సాహితీప్రియులకు దీపావళి పసందైన విందు!!!!!

ముందుగా పేర్కున్నట్లే దీపావళి శుభాకాంక్షలతో, మీ ముందుకు వచ్చిందీ సంకలనం. ఇక నాతో పాటే మీరూ విహారాలు, విలాసాలు, విలాపాలు గరపండిక...

*** *** *** *** *** ***
రండి రండి రారండి
గెలుపు జెండా ఎగరేయండి
ఏకీభవ సంబరాల
దివిటీ వెలుగులు కనరండీ ॥రం॥

మనం మనం మనమందరం
మనమే నవసాహితీ మార్గదర్శకులం
జలం జలం కడలిజలం
జలమే మనకలాలకి కథనరంగం ॥రం॥

పదం భావం పదబంధకవనం
రాదా ఎగిసిఎగిసి సాగరకెరటమై
ముదం మోహనం "మత్స్యరూపం"
అవదా మనరచనా కీర్తికిరీటంరం
-మరువం ఉష
*** *** *** *** *** ***

"జలపుష్పాభిషేకం" కొరకు సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ నా హృదయ పూర్వక కృతజ్ఞతలు. శ్రీకారం చుట్టగానే మొదటి రచనలు అందించిన ప్రదీప్, భా.రా.రె, బాబా గార్లకి వందనాలు. సంకలనం పి.డీ.యెఫ్. గా మలచటం లో పూర్తి బాధ్యత స్వీకరించి తోడ్పాటు అందించిన గీతాచార్య, సృజన, ధన లకు ధన్యవాదాలు. చిత్రసేకరణ నా వంతు. ఇక చివరిగా నేను
వ్రాసిన పాటకి రాగం కట్టి పాడతానని, అక్కడక్కడా పదాలు మార్చిన భా.రా.రె.కి అభివందనాలు. ;)

పైన లింక్ చూడని వారికి ఇదిగో మరోసారి... సంకలనం పదం పై నొక్కండి...

50 comments:

 1. I am unable to see some pages in pdf

  its showing only dots


  pl. check

  ReplyDelete
 2. ఉషగారు,
  రాసిన అ౦దరికి,
  అన్ని బాగున్నాయి...గుడ్ జాబ్ ఉషగారు.

  ReplyDelete
 3. ముందుగా సాహితీమిత్రులందరికీ దీపావళీ శుభాకాంక్షలు. జలపుష్పాభిషేకం పేరుతో సాహితీ మిత్రులందరి మద్యా అక్షర బంధాన్ని పెంపందింప చేసిన ఉష గారి నిష్కామకర్మకు మనమంతా జేజేలు పలుకుదాం. మన:స్ఫూర్తిగా అభినందిద్దాం.

  ReplyDelete
 4. అయ్యో అప్పుడే టైం అయిపోయిందా ..ప్చ్ .నేను రాయాలనుకుంటున్న .

  ReplyDelete
 5. John [The fist one] Thanks for the heads up, but could you please let me know the browser and resolution you are using. I went over 3 times myself before posting and a friend checked the link before hand,not sure what the issue could be and if anyone else met with it. I even did a check right now. All look fine to me! But would certainly look in to it.

  ReplyDelete
 6. రండి రండి రండి
  కడలి తరంగాల్లా
  నవ్య భావ వుషోదయాన
  దివ్య కాంతి వీక్షణకై
  దివ్వెల దీపోత్సవం మీ అందరి జీవితాల
  దివ్యకాంతి నింపాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ...
  ఆశీస్సులనందిస్తూ......మీ యందరి రాఘవేంద్ర

  ReplyDelete
 7. దివ్వెల దీపోత్సవం మీ అందరి జీవితాల
  దివ్యకాంతి నింపాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ...
  ఆశీస్సులనందిస్తూ......మీ యందరి రాఘవేంద్ర

  ReplyDelete
 8. John, some additional info. from some experts. Can you check if your system, assuming it is Windows, setup is configured for Asian script?

  ReplyDelete
 9. ***** QUICK REQUEST *****

  All, Do any of you see the issue that John mentioned, can one of you try to open/go through the PDF and confirm for me that it works for you?

  ReplyDelete
 10. PDF బాగానే ఉంది.
  'సంకలనం' లో అప్పుతచ్చు :)

  ReplyDelete
 11. Thanks వేమన గారు :) that's in deed a very good catch. Fixed it. ఇక మరో "అచ్చుతప్పు" కాదు కాదు "అప్పుతచ్చు" లేదు ;)

  ReplyDelete
 12. అమ్మోయి గారూ, నేను రాగం కట్టి పాడానంటే మీ బ్లాగులకొచ్చే అడ్డగాడిద కూడా పరిగెత్తి పోవాల్సిందే. :)
  అదేదో భావనగారికిచ్చేయండి, ఏంచక్కా సుశీలమ్మ గారిలా పాడేస్తారు.

