విశ్వామిత్ర-7

వేసవి రోజులు. ఆదివారం సాయంత్రం. వాతావరణం బాగుంది, అలా కాసేపు తిరిగివస్తే బాగుండునని బయటకి వచ్చింది మిత్ర. కాస్త డ్రైవ్ చేసుకుని వెళ్తే, దగ్గర్లోనే వున్న గార్డెన్ లో తిరిగిరావొచ్చు. కార్ పార్క్ చేసి లోపలకి నడుస్తూ యధాలాపంగా రోడ్ అవతలి వైపు చూసింది. విశ్వ జాగ్ చేస్తూ కనపడ్డాడు. మిత్రని చూడగానే ఆగి చెయ్యి వూపాడు. ఇటుగా రోడ్డు దాటి వచ్చాడు.

"విశ్వ! మీరు ఇక్కడా...ఓ రేపటి నుండి మళ్ళీ ఓ వారం ఇక్కడే కదూ?" అని అడిగింది మిత్ర.

"బాగున్నారా మిత్రా? అవునండి, ఇందాకే రెండు గంటల క్రితం లాండయ్యాను. నేనుండే స్వీట్స్ ఇక్కడికి మైలు లోపే. క్రితం సారి ఐవన్ ఎంగేజ్ చేసిన సాయంత్రం తనతో కలిసి సాకర్ చూడటానికి ఈ గ్రౌండ్స్ కి వచ్చాను. రన్ కి బాగుందీ ట్రాక్ అని ఇలా వచ్చాను" అన్నాడతను.

"నిజమే తను చాలాసార్లు ఇటుగా వచ్చినా ఆ ఆసక్తి లేక ఆ గ్రౌండ్స్ కానీ, బైక్/వాక్ ట్రాక్ కానీ గమనించనేలేదు. ఇప్పుడు కూడా ఏదో గేమ్ జరుగుతున్నట్లుంది" స్వగతంగా అనుకుంది.

"మీకు అభ్యంతరం లేకపోతే మీతో కలిసి వాక్ చేయొచ్చా?" మర్యాదపూర్వకంగా అడిగాడు.

"తప్పకుండా, నాకూ ఏమీ తోచకే ఇలా వచ్చాను, రండి ఈ లోపల గార్డెన్ బాగుంటుంది. లోపల కూడా తిరగొచ్చు" అంటూ అటుగా దారితీసింది మిత్ర.

"ఎలావుంది ఇక్కడి జీవితం" ఉపోధ్ఘాతంగా అడిగింది. అతనింకా మాటల పొదుపరేనని మునుపే గమనించింది.

"బాగుంది, క్రొత్త పరిచయాలు. ప్రభావాలు." అన్నాడు.

"ఊ నచ్చిందన్నమాట. చెప్పండి ఏదైనా ఒక ఆ క్రొత్త విషయం." సంభాషణ పొడిగిస్తూ అడిగింది.

"సరే, ఇదిగో నా జాగింగ్, గారీ నుండి అలవాటైంది. తను మరథాన్ రన్నర్. విషయం తెలిసే కొద్దీ అదీ తను అంత శ్రద్దగా ప్రాక్టీస్ చేస్తూ మంచి సమాచారం ఇచ్చాక నాకూ ఆసక్తి పెరిగింది. తన ద్వారాగా ఒక పేస్ టీమ్ తో కలిసి సాధన చేస్తున్నాను." అన్నాడు.

తర్వాత ఓ పది నిమిషాలు పేస్ టీమ్, మారథాన్ కి వయసుకి సంబంధించిన అంశాలు, శారీరక ఇబ్బందులు, సిద్దపడటం వంటి విషయాల మీద సాగింది.

"కాసేపిక్కడ కూర్చుందామా" అని అడిగింది.

కాస్త ఎత్తుపల్లాలుగా వున్న ఆ తోట వాళ్ళు నిలబడిన దగ్గర నుండి కొంచం దిగువకి మారుతుంది. మళ్ళి కాస్త వెనగ్గా కొండ మాదిరిగా కనపడుతుంది. సూర్యాస్తమయం కానుంది. కనకాంబరం వన్నెలో ఆ బింబం కాంతులీనుతూవుంది.

