మహాభారతం - మరో దృక్కోణం !!!

గమనిక: జలపుష్పాభిషేకం కొరకు నా మరొక రచన. ఈ కవితకి ఆధారం పలు మహాభారత గాథలు. కొంత నా వూహ జోడించినా మూల కథల్లో మార్పు చేయలేదు

మొదటి తరం:

అతిలోక సౌందర్యవతిని
అపరిమిత జ్ఞానసంపన్నురాలను
గంధర్వకాంతను
గుణగణాల అధికురాలను "అద్రిక"ను
సృష్టికర్తకు నను మించిన సృజన ఇక మిగలలేదా?


ఆతని మానసాన మరొక యోచనకు సృష్టి
లోకరీతిని మార్చు వినూత్న ప్రయోగారంభం
సమస్త ప్రాణి జన్యు వ్యవస్థకి సవాలేమో?


తొలిజీవ పరిణామమగు "మత్స్య" రూపిణినై
సప్తసముద్ర వాసినయ్యాను
మానవోత్తమ శౌర్యపరాక్రమ వసురాజ పరోక్షాన
పురుష రేతస్సు సంగ్రహించాను
జలచర గర్భాన మానవ కవలల నవ్య సృష్టి చేసాను


రెండో తరం:

దాశరాజ పుత్రికనై కాళి నామమున ఎదిగాను
జన్మ కారణాన "మత్స్యగంధి"గా మరులు గొలిపాను
యోగి నందు కాంక్ష రగిలించి యోజనగంధినయ్యాను
దైవమానవ సంగమ నూతన వంశవృద్దికి అంకురమయ్యాను


మూడో తరం:

కానీనుడను కృష్ణద్వైపాయనునిగా ఉద్భవించాను
వేదాలను, పురాణాలను విభజించి
"వేదవ్యాసుడ"నయ్యాను
భారతాన లేనిది జగతి నందులేదన్న నానుడిగా రచనచేసాను
ప్రతి పాత్రయందు తరతరాలు చెప్పుకొను కథ మలిచాను

మూడు తరాల చరితనందు ఎన్ని సాంఘిక న్యాయాలు?
ముందు తరాలు అందుకోను మరిన్ని శాస్త్రీయ సూచనలు
మహాభారతాన తరగని నిధులు విలువైన నిక్షిప్త గాథలు!

*******************************************
జీవ పరిణామం : human evolution
జన్యు : genes
రేతస్సు : sperm
కానీనుడు : పెండ్లికి ముందు కన్యకు పుట్టిన వాడు

45 comments:

  1. ఉషగారండీ, అంతా బాగుంది కానండీ, ఇప్పుడు దీనికి కామెంట్ వ్రాయాలంటే మేము భారతము పుస్తకాలు ఎక్కడ వెతకాలండీ? ఆ అవసరం లేకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోని ఈ టపాని ఇంకో భారతం చేద్దామని పిస్తుంది. ఇంతకీ అద్రిక ఎవరండీ?

    ReplyDelete
  2. భా.రా.రె, దొరికారిక మరి చూడండి. శౌనకాది మహా మునులందరికీ వందన సమర్పణ చేస్తూ మీకు గురూపదేశం మొదలెడతాను.

    I knew it is a bold concept - artificial insemination and/or human cloning, unmarried moms and such kids getting respected roles [వ్యాసుడు అన్నది ఒక పదవి. భారత కర్త ఈ కల్పానికి 28వ వ్యాసుడు] and many more. yet intention is to convey that our history/myths have had mentioned of all these scientific and/or medical advancements and social reforms a long ago [~5k years ago]

    అద్రిక ఒక గంధర్వ కన్య. పొరపాటున ఒక ముని పాదమును తొక్కి, బ్రహ్మ శాపము వలన ఒక మత్స్యము/చేపగా పుట్టింది.
    వ్యాసుని జన్మ వృత్తాంతం చదివితే మిగిలిన వివరాలు దొరుకుతాయి. ఈమె ఇద్దరు కవలలకి జన్మనిచ్చింది. అందులో మగబిడ్డకి ఇక పెద్దగా పాత్ర లేదు.