  ReplyDelete
 13. మీ జలపుష్పం సంకలనం చాలా బాగుంది.
  ఈ మహాయజ్ఞం పాలుగొనలేని అశక్తురాలనైనందుకు చింతిస్తున్నాను 1
  రూపకర్త ఐన మీకు అందులో పాలుగొన్న వారికి హృదయపూర్వక అభినందనలు.

  ReplyDelete
 14. adbutamgaa uMdi

  indeed a very good work.
  congrats

  bollojubaba

  ReplyDelete
 15. మరువపు వనానికి రాకూడదనుకున్నా కానీ "ఇక మరో "అచ్చుతప్పు" కాదు కాదు "అప్పుతచ్చు" లేదు ;) చూసి రావలసి వచ్చింది. ఏమీ అనకండేం :).
  విళాపాలు అంటే?

  ReplyDelete
 16. చిన్నీ! నిజమే? ;) ఎన్నిరోజుల నుండి ఈ బ్లాగ్రథం ఎక్కి ప్రచారం చేసాను అమ్మడు. ఇప్పుడా మేల్కునేది? సరే వచ్చే ఏటి దీపావళి సంకలనం అంశం ఇచ్చేయనా?

  ReplyDelete
 17. మాలాకుమార్ గారు, బాబా గారు, జాన్ హైడ్ గారు, సుభద్ర, హరేకృష్ణ, ఇది సామూహిక బలం లోని విజయం. ఇందులో పాలు పంచుకున్న అందరిదీను. ధన్యవాదాలు.

  ReplyDelete
 18. నూతక్కి వారు, తమకిది మామూలే కదండి, పెద్ద మనసుతో కొండంత ఆశీర్వాదాలు కురిపిస్తారు. అంతే ఆత్మీయంగా మీకూ ప్రణమిల్లుతున్నాను.

  ReplyDelete
 19. కుమార్ గారు, ఒక మనిషిని పైకి తీసుకురావాలంటే పది చేతులు కలవాలి. ఇక్కడ జరిగిందదే. మీరంతా లేని నేను ఎక్కడ వుంటాను. నేనూ నిమిత్తమాత్రురాలినేనండి. ఇదంతకీ మూలం మరేదో. అంతా మంచినా అవిఘ్నంగా సాగిపోయినందుకు సంతోషం.

  ReplyDelete
 20. భా.రా.రె, traitor :) ఇది మనందరి సంకలనం, తలావొక చెయ్యీను. మీరు పాట పాడటం మానేసి ముద్రారాక్షసాల వెంట పడటం ఇదో అబ్బాయో, ఇదేం బాలా. మళ్ళీ అదిగో మాట పడ్డాను అని మనియాద పడతారని ఇంతటితో వదిలేస్తున్నాను. అసలు ఇంత తెలుగు వ్రాస్తానని పోయిన జన్మలో కూడా [కలలో కూడా కి కొంచం అతిశయోక్తి కలిపి] అనుకోలేదు... ఇక ఈ కుళ్ళుగుమ్మడి పనులు మాని ఇచ్చిన పని పూర్తిచేయండిక. :)

  ReplyDelete
 21. సంకలనం బాగుందండి. మొదలు పెట్టి అందరికీ స్ఫూర్తినిచ్చిన మీకు, అడిగిన వెంటనే ఆణిముత్యాల లాంటి రచనలు అందించిన రచయితలు అందరికీ, ఫీడియఫ్ గా రూపొందించడానికి సహకరించిన టీమ్ కు అందరికీ అభినందనలు. సంకలనం లో ఉపయోగించిన చిత్రాలు కూడా చాలా బాగున్నాయి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు.

  No Problem with the PDF file. I down loaded and verified, also checked in different browsers. I guess one 'p' is missing in the file name :-)

  "ఏటి మీ పేటోళ్ళంతా అసలు విషయం వదిలేసి అప్పుతచ్చుల వెనకాల పడతారు" అని తిట్టకండేం :-)

  ReplyDelete
 22. మీ పేటోళ్ళ చెయ్యి కూడా ఉంది బాసూ, తప్పులెంచేది మంచి కోసమే కదా... ;-)

  సంకలనాన్ని చక్కగా చేయించినందుకు, అసలు ఈ ఆలోచనతో అందరిని కూడగట్టుకుని ఇంత మంచి సాహితీ బహుమతిని దీపావళి సందర్భంగా అందరికీ అందించినందుకు మీకు అభినందనలు/ధన్యవాదాలు/వందనాలు

  ఉషగారు, మీకు దీపావళి శుభాకాంక్షలు.

  pdf is created in the latest of all the technologies, namely VSAX.

