All, everything that I understand, I understand only because I love. – Leo Tolstoy
If you want a relationship to get deeper and deeper with the passage of time, you will go on strengthening it all your life ...
If you want a relationship to get deeper and deeper with the passage of time, you will go on strengthening it all your life ...
*** *** *** *** *** ***
నీ మౌనం నను బాధించిన ప్రతి క్షణం
నా భాషలో భాష్యం వెదికానిన్నాళ్ళు.
నీదీ ఓ భాషేనని అదొక్కటే నీకు తెలుసనని,
నాకు తెలిసినదేదో కలవరపరిస్తే,
తెలిసీ తెలియని భావాలతో
నేనూ నీవలె సంభాషిస్తున్నానిపుడు, చూడు మరి!!!
నా భావం నీకెరుక పరుచను
ఈ రెప్పచాటు నీరు చాలదా?
నీ ఒదార్పు నాకందించను
ఓ రెప్పపాటు చూపు చాలదా?
మన బంధం బలీయమవను
నీది నాదీ ఒకటే లయ కావద్దా, చెప్పు మరి!!!
ఈ రెప్పచాటు నీరు చాలదా
ReplyDeleteనీ ఒదార్పు నాకందించను
నేను ఎల్లవేళలా కోరుకున్నది ఇదే.
కంటిచూపు బాసకు అర్థాలె వేరులే.. అర్థాలె వేరులే
ReplyDeleteజాలు వారిన నీటిబొట్టు కాటుకంత కరగదీసి
ఎదురనున్న మనిషి గుండెలోన కరిగిపోయెలే
రెప్పపాటు చూపుకోసం .. రాతిరంత రెప్పమూసి
గుండె గుడిదారినంతా సర్దిచెప్పి సద్దు మణిచి
హృదయ సీమ తలుపులన్నీ
నీ పిలుపుకై బార్లతెరచి
ఉంచానా....
పిలిచిన ఆ పిలుపుకోసం
మరి మరి వలపులకోసం
లేని కోపం ముక్కున చూపి
ముఖమంతా వాడ్చిచూపి
ఇటు తిరిగి నవ్వుకున్నాలే
మనసులోన త్రుళ్ళిపోయాలే
ఆడువారి మాటలకు అర్థాలె వేరులే... అర్థాలే వేరులే...
మన బంధం బలీయమవను
ReplyDeleteనీది నాదీ ఒకటే లయ కావద్దా
Well Said.
బాగుంది.
ReplyDeleteకొన్నిటికి చెప్పడం వుండదండి ,మౌనం లోనే సమాధానం వుంటుంది అది నిజమైన ప్రేమికులకి అర్ధం అవుతూనే వుంటుంది , కాని అబద్రత భావం తో అప్పుడప్పుడు ఇలా బయట పడుతూ వుంటుంది
ReplyDeleteమీ భావం బాగుంది .
ReplyDeleteఇన్స్పిరేషన్:
ReplyDeleteAll, everything that I understand, I understand only because I love. – Leo Tolstoy
If you want a relationship to get deeper and deeper with the passage of time, you will go on strengthening it all your life ...
*************************
Due to lack of time I did not add this bit. Now added to the post.
Will come back on any comments that await my further clarifications, in the evening. Thanks for visitng me.
ఎంత బాగా రాసారు.. !
ReplyDelete"నా భావం నీకెరుక పరుచను
ReplyDeleteఈ రెప్పచాటు నీరు చాలదా?
నీ ఒదార్పు నాకందించను
ఓ రెప్పపాటు చూపు చాలదా?"
చాలా బాగుంది.
ఉషగారు...ఎంత అందమైన భావన!
ReplyDelete@ వల్లి, తొలిసారి నా వనవిహారానికి వచ్చారు. థాంక్స్.
ReplyDelete@ మాలాకుమార్, తృష్ణ, సుజ్జీ, పద్మార్పిత, ఓ పదిమంది బాగుందన్నారు. సంతోషం [మీరే పదిమంది పెట్టు నాకు] ;)
@ ఒరెమునా/చావా కిరణ్ గారు, చిరకాల దర్శనం, సార్ :)
ReplyDelete@ కుమార్, వేణు, మీకు నచ్చిన పంక్తులు నాకు కొత్తగా చూసినట్లనిపించింది. ఇది మరీ ఫ్లోలో వ్రాసేసాను, పదాలు దొర్లటమే గుర్తు. మెదడుకి ఎక్కనంత వేగంగా మనసు, కలం పని కానిచ్చేసాయి. ;)
@ భా.రా.రె, అందుకే నాకు నా కన్నని చూస్తే అంత కోపం, అంతా తన వకాల్తా పుచ్చుకునేవారే. మౌనంగానే శాసిస్తాడు. :) అయినా అంత ఆశుకవిత ఎలా తన్నుకువచ్చిందేం? స్వానుభవసారం కాదు కదా? ;) టపా వ్రాసిన అరగంట లోపు ఆవలీలగా కవిత ఒలకబోసారు ఎంతైనా మీరు దేనికైనా సమర్థులే, ఓసారి నాకు సానుభూతి, పదిసార్లు దండయాత్రలూను. థాంక్స్.