    కాళి/మత్స్యగంధి - కాళింది నదిలో దొరికిన అద్రిక గర్భాన పుట్టిన మానవ కన్య. ఈమె వశిష్ట ముని మనవడైన పరాశరుని యందు కృష్ణద్వైపాయునికి కన్యగా వుండగానే జన్మ నిచ్చింది, అతడే మహా భారత కర్త. వేద వ్యాసుడిగా కీర్తించబడ్డాడు. తర్వాత ఈమె పరాశరుని వరాన యోజనగంధిగా మారి, సత్యవతిగాను పేర్కొనబడి శంతన మహరాజుని ప్రేమ వివాహమాడింది. అలా అలా సాగే ఈ భారత గాథలో కౌరవులు, పాండవులకు తాత వ్యాసుడైతే. ముత్తవ్వ ఈ మత్స్యగంధి అన్నమాట!

    అదండీ ఆ మూడు తరాలు కలుపుతూ ఇన్ని శాస్తీయ పరిజ్ఞానం, సాంఘిక న్యాయాలు పేర్కున్న భారత గాథ, నా కవితాను. :)

    ReplyDelete
  3. ఉషగారు మీరు ఇలా వ్రాస్తుంటే అవి చదివి నేను మహా జ్ఞానిని అయిపోతానేమో!:)

    ReplyDelete
  4. Vedas, no mans invention, may be the best rules of the then society.

    Upanishads, the essence of the Vedas from different people. So can I infer MahaBharata, essence of Vedas/ Upanishads in short stories? What is your take? Let’s discuss ;)

    ReplyDelete
  5. పద్మార్పిత, ఇప్పుడు నా విషయంలో జరిగిందదే :) చదివి చదివే క్రొత్త అర్థాలు గోచరించాయి.

    ReplyDelete
  6. భా.రా.రె. సరిపోయింది ;) ఏదో సామెత చెప్పినట్లు. చర్చ అని కాదు కానీ, తెలిసిన విషయాలు అందరం కలేసి చెప్పుకుంటే కొంత జ్ఞానసముపార్జన చేయొచ్చు కదా. ఇకపోతే, ఇక్కడ మూలాల్ని ప్రశ్నించటం కానీ, ఆ మూలాలకి ఆధార భూతాలని వెదకటం కానీ, వాస్తవమా అని సంధిగ్దపడటం కానీ నా అభిమతం కాదు. వాటిల్లోని ఇంకా వెలికి రావాల్సిన విషయాల్ని చూడటం, చెప్పటం మాత్రం జరిగింది ఇక్కడ. స్త్రీల విజయాల పట్ల, స్త్రీల విశిష్టత తెలిపే కథనాల పట్ల ఆసక్తి మెండు. నా ఈ కవిత రెండో తరమైన సత్యవతి నుండి ఒక తరం అటు ఒకతరం ఇటుగా సాగింది. అద్రికని జలపుష్పం గా తీసుకుని, ఆమె పుత్రికైన సత్యవతిని గురించి ఆలోచిస్తే కన్య గాను, వివాహిత గాను భారత చరిత్ర మొత్తానికి, వంశవృద్దికీను [వ్యాసుని కారణంగా అంబిక, అంబాలిక లకి సంతానప్రాప్తికి ఈమె పాత్రవుంది] ఎంత పాత్ర వహించిందీ అన్నది నాకు చాలా ఆశ్చర్యం కలిగించిన విషయం. ఎందుకంటే అది మాతృస్వామ్య వ్యవస్థ కాదు, అలాగే తండ్రిలేని సంతతిని లోకువగా చూసే ఆనాటికి, కానికుడికి అంతటి పదవినిచ్చిన ఆనాటి కాలమాన పరిస్థితులనీ గమనిస్తే మనది పురోగమనమా, తిరోగమనమాఅనిపిస్తుంది. అర్హతకి తొలి పీఠం ఆనాడు ఇచ్చారన్న విషయం మాత్రం వెళ్ళడౌతుంది. అలా వెళ్ళీన ఆలోచనల నుండి, ఆ ముగ్గురి జీవితాలు చెప్పే వైజ్ఞానికాంశాలు నా ప్రధాన గురి. మిగిలినవి నాకు అప్రస్తుతం.

