పులసా! పులసా!

"సాహితీ-యానం" చేస్తున్న మిత్రులు బొల్లోజు బాబా గారు సహృదయంతో పంపిన జలపుష్ప కవితిది. ఇక్కడే టపాగా ప్రచురించమన్న వారికి కృతజ్ఞాభివందనాలతో ...

/* (నదీ పరీవాహక ప్రాంతాలలోకి గుడ్లు పెట్టటానికై సముద్రం నుంచి వచ్చి, ఇక్కడ వలలకు చిక్కి దాదాపుగా అంతరించిపోయిన పులస చేపల గురించి వ్రాసిన కవిత ఇది.

ఒక ఇరవై సంవత్సరాలక్రితం పదిరూపాయిలు పలికిన ఈ చేప ఈనాడు మూడువేలరూపాయిల పైన పలుకుతుంది. కారణం విపరీతంగా వేటాడడమే. అయినా ఇంకా దీనిపై కనికరం చూపటం లేదు. సెనపులస అంటే గుడ్లతో కూడిన తల్లి పులస) */

ఇక్కడే గుడ్లు పెట్టాలనే

లక్షల సంవత్సరాల నీ ఇన్ స్టింక్ట్ ని

ఇకనైనా మార్చుకోలేవా?

ఆనాటి మానవులం కాం మేవిపుడు.

మనిషిని మనిషే అంగట్లో

సరుకుగా మార్చే కాలమిది.


బజారు గట్టుపై నీవు

మృత్యు జలాలలో ఈదుతూన్నపుడు

నీ కనుల మెరుపులో నా హ్యూమన్ రైట్సన్నీ

కాలి బూడిదయ్యాయి.

సాగరాల్ని ఓడించిన

నీ రెక్కలు మౌనం దాల్చినపుడు

నా జాతి ఔన్నత్యమంతా

హాహా కారాలు చేస్తూ ఆవిరయ్యింది.


“సెన పులసైతే రేటెక్కువ”

అన్న మాటవద్ద, సరిగ్గా అక్కడే

నా జాతి భవిష్యత్తు నాకు

స్పష్టంగా కనిపించింది.“పుస్తెలు తాకట్టు పెట్టైనా పులసను తినాలి”

అంటూండే మా అనాగరీక తాత

ఇపుడైతే

“పుస్తెలమ్మైనా పులసను కాపాడండర్రా”

అనే వాడేమో.


9 comments:

 1. Touching. Very touching. We have environmental studies in the course. This must be shown to the students. బాబా గారు బాబా గారే!

  ReplyDelete
 2. Shall I say 'beautiful' to the poem or feel sad for the fish? Really mixed emotions.

  ReplyDelete
 3. మనసు పిండేస్తున్నట్టు గా ఉంది. అవును నిజం. పుస్తెల్నమ్మయినా పులసల్ని కాపాడాల్సిందే.

  ReplyDelete
 4. బాబా గారి కవితలో అంతరించిపోతున్న పులసల పట్ల కనపరిచిన ఆవేదన అనంతం.
  గీతాచార్య, సృజన, నరశిమ్హ గరు, మీ మీ స్పందనలకి కృతజ్ఞతలు. ఏ ప్రాణికైన మనిషితో సమానంగా జీవించే హక్కువుందని నమ్ముతాను. నా సాధ్యమైనంత వరకు వాటికి సంరక్షణ ఇవ్వటానికి ప్రయత్నిస్తాను. ఇవన్నీ ఐఛ్ఛికాలు కనుక ఎవరినీ ఏమీ అనలేము.

  ReplyDelete
 5. “పుస్తెలు తాకట్టు పెట్టైనా పులసను తినాలి”
  “పుస్తెలమ్మైనా పులసను కాపాడండర్రా”
  పులస చేపనైనా మనిషి ఆహారంగా ఆరగించే మరే జీవవాన్నైనా తినే ముందు ఒక సారి యీ కవిత చదివితే చీ తినకపోతే ఏమని తినే ముందు తప్పక ఆలోచిస్తాడు.ఇందులో మారుతున్న ఆలోచనా ధోరణులు,తరాల అంతరాల అంతరంగాన్ని అత్యధ్భుతంగా విశ్లేషించారు .హ్యాట్స్ ఆఫ్ బాబా .

  ReplyDelete
 6. సాగరాల్ని ఓడించిన
  నీ రెక్కలు మౌనం దాల్చినపుడు
  నా జాతి ఔన్నత్యమంతా
  హాహా కారాలు చేస్తూ ఆవిరయ్యింది

  చిన్న చేపని పెద్ద చేప తినడమ్లో ఉన్న ఆనందం దాని నైతిక పునాదుల్ని
  బయట పెట్టింది. అద్భుతంగా ఉంది.

  ReplyDelete
 7. పదునైన అతి తక్కువ పదాలు... అంతులేని భావాలు... బాబా గారు మీకు మీరే సాటి... పులసల కధ తెలిసిన వారెవరి కంటనైనా నీరు సుడులు తిరగక మానదు... సంతానాభివృద్దికోసం సాగరానికి ఎదురీది గోదారి జలాలను చేరుకుంటున్న పులసల అస్తిత్వమే ప్రశ్నార్ధకమవటం దారుణం.

  ReplyDelete
 8. అద్భుతంగా ఉంది

  ReplyDelete
 9. ఉషగారు థాంక్సండీ

  ఆలోచనను పంచుకొని స్పందించిన మిత్రులకు ధన్యవాదాలు తెలియచేసుకొంటున్నాను

  భవదీయుడు
  బొల్లోజు బాబా

  ReplyDelete