"మీరిక్కడికి తరుచుగా వస్తుంటారా?" అని అడిగాడు. ఇద్దరూ అక్కడే ఓ చెట్టు క్రిందగా వేసిన బెంచ్ మీద కూర్చున్నారు. మిత్రకి ఎడం ప్రక్కగా అతను.

పెద్ద కుచ్చు తోకని తమాషాగా కదుపుతూ పైకి, క్రిందకి పరుగులు పెడుతున్న ఉడుతని తదేకంగా చూస్తున్న మిత్ర "అవునండి ఇక్కడకి వస్తే తాత గారి మామిడి తోటలో వున్న ఫీలింగ్. ఆ తోపుల్లో తిరుగాడినట్లే వుంటుందిక్కడాను." అంది మిత్ర.

మిత్రని ఒకసారి పరీక్షగా చూసాడు. చిన్న చిన్న పూలున్న లాంగ్ స్కర్ట్, పసుపు రంగు స్లీవ్ లెస్ టాప్, ఆ సాయం సంధ్య వెలుగుకి కాస్త లేత గులాబీ ఛాయ కలిసినట్లుండే ఆమె మోము మరింతగా వెలుగుతుంది. అప్పటికప్పుడు ఆ రూపు చిత్రించాలన్న అనుభూతి. హృదయం లో మాత్రం చిత్రించుకుపోయింది. ఆ కూర్చోవటమ్లో కూడా ఏదో హుందా, హొయలు. లేదా తనలోని భావనా అది? చిన్నగా నవ్వు పాకివచ్చింది అతని మొహమ్మీదకి.

అప్పుడే తల తిప్పి చూసిన మిత్ర సన్నగా అతని కుడి బుగ్గ మీద పడ్డ చొట్టని అప్పుడే గమనించింది. మరో పది సెకన్లలో ఆమెలో ఉద్వేగం. ఆ కల తనకింకా గురుతే. చివ్వున ఏదో బిడియపు పొర.

'ఎంకీ నే చూడలేనే ఎలుతురులో నీ రూపు ఎలిగిపోతుంటేనూ' విశ్వ మనసులో కదలాడుతున్న భావన.

ఇద్దరూ ఎవరి అనుభూతిలో వారున్నట్లుగా మరో ఐదు నిమిషాలలా గడిపేసారు.

ఇంతలో ఆ ప్రక్కగా వున్న ఓ పదడుగుల స్తంభం మీదకి నెమ్మదిగా ఎగురుతూ వచ్చి వాలింది ఓ గ్రద్ద.

"ఇంత దగ్గరగా ఈ పక్షిని చూడటం నాకు ఈ వూర్లోనే జరిగింది" అన్నదామె.

"అవును మేము చిన్నప్పుడు గ్రద్ద నీడ మీద పడటం కోసం పైన ఎగిరే పక్షి నే చూస్తూ క్రింద పరుగులు తీసేవారం" అతనూ చిన్ననాటి జ్ఞాపకాన్నిగుర్తు చేసుకున్నాడు.

సన్నగా గాలి వీచి చెట్టు పూలు ఒకటీ రెండూ రాలి ఇద్దరి మధ్యగా పడ్డాయి.

అప్రయత్నంగా చేతులు అటుగా కదిపిన ఇద్దరికీ ఒకరి చెయ్యి ఒకరికి తాకింది. తొలి స్పర్శ. చటుక్కున చెయ్యి వెనక్కి తీసుకుంది మిత్ర.

"సారీ, చూసుకోలేదు" అన్నాడు విశ్వ.

మరింత ముడుచుకుపోయింది, 'అంటే అతనూ గమనించాడు..' మొహమాటంగా వుంది.

"ఇక వెళ్దామా?" లేస్తూ అడిగింది.

"ఊ, పదండి, చూస్తూ చూస్తూ గంట గడిచిపోయింది. కంపనీ ఇచ్చినందుకు థాంక్స్" అన్నాడు విశ్వ.

"అయ్యో అలా ఏమీ కాదు, ఆమాట కొస్తే నాకూ సమయం తెలియకుండా గడిచిపోయింది. మనం మొదటిసారి వర్క్ విషయాలు కాకుండా వేరే విషయాలు మాట్లాడాం. గమనించారా?" లోలోపలి తడబాటు కప్పిపుచ్చుకోవటానికి తనీ మాట అంటుందా?

