ఈ మధ్యనే పడకింటి కప్పు మీద
ఓ పావురాయి గూడు కట్టింది
పగలంతా మేతకో, జత కొరకో వెదుకులాడుతూ..
రాత్రంతా గునుసుకుంటూ
పట్టరాని విసుగు కలిగిస్తూ పరిచయమై
పట్టించుకునే ఉనికిగా,
ఉనికిపట్టులో తోడుగా మారింది.
నిన్న రాత్రి కప్పు క్రిందగా
జారుతున్న వాన చుక్కల సడి..
ఆగి ఆగి కురిసిన వాన,
పిట్ట గొంతుని పట్టి ఆపినట్లుంది
గుండె నిండా తడి భావనలు,
గూడు కూలిందేమోనని గుబులు..
ఉన్నపళాన లేచివెళ్లే వేళకాదు-
తెల్లార్లూ చెవులు రిక్కించి
రెక్క సడికి,cooOOoo-woo-woo-woooo కూత కొరకు
ఎదురుచూపు మోసే కనులతో,
పదే పదే పచార్లు చేస్తూ, నేనూ మారిపోయాను ఒక Mourning dove గా
బెదిరిన ప్రాణికి లాలన కాలేని ఘడియల్లో...!
గుడ్ పోస్ట్. బాగుంది.
ReplyDeleteపోస్టులు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.@ K.S.చౌదరి
mourning dove.reminding "maa nishada"
ReplyDelete