    కాలచరిత్ర వ్రాసిన బ్రహ్మం గారికి మేనకోడలు పూళ్ళ గోవిందమ్మ గారు, ఇనుప రెక్కలకోడిని తన భవిష్య దృష్టిలో చూసానని వ్రాసింది. అమె కి ఎందువలనో అంత ప్రాచుర్యం రాలేదు కానీ దాన్నే విమానంగా వూహించుకోండి, ఆవిడ గ్రహణాశక్తికి అబ్బురపడతాము. ఇదీ అంతే, వాస్తవ చరిత్రలైతే మనకు గర్వకారణం. ఆద్యులం అన్న తృప్తి. ఆ ప్రాభవాన్ని కోల్పోయామన్నది తక్కిన అంశం. కథలే అనుకోండి ఆ కథకుల రచనాపటిమకి అచ్చెరువొందాలి. అచ్చంగా ఈ నాటి శాస్త్ర, సాంఘిక స్థితి గతుల్ని వూహించి వ్రాసినందుకు. మీరు మరిన్ని అంశాలు వ్రాస్తే బాగుంటుంది ;)

    ReplyDelete
  7. padmaarpitagaaritoe neanuu " sai!" antaanu!naaku nachchindi

    ReplyDelete
  8. Usha, Now I know your stand. మరి నేను? ప్రస్తుతానికి గుఱ్ఱాలెక్కి పనికి వెళ్ళే పనిలో వున్నాను. వెళుతూ వెళుతూ తుపుక్కున వూస్తే బవిరి గడ్డం దెయ్యం ఎక్కడ ఊడి మీదపడుతుందేమో అనే అనుమానంతో..తమాయించుకొని రాత్రికి నా వ్యాఖ్య వ్రాస్తాను. నేను నిలుచున్న విధానం అప్పటిదాకా మీకు తెలియదు :)

    ReplyDelete
  9. బాగుంది, మంచి థీమ్ ఎంచుకున్నారు. పనిలో పని అర్జునుడు వివాహమాడిన మత్స్యకన్యను, గురి చూసి చేధించిన మత్స్య యంత్రాన్ని కూడా కలిపెయ్యవలసింది. (అసంపూర్తి అని కాదు, భారతం పేరు వినగానే అవి కూడా గుర్తుకొచ్చాయి అంతే)

    ReplyDelete
  10. కన్య గా వుండగానే జన్మ నిచ్చుటయ అసంభవం లేదా వ్యాకరణ దోషము , కడుపు పండిన ఇంకెక్కడి కన్యరికం ?ఇంచుక జీర్ణించు కొనుట కడు దుర్లభము .బహుశా వివాహమునకు పూర్వమే కాలు జారిన కన్య అని సవరించవలనేమో ?యోచన చేయుడు .

    ReplyDelete
  11. To all those interested in sharing opinion,

    I did some study in to it and came up with this new digging. My attempt is not belittle to any, just taking a new stab at it, that's it. A couple of my comments above have more background details. I would like different perceptions and views flow in so this makes a complete forum. Just treat this as an avenue even if you differ, am not really looking towards a concurrence in here.

    If you think you would have something to add here, please take some time to go over and add a word or two. Thanks.

    ReplyDelete
  12. దశావతారాలను మానవ పరిణామక్రమాన్ని చెప్పేందుకు ఉటంకించారని అంటారు. ఇది శోభంబాబు సినిమాలో కూడా విజువల్ గా చూపించారు. దేనినైనా ఊహించి రాయడం వారికున్న భవిషత్ దృష్టిని తెలియచేస్తుంది. అదే విధంగా తరువాతి తరం తన శాస్త్రీయ పరిజ్ఞaణంతో భౌతికంగా కనుగొన్న నాడు నాటి ఊహలు నిజమయి మనల్ని ఆస్చర్యానికి గురిచేస్తాయి. నేటి టెస్ట్ ట్యూబ్ బేబీ పరిజ్ఞానం భారతంలో కనబడుతుంది. కౌరవుల జన్మం అలాగే చూపిస్తారు. వీర్యాన్ని మింగిన చేపలోంచి మానవుడు పుట్టడం కూడాను. ఇవి నాటి కవుల కల్పనలే కావచ్చు. కానీ వాటిని సాధించిన నేటి మానవుడు వారి కలలను నిజం చేసి తన వారసత్వాన్ని నిలబెట్టినట్లే కదా?

    ReplyDelete
  13. ఆఖరి మూడులైన్లు తీసేస్తే కవితకు మరింత అర్థం వస్తుంది. ఆ లైన్లవల్ల కవిత కుంచించుకుపోయింది.