సన్నగా నవ్వి "నిజమండి, నాకు ఈ గార్డెన్ నచ్చింది, మళ్ళీ రావాలి." అన్నాడు.

ఈ సారి వెనక్కి మళ్ళకుండా ముందుకే వెళ్ళి కాస్త చుట్టూ తిరిగి పార్కింగ్ దగ్గరకి వచ్చారు.

"ఆలస్యం అయింది కదా. డ్రాప్ చేసి వెళ్ళనా?" కార్ డోర్ తీస్తూ అడిగింది మిత్ర.

"వద్దండి, ఎంత పది నిమిషాల్లో వెళ్ళిపోతాను. మరిక సెలవా, రేపు కలుద్దాం." అంటూ ఆగాడతను.

మరొక పది నిమిషాలకి ఇల్లు చేరిన మిత్ర స్నానం చేయటానికి వెళ్తూ, లాండ్ లైన్ మీద ఆన్సరర్ చెక్ చేసుకుంది. నవీ మెసేజ్, "పైవారం ఇండియాకి వెళ్తున్నాను. తాతగారికి ఏమైనా కొని తీసుకువెళ్ళనా? " అది క్లుప్తంగా సమాచారం.

రాత్రికి కాల్ రిటర్న్ చేయాలి అనుకుంది. విశ్వ గురించి చెప్పనా మాననా అని తర్జన భర్జన పడి అప్పుడే కాదు, అనుకుంది. కానీ ఏదో తెలియని భావన. అతని పట్ల ఆత్మీయత వంటిది కలుగుతుంది. ఒంటరితనం వలన పూర్వ పరిచయస్తుడు కనుక ఆ దగ్గరతనం ఫీలవుతుందా? కాదు, అతనిలో తనకు తెలియని పార్శ్వం తెలుస్తుంటే ఆ వైపు గా తన మనసు వెళ్తుంది. ఇది నిజం.....

*** *** *** *** *** *** *** *** *** *** *** *** *** ***

రాత్రి డిన్నర్ పూర్తి చేసి, మర్నాటి ప్రాజెక్ట్ ప్రపోజల్ మీదా, ప్రజంటేషన్ మీద కాసేపు గడిపి, మిత్రని గురింఛి ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు విశ్వ.

నిద్ర దూరమై, అటూ ఇటూ దొర్లి, విసుగ్గా లేచి యండమూరి నవల చదువుతూ కాసేపు, నవీ తో మాట్లాడుతూ కాసేపు గడిపి, అస్పష్టం గా వున్న భావాల్ని అలా కాగితం మీదకి వంపింది.

ఇరు మేఘాల చిరుసందడిలో చినుకుల జడి,
మేరు గర్జనల అలజడిలో మెరుపుల వరవడి,
సరి సరి రాగాల నెత్తావి గుస గుసల గుంభన సడి,
విరి తరుల వయ్యారి వూపుల పొంగారు పుప్పొడి,
గోధూళి వేళ, పున్నమి రాత్రుల జాలువారు,
తెమ్మెరలు, వెన్నెల వెలుగులు వెరసి వెల్లువైన పుత్తడి జాడలు,
కావా నీకు నా రాయబారం, మోసితెస్తూ నా ప్రేమ సంబారం.

[సశేషం]

23 comments:

  1. Nice narration this time. The writer's domination decreased. :-)

    Some descriptions are quite handsome. Just like this one.

    ReplyDelete
  2. పెద్ద కుచ్చు తోకని తమాషాగా కదుపుతూ పైకి, క్రిందకి పరుగులు పెడుతున్న ఉడుతని తదేకంగా చూస్తున్న మిత్ర "అవునండి ఇక్కడకి వస్తే తాత గారి మామిడి తోటలో వున్న ఫీలింగ్. ఆ తోపుల్లో తిరుగాడినట్లే వుంటుందిక్కడాను." అంది మిత్ర.
    Just like this one.

    ReplyDelete
  3. The poem is nice.

