సెప్టెంబర్ పాఠాలు

ఈ నెల విశేషం: స్కూల్లో వారికి క్రొత్త తరగతి మొదలుపెట్టినట్లే నేను వారి చేత వ్రాయించటం మొదలు పెట్టాను. :)

అందరికీ చిన్న వైట్ బోర్డ్, ఇరేశబుల్ డ్రై మార్కర్ కానుకగా ఇచ్చాను. అదీకాక వాళ్ళ క్రెడిట్ పాయింట్స్ చూసి అందరికీ మార్కర్స్ సెట్ ప్రెసెంట్ చేసాను. ఈ చిన్ని చిన్ని సరదాలు వాళ్ళలో నేర్చుకోవాలన్న ఉత్సాహాన్ని పెంచుతాయని నా ఆలోచన.

.. మొదట వాళ్ళతో అచ్చులు వ్రాయించి, ఆ తర్వాత వ్రాయించిన రెండక్షరాల పదాలు మచ్చుక్కి కొన్ని:

అల, తల, వల, కల, జడ, ఆట, పాట, పాలు

.. వత్తులు కలిపి, రెండు అక్షరాల శబ్దాలు కలిపి పదాలు

అక్క, అత్త, అట్ట, నవ్వు, పువ్వు, చిక్కని, నీళ్ళు

****************************************

పాటలు:

.. బుర్రు పిట్ట బుర్రు పిట్ట
.. చిట్టి పొట్టి మిరియాలు
.. ఒప్పులకుప్ప వయ్యారిభామ

2 comments:

  1. చాలా మంచి పని. పిల్లలకి తెలుగు తాయిలాలివ్వటం. ;-)

    ReplyDelete
  2. గీతాచార్య, ధన్యవాదాలు. నిజానికి వాళ్ళ తియ తీయని పలుకులే నాకు తాయిలం. మన భాషని ఇంకొన్ని తరాలు అందుకోవాలనే నా ఈ చిరు ప్రయత్నం.

    ReplyDelete