    ReplyDelete
  14. బాగుంది. మత్స్య రూపంలో ఉన్న అద్రిక, వసురాజ వీర్యం వల్ల గర్భం దాల్చి సత్యవతిని కనడం కథ గుర్తుంది. ఆమెకి కవల సోదరుడు ఉన్న సంగతి గుర్తు లేదు. గంగా పుత్రుడు భీష్ముడు బ్రహ్మచారిగా మిగిలిపోవడం వల్ల, కురువంశాన్ని కొనసాగేందుకు ముందు సత్యవతి గర్భమూ, పిమ్మట కృష్ణద్వైపాయనుని వీర్యమూ కారణాలనేందుకు సందేహమేం లేదు.

    పురాణ కథలు చూస్తే ఆ కాలంలో (ఏ కాలం అది??? :)) వంశం కొనసాగడమే పరమావధిగా కనిప్సితుంది. ఈ పరమావధి కోసం ఆయా సమయాల్లో పాటించబడిన సాంఘిక ధర్మాలు వివిధమైన పద్ధతుల్ని అనుమతించాయి.

    దశావతారాల వరుసకీ జీవపరిణామ సిద్ధాంతానికీ ఉన్న పోలిక యాదృఛ్ఛికం మాత్రమేనని నా ఉద్దేశం. భాగవతంలో దశావతారాల వరుస మనం సాధారణంగా చెప్పుకునే వరుసలో రాదు.

    ReplyDelete
  15. వుషా!...."మహాభినందనలు ... మహాభారతం మరో ధ్రుఃక్కోణం" యీ సబ్జెక్ట్ మీద విశ్లేషణా విన్యాసం ...వామ్మో!! యింత మంది స్కాలర్స్ మధ్య . ! దేవుడ...దేవుడ......దేవుడ .........దేవుడా..............ఆ............ఆఆ ........ఆఅఆ. అయినా నా విశ్లేషణ వుంటుంది నాదైన శైలిలో. సోదాహరణంగా అంటే కుదరదమ్మాయ్ . నో వుదాహరణలు,నో సాక్ష్యమ్స్.....ఓకే....నూతక్కి

    ReplyDelete
  16. అమ్మాయిగారండీ - :) :) ...మళ్లీ :) (చిలకవీ కాదు, ముసిముసివీ కాదు). ప్రాకృతిక పరిణామాలు, అందులో ఇమిడిన సాహితీ పరిణామాలు, వారసత్వాలు, యాదృచ్ఛికాలు, అవతారాల వరసలు , తమాయింపులు, కుంచించుకొనిపోవడాలు తల్చుకుంటే కలిగిన "చిరుస్పందన".

    సంప్రతి వార్తాహా శూయంతాం - జాగ్రత్తగా వినుకోండి అపార్థాల జోలికి పోకుండా- ఒక్కసారికి అర్థం కాకపోతే వంద సార్లు వినుకోండి - చదువుకోండి. నెత్తిమీద బెత్తెడు టోపీ పెట్టుకుని మాగాణీ వేదాంతం పలుకుతూ మత్స్యాలతో కూడిన కల్లు కాలువలు, సారా సరస్సులు తవ్వించి ఒడ్డున కూర్చున్న జనాలకి తడిక కడితే అది అబద్ధం. జంతికల్లాంటి కుండలాలు చేట చెవులకి తగిలించుకుని, బొక్కలు పడ్డ శాలువా చాటుతో ఓ పది జలపుష్ప వార్తలు చదివి ఇవతలివాడి చెవులకి తడికలు కడితే అది నిజం. అదండీ సంగతి. రాతి విగ్రహానికి రాతి పేగులు ఉండటం మూలానో ఏమో, కొందరు మానవుల్లోని రాతి ముక్కులు కూడా ఎగబీలుస్తున్నాయని వార్తలొస్తున్నాయి.

    అదంతా సరేగానీ అమ్మాయిగారండీ. మొన్న అడిగిన పుస్తకం ప్రశ్న పుటల్లోకి సరిగ్గా చేరలేదనుకుంటా. పురిపెట్టి చెవిలో తిరులతో ఒకసారి మళ్ళీ చూడండి. ఇంకా చెట్టు మీదే కూర్చుని వున్నా. చుట్టం కావటానికి మరి కొద్ది సమయం పట్టేటట్టు ఉన్నది. :)

    నుడులచేత పలుకుబడులచేత ఉషఃకిరణాల కైత రమణీయమైన కూతైతే, అది తదుపరి కవులపాలి నుదుటి వ్రాతైతే, తెలుగుతోట మీద దిద్దిన పైపూతైతే - అలా అలా అలా ఎన్నో తీరాలకు చేరాలని - ఏతావాతా ఏమిటయ్యా అంటే "రవి ఎరుగును భువి తత్త్వము". జై జండాపై కపిరాజా !