    "కావా నీకు నా రాయబారం, మోసితెస్తూ నా ప్రేమ సంబారం." Ekkadiko teesukellina maatalu

    BTW there is a typo in the otherwise cute poem. "ఘర్జనల"

    ReplyDelete
  4. బాగుందండీ ...ఇంకా కొంచం ఎక్కువ రాయొచ్చుగా ...మీ కథలో హీరోకి లానే మా హీరో నవ్వుతుంటే డీప్ డింపూల్స్ ;):)

    ReplyDelete
  5. how romantic...!! now its a long wait for the next sunday... :(

    ReplyDelete
  6. ఉష గారు, చదివిన వెంటనే కలిగిన భావావేశం లో అదుపు లేకుండా కామెంట్ రాసేస్తాను అని ఇంతసేపు ఆగాను :-) చాలా బాగుంది, కధ అందంగా ముందుకు సాగుతుంది, ఉడుత, గ్రద్ద, ఎంకి చాలా బాగా నచ్చేశారండీ.

    ఉడుత వర్ణన చదవగానే కొన్ని సంవత్సరాల క్రితం బెంగళూరు లో, ఓ డాబాపై ఉన్న నా రూమ్ ఎదురుగా ఉండే ఖాళీ స్థలం లోకి నే తలచుకున్నపుడల్లా వచ్చి వివిధ విన్యాసాలతో నన్ను అలరించి బోలెడు ఊసులు నాతో చెప్పిన నా ఒంటరితనపు ఆత్మీయ నేస్తం ఉడుత గుర్తొచ్చింది. కరెంట్ తీగలకు అడ్డు వస్తుందని ఇంటి పక్కన చెట్టుకొట్టేశాక ఎన్ని వారాంతాలు నా కళ్ళు తన కోసం ఆశగా డాబా అంతా పరికించి చూసేవో చెప్పలేను. మొదటి కొన్ని రోజులైతే అన్నం కూడా సయించలేదు.

    ReplyDelete
  7. వేణు గారు,
    ఇది మీ [పెద్ద కుచ్చు తోక] ఉడుతని మరోసారి మీ కనులకు పట్టిద్దామని ...
    http://picasaweb.google.com/ushaa.raani/PDZRDL?authkey=Gv1sRgCKukhcLq8o7NEA#5361485519162016370


    కాగా ముందు టపాలో మీ చివరి వ్యాఖ్యకి బదులుగా [కనుక మీరు హాయిగా ప్రశాంతంగా నిదురలోకి వెళ్తారని] ... అక్కడ జరిగిన సంభాషణ ఇది... ;)

    మీరు: విశ్వామిత్ర కోసం మరో రోజు ఆగాలా... హ్మ్.. పండగ కనుక సరే :-) వచ్చే వారం మాత్రం ఆలశ్యమైతే ధర్నా చెపట్టేయాల్సొస్తుంది మరి:-)

    నేను: విశ్వామిత్ర వ్రాస్తూ మిమ్మల్నే గుర్తు చేసుకున్నాను. ఒక్క వ్యాక్యం అన్నా మీ వ్యాఖ్యలో నచ్చింది అని వ్రాస్తారని. మరో పదిహేను నిమిషాల్లో వచ్చేస్తుంది. ముందుగా మీరే చదువుతారేమో.

    గీతాచార్య: Hope 15 minutes over...? ;-)

    నేను: ఇక పదిహేను నేను కేవలం 'విశ్వామిత్ర' కి వాడే సమయమని నా భావం. ఇక్కడ క్లాక్ మధ్యలో రీసెట్/స్టాప్/రీస్టార్ట్ వగైరాలు జరిగాయి. ;)

    అదీ కాక కాస్త అల్ప అస్వస్థత కారణంగాను, మీరు సిద్దంగా వున్నారు కత్తులు నూరను అన్న భయంతోనూ అలా జరిగింది... [సరదాగానే]

    మీరు: అయ్యోరామా!! ఉష గారు, నేనీ అస్వస్థత గురించి అసలు ఆలోచించలేదు సుమండీ.. ఏదో సరదాగా ధర్నాలు అవీ అన్నాను. మీరు ఆ మాటలు పట్టించుకోక మీ వీలు చూసుకుని ప్రచురించండి.
    *******************

    ఈ వరస క్రమంలోనే విశ్వామిత్ర-7 వెలువరించటం మీరూ ఈ పైనున్న వ్యాఖ్య వ్రాసేయటం జరిగింది. కనుక ఇక ఏ కన్ఫ్యూజన్ లేదు కదా, నేను ప్రచురించేదీ ఏమీ లేదిక. కథ మీకు చేరింది. మీ స్పందనా నాకు చేరింది.
    నా అసలు ప్రతి స్పందన ఆనక వస్తుంది.

