ఈ నెల పిల్లలంతా తిరిగివచ్చారు. ఇప్పుడు మా బళ్ళో పిల్లలు, పంతులమ్మల పేర్లివి. ;)
పంతుళ్ళు-పంతులమ్మలు:
అలేఖ్య
అనీష
అనీష [సంతు]
అనూష
మేఘన
నేహ
వైష్ణవి
స్నేహ
సాహితి
సంహిత్
స్ఫూర్తి
శ్రీవల్లి
లలిత్
తేజస్
పిల్ల:
నేనే ;) - వాళ్ళంతా ఇప్పుడు నాకు పాఠాలు నేర్పేవారే ...
********************************************
ఈ నెల ఎన్నో చేసాం. అన్నీ తెలుపలేనేమో. అయినా చిన్న ప్రయత్నం.
.. మా లేక్ లోని చేపలకి బ్రెడ్ వేయిస్తూ వాళ్ళతో ఆ చుట్టూ పరిసరాల మీద వ్యాఖ్యానం చేయించాను.
ఉదా: చేపకి రొట్టె పెడుతున్నాను; ఇక్కడ పక్షులు వున్నాయి.
.. జంతువులు, పక్షులు పేర్లు నేర్చుకున్నాము
.. ఒక్కొక్కరికి ఒక అంశం ఇచ్చి రెండు నిమిషాల చొప్పున మాట్లాడించటం
.. దసరా పండుగ ఎందుకు చేసుకుంటాం?
.. ఒకరు చేసే మూగ సైగని మరొకరు చూసి అర్థం చెప్పటం.
.. కూరగాయల పేర్లు - వాటితో ఒక కథ - దోసకాయంత దొంగోడు
.. అక్షరాలు వ్రాయటం లోని తేడాలు వివరించాను
ఉదా: ల [ఒకటే గీత], స [రెండు కానీ కలవవు], క [రెండు గీతలు కలిపి వ్రాయటం]
.. పదాలు వాడి నేను చెప్తే వాళ్ళూ కొన్ని గొలుసుకట్టు పదాలు కూర్చటం
ఉదా: చెరువులో చేపలు, మొక్కమీద పువ్వులు
.. ఉచ్చారణ దోషాలు పోవటానికి కష్టమైన పదాల సాధన
ఉదా: [పెళ్ళి, కిళ్ళీ, కొడిగినహళ్ళీ, బిసిభళేబాత్]; [కాకర, కీకర, కీసర, బాసర] ... ఇలా గుక్కతిప్పుకోకుండా వల్లెవేయటం :)
*********************************************
పాట:
.. చిట్టి పొట్టీ మిరియాలు
.. దేవీ స్తోత్రం
.. పిల్లల చేత సినిమా పాటల్లోని పదాలు గుర్తింపచేయటం
దేశం కాని దేశంలో మనకంటూ ఏమీకానీ పిల్లల్లో గిరిజా దేవివై చిరు హృదయాలపై బీజాక్షరాలు లిఖిస్తున్నారు. మీ ప్రయత్నం సర్వదా సత్ ఫలములనివ్వాలని మనఃపూర్తిగా కోరుకొంటున్నాను.
ReplyDeleteఉష గారూ కృత్యం ద్వారా వాక్య నిర్మాణం చేయించడం బావుంది. చక్కటి కాన్సెప్టులతో విద్యను అందిస్తున్నారు. అయితే మీది పూర్తిగా పాఠశాలనా? విశ్రాంతి రోజులలో నేర్పిస్తున్నారా? దయచేసి పాఠశాల వివరాలు తెల్పండి. మీ తరగతిని ఊహించుకోడానికి సులభంగా ఉంటుంది. మీకు ఇబ్బంది లేకపోతే.
ReplyDeleteభా.రా.రె. మీ అభినందనకి, ఆకాంక్ష కి నా కృతజ్ఞతలు. నిజానికి ఆ పిల్లల్లోని ఉత్సాహమే నాకు ప్రోత్సాహం. పరుగులుదీస్తూ వస్తారు. చురుగ్గా నేర్చుకుంటారు.
ReplyDeleteజీవని గారు, నాది అమెరికాలో సెలవు రోజైన శనివారం, అంటే వారానికి ఒక రోజు నడిపే బడి. వృత్తిరీత్యా సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయిన నాకు భాష పట్ల గల అభిమానం వలన ఇక్కడ పెట్టి పెరుగుతున్న ఈ చిన్నారులకి నేర్పాలన్న సంకల్పం తో మొదలు పెట్టాను. మరి కొన్ని వివరాలు ఇక్కడవున్నాయి.
ReplyDelete"తెలుగు వెలుగు� - స్ఫూర్తి, ఆవిర్భావం!" http://janyaa-teluguvelugu.blogspot.com/2009/03/blog-post.html