    ReplyDelete
  17. వచ్చారా సూత్రధారి గారూ, ఏ చెట్టుమీదున్నారో అని దిక్కులు చూస్తూనే వున్నా, అయినా ఉషమ్మ ఇంత హమాయకురాలనుకోలేదు.
    సరేగానండే, మీరేమి "చిరుస్పందన" వ్రాసారో గానీ నా "హృదయ స్పందనకు" కు మొలకలోనే అన్నీ అడ్డంకులే. ఏదో గారెలు తింటూ ఉషా భారతాన్ని విందామనుకుంటే జంతికలు తినిపిస్తున్నారు. మీ భాషను డీకోడ్ చేసుకోవడంలోనే ఉషాకిరణాల స్థానే వనమంతా నిశీధి నిండి దారికానరాక ఉన్నచోటనుంచి కదలడంలేదు.

    బొక్కలు పడ్డ శాలువా చాటువులు? ఎక్కడబ్బా?

    "రవి ఎరుగును భువి తత్త్వము"... ఎందుకనండీ?

    ReplyDelete
  18. wow !you went through evry page of Mahabharatam.!!!!
    really wonder...with heartly blessings.Nutakki.

    ReplyDelete
  19. భా.రా.రె, మళ్ళీ కొండని ఢీ కొనటానికి సిద్దమయ్యరన్నమాట! :) కానీండి. ఇదే సరైన వేదిక. ఈ రకంగా అభిప్రాయసేకరణని ముందుకు కదుపుతున్నందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
  20. ప్రదీప్, ద్రౌపదీ స్వయంవరం, ఇతర వివాహాలు సుభద్ర, ఉలూపి, చిత్రాంగద, ప్రమీలార్జునీయం ఇవన్ని కాస్త జనబాహుళ్యం లో ప్రచారంలోవున్నాయని, ఈ ముగ్గురు ఆద్యులను మాత్రం తీసుకున్నాను, పైగా క్లుప్తత కోసం కూడా ఆలోచించాలి కదా. థాంక్స్.

    ReplyDelete
  21. అశ్వినిశ్రీ, థాంక్స్. సై సై జోరెడ్లాబండిక.. ;)

    ReplyDelete
  22. @ కుమార్, మీ విశ్లేషణ బాగుంది.

    @ మహేష్, అవి మూలాలు కనుక ప్రస్తావించాను.

    @ రవిగారు, మీరు కొంచం ప్రక్క అంశంలోకి వెళ్ళారు. మీకు శ్రద్దవుంటే సద్యోగర్భం అన్న విషయం గూర్చి చదవండి. వంశవృద్దికి ప్రశాంతమైన మనసుతో తన వంతు సహకారం ఇచ్చింది. అందుకే ఆమె కన్యాత్వం దూషితం కాని వరాన్ని పొందింది.

    ReplyDelete
  23. కొత్తపాళీ గారు, చదివినకొద్దీ తరాని ఆలోచనలు కలిగించే కథలు ఈ భారత గాథలు. మీ అభిప్రాయానికి కృతజ్ఞతలు.

    నూతక్కి వారు, ఎందుకండి భయం, వాళ్ళు చదివి తెలుసుకున్నవే నేనూ చదువుతున్నాను. ప్రయత్నాన్ని హర్షించినందుకు ధన్యవాదాలు. ఆశీర్వదించినందుకు అభివందనాలు.

    ReplyDelete
  24. అమ్మాయిగారండీ - సరే మీ "వేలు", "వ్యూహాలు" "చప్పట్లు" "అర్హమయిన అహంకారాలు" మీ వద్దనే వుంచుకోండి. :)

    రెండో పేరా అంత తొందరగా అర్థం కాదనే, ముందే చెప్పా. వీలయితే వంద సార్లన్నా చదువుకోండి అని. వెటకారానికి కాదు. నాకు తెలుసు కాబట్టే చెప్పా. కిందటి కామెంటులో చివరి రెండు పంక్తులు అర్థం అయినందుకు సంతోషం.

