విశ్వామిత్ర - 5

నీరెండ సమయం. విశ్వ ఇంట్లో విష్ణు, విశ్వ ఇద్దరే వున్నారు. వాళ్ళ వాలకం చూస్తుంటే చాలా సేపట్నుంచే మాటల్లోపడ్డట్టుగావున్నారు.

"విస్సు! నాకింకా నమ్మకం కలగటం లేదురా. నువ్వు మిత్రాని ఇష్టపడటం ..." విష్ణు దృష్టి ఇంకా విశ్వ చిత్రించిన మిత్ర రేఖాచిత్రం మీదనే వుంది.

చిన్నగా నవ్వేస్తూ, విశ్వ లేచి వెళ్ళి ఫ్రిడ్జ్ లోంచి చల్లటి నీరు రెండుగ్లాసుల్లో పోసి తీసుకొచ్చాడు. తానున్న గత మూడు నాల్గు గంటల వ్యవధిలోనూ విశ్వ చేతిలో సిగరెట్ కనపడలేదు.

"అవునూ సిగరెట్..." అర్థోక్తిగా ఆగిన విష్ణు మాటకి అవునన్నట్లుగా తల వూగిస్తూ, "ఆ మధ్య తన సిస్టం చూడటానికి వెళ్ళినపుడు నా చేతిలో సిగరెట్ చూసి తను మొహం చిట్లించుకోవటం గమనించాను. అంతే, ఆ తర్వాత ఎందుకో మనస్కరించలేదు." మొహమాటంగా అన్నాడు విశ్వ.

"మిత్రకి చాలా చురుకు, చొరవవున్న మనిషి. నీ మనసులో మాట ఇంకెంత కాలం దాస్తావు. ఒకసారి తనతో మాట్లాడతావా? " అన్నాడు విష్ణు. "ఇప్పుడు కూడా నేను అనుకోకుండా గమనించబట్టి దొరికావు" చిర్నవ్వుతో అన్నాడు.

"వద్దురా అవన్నీ నా వల్ల కాదు." అన్నాడు విశ్వ.

"ఊ ఈ మౌనప్రేమ ఇంకెంత కాలం సాగుతుందో చూస్తాను" అంటూ ఇక వెళ్తానన్నట్లుగా లేచాడు.

----------------------------------------------------------------
మిత్ర తల్లీ,తండ్రి కస్తూరి, సురేంద్ర సెలవు మీద వచ్చారు. తనతో నాల్రోజులు గడిపి వూరుకి వెళ్ళి అటుగా తిరిగి వెళ్ళిపోయే ప్రయాణమ్మీద వచ్చారు. అదీ కాక మిత్ర పెళ్ళి విషయం కదపాలన్న ఉద్దేశ్యంగా కూడా వచ్చారు. మిత్ర ఉద్యోగంలో చేరాక వాళ్ళు అదే రావటం, సుబ్బాలుకి తెగ సంబరంగా వుంది.

వర్ధని గారు, కస్తూరి అలా బయటకి వెళ్ళారు. సుబ్బాలు కూడా కూరగాయలు తెస్తానంటూ వెళ్ళింది. సురేంద్రకి వేపిన వేరుశెనగ పప్పుల్లో బెల్లం కలిపి తినటం ఇష్టం. సుబ్బాలు వేపివుంచిన పప్పులు ప్లేటులో సర్ది, వేడి టీ తీసుకొచ్చింది. అవి తండ్రి ప్రక్కగా పెట్టి, మళ్ళీ లోపలికి వెళ్ళి ఓ కప్పు పాలు తెచ్చుకుని కూర్చుంది. మునుపు కన్నా పెళ్ళికి సుముఖంగానే వుందని కస్తూరి అంది. ఒక సారి కదిపితేనో అనుకున్నాడు.

"మిత్ర! నిన్న విష్ణు తో కలిసి విశ్వనాథ్ వచ్చాడు. పిల్లాడు నిదానస్తుడు. మనకి కావాల్సిన వాడు. విష్ణు కూడా అతని నిన్ను ఇష్టపడుతున్నాడని చెప్పాడు. ఏమ్మా మరి నీ ఉద్దేశ్యం ఏమిటి. నిజానికి బెనర్జీ మావయ్య ఫోను చేసాడు. తనకి మనతో సంబంధం కలుపుకోవాలనివుంది. వాళ్ళ అబ్బాయి మనోహర్ కూడా ఉద్యోగంలో స్థిరపడ్డాడట. నీకు నచ్చినట్ట్లే అన్నీ జరుగుతాయి." అన్నాడు.

