మర్చిపోయానంటారా, వూరుకుంటానేమిటీ ...
నా మారథాన్ - విశ్వమానవ ఆయురారోగ్యాలకి అంకితమిస్తు, నేగరిపిన యాగం!
ప్రక్కన కూర్చుని చెవిలో జోరీగలా మరీ హోరెత్తిస్తాను. అప్పుడు అంతా ఆహా ఓహో అన్నారుగా, వ్యాఖ్యల్లో అభినందనలు కురిపించేసారుగా :) అందుకే మళ్ళీ వచ్చే యేడు మారథాన్ కి సాధన పరుగులు మొదలు పెడుతున్నాను."సాధన ఎందుకు అంటారా"? మిమ్మల్ని క్షమించి వదిలేస్తా. మరి "సాధన చేతనే కదా సమకూరు పనులు ధరలోన?" ఇప్పటికి ఏడు మైళ్ళు ఆగకుండా పరిగేట్టేస్తా, ఇక దాన్ని పదమూడుకి పెంచి, మునుము కన్నా ముందుగా పూర్తీ చేసే ఆలోచనలోవున్నాను. అదీ సంగతి.
కాస్త దండోరా వేద్దామని ఈ టపా! ఈ ప్రయత్నాల్లో వున్న మిత్రులు మీ మీ సలహాలు, సమాచారాలు నాతో పంచుకోండేం. అలాగే ఏమైనా కావలిస్తే నాతోనూ సంప్రదించండి.
ఆగండాగండి మరి నాట్యం అంటారా, అదీను, దివ్యంగా రోజుకి గంట నా కాళ్ళకి ఓపిక వుంటే రెండు గంటలు లాగిస్తున్నాను.
మన బ్లాగుల్లో ఓ బాటసారి గారు మారథాన్ గురించి కాసిని అనుభవాలు పంచారు. నాకు తెలిసి కొంత ఉపయోగపడే సమాచారం ఇది.
wrote by some body who is preparing for మారథాన్
http://well.blogs.nytimes.com/2009/06/01/why-walk-breaks-help-you-run/
http://well.blogs.nytimes.com/tag/marathon/
I am running on the street
ReplyDeleteMy legs are moving so fast
My hands are weaving in the air
I could hear the people shouting
Common! Common! Common
My legs are paining
But I still have to keep on running
From my house all the way to work
Every morning, Every evening
A Marathon of Life Every day
All the best :)
ha ha hhaa Thanks Bhaa.Raa.Re for conceding. I too run a lot on that front yet run at the real one too!
ReplyDeleteone wicket down. yep, let's wait and see what your captain has to say now... [Pradeep, get the hint? :)]
Yeah, good start ...
All the best.
ReplyDeleteపరుగాపక పయనించవె తలపుల నావా
ReplyDeleteకెరటాలకు తలవంచితె తరగదు త్రోవ
సిరివెన్నెల
i like those lines.
have fun
all the best
bollojubaba
బాగుందండీ.. మరువం ఉషగారు కొద్ది రోజులు పిటి ఉషగారి స్ఫూర్తి తో ముందుకు సాగనున్నారనమాట... All the best... :-)
ReplyDeleteప్రకృతి, శరీరము, పరిస్థితులు అన్నీ మీ సంకల్ప బలానికి తోడు నిలిచి, సంపూర్ణంగా సహకరించాలనీ.. మీరు అనుకున్న లక్ష్యాన్ని అవలీలగా చేరుకోవాలని ఆశీర్వదిస్తున్నాను.
wish you reach your goal....good luck..!!
ReplyDeleterun usha run
ReplyDeletebest of luck
అన్నీ మంచి తరుణములే....
ReplyDeleteఈనాడులో మహిళా బ్లాగుల వార్తనందు 'మరువం' మురిపెం...
http://1.bp.blogspot.com/_Ldj17B6B4Uc/StBK-7JrsoI/AAAAAAAAAPE/jNE3VyJ6Quw/s1600-h/20091010a_Vasundhara.jpg
my blog template pic above the laptop and text about maruvam right under the వసుంధర title...