  ReplyDelete
 23. I tested the pdf in 7 browzers including konqueror. No problem occurred.

  ReplyDelete
 24. Usha garu,

  First of all congratulations for your work. Pdf is so cute, and the pictures are exceptional. We expect more such works from you... ఇప్పటికైన శ్రమ చాలదా? అంటారా? ;-) సర్లెండి. శ్రమ పడందే ఇంత మంచి సంకలనం వచ్చి ఉండేదా?

  Deewali wishes to you.

  @Dhanaraj Manmadha garu,

  VSAX technology!!! Latest??? Really? Whatz that never heard b4, and not seen in Google search too.

  ReplyDelete
 25. మీకు అందులో పాలుగొన్న వారికి హృదయపూర్వక అభినందనలు.

  ReplyDelete
 26. మరువం ఉష గారి జలపుష్పాభిషేకాని్న అందుకోలేని మరో పువ్వు..
  http://naazaada.wordpress.com
  -సురేష్

  ReplyDelete
 27. వేణూ గారు, నాకిప్పుడు మీరు పేటరంగు కలిపి చేసిన పుల్లైస్ మాదిరిగా కనిస్పిస్తున్నారు. కావాలంటే ఓ సారి అద్దం లోకి లుక్కేయండి మీకే తెలుస్తుంది... ;)

  "మండపేట మలకపేట నాయుడుపేట పేటరప్‌
  అచ్చంపేట కొబ్బరిమట్ట….. ;)" మీ ఘనమైన నర్సారావుపేట ఏడబ్బా?

  మా మండపేట వాళ్ళు మాత్రం మంచాళ్ళు. :)

  ఇక లాభం లేదు మీకు కూడా తలంటే ఇక, మా శేషయ్య అయితే బాగుండేది, మీకా అదృష్టం లేదు, స్వర్గం లో వున్నాడు. కనుక గంగయ్యని పిలుస్తున్నాను. ఇక, "చంటి" లో నాజర్ మీరు, తను వెంకటేష్... "ఇది తైలం పెట్టి తాళం పట్టి తలాంగుతో తలంటితే మోత ఇది ఒళ్ళే రుద్ది బుద్దే శుద్ధి చేసే కొద్ది తమాషాలే తీత"

  హన్నాన్నా, అసలు సంకలనం వదిలి ఈకలు పీకుతారా, అందరికీ కలిపి తట్టవరస పెట్టిగల్ను..

  ReplyDelete
 28. ధన, మరోసారి థాంక్స్. ఇది శ్రద్దగా విపులంగా చేయాల్సిన పని, మీరు అందించిన సాయం మరిచిపోను.

  ప్రియ, ఇక ఒక వారం పదిరోజులు మనసుకి సెలవులు. అంతగా సంతృప్తద్రావణమైపోయింది స్పందన. మీ అభిప్రాయానికి థాంక్స్. మీ ప్రశ్నలకి ధన నుండి సమాధానం రావచ్చేమో మళ్ళీ వచ్చి చూసుకోండి మరి.

  ReplyDelete
 29. సురేష్ గారు, మీ బ్లాగున నా వ్యాఖ్య వుంది. పి.డి.యఫ్ కి మరో అప్డేట్ చేయటానికి ప్రయత్నిస్తాను. మీ కవిత చాలా విలాపాన్ని పంచింది. చక్కగా వ్యక్త పరిచారు.

  ReplyDelete
 30. నేస్తం, థాంక్స్. పైయేటికి మీరూ కలవాలి.

  తృష్ణ, బెత్తం కూడా తేకపోయారా నన్ను నిలదీయను. ;) పండుగ కదా కాస్త పిల్లాపాపలతో నేనూ పసిదాని మాదిరి గడిపేసాను. రేపు వస్తుంది విశ్వామిత్ర తరువాయి భాగం. అడిగినందుకు మహదానందం...