బెనర్జీ ఆయన చిన్ననాటి స్నేహితుడు. మనోహర్ని రెండు మూడు సార్లు కలిసింది. ఎందుకో అతని భావాలు తనకి సరిపడవు. ఆడవారి చదువు విషయంలోఒకసారి తేలిగ్గా తీసిపడేసినట్లు మాట్లాడాడు. అందగాడే కానీ సంస్కారం విషయంలో మాత్రం ఏదో లోపం.

"నాన్నగారు, నాకింకా చదువుకోవాలని వుంది." నెమ్మదిగానైనా స్పష్టంగా అంది మిత్ర. మళ్ళీ తనే మాట కలుపుతూ "నాకు మనోహర్ ఇష్టం లేదు. పెళ్ళి మాట ఆలోచించుకుని చెప్తాను" అంటూ తడబాటుగా లేచి వెళ్ళిపోయింది.

తన తండ్రి దగ్గర వున్నంత చనువు తన దగ్గర మిత్ర తీసుకోదని సురేంద్రకి తెలుసు. అదీకాక తన మనసు సున్నితం. ఏదైనా మనసులోనే వుంచుకుని బాధ పడుతుంది. అందుకే ఇంక ఆ విషయం పొడిగించకుండా వదిలేసాడు.

----------------------------------------------------------------


ఏదో అస్పష్టమైన కల. మిత్రకి తెలిసీ తెలియనట్లుగావుంది. పొలాల మధ్య చెట్టు. నిద్రగన్నేరు మాదిరి పూలు జల జలా రాలుతున్నాయి. చెట్టు మొదలుకి ఆనుకుని ఒక జంట.

అమ్మాయి అతని ఎడమ అరచేతిలో తన కుడిచేతి చూపుడు వేలితో సున్నాలు చుడుతూ ఏదో చెప్తుంది. అబ్బాయి మొహమ్మీద నవ్వు, కుడి చెంపమీద సన్నని చొట్ట. అతను ఆమె చెప్పేది వింటూ తల వూగిస్తూ, కుడిచేత్తో ఆమె ముంగురులు సవరిస్తూవున్నాడు. అతి సన్నిహితంగా కూర్చున్న వారిలో స్త్రీ తనే. మరి అతను ఎవరు?

గబుక్కున మెలుకువ వచ్చేసింది. ఇంకా తెల్లవారలేదు. బయట చీకటిగానే వుంది. కల తలుచుకుంటే నునుసిగ్గుగా వుంది. మొదటిసారి ఇటువంటి కల. ఏదో కలవరం. అలవాటుగా పెన్, తను వ్రాసుకునే పుస్తకం చేతిలోకి, ఓ నాలుగు పంక్తులు వ్రాసుకుంది.


"ఎవరివో నీవు, ఎప్పుడు కలవనున్నామో? నీ వ్యక్తిత్వం నాకు కానుకగా కావాలి. నీ స్నేహితం నాకు ఇవ్వాలి. బదులుగా నా మనసు ఆకాశగంగ అంత అమృతంగా, తనువు పాలధార అంత మధురంగా నీకు సమర్పిస్తాను. నువ్వు నా మనసుకి అధిపతి, తనువుకి సర్వాధికారివి, నా ప్రేమకి పిపాసివి, నా చూపుకి బానిసవీ కావాలి." నవ్వొచ్చింది. అప్పుడే మనసు ఈ బాటలో అడుగులు వేసేస్తుంది. పుస్తకం మూసి ప్రక్కన పెట్టింది.

మళ్ళీ పక్క మీదకి వాలి, నిన్న సాయంత్రం తండ్రితో జరిగిన సంభాషణ గుర్తుకు తెచ్చుకుంది. "ఊహు, తన భాగస్వామిని ఎన్నుకోను తనకి సమయం కావాలి. తనని వెద్దుక్కునే తోడు కొరకు తను వేచివుంటుంది. అందాక ఇలా సంబంధాలు, పెళ్ళి ప్రసక్తి తేవద్దని చెప్పేయాలి." నిద్రలోకి జారుకుంది. గాఢంగా కలతలేని నిద్ర అది.

----------------------------------------------------------------


"నాన్న గారు, పెళ్ళి పట్ల నాకు అయిష్టత లేదు. అలాగని విస్సుని అంగీకరించటానికి నాకు ఇష్టం లేదు. నేను చూసినంతలో అతనికి నాకు ఒకరికొకరం తెలిసింది తక్కువ. నిజానికి అతని పట్ల ఆలోచన కలగటం లేదు." ఉదయం ధ్యానం చేసుకుని రాగానే అమ్మా, నాన్నలిద్దరినీ పిలిచి మనసులోని మాట చెప్పింది.