    ఇక ఆ పి.డి.యెఫ్. అప్డేట్ వీలుని బట్టి తెస్తాము.

    ReplyDelete
  8. పూలకోసం రెండు మనసులూ పరిగెత్తాయన్నమాట. కథ బాగుంది. మొదటి సారి మీ కథ నచ్చింది.

    ReplyDelete
  9. "పెద్ద కుచ్చు తోకని తమాషాగా కదుపుతూ పైకి, క్రిందకి పరుగులు పెడుతున్న ఉడుతని తదేకంగా చూస్తున్న మిత్ర "అవునండి ఇక్కడకి వస్తే తాత గారి మామిడి తోటలో వున్న ఫీలింగ్. ఆ తోపుల్లో తిరుగాడినట్లే వుంటుందిక్కడాను." అంది మిత్ర."

    This is the beauty. Just coming back from a deep thought to describe it to the person next with u. Gives a scope for imagination to the readers. I have gone back into some memories. Now a days squirrels are nearly extinct. Have seen a real sqirry some 2 yrs ago. Sparrows are... Hmm. So here thanks for ur pics, though not intended for me. I sneaked into them to have a look at my squirry friends. ;-) Sorry.

    For the first time I fell in love with ur story. Addio Maruvam

    ReplyDelete
  10. ఇది అన్యాయం..! విశ్వామిత్ర రిలీజ్ ని ఒక రోజు పోస్ట్ పోన్ చేసినందుకు :( వీక్ డే లో కమేన్టడం కుదరదండీ! this part is best of all parts
    పోస్ట్ పోన్ చెయ్యడం వల్లనే ఇంత బాగా వస్తుంది అని అంటే మేము రెడీ

    waiting for next part

    ReplyDelete
  11. బాగుందండీ ....కవిత ! మంచుపూల వాన కురిసినట్టు !

    ReplyDelete
  12. స్పందింఛిన మిత్రులందరికీ, ధన్యవాదాలు. కాస్త నలతగా వుంది. ఈ రోజుకిక ఎక్కువ కబుర్లు చెప్పగలనో లేనో? కానీ ముందే చెప్పాను ఇది నా కలం లిఖిస్తున్న ప్రేమ కావ్యం అని. మీ అందరికీ వారిద్దరూ కలిసిన ఈ భాగం నచ్చినందుకు థాంక్స్.

    సృజన, తప్పు సరిచేసాను.

    గీతాచార్య, మీ అనాలిసిస్ కి ధన్యవాదాలు. ఈ రోజు వ్రాసేప్పుడు ఏదో ఉద్వేగంలోవున్నాను. ఆ ప్రభావం వుందేమో?

    ఇక "మావూర్లో అవతరించిన పిచ్చుకపై ... "http://maruvam.blogspot.com/2009/01/blog-post_12.html

    చూడండి, ఇప్పటికీ నా బాక్యార్డ్ కి ఓ పదైనా ఉదయాన్నే చేరతాయి ఉదయన్నే.

    వేణు గారు, నాకు అలాగే ఒక సన్నజాజి తీగె [దుర్మార్గుడు మా నరసింహులు మొదలు వరకు నరికేసాడు] తో అనుబంధం. చాలా రోజులు ఏడ్చి గోల పెట్టాను. తర్వాత "బిస్ బిస్ మేక" "నల్లావు దూడ" ఇలా ఎన్నో. మొక్కలు కూడా అదే జాబితా. అనుబంధాలు శ్వాసించే మనిషిని.

    చిన్ని, అంతేనా ఇంకొంచం చెప్పారు కాదు మీ డింపుల్స్ హీరొ గారి గురించి. :)

    తృష్ణ, ఊ ఊ మరువం మీతోనూ పలికిస్తుందేం అలా..? ;)

    హరేకృష్ణ, ఈ వారం పండుగ సెలవు పుచ్చుకున్నాను. ఇకపై జరగదిలా. చూద్దాం ఎంత ముందు వస్తారో కామెంటటానికి.. :)

    భా.రా.రె., మొత్తానికి మిమ్మల్నీ మెప్పించానన్నమాట. నిజమే తొలిస్పర్శ, అది సంభవించే విధానం అపురూపం కదా. మనసులు ఎప్పటికీ దాచుకునే నిధులా జ్ఞప్తులు.