    నా భాషా పరిజ్ఞానం సంగతెందుకు లెండి - :) అది ఊట లేకుండా ఎండిపోయే బావీ కాదు. కరువుతో సతమతమయ్యే కట్టెలడివీ కాదు. నిత్య యవ్వని. పంచేంత లేదు. వంచేంత, వడ్డించేంత అంతకన్నా లేదు. వీలున్నప్పుడు అలంకారానికి సిద్ధమయిన వారికి అందించటానికి ప్రయత్నిస్తా. పనస తొనలు పంచటానికి నేను సిద్ధమని ముందే చెప్పా. పరీక్షా కాదు, అస్త్ర విద్య అంతకన్నా కాదు. ఇక ఇటువైపు చూసేదీ లేదు. సర్లెండి. శాశ్వత శలవు. :)

    చివరిగా ఒకమాట. ఒక పెద్దాయన ఈ క్రింది మాటలు అన్నారు. వీలుంటే చదువుకుని ఆనందించండి.

    రెండు కాకులు కూర్చుండె బండమీద
    ఒండెగిరిపోయె అంత అందొండు మిగిలె
    రెండవదిపోయె పిదప అందొండు లేదు
    బండ మాత్రము పాపమందుండిపోయె

    ReplyDelete
  25. కొత్తపాళిగారు రాసినట్లు,సత్యవతి జననం..మొదలైన కధంతా తెలుసు కానీ ఆ కవల సోదరుని కధ తెలియదు.
    చదివి ఉండొచ్చు కాని గుర్తు లేదు...భారత,భాగవతాలు రెండింటిలోనూ ఎన్నో కధలు...నీతిని,జీవిత సత్యాలను,మంచి మార్గాలనూ తెలిపేవి ఉన్నాయి...ఈ కధలు సులువుగా అర్ధమయ్యే భాషలో ఉన్న పుస్తకాలను అమ్మ కొని మాతో చదివించేది..!

    బాగా రాసారు.అభినందనలు.

    (మీ కవితలే అనుకుంటే వచ్చే వ్యాఖ్యలు కూడా సగం సగమే అర్ధమౌతున్నాయండి..:) :) )

    ReplyDelete
  26. ఏండి తమరు పండితులో, పండితపుత్రులో, "శాస్త్త" పారాయణులో కానీ మీ మెట్ట ఏదాంతం/ ఓ సారీ, మాగాణి వేదాంతం..బలే గొప్పగా వుంది దొరా..సాత్రాలు, ఉపనిసత్తులు, సెప్పలేని సంగుతలన్నీ ఒక సిన్న తేటగీతి తో తలకెక్కించారు.. అంతా బాగే కానండీ మీ జరుక్ సదివాక నాకో దురబుద్ది పుట్టింది. నాకూ ఒక జలసుత్రమ్ రాయాలనిపించింది

    రెండు కాకులు బట్టగ బండ మీద
    గుంట నక్కగ కూర్చుండె పట్ట పగలు
    పట్టు దప్పి జారి కింద బడెను వాడు
    రెట్ట వేసి ఎగెరెబో రెండు నంత !

    అదండీ దొరా సంగతి. ఇతి వార్తాః

    ReplyDelete
  27. Wow well. Read at last. Though I have issues with సామాజిక న్యాయాలు the comparisons made are only I can clap. మీరు నా ఎదురుగా ఉంటే గట్టిగా నవ్వే వాడిని. You have got the thread, through you can enquire, what my laughter means.

    Finally you yourself delivered the best in this compilation yet.

    ReplyDelete
  28. మహాభారతాన తరగని నిధులు ఈ విలువైన నిక్షిప్త గాథలు!

    నిజమే, ఎవరెన్ని అన్నా మహాభారతానికి విలువ తగ్గదు. సద్విమర్శైనా, కువిమర్శైనా, పొగిడినా తెగిడినా "భారతం విలువ భారతానిదే" దాని అసలు పేరే "జయం" కదా!

    కవిత బాగుంది. మరోసారి రావాలి

    ReplyDelete
  29. గీతాచార్య, మీ నవ్వుకి అర్థం నాకు బోధపడిన వరకు నేనూ నవ్వేసుకున్నాను.

    సృజన, అలాగనే నా పెద్దవారు నాకు చెప్పారు. వాళ్ళు చెప్పినవే కాక ఇలా క్రొత్త అర్థాలు నేను వెదుకుతున్నాను.

    ReplyDelete
  30. తృష్ణ, మీకు నచ్చినందుకు సంతోషం. మాకు నాన్న గారు చాలా వివరంగా, మా బంధువూల వరసలతొ పోల్చి, భారత పాత్రల చుట్టరికాలు అవీ బాగా వివరించేవారు. నాకీ శ్రద్ద ఆయన వలన వచ్చిందే. అలాగే నలుగురు ఇక్కడ మాటలు కలిపారు సంతోషం.