"అలాగేనమ్మా! అతనికి విష్ణుతో కబురు చేస్తాను. నువ్వు ఇష్టపడలేదు అని చెప్పమంటాను." అన్నాడు సురేంద్ర.

కస్తూరికి లోలోపల మంచి సంబంధం వదిలేసుకుంటున్నామన్న భావన. వర్ధని గారు అతని గురించి చాలా బాగా చెప్పారు. కానీ మిత్రకి కూడా నచ్చాలి కదా. చిన్నగా నిట్టూరిస్తూ వంట గదిలోకి వెళ్ళిపోయింది.

మర్నాడు వాళ్ళు ప్రయాణమై వెళ్ళిపోయారు. మరోసారి పెళ్ళిసంగతి గుర్తుచేసి మరీ వెళ్ళారు.

----------------------------------------------------------------


ఇల్లంతా నిశ్శబ్దంగా వుంది. ఈ నాల్రోజులు అమ్మా, నాన్న సందడి. తలస్నానం కని సుబ్బాలు కొబ్బరి నూనె వేడి చేసుకుని వచ్చింది. నెమ్మదిగా జుట్టు పాయలుగా విడదీసి నూనె రాస్తూ, "మిత్రమ్మా! విశ్వం బాబుని వద్దన్నావట" అంది.

చురుగ్గా చూస్తూ "ఏం! ఎందుకు కావాలనాలి?" అంది మిత్ర.

"సరిజోడు చూసుకోవాలి తల్లీ. అబ్బాయి కుటుంబం చూసుకోవాలి. నీకు మరో ఇల్లు అది. ఆ బాబుకి నీవంటే ఆపేక్ష. కళ్ళలోనే బయటపడిపోతది. మంచి ఉద్యోగమట. అనంతమ్మ మంచిది. నీకు అక్కల్లేరు, అ లోటు వుండదు. ఒక్కడే కొడుకు. ఆస్తి పరులు. పైగా నీవంటే ప్రేమ. ఇంకెమున్నా ప్రేమ వున్న చోటఅన్నీ సర్దుకుపోతాయి" అన్న సుబ్బాలు మాటలకి ఆశ్చర్యం అనిపించింది. అమాయకంగా వుండే తనకి ఇంత ఆలోచన. అతని చుట్టూ వున్న కుటుంబం, పరిస్థితులు వరకు కలేసి చెప్పింది. అయినా తనకి ఆ భావన కలగటం లేదు.

విస్సు. అతన్ని తలుచుకుంటే ఏ భావనా కలగటం లేదు. అసలు ఆ మౌనాన్ని తను భరించగలదా? ఎందుకు తనకన్నా అధికుడుని కోరుకుంటుంది తన మనసు? అందం తనకి ముఖ్యం కాదు, కానీ వ్యక్తిత్వం కావాలి.
అతన్ని చూస్తే సాదాసీదాగా వుంటాడు. ఒక లక్ష్యం వున్నట్లుగా తోచదు. ఇన్ని సార్లు కలిసినా అతని గురించి తెలిసింది తక్కువే. అసలు అతనిలో ప్రత్యేకత లేదేమో.

సుబ్బాలు మరో కోణం చూపింది. శోభని అడిగితేనో. లేదు అలా కాదు. ఇది తన జీవితం, తనక్కావాల్సిన వ్యక్తిని తనే కలుసుకోవాలి. ఇపుడిపుడే తన మనసులో రూపుదిద్దుకుంటున్న ఊహాచిత్రం మాత్రం అతను కాడు. ముమ్మాటికీ కాదు. ఊహు, తనకి అతనికి కుదరదు. తన నిర్ణయంలో మార్పు రాదు.

[సశేషం]

17 comments:

 1. ట్విస్టదిరింది. కథనంలో ఊపు కూడా కనిపిస్తున్నది. Waiting for the next episode. కానీ హీరోయిను మరీ సెన్సిటివులా ఉందే? ;-) మరో రౌండ్ రావాలి.

  ReplyDelete
 2. @సృజన, గీతాచార్య, ఇక కథకి ఈ వేగమైన నడక నుండి పరుగుకి తెచ్చే ప్రయత్నం చేస్తాను. విశ్వామిత్రల సంవాదంకి సిద్దంకండి.

  @ తృష్ణ, ధన్యవాదాలు.

