ఈ వేసవి లో క్లాసులు చాలా ఇర్రెగ్యులర్ గా జరగటం తో వచ్చే యేడు వేసవికి తెలుగు స్కూల్ కి కూడా సెలవలు ప్రకటించాలని నిర్ణయించుకున్నాను.
ఇక్కడ మేము విలైనంతలో నేర్చుకున్న పాఠాలు జతపరుస్తున్నాను. మీ పిల్లల పుస్తకంలో పూర్తి వివరాలు వున్నాయి.
.. అచ్చులు ఉచ్చారణ వచ్చాక హల్లులతో కలిపి గుణింతాలుగా పలకటం.
ఉదాహరణకి అ - క; ఆ - గా; ఇ - సి; ఈ - టీ ఇలాగన్నమాట.
.. పైన శబ్దాలు వాడిన పదాలు
ఉదా: నాకు, నీకు, మేము, మనము, మీరు, వారు, వీరు
.. పదాల్లో వివిధ అర్థాలు
ఉదా: ఇక్కడ - అక్కడ - ఎక్కడ; ఎందుకు - అందుకు; ఇది-అది-ఏది
.. పదాలు వాడకం
ఉదా: నీతో, నాకు, మీ కోసం
.. వాళ్ళు రోజూ గమనించేవి
ఉదా: చంద్రుడు, అమావాస్య, పౌర్ణమి, నెలవంక.
ఇవి నేను బొమ్మలుగా గీసి, వాళ్లతో రంగులు దిద్దించి, పలికించటంతో గుర్తు పెట్టుకునే అవకాశం ఎక్కువ.
.. ప్రకృతి/నేచర్ లో వారు గమనించేవి
ఉదా: భూమి, ఆకాశం, అగ్ని, గాలి, నీరు, నక్షత్రాలు, చంద్రుడు, సూర్యుడు, మేఘాలు, మట్టి, వాతావరణం.
******************************************************
పాటలు:
.. చుక్ చుక్ రైలు
.. కాకి కాకి
.. అమ్మ మాట చల్లన
ఉష గారు,
ReplyDeleteమీ బ్లాగ్ ఈ రోజే చూసాను. చాలా మంచిగా వుంది. ఈ బ్లాగ్ లో ఇంకా చిన్న పిల్లల లాలి పాటలు కూడా పెడితే బావుంటుంది. ఆలోచించండి.
రవి గారు, మీ అభిప్రాయానికి ధన్యవాదాలు. ఈ బ్లాగు ప్రథమంగా ఒక ఏడాదిపాటు పిల్లల అభివృద్ది తల్లితండ్రులకి తెలుపటానికి ఉద్దేశించబడింది. ఆపైన పిల్లల విద్యాకౌశలం పదిలపరచటానికి, అపుడపుడు మా జన్యా సంస్థ ప్రగతి, విశేషాలు పంచుకోవటానికీను. ఆ దృష్ట్యా ఇక్కడ లాలిపాటలు కలుపబడలేదు. పిల్లలకి నేను నేర్పేవి, వారికి బోధనాంశాలుగా వాడినవీ మీకిక్కడ తెలుస్తాయి.
ReplyDelete