    ReplyDelete
  31. బాగుంది ఉషా.. శంతన మహారాజు బ్రహ్మ లోకం లో గంగాదేవిని చూసి మనసు పారేసుకుంటే, గంగ కూడా మనసు పడితే బ్రహ్మ మాట మీద వాళ్ళు ఇద్దరు భూలోకం లో కలిసేరని కధ విన్నా కాని మిగతా కధ వినలేదు, మా మాస్టారు ఒక సారి మహాబారతం లో ని ధుర్యోధనులము మనమే ఎలా అనేది చెప్పేరు, అలాగే భీష్ముడి పాత్ర గురించి కూడా కాని నువ్వు చెప్పినవి ఎప్పుడు వినలేదు, బాగుంది.. ఆ మూడిటి కి కలిపిన లింక్ బాగుంది, మా మరువపు కొమ్మ కు పరిమళమెక్కువ ... గిల్లకున్నా గాలివాటు కే పరిమళాలు పంచుతుంది, కూసంత మాటల తేటల వూటల నిస్తే చాలు... ప్రవాహాల ప్రభందాల పరుగులను పరిచయం చేస్తుంది.. :-)

    ReplyDelete
  32. ఉష గారూ నేనో చిన్న కవనం రాసాను, లింక్ వేసాను కానీ అది వర్క్ కావటంలేదు.

    ReplyDelete
  33. ఉషగారూ,మీరు ఆ సమాధానం రాసింది ఎవరికో తెలీదు కానీ..నేను మాత్రం ఎప్పుడూ అనుకుంటానండి..బంధువులు కానీ,స్నేహితులు కానీ,దేశంలో ఉన్నవారే సమయం లేదు,సమయం చాలటం లేదు అంటున్న ఈ రోజుల్లో..ఎక్కడో దూర దేశాలలో ఉండి;మీరు రాసినట్లు ఉద్యోగం,పిల్లలూ-సంసారం + ఈ మరువాన్ని (మీకోసమైనా) మాకోసం నవ సుగంధాలతో నింపే మీరంటే నాకు ఎంతో గౌరవం..అభిమానం.. and i mean it..!!

    ReplyDelete
  34. ఉష గారు,
    తృష్ణ గారి మాటే నాదీనూ.

    ReplyDelete
  35. భావన, సరీగ్గా అస్త్రాలు [ఎవరి మీదకని ఆ ఒక్కటీ అడగకు ;) సంధించుకుంటున్న సమయంలో కృష్ణగీతం ఆలాపిస్తూ వచ్చేసావు, ఇంకేమిటి నాతో నేనే నాలో నేనే సంధి చేసేసుకున్నాను. ఎప్పటి మాదిరే ఓ నవ్వు నవ్వేసుకున్నాను. గిల్లేవారే ఎక్కువయ్యారే తల్లీ అందుకే నా వనం వూరంతా హోరెత్తుతుంది[ట!] ;) భావన, ఇంకా మనకి సరీగ్గానో/పూర్తిగానో తెలియని కథలెన్నో వున్నాయి - ఏకలవ్య, అతని సోదరి కర్ణుడిని వివాహమాడటం ఇలాంటివి. ఇంకా మా గోదావరి ప్రాంతాల్లో, గొంతెమ్మ పండుగ జరుపుతారు. కర్ణుని మరణానంతరం అతని జన్మ రహస్యం తెలిసిన ధర్మరాజు ఆగ్రహింఛి తల్లిని శపించటం మనకు తెలిసిన కథ. ఆమెని తరిమికొట్టటం, ఆమె అతనికి జడిసి జాలరి/రజక కులస్తుల సాయం అడిగి ప్రాణ రక్షణ పొంది బదులుగా వారికి ఏవో వరాలివ్వటం వాళ్ళు నమ్మే కథ. వారు ఆమెని గొంతెమ్మ [కుంతి కి వికృతి కావచ్చు] అని ఏటా వేడుక జరుపుతారు. నా పట్ల అభిమానానికి థాంక్స్. ఏదో అప్పుడప్పుడు ఇలా చదివినవి అలా నా భావనలుగా మీకు పంచుతాను.

    ReplyDelete
  36. సునిత, తృష్ణ, వేణు గారు - ధన్యవాదాలు.

