చిత్రం

ఒక రేయిలో సగం మోముతో పచ్చటి పలుకరింపు 
ఆవపూల గుట్ట చూసినట్లుగా అనిపించింది

మరొక రేయిలో ఇంకాస్త దాచుకుని అదే మిడిసిపాటు 
మరి కాస్త బంగారు రజను అద్దుకుని

ఎందుకో కలవరం, ఎదమాటున కలకలం
వెన్నెలతో నలుగు పెట్టుకున్నట్టుగా

ఏనాడూ జరగనిది, ఎదురుగా లేని ఎవరో 
ఇంకేవో పనులు పురమాయించినట్లుగా

పరాగ్గా, ఉదాసీనంగా నడుస్తున్న నన్ను 
ఆదమరిచి తనకే అతుక్కునేలా చేసాడు

05/01/2014

3 comments:

  1. చిత్రంగా...

    ఏవేవో బ్లాగులు కెలుకుతుంటే
    ఏ నగిషీలూ వెలుగు జిలుగులూ లేని...
    మీ బ్లాగ్ కనబడింది...
    మరువపు fragrance...

    ఆవపూల గుట్ట ఎలా వుంటుందో తెలియదు గాని...
    అరమోము వెచ్చటి పలకరింపు మాత్రం వినబడినట్లైంది...

    మిడిసిపాటుతో దాటుకుపోక...
    మిగిలిన రూపం కనుగొనాలనిపించింది...

    లోలోపల ఏదో కలకలం
    తెలియని కలవరం ఏమవుతుందోనని...

    ఏనాడు కనబడని యేమాత్రం తెలియబడని
    యీ మూర్తి ఏమనుకుంటుందోనని...

    పరాకుగా చిగురాకులపై నడుస్తున్న నన్ను
    తొలకరై పలుకరిస్తారో... మదినెలా చిలకరిస్తారో...

    ఒక స్నేహ భావన...
    స్నేహ కరచాలన...

    hearty welcome to visit my blog...
    i am just 10 days old in the blogger world...
    hope we can meet here or there again...

    nmraobandi.blogspot.in

    ReplyDelete
  2. Nmrao Bandi గారు, మీరు వ్యక్తపరిచిన స్నేహ భావనకి/స్నేహ కరచాలనకి నెనర్లు. ఈ కవితలో ప్రస్తావన వెన్నెల మాసాలలోని నవమి, దశమి నటి జాబిలిని గూర్చి! నేను బ్లాగుల క్రియాశీలక పాత్ర నుంచి వైదొలగి చాలా కాలమే అయింది. ఈ బ్లాగు నా రాతల భాండాగారం మాత్రమే! మీకు హార్దిక స్వాగతం. పోతే, I am not much of a critique or a trained literary reviewer. మీరు ఆ పరంగా ఈ-పత్రికల ప్రచురణ గానో, ఫేస్బుక్ లోని కవి సమూహాల్లోకో అడుగిడితే ఎక్కువ మేలు జరుగుతుంది. శుభాభినందనలు-

    ReplyDelete
  3. I am not much of a critique or a trained literary reviewer -
    that s exactly the same with me as well...
    and i am not even a trained literary writer also...
    ఏదో మనసుకు తోచిన స్వేచ్చా రచనం...
    అంతే...
    నాకు మీ రచన నచ్చింది...
    స్పందించాను...
    మీలాగునే నేను కూడా అపుడెప్పుడో...
    చదువుకున్న రోజుల్లో వ్రాసిన గీతాలు
    e బ్లాగులు చూసిన తర్వాత 'సరే మనం
    కూడా వ్రాసినవి పెడితే సరి' అని మొదలు
    పెట్టినవే...
    మార్గమధ్యంలో...అనుకోకుండా కొన్ని
    ఇప్పటివి కూడా కలుస్తాన్నయనుకోండి...

    మేలు గురించి అంటారా...
    పెద్దగా సాధించాల్సిన ఆశయాలేమి లేవు ...
    మీలాంటి మంచి మనుషుల సాంగత్యం తప్ప...

    ప్రత్యుత్తరానికి ధన్యవాదాలు...
    శుభాకాంక్షలతో...


    ReplyDelete