  ReplyDelete
 31. ఒక్కోసారి, అనుకోనివి అదీ అనూహ్యమైన ఆనందాన్ని కలుగజేసేవి జరుగుతాయి. ఈ సంకలనం సృష్టి నుండి అదే వరస. గత రెండు రోజుల్లో మాకూ చోటు కావాలి అని వచ్చిన రచనలివి.
  (1) చిత్రం :) విజయమోహన్ గారి కుంచె నుండి "చిలి వలపు చిలుకు చేప" చిత్రం...

  http://vijayamohan59.blogspot.com/2009/10/blog-post_17.html

  (2) అనగనగా ఒక చేప - "నెమలికన్ను" మురళి గారి కలం చేసిన సద్దు

  http://nemalikannu.blogspot.com/2009/10/blog-post_15.html

  (3) దిక్కెవరు - సురేష్ గారి చేప విలాపం

  http://naazaada.wordpress.com/2009/10/18/%e0%b0%a6%e0%b0%bf%e0%b0%95%e0%b1%8d%e0%b0%95%e0%b1%86%e0%b0%b5%e0%b0%b0%e0%b1%81/

  పిడియెఫ్ లోకి ఇవి చేర్చే లోపు మీ కనులకు విందులుగా పంచుతున్నాను.

  ReplyDelete
 32. మీకు మీ కుటుంబసభ్యులకు దీపావళి శుభాకాంక్షలు .

  ReplyDelete
 33. @Priya,

  Yes. It's a latest method of converting any type of file into a pdf. Invented by me, and is tested to be effective. It works as effective as MS addon, and the direct button of OOo.

  At present it's code is only with me, and this pdf is made with help of it. It's far better than the present used ones.

  ReplyDelete
 34. Dhana, తెలుసండీ పేటోళ్ళ చేయి కూడా ఉందని :-) మీ కొత్త టెక్నాలజీ గురించి తెలుసుకోవడం ఆసక్తి దాయకంగా ఉంది.

  @ఉషగారు, అయ్‍బాబోయ్ ఏటండి అంత కోపం చేసేస్కున్నారు. అసలు సంకలనం వదల లేదు లెండి:-) మీరు నా వ్యాఖ్యలో మొదటి మూడు లైన్లు చదవాలి మరి, అది సరేగానీ ఇంతకీ పుల్ల+ఐస్ ఆ లేకా పుల్లని ఐసా :-)

  మా నర్సరావుపేట అలాటి అల్లరి పాటలలో ఉండదండీ :-)

  మొత్తానికి నన్ను విలన్ ని చేసేశారు :-) నాకు మటుకు పెళ్ళిపుస్తకం లో తలంటు సీన్ గుర్తొచ్చింది... "కొట్టు..కొట్టు.. కొట్టుచితక్కొట్టు.." (ఏదో ఈరో అయిపోదామని)

  అన్నట్లు ఎలాగూ మరికొన్ని రచనలు కలుపుతాను అంటున్నారు గా మరో ఈక :-) చివరిపేజీ లో సమ్పూర్ణం vs సంపూర్ణం. అట్టా గుర్రుగా సూసేయకండి మరి. ఏదో మా మరువం ఉషగారి సంకలనం లో చందమామ లో ఉన్నపాటి మచ్చ కూడా ఉండకూడదు అని తాపత్రయం అంతే :-)

  విశ్వామిత్ర కోసం మరో రోజు ఆగాలా... హ్మ్.. పండగ కనుక సరే :-) వచ్చే వారం మాత్రం ఆలశ్యమైతే ధర్నా చెపట్టేయాల్సొస్తుంది మరి:-)

  ReplyDelete
 35. వేణు, అవన్నీ పండుగ సరదాలే, నా కోపం తాటాకు మంట. ఇలా భగ్గుమని అలా ఆరిపోతుంది. ఇక మీపై అదీ రాలేదు. నాకు తెలుసండి మీ సదుద్దేశ్యం. :) ఆ చివరి పలుకు నేనూ గమనించాను కానీ అప్పటికే దాదాపు రాత్రంతా కూర్చుని ఈ సంకలనం కూర్చిన వారిని ఇబ్బంది పెట్టలేక రెండో వర్షన్ లో మార్చుదామని ఆగాను. ఇలా ఏ మచ్చ లేకుండా రావాలనే అందరి ప్రయత్నం. చాలా థాంక్స్ ఇలా చిన్ని చిన్ని లోపాలు కూడా లేని విధంగా సరిచేస్తున్నందుకు.

  విశ్వామిత్ర వ్రాస్తూ మిమ్మల్నే గుర్తు చేసుకున్నాను. ఒక్క వ్యాక్యం అన్నా మీ వ్యాఖ్యలో నచ్చింది అని వ్రాస్తారని. మరో పదిహేను నిమిషాల్లో వచ్చేస్తుంది. ముందుగా మీరే చదువుతారేమో.

  ReplyDelete
 36. This is right... సమ్పూర్ణం

  This is general usage... సంపూర్ణం.