Not boasting just feel honored to be one among those ...
వార్త గురించి టపాగా వ్రాసిన "మనసులో మాట" సుజాత గారికి http://manishi-manasulomaata.blogspot.com/2009/10/blog-post.html
ఈపేపర్ లో ఈ అర్టికిల్ బొమ్మ సేవ్ చేసి తనకి పంపిన వేణు శ్రీకాంత్ గారికీ
ధన్యవాదాలతో,
ఉష.
just saw your blog in the article.
ReplyDeletefine and good applause for the commitment for telugu from distant lands.
మామూలుగా అమెరికాలో ఫాల్ వచ్చిందనగానే, ప్రపంచమంతా వేగం తగ్గించుకుని రాబోయే క్రిస్మసు సెలవల కోసం ఎదురు చూస్తూ విశ్రాంతి తీసుకుంటూ చిరుబొజ్జలు పెంచుకుంటూ హైబర్నేట్ అయేందుకు సిద్ధ పడుతూ ఉంటుంది.
ReplyDeleteఇట్లాంటి సమయంలో మీ ఈ మేలుకొలుపు చెర్నాకోలవిసురులాగా చురుక్కని తగిలింది.
ఇదిగో, నేనూ లేచి, బద్ధకాన్ని వొదుల్చుకుని వొళ్ళు విరుచుకుంటున్నా ..
Nice to hear. But where is the serial. This's already saturday. Hehehe
ReplyDeleteకవితా మారథానే అనుకున్నా! ఇది కూడానూ మళ్ళీ దానికి తోడు నాట్యం అంటున్నారు .హమ్మో! సకల కళలూ మీ సొంతమే.శుభం కలుగుగాక!
ReplyDeleteమాలా గారు, సుజ్జీ,తృష్ణ, థాంక్స్. ఏదైనా అది నా లక్ష్యం అనుకున్నాక నేను సాధించనిది లేదు. ఆ గురి పెట్టే వరకే కాలయాపన. ఇది ఆత్మవిశ్వాసం మాత్రమే! దైవం మీద ఫలితం వదిలి ప్రయత్నం మాత్రం నా వంతుగా చేయటం అలవాటు.
ReplyDelete:-)
ReplyDeleteబాబా గారు, నిజానికి ఆ తర్వాత వచ్చే పంక్తులింకా ఉత్తేజానిస్తాయి కదండి.
ReplyDelete"ఎదిరించిన సుడిగాలిని జయించినావా
మది కోరిన మధుసీమలు వరించి రావా"
ఇంకా సిరివెన్నెల గారు ఓ వూపుతో మనసుని ముందుకు తోసే పంక్తులివి ...
"తన వేళ్ళే సంకెళ్ళై కదలలేని మొక్కలా
ఆమనికై ఎదురుచూస్తు ఆగిపోకు ఎక్కడా
అవధి లేని అందముంది అవనికి నలుదిక్కులా
ఆనందపు గాలివాలు నడపనీ నిన్నిలా
ప్రతి రోజొక నవగీతిక స్వాగతించగా
వెన్నెల కిన్నెరగానం నీకు తోడుగా"
ఈ దూరసీమల నుండి కవితామతల్లి గళ్ళాన్ని అలంకరించను మేము చేస్తున్న ఆ ప్రయత్నాలని హర్షిస్తున్నందుకు ధన్యవాదాలు.