ReplyDeleteరవిగారు, సమయానికి తెలుగు పదం జ్ఞాపకానికి రావటమ్ లేదు. అది అభధ్రతాభావం కాదేమోనండి - పొసెసివిటీ, ఇంకా ఇంకా స్వంతం చేసుకోవాలన్న అనురాగం. తెలియని ఇంకే వూసులు తన మౌనంలో దాగున్నాయేమోనని శోధన. చివరి శ్వాస వరకు ఈ ప్రేమైకజీవనం నాకు తప్పదు. :)
ReplyDeleteకలిసి నడిచే నాలుగు కాళ్ళు రెండయినప్పుడు, కలిసి స్పందించే రెండు మనసులు ఒకటైనప్పుడు... రెప్ప పాటు చూపులో ఒలికిన భావనలెన్నో చాలదా గుండె నుంచి గుండెకి పాకి కరిగిన కాటుక సాక్షి గా పెదవి మీద నవ్వు పువ్వులు మెరిపించి మరువపు మొలకను మురిపించేందుకు...లయ మారని గుండె చప్పుడు లో లయమయ్యేందుకు...
ReplyDeleteభావన, పాట ఒకటి వుంది చూడు "నీకూ నాకూ ..., తెలిసినదేదో తలిచిన కొలదీ కలవరమాయెనులే..." అలా మన ఇద్దరికీను. నీకు కృష్ణయ్య,నాకు నా కన్నయ్య :) అచ్చంగా నువ్వన్నట్లే "కరిగిన కాటుక - మోమున నగవు" వూసులివి. వూసుపోని అలకలివి, వదలనీని మోహమిది అన్నిటా ప్రేమదే పైచేయనుకో...
ReplyDeleteA good relief after reading such an intensive story. Chala baga rasaru. malla inko sari chadavali...
ReplyDeleteఅ.గా. గారు, వ్యక్తిగతమే అయినా ఇలా నలుగురిలో పంచాయితీలు జరపటం అలవాటే నాకు :) నా మానాన నన్ను జలపుష్ప సంద్రాల్లో వదిలేసి, హాయిగా చేపల పులుసులు లాగిస్తూ, అసలే మౌనమూర్తా ఇక నా వైపే చూడని నా "కన్న" కి హఠాత్తుగా దూరం జరిగిపోయిన ఆందోళన లోంచి ఆశువుగా జారిన కవిత ఇది.
ReplyDeleteI felt like I got sucked in to a pond of fishes :) so jumped out to push him in to the ocean of bloggers to fish him out....;) JK
పరిమళం, థాంక్స్. :) Feels nice to see your signature once again!!!!
చాలా బాగుందండి. "మౌనమే నీ భాష ఓ మూగమనసా"! అన్నారు కాదా. భావాలు బయటికి తెలియనంతవరకు తియ్యటి అనుభూతే కదా!
ReplyDeleteజయ, నిజమే కానీ "మాటే మంత్రము మనసే బంధమూ" అన్నదీ తానే అందుకే తన మౌనం భరించలేనిక అనుకున్నపుడే ఈ విలాపాలు. కాస్త తొట్రుపడి సద్దు చేస్తాడు కనుక నేనీ సవ్వళ్ళు అపుడపుడు వెలికి తెస్తాను. థాంక్స్.
ReplyDeleteరెప్ప పాటు చూపైనా, రెప్ప చాటు నీరైనా ఇంతి మనో భావాలను అలవోకగ బయల్పరచు.అధ్భుత వ్యక్తీకరణ.,వుషా అభినందనలు.
ReplyDeleteనూతక్కి వారు, ఇంతి మానసాన్ని వ్యక్తపరచను ప్రబంధాలే వెలువరించారు కదండీ, ఏదో గాలివాటు కవితలివి. మీకూ నచ్చుతున్నందుకు సంతోషం. కానీ ఇందులోని "రెప్పపాటు, రెప్పచాటు" మాత్రం పునరావృతాలు నా జీవితంలో.
ReplyDelete