రససిధ్ధి: Aligarh చలనచిత్ర కవిత్వానికి అనుసృజన

"యథో మనః తథో భావ, యథో భావ తథో రసః" వంటి తాదాత్మ్యం కలుగజేసిన ఆణిముత్యాల వంటి ఈ Aligarh హిందీ చలనచిత్ర కవిత్వపు పలుకులకి నేను స్వేచ్ఛానువాదం చేస్తుండగా,  "త్రిపుర" కలంపేరు తో రచనలు చేసే నా మిత్రురాలు చేసిన అనుసృజన అందింది.  మేలైన భావన పొదిగిన ఆ రచన బాగుందని (నా అనువాదం ఆపి) మీకూ పంచుతున్నాను.  "poetry शब्दों में कहाँ होती है बाबा. कविता शब्दों के बीच में मिलती है. साइलेन्सस में. पॉज़स में. फिर हर कोई अपने अपने हिसाब से अपना अर्थ निकलते हैं. "  వంటి గాఢమైన సాలోచన లోకి తోయగల సంభాషణలు చాలానే ఉన్నాయి  Aligarh  లో.  అన్నిటినీ మించిన జీవన సంవేదన,  ఒంటరి దైన్యం, అనురాగభరిత స్పర్శ కి అలమటింపు చిత్రీకరణ లోతైన స్పందన కలిగిస్తూనే ఉంటుంది తలిచిన క్షణం.  ఇది నిజ జీవితాధారిత చిత్రం.  అంశం చాలా సున్నితమైనది అయినా మనోజ్ వాజ్‌పాయ్‌ వలన దృష్టి సరైన రీతి కి మళ్ళుతుంది.  సానుభూతి, సదవగాహన మిగులుతాయి. 

-1-  ఆంగ్లానువాదం  ( అంతర్జాల సౌజన్యము తో)

O beloved moon.
Fear not the dawn that separates us.
For we will meet again when the world goes to sleep.
in the light of day, I am unseen.
it is in your light, my heart awakens.
we will dance as shadows dance.. to the songs of nightingales.
we will touch as shadows touch..
becoming one in the midnight sun.
You and me are illusions. victory and defeat are mere words.
There is no beginning nor is there an end.
This moment is the only truth.

-----
Today I lost myself to him.
At the crack of dawn he came along..
and stole my heart
(This morning Lord Krishna appeared in my dreams and stole my heart)
In the midst of my sweet morning sleep,
he lifted me gently like a fallen flower.


-2-  "త్రిపుర" చేసిన అనుసృజన 

ఓ ..నా నెచ్చెలీ..నా జాబిల్లీ..
ఊహలోని  యెడబాటు తారాడితారాడి
నీ నయనాల ఆ నీలి నీడలా కమ్మెనేమో
ఉదాసీనంగా  వాలిపోయే సంజకాంతులు
కాలేవేనాటికీ..చీకటి సీసపు పరదాలు..
గాఢ సుషుప్తిలో యీ సృష్టి సోలిపోయే తరుణాన
తనువూ మనసూ తన్మయ మై స్వప్నాల విహరించుదాము..!
దివ్య ప్రభల వెలుగుల లోకాన నేనొక అగోచర మయూఖాన్ని ..
నీ అంతరంగపు వెలుగు పుంతలలో   నేనొక చేతనా చైతన్యానికి  ప్రతీకని ..!
గాఢ నిశీధిన నింగిన    నవ్వే సూర్య కాంతుల  పందిరి ఛాయ
గాలి తెమ్మెరల ఆగి  సాగే కోకిల గాన రవళి మోహనమైన వేళ
మన నీడలతో మన దోబూచులాటలే
మమేకమైన రసదిద్ధికి  కాదా రంగస్థలమది ..
నీ నా అస్థిత్వమే మాయా బ్రాంతి ..జయాపజయాల మాటల జూదమే
ఆది అనాదిలేని ఈ కాల పరిభ్రమణంలో ముగిసిపోతున్న ఈ క్షణమే నిలువెత్తు నిష్టుర నిజము

తొలిపొద్దురేఖ రాగ రంజితమై చెంగలించిన వేళ
చేరి  దరిచేరి దొరవోలె దోచినాడు నిలువెల్ల నీలికాంతుడు

అరమోడ్పు కనుల  అరనిద్ర భారమై తరళించు ఝాము
రాలిన రేలు పూవులా గారాన యెద చేర్చి బిడియపు తెర
నయగారమున అధరముల జార్చి నన్నేలెనో నా స్వామీ !

Mourning dove

ఈ మధ్యనే పడకింటి కప్పు మీద
ఓ పావురాయి గూడు కట్టింది
పగలంతా మేతకో, జత కొరకో వెదుకులాడుతూ..
రాత్రంతా గునుసుకుంటూ
పట్టరాని విసుగు కలిగిస్తూ పరిచయమై
పట్టించుకునే ఉనికిగా, 
ఉనికిపట్టులో తోడుగా మారింది. 

నిన్న రాత్రి  కప్పు క్రిందగా
జారుతున్న వాన చుక్కల సడి..
నిదుర ఆగని మనసుకి నెమ్మదిగా మెలుకువ.
ఆగి ఆగి కురిసిన వాన, 
పిట్ట గొంతుని పట్టి ఆపినట్లుంది
గుండె నిండా తడి భావనలు, 
గూడు కూలిందేమోనని గుబులు..

ఉన్నపళాన లేచివెళ్లే వేళకాదు-
తెల్లార్లూ చెవులు రిక్కించి
రెక్క సడికి,cooOOoo-woo-woo-woooo కూత కొరకు
ఎదురుచూపు మోసే కనులతో,  
పదే పదే పచార్లు చేస్తూ,
నేనూ మారిపోయాను ఒక Mourning dove గా

బెదిరిన ప్రాణికి లాలన కాలేని ఘడియల్లో...!

ఎగురలేని గాలిపటాలు

గాలిపటాలు
ఎగిరే మబ్బుల్లా ఉండేవవి!

చేతికి చిక్కనున్న
మబ్బుకోసమే..
పటాలు నేలకి కురవాలని
పసితనపు ఆశలూ ముసిరేవి

అప్పట్లో
ఏదో పండుగ కాలం లో,
కనీసం ఎండాకాలం సెలవుల్లో
ఎవరో ఒకరు ఎగురవేస్తారు

ఎగిరే పటం వాలితేనే కేరింత..

ఆట ముగిసే వేళకి

గాలివానకు ఒరిగిన పిట్టల్లా
చిరుగు పట్టిన చీరల్లా

అవే గాలిపటాలు..తెగిన పటాలు

బహుమతులుగా
వెదికి తేవటమే
పందెం కోళ్ళ వంటి పిల్లల కేళి

ఇప్పుడూ
ఒకప్పుడు ఎగురవేసిన
ఉల్లాసాలు
కాలపు కండె తెగిపడిన
పటాలుగా..


జ్ఞాపకాలకి చిక్కుకుని
అనుభూతులు
వెదకకుండానే ఎదురయే
మమతని
పదిలంగా తాకివస్తే
కానుక అందిన భావన..

కమ్ముకున్న ఆశలు
చిన్నప్పటి చిక్కదనంతోనే
ఇప్పటికీను
అంచేత,
మరి కొన్ని క్షణాలు
ఇప్పుడిప్పుడే
ఎగురవేస్తున్నాను
రానున్న కాలాల్లో
మనసుకి అందివస్తాయని!