Inspiring. BOL for this attempt
ReplyDeleteకొత్తపాళీ గారు, ఇటువంటి పనులు చేస్తాననే నన్నంతా "పట్టుదలెక్కువ" అని ఆత్మీయుల నోట, "వూరందరిదీ ఒక దారైతే, ఉలిపికట్టెది ఇంకొకటి" అని గీత్మియుల [మాయాబజార్ 'గిల్పం' మాదిరి] నోట మాట అనిపించినదాన్ని. :)
ReplyDeleteథాంక్స్ అండి. మీ అందరికీ అలా వేకప్ కాల్ ఇవ్వాలనే నా కథని ఆపి మరీ ఈ ఈల వేసిండి. ఇదంతా మా నాన్నగారి చలవ. నేను పుట్టాక ఇంతవరకు ఆయన ఉదయం 3:30-4:00 నడుమ లేవకపోవటం చూడలేదు. మంచి క్రమశిక్షణలో పెంచారు మమ్మల్ని. అప్పుడు విసుక్కున్నా ఇప్పుడు ప్రతి క్షణం ఆ విలువ తెలుసుకుంటున్నాను. నా ప్రతి అడుగు వెనుకా ఆయన తీర్చిదిద్దిన పోకడే వున్నది.
@ Priya, Srujana, ;) come be my cheer leaders ;) am sure I won't let you down. Thank you both....
ReplyDelete@ dhana, yeah I was waiting for at least one to ask for it. It is on its way, just wanted to alert some of the upcoming fall and winter cold nights and mornings and not fall prey for the laziness.... :)
You know what writing that story is much more easier task than running on our midwest streets during the snowy days.
విజయమోహన్ గారు, అవునండి సకల కళా "వల్లభిని" :) మీ అందరి అభిమానాన్ని "చోర"గున్న ఆ అరువది నాలుగవ కళ కలుపుకుని. మీ అశీర్వాదానికి ధన్యవాదాలు.
ReplyDeleteవేణూ శ్రీకాంత్, మరోసారి మీ అభిమానంలో ముంచారు. నాకు ఈ మారథాన్ స్ఫూర్తి కలిగించిన నేస్తం నా వెనుక వున్నంత కాలం ప్రకృతి, అరోగ్యం లెక్కచేయను, ఒక్క దైవబలం నా సంకల్పాన్ని దృఢపరిస్తే అది చాలు. థాంక్స్.
ReplyDeleteచూస్తున్నా చూస్తున్నా. నాకూ పరుగానుభవముంది. సరదాగా one km races చేస్తుంటాను ఫిట్నెస్ కోసం. అలాగే 100 metres ని 12 నిమిషాలలో పూర్తి చేయాలని కోరిక కానీ, ఏడాది నుంచీ సాధ్యం కావటంలేదు. My thin frame is rejecting that prospect, కానీ impossible మాత్రం కాదని అర్థమవుతూనే ఉంది. చూద్దాం. మీరు కవితలు పరిగెత్తిస్తున్నారు.
ReplyDeleteమీకు ’వంద’నం
1
2
3
4
and me 5
Wish U Good luck.
ReplyDeletemy wishes are there for your marathon and dance. wish you good luck and good twist .
ReplyDeleteగీతాచార్య, ఇక్కడ వయోబేధం లేకుండా శారీరక దారుఢ్యాన్ని లెక్కచేయక పరుగులిడేవారిని చూస్తే మీరలా అనరు. నేను చాలా ఏళ్ళ తర్వాత ఇందులోకి వచ్చాను. చిన్న చిన్న ఇబ్బందులే కానీ ఎక్కువగా బాధ లేదు. అనారోగ్యం, అనువంశిక కారణాలు తప్ప మిగిలినవి లెక్కచేయనవసరం లేదు.
ReplyDeleteమీ బాధ 1-5 with four of mine in between is an intentional deed yet well understood ;)
@ పద్మార్పిత, నూతక్కి వారు, ధన్యవాదాలు.
Wish You Good luck.
ReplyDeleteThanks Sunita. I sure will come back to you all with the new numbers and better ones with my time and practice this time. My legs are in much better shape. Grateful to god for giving me back my zeal.