  ReplyDelete
 3. నేనింకో 10,11 వారాలు వేచివుండవలసిందేగా....

  ReplyDelete
 4. After reading few parts of mitra's story I am not surprised that she was(is) an effective spokeswoman.with her personal experience she has a pwerful tale to tell . Waiting for the next one.

  ReplyDelete
 5. ప్రతి ఆడపిల్లకి పెళ్ళికి ముందు యి అంతర్మధనం తప్పదేమో మిత్ర లాగ .ఇంతకీ మిత్ర కలలో వచ్చిన ''అతనెవరు''?కొంపతీసి నేను రాసిన కద కి ముందు జరిగిన కధాఇది ?
  యి సందర్బంగా నేను like చేసే ''మనసా తుళ్ళి పడకే అతి గా ఆశ పడకే ''అన్న వేటూరి పాట గుర్తు కొచ్చింది .

  ReplyDelete
 6. As I said in the earlier installments, improvement is obvious :-)

  ReplyDelete
 7. నేను, వేచివుండటంలోని ఆనందం గురించి ప్రత్యేకంగా చెప్పాలాండి. వారానికొకసారి వచ్చే పత్రికని చూస్తే ఎంత ఆనందంగా వుండేదీ? అలాగే నెమ్మదిగా అలా అలా పూల తేరుమీద మిమ్మల్ని తీసుకుపోతానిక! ఎంతలో 12 వారాలు తిరిగొస్తాయి. పుష్కరాలే ఇట్టే పలుకరించిపోయే ఈ రోజుల్లో... :)

  ReplyDelete
 8. భా. రా. రె, అర్థమైంది లేండి అంతర్లీనంగా వున్న సలహా! :)

  అ.గా, ప్రదీప్, సుజ్జీ, ధన్యవాదాలు. కాసింత వూపిరి పీల్చుకున్నాను. దెబ్బలేన్నో చప్పట్లు అన్ని కదా? అంచేత..

  ReplyDelete
 9. రవిగారు, నిజానికి ప్రతివారికీ ఒక నిర్ణయం ముందు అంతర్మధనం తప్పదు కదండి.

  ఇక అతడేవరు http://maruvam.blogspot.com/2009/08/blog-post_08.html మీరు చదవలేదన్న మాట. ఇందు మూలంగా తెలిజేయునదేమంటే మీ కథా కమామీషులు నేను ఎరుగనండి. :)

  మీకిష్టమైన ఆ పాట ''మనసా తుళ్ళి పడకే అతి గా ఆశ పడకే ' సుమారు జనవరి, ఫెబ్రువరి సమయంలో మీ బ్లాగులో ఒక టపాగా వ్రాసి, సాహిత్యం కూడా ఇచ్చారు, చిమట మ్యూజిక్ లింక్ ద్వారాగా. నేను కూడా అప్పుడే ప్రింట్ తీసుకుని వుంచాను. ఎందుకంటే నాకూ ఇష్టమే ఆ పాట.

  ReplyDelete
 10. చాలా బాగుంది ఉష గారు..
  వేయించిన వేరుశనగపప్పు, నిద్ర గన్నేరూ, అరచేతిలో సున్నాలు, నుదుట ముంగురులు అత్యద్భుతం...
  ట్విస్ట్ బాగుంది... విశ్వమిత్రల సంవాదం కోసం ఎదురు చూస్తున్నాను...
  మిత్ర కోసం విశ్వ పూర్తిగా మారిపోతాడేమో అని తన మీద కాస్త జాలిగా కూడా ఉంది.. :-)

  ReplyDelete
 11. బాగుంది .
  ప్రేమ వున్నచోట అన్ని సర్దుకుపోతాయ్ నిజమే అసలు ప్రేమంటూ వుంటే !
  విశ్వామిత్రల సంవాదం కోసం ఇంకో వారమాగాలన్నమాట .ఓకె

  ReplyDelete
 12. మాలా గారు, ప్రేమలో సంశయం తగదు :) ప్రేమికులలో అసలు నకలు వుండొచ్చునేమో కానీ ప్రేమలో కాదు. మళ్ళీ వారం కలుద్దాం.

  ReplyDelete
 13. వేణు గారు, ప్రతి భాగంలోను ఒకరైనా గమనించాలి అని వ్రాసుకున్నవి మీరు భలే పట్టేస్తారు, మీ ప్రత్యేకత అది. విశ్వ మీరకున్నంత మెత్తన కాదు సుమండీ... థాంక్స్.

  ReplyDelete