    ఎందుకో నిన్నంతా మనసు మనసులో లేదు. "తబ్బిబైయింది నా మనసు ... మబ్బులు మబ్బులు మబ్బులొచ్చినాయ్" పాటలో అన్నట్లు

    "ఉరుములురిమి నను తరిమి కొట్టితే
    మెరపుతీగె కొరడా ఝళిపిస్తే
    మందవిడిన తువ్వాయికి మల్లే
    మనసూరక బెంబేలైపోతది"

    అన్న స్థితిలో వుండగా మీ వ్యాఖ్యలు వచ్చాయి.

    తృష్ణ, వేణు గారు, మీ మాటలకి చిన్న వివరణ ఇవ్వాలని వుంది. నేను వ్రాసినది మిత్రులు, అమాయక చక్రవర్తి భా.రా.రె. ని గురించి కాదు. అలాగే నా సమయం యెంత విలువైనదో, ఇతరులదీ అంతేనని గుర్తించబట్టే నా మనసుకి అది మరొకరికి ఆలోచన/ఆహ్లాదం/ఆనందం/ఆసక్తి కలిగిస్తుందనుకుని తోచిన రచననే ఇప్పటి వరకు మీ ముందుకు తెచ్చాను. ఇకపైనా అంతే.

    మీ ఇరువురి వ్యాఖ్యకి కళ్ళు చెమర్చాయి. అది ఆనందమా, ఇంతమంది ఆత్మ బంధువులని ఏర్పరుస్తున్న భగవంతుని పట్ల కృతజ్ఞతో నాకు తెలియదు.

    ReplyDelete
  37. జలసూత్రం గారికి, సమయం వెచ్చించి మీ అమూల్యమైన అభిప్రాయం తెలిపినందుకు ధన్యవాదాలు. సమయం అనుకూలిస్తే మీరు సూచించిన దిశగా సాధన చేస్తాను.

    మిత్రులకు,
    పునరాలోచనతో మూడు వ్యాఖ్యలు [నావే అన్నీను] తొలగించాను. ఇది నలుగురు విహరించే వనం. దీన్ని అదే మాదిరి వుంచుతాను.

    ReplyDelete
  38. ade chetto sri krishnuni kosam inkonchem raayagalara pandaga chesukuntam

    ReplyDelete
  39. పైనున్న సద్విర్శల దృష్ట్య కాస్త చదువుతూ
    http://knol.google.com/k/kotha-kamalakaram/kalaprapurna-kotha-satyanarayana/3hl55kku5xyzp/2# చూడటం తటస్థించింది. నాకు సందేహాలు వున్నాయి. ఉదాహరణకి "రవి ఎరుగును భువి తత్త్వము" అన్నదానికి రవి==కవి, భువి=కవిత్వం అని అన్వయించి "కవియగువాడు దాస్యమును కర్మము కాలి కవిత్వధోరణిన్ భువి వెలయింప జ్రొచ్చిన పూర్వ విశేషముతోడి పక్షపాత విధము లెస్సగా బొరయు, దానిని భారతగాధ సాక్ష్యమే యవును" ఏమైనా సంబంధం వుందా? లేక
    రవి == సూర్యుడు, భువి == భూమి అన్న యథార్థ పదాలనే వాడి విశదీకరించుకోవాలా. ఇటువంటివి.


    అలాగే నుడికారాలు, పలుకుబడులు, చందస్సు, అలంకారాలు, అలతి యలంతి వాక్యాలు ఇటువంటి వాటిని గురించి తెలుసుకోను సమాచారం తెలిసినవారు ushaa.raani@gmail.com కు ఇ-మెయిలు చేయగలరా?

    ReplyDelete
  40. హమ్మా ఉషాజీ అని కాసేపు, ఏమిటో ఉషాజీ అని కాసేపూను :)
    mixed feelings :):(

    ReplyDelete
  41. భా.రా.రె, "యధ్భావం తధ్భవతి" ఇకనుంచి నేనన్న ప్రతి మాటకి అర్థాలు వెదికితే ఇక ఆదిశక్తే మీకు కనపడేది. :)

    ఎన్నేళ్ళ తరబడి అధ్యయనం చేయలేదు మేమూను [నా ఆత్మగౌరవం గురించి ప్రస్తావించేప్పుడు మనది "అన్న" గారి బాణీ]. ఇక ముందుకు కదులుదామా?

    *****

    As per me it is all behind whatever happened. I am moving on. Am like a flowing river.

    "Life is pain, joy, beauty, ugliness, love and when we understand it as a whole, at every level, that understanding creates its own technique." How can we