ReplyDeleteఉష.... I am so proud of you my dear.. Really proud of you. I wish I have at least 1/10th of your determination, All the best, you can achieve what ever you are trying for" ఇక్కడ కబుర్లు.కాం సూర్యా ఉపాధ్యాయుల కూడా పరుగెడుతుంది నాకు తెలిసి... నువ్వు బోస్టన్ లో వుండకూడదు అయ్యో.... :-(
ReplyDeleteభావన, అంతా మనమనుకోవటంలోనే వుంటుంది. ఒకరికి ఆలోచన వస్తే అది మరొకరు సాధ్యం చేయొచ్చు. అపుడది మరో పదిమందికి ఆచరణీయం. ఇలానే అన్నీను. ఆశయం, ఆలోచన, ఆచరణ - ముప్పేట పేనిన బంధం. నువ్వూ త్వరలో ఇదిగో నేనీ పని చేసాను అని చెప్తావు చూడు. మీ మదిలో ఆరంభం అయిన యోచనకి గుర్తు మీ యీ వ్యాఖ్య.
ReplyDeleteమరువమా చిలిపి పరుగు తీయకు
ReplyDeleteపరుగులో పంతాలు పోవకు
ఏ కొంటె వాడో కన్నె కొట్టునో?
ఏ తుంట రోడో చెయ్యే పట్టునో
నాట్యం లో మయురివై
పరుగు లో హరిణి వై
మరువమా చిలిపి పరుగు తీయకు .
రవిగారు, "మారథాన్ - మళ్ళీ మొలకేయవే మరువమా!" మీద మీ వ్యాఖ్య చదివాక నాల్గు మాటలు చెప్పాలని.. ముందుగా చక్కటి పాటని గుర్తు చేసారు. థాంక్స్. ఇక చిలి పరుగులు తీయగలనేమో కానీ పంతాలు ఎవరితో పోగలనండి, ఈ యేడు పదివేల మందిలో నేనొకరిని. పైయేటికి మరి కొన్ని వేలు. :) ఇక, చెయ్యిపట్టే విషయమంటారా ... నేను ఆరో మైల్లో కొంత నిదానమయ్యాను. షూ లేస్ వూడిందని కట్టుకోవటానికి వంగుతుండగా ఒక దృఢమైన చెయ్యి పట్టి ఆపింది. ఒక అర మైలుగా నన్నే గమనిస్తున్న సుమారు డెబ్బై సం. వయసున్న వ్యక్తి నేను పడిపోతున్నాననుకుని అలా పట్టుకున్నారు. చాలా భరోసాగా అనిపించింది. ఆయనకి నా కాలు ఆపరేషన్ విషయం చెప్పి ఒక పావు మైలు కలిసి నడిచాక, "ఇక నువ్వు పరిగెట్టొచ్చు,నేనిలా వేగంగా నడుస్తాను, మధ్య మధ్య లో నేను పడిపోతానేమో నువ్వే చూడాలి మరి" అని కన్ను గీటారు. చివరగా పన్నెండో మైల్లో మళ్ళీ నన్ను దాటివెళ్తూ చేయి వూపారు. అంతకు మునుపు చివరి పధ్నాల్గు మైళ్ళ ప్రాక్టీస్ లోకూడా నేను అదే మైలు దగ్గర బ్రేక్ డౌన్ అయ్యాను. ఇక కదలలేనేమోననుకున్న ఆ తరుణం లో ఆయన మళ్ళీ కనపడటం కొంత, ఇరవై ఏడు మైళ్ళ వారు కొంత మంది కలవటంతో కొంత ఊపునిచ్చాయి. అలా అలా పదమూడు మైళ్ళు పూర్తిచేసేసాను. ఈ రోజు తృప్తిగా ఆ సంబరాన్ని మీ అందరితో పంచుకోగలిగాను. ఏదైనా మనం అనుకోవటంలో వుంటుంది. ఆయన చర్యలో కానీ, అలా కన్ను గీటిన కుర్రాడి కళ్ళలో కానీ ఏ విధమైన విపరీత భావం నాకు కనపడలేదు. మీరంత శ్రద్దగా వ్యాఖ్య వ్రాసినందుకు, నా పరుగుకి హుషారిచ్చినందుకు ధన్యవాదాలు. హరిణి గానో, మందగమన గానో బండి లాగించేస్తాను. మయూరిగా నాట్యం మాత్రం ఏ ఢోకా లేదు. నెనర్లు.
ReplyDelete