    పరిమళం, మరి కవనమే కదా మన బలిమి. థాంక్స్.

    ReplyDelete
  13. ఉష గారు, మొన్న మీ ఉద్యానవన విహారం చేసినపుడే గమనించానండి. మరల లింక్ ఇచ్చినందుకు నెనర్లు.

    ReplyDelete
  14. ఉషా ,
    మీ విశ్వామిత్రుల ప్రేమ కథ చదువుతుంటే నా ప్రేమ కథ చెప్పలనిపిస్తోందిమరి ! మరి ప్రచురిస్తారో స్తలాభావము తో మానేస్తారో మీ ఇష్టం !
    నేను పి.యు .సి చదువుతున్నప్పుడు ,పని మీద మా నాన్నగారు , హైదరాబాద్ వెళ్ళారు . అప్పుడు మా నాన్నగారి కజిన్ ,కమల కి పదిహేడో ఏడు వచ్చిందికదా పెళ్ళి చేస్తావా ? మంచి సంబంధం వుంది అన్నారట సరే చూద్దాం అని నాన్నగారు పెళ్ళివాళ్ళను ఆహ్వానించి వచ్చారట .పెళ్ళికొడుకు మిల్ట్రీ లో కాప్టెన్ అని మా అమ్మ ముచ్చట పడిపోయిందిట !
    ఇక నన్ను రెడీ చేసే పని , హాలిడేస్ లో మాయింటికి వచ్చిన మా కజిన్ గిరిజకు వొప్పచెప్పంది. అంతకు ముందే నాకు టైఫాడ్ వచ్చితగ్గటముతో ,జుట్టంతా వూడిపోయి మళ్ళీ వస్తూ భుజాలదాకా వచ్చింది . దాని లావుకు సరిపోను ,రెండు పెద్ద సవరాలు పెట్టి , నా రెండుజడలను ఓ పెద్ద ఒక జడగా మార్చేసింది గిరిజ .పెళ్ళిచూపులలో తలవంచుకొని కూర్చున్న నన్ను చూసి మా అత్తగారు ముచ్చట పడిపోయి , అక్కడికక్కడే ఓ కే చేసేసారు. పెళ్ళిచూపులయ్యాక అందరమూ నాగార్జున సాగర్ కెనాల్ చూడటానికి వెళ్ళాము . ( అప్పుడు మానాన్నగారు అక్కడే పని చేస్తుండే వారు ) . అక్కడ మాతో వచ్చిన మా అత్తయ్య ,కమలా తలెత్తి పెళ్ళికొడుకును చూడు అంది . భారం గా తలెత్తి చూద్దును కదా కిందికి మెట్లు దిగుతున్న పెళ్ళికొడుకు వెనుక భాగం కనిపించింది !
    హడావిడిగా ముహూర్తం పెట్టించి ,హైదరాబాద్ లో పెళ్ళని హైదరబాద్ తీసుకెళ్ళారు. పెళ్ళికొడుకుకు పెద్ద పెద్ద మీసాలున్నాయని, తెల్లగా వున్నాడని , అదనీ ఇదనీ మా చెల్లెళ్ళు తెగ చెప్పేస్తున్నారు ! మీసాలని తలుచుకొని భయపడుతున్నారు !
    గదిలో పెట్టివున్న వెడ్డింగ్ కార్డ్స్ లో ఎవరూచూడకుండా పేరు చూసి ప్రభాత్ అని తెలుసుకున్నాను. ఇంతలో పెళ్ళికొడుకు లాబ్రెట్టామీద వచ్చాడు అని అందరూ చూడటాని కి పరుగెడుతుంటే చిన్నగా అందరిని తోసుకొని ,బాల్కనీ లో నుండి చూద్దునుకదా ,లాంబ్రెట్టా వెళ్ళిపోతూ కనిపించింది !
    పెళ్ళంతా బుద్దిగా తలవంచుకొని కూర్చొని ,పెళ్ళికూతురంటే కమల లా వుండాలి అని నా తరువాత పెళ్ళైన వాళ్ళందరికీ మోడల్ గా నిలిచాను. ఆ తరువాత ఎప్పుడో మావారు ఆ రెండు సవరాలనీ కత్తిరించి అవతల పారేసే దాకా తలవంచుకొనే వున్నాను ! ఈ సవరాల గోలలో అసలు మావారిని చూడాలన్న సంగతి కూడా మర్చిపోయాను ! అసలెప్పుడు చూసానో , చూసానో లేదో కూడా గుర్తులేదు !
    ఇదండీ నా ప్రేమకథ !