  Just like Vraayatam and raayatam

  ReplyDelete
 37. బ్లాగర్లందరికి
  ప్రపంచ కవితా దినోత్సవ శుభాకాంక్షలు

  ReplyDelete
 38. గీతాచార్య, "సమ్పూర్ణం" అన్నది సరైన ప్రయోగమేనన్న వివరణకి థాంక్స్.

  ఇక పదిహేను నేను కేవలం 'విశ్వామిత్ర' కి వాడే సమయమని నా భావం. ఇక్కడ క్లాక్ మధ్యలో రీసెట్/స్టాప్/రీస్టార్ట్ వగైరాలు జరిగాయి. ;)

  అదీ కాక కాస్త అల్ప అస్వస్థత కారణంగాను, మీరు సిద్దంగా వున్నారు కత్తులు నూరను అన్న భయంతోనూ అలా జరిగింది.

  నేనీ వ్యాఖ్య వ్రాసుండగానే మీ అభిప్రాయం రావటమూ జరిగింది, అయినా కానీ...

  ReplyDelete
 39. గీతాచార్య గారు, That's very interesting. This is the first time i ever come across such confusion. వ్రాయడమూ రాయడమూ మధ్య సందేహం నాకు ఎప్పటి నుండో ఉన్నదే కానీ సంపూర్ణం సమ్పూర్ణం మధ్య అసలు రెండవ వాడకం ఎక్కడా చూడ లేదు. ఇంతకీ మొదటి జంటలో ఏది రైటంటారు మీ ఉద్దేశ్యం లో.

  ReplyDelete
 40. అయ్యోరామా!! ఉష గారు, నేనీ అస్వస్థత గురించి అసలు ఆలోచించలేదు సుమండీ.. ఏదో సరదాగా ధర్నాలు అవీ అన్నాను. మీరు ఆ మాటలు పట్టించుకోక మీ వీలు చూసుకుని ప్రచురించండి.

  ReplyDelete
 41. సంపూర్ణం, సమ్పూర్ణం as far as I know, both are right.

  వ్రాయడమూ is the right way if writing. రాయడమూ is a common sound in speaking. So, no question of which is right in modern day language language usage. But here I take the right word.

  సమ్పూర్ణం like words are generally seen in stOtrAs. I unexpectedly used it, and then stuck to it, as I felt to use it here in this collection. Thatz all. Came again just to clarify

  ReplyDelete
 42. ధన, వివరాలకి.. you are a geek
  వేణు, సందేహాలకి, ఈకలు పీకటానికి - పేట వారికి వుండాల్సిన లక్షణం ఇదొకటి.
  గీతాచార్య, వివరణకి, పేట వారికి వుండాల్సిన రెండో లక్షణం కూడా [ఇదే] వున్నందుకు
  ;)
  మీ అందరికీ అభినందనలు!!!!!!!!!

  ReplyDelete
 43. గీతాచార్య, మళ్ళీ థాంక్స్ చెప్పాలనిపించింది. "చన్ద్రశేఖర" అన్నదే సరైనది "చంద్రశేఖర" కాదు అని చదివానొకచోట, నాకు కూడా ముందు "సమ్పూర్ణం" కి "సంపూర్ణం" కి నడుమ అదే సందేహం కలిగింది.

  ఇక, ఈ 'వ్రాయటం' 'రాయటం' ని గురింఛి ఓ చిరు జ్ఞాపకం, మేము పోయినేడు అక్కడకి వచ్చినపుడు స్నేహకి తెలుగు రాదనుకున్న ఒకరు, వారికి ఇంగ్లీష్ కొంచం వచ్చని నాకు తెలుసు, ఏదో క్రీం తనకి ఇచ్చి "write on your face" అన్నపుడు కానీ నాకు ఈ మిక్సప్ అటు కూడా పాకిందని తెలియలేదు. [కాస్త నవ్వుకుందామనే కానీ ఆయన్ని కించపరచటం కాదిది]

  ReplyDelete
 44. చిన్ని చిన్ని సవరణలతో, చివరిగా అందిన ముచ్చటైన మూడు క్రొత్త రచనలతో, పి.డి.యెఫ్. అప్డేట్ ఇప్పుడు లభ్యం. కావాల్సిన వారు డౌన్ లోడ్ చేసుకోవచ్చినిక. ఇది ఫైనల్ కాపి. ఈ సహాయం అందించిన సృజనకి థాంక్స్.

  http://docs.google.com/fileview?id=0ByYmzYchoOSIMzg2MmE3MmQtYTkzNi00NjhhLWJjNmEtNmYzNGVlZTE1ZmMx&hl=en

  ReplyDelete