    ReplyDelete
  15. బాగుంది ఉషా... ఏమి తోచని బద్దకపు ఆదివారం సాయింత్రం అందం గా అవిష్కరించేవు కళ్ళ ముందు. జీవితోద్వేగపు క్షణాలు లిఖించ తరమా.... అనుభవించటమే తప్ప. ఆరోగ్యం బాగుందని ఆశిస్తాను. ఈ వారాంతం నా పరిస్తితి అదే నలత పడ్డ శరీరం నలత లేని మనసు మంచి కాంబినేషన్ కదు.;-)

    ReplyDelete
  16. మాలా గారు, కాదు కాదు "రెండు జెళ్ళ సీతా, తీపి గుండె కోతా" గారు, భలే నాకు కుళ్ళు పుట్టించారు. ప్రభాత్ గారికి మీ కళ్ళలో కళ్ళు కలిపి తీరాల్సిందేనని ఆ పని చెసారన్నమాట. :) విశ్వ మీ తాను నుండే పుట్టాడు. "కళ్ళలో కళ్ళూ పెట్టి చూడు" అని మిత్ర పాటలు కట్టే రోజు, ఆ రోజెంతో దూరము లేదు కమలమ్మో!!! :)

    చాలా సంతోషం, మీ గుండెల్లో దాచుకోవాల్సిన ఈ తీపిగురుతుని ఇలా మా అందరికీ పంచినందుకు.

    ReplyDelete
  17. భావన, ఒక్కోసారి మనం వ్రాసిన దాని కన్నా, చదువరులు అద్దే గంధం వలన గుభాళింపు వస్తుంది చూడు అలాగన్నమాట, ఈ టపాకి అనుకోని అందం మీ అందరూ ఆపాదించారు. ముచ్చటగా మురుస్తూ నలత వదిలించుకుని, కదిలి వచ్చాను. In general I sleep it off. Feeling better by all means. Thanks for checking.

    ReplyDelete
  18. ఏదో చదివి వెళ్ళిపోదాం,వ్యాఖ్యానించకుండా అనుకున్నాను. కానీ కొన్ని వాక్యాలు నాచేత రాయిస్తున్నాయి.
    " చిన్న చిన్న పూలున్న లాంగ్ స్కర్ట్, పసుపు రంగు స్లీవ్ లెస్ టాప్, ఆ సాయం సంధ్య వెలుగుకి కాస్త లేత గులాబీ ఛాయ కలిసినట్లుండే ఆమె మోము మరింతగా వెలుగుతుంది " - వర్ణన చాలా బాగుంది. ఒక దేవత కళ్ల ముందు కూర్చున్న ఫీల్ .

    " "సారీ, చూసుకోలేదు" అన్నాడు విశ్వ.

    మరింత ముడుచుకుపోయింది, 'అంటే అతనూ గమనించాడు..' మొహమాటంగా వుంది.
    " - సన్నివేశ చిత్రీకరణ భలే ఉంది నా ఊహలో,

    చివరగా చిన్న ప్రశ్న, మీరు మారథాన్ కోసం ప్రిపరేషన్ మొదలెడితే మాత్రం, కధలో పాత్రల చేత కూడా చెప్పించాలా??

    ReplyDelete
  19. ప్రదీప్, భేషజాలు లేని మాట ఇది. మీకు నచ్చిన ఆ రెండు వ్యాక్యాల్లో ఒకటైనా ఏ ఒకరినైనా ముఖ్యంగా మిమ్మల్ని కదుపుతాయనుకున్నాను. అదొక గట్టి వూహ. మరికనేం

    ఇలా పాడించేసుకోండిక... ;)

    ఒక దేవత వెలిసింది నీ కోసమే
    ఈ ముంగిట నిలిచింది మధుమాసమే ||ఒక||
    సంధ్యా కాంతుల్లోన శ్రావణిలా
    సౌందర్యాలే చిందే ఆమినిలా
    ఎన్నో జన్మల్లోన పున్నమిలా
    శ్రీరస్తంటూ నీతో అంది ఇలా
    నిన్నే ప్రేమిస్తానని . .

    ఇక రెండోది స్వానుభవం :) ఇక కలపటానికి ఏమీ లేదు. ఈ మధ్య కళాతపస్వి విశ్వనాథ్ గారు కూడా ఈ విషయమై ఒక అనుభూతిని పంచుకున్నారు.

    ఇక చివరి ప్రశ్న - మీకు సంధించిన పరీక్షా బాణం. సరీగ్గా తగిలింది. ;) ఎలా అంటారా...

    విశ్వామిత్ర-6 కి ఏమన్నారు? - "తరువాయి భాగానికి నా వ్యాఖ్య ఆలస్యమయితే "ఆహ్లాదం" అని మీరే వేసేసుకోండి హాజరు" అని కదా? కనుక ఈ మరథాన్ వూసు కలిపితే ఈకలు పీకుతారా లేదా అని నా టెస్ట్. ;)

    నిజానికి ఇదీ మరొకరి, నిజానికి నాదీను జీవితానుభవమే. ఇవి ఒకరి నుండి మరొకరికి ఉత్తేజం వచ్చి సాగే స్ఫూర్తిదాయకాలు.

    నెనర్లు.

    ReplyDelete
  20. ప్రేమికులకి మొదట్లో వున్నంత ఆస్వాదన దగ్గర అవుతున్న కొద్ది దూరం అయిపోతుందేమో అని పిస్తుంది.మొదట్లో అంతా చూపులతో మాట్లాడుకుంటూ అణువణువు గమనిస్తూ చిన్న చిన్న స్పర్సల్ని కుడా ఇద్దరు వొకే సారి గమనిస్తూ ఆనందించే స్థాయినుంచి మాటల ప్రవాహం మొదలయ్యాక మెల్లిగా లోపాలు కనబడడం మొదలవుతుంది .అందుకే ప్రేమ చూపుల స్థాయిలోనే వుండీ పొతే వొక మధుర కావ్యం గా మిగిలి పోతుంది .

    ReplyDelete
  21. రవిగారు, అదే నిజం కావచ్చు. Thanks for sharing your opinion. కాకపోతే in any relation this is the common trend right? Both parties present only the niceties. Then comes the reality, some incompatibility, and then it is the bonding/love/affection/attachment that comes to bridge the gap. So true lovers sustain the tests and overcome. When put in common life no one can be the only receiving end for pain always, be it disappointment be it an untoward situation. So there enters the sharing concept, share the pain to make it half. Then share the joy to double it up.

    As per leaving the relation than continue from those initial moments, there is always a trade off - boils down to leave and pursue life along random path and regret from time to time of such a decision or lead together and traverse the path and experience the kalaidiescope of emotions. Eah individual got to decide. I went with the latter.

    Just thought share my opinion too! Hope you do not mind my answer in english. Lest I have to put it on paper, think and translate to telugu.

    ReplyDelete
  22. in a nutshell you have explained the ground reality of love . love brings two persons together intially later on the compulsions will sail them through. i think manmadhudu cinemalo brahmanadam chepinattu tarvata nenu preminchalsi vachhindi ani .since langaguge is only a vehicle of thought it is only the bhava pradanyam rather than bhasha pradanyam . any lingo which ever is comfortable is ok with me .thx

    ReplyDelete
  23. రవిగారు, ఇది ఒక వకృత్వపోటీకి పనికి వచ్చే లోతైన అంశం. ఇందులో గ్లోబల్ విధానం లేదు. వ్యక్తిగత అంశాలు చాలా కలుస్తాయి. కనుక నేను ఇక్కడే వదిలేస్తున్నాను. మీరన్న కంపల్షన్స్ విధిగా/విధిలేక/... ఇలా పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ వలన వస్తాయి. కొన్ని తప్పనిసరైనా కష్టం కాదు. కొంచం ఇష్టం కొంచం కష్టం .. నా వరకు నో రిగ్రెట్స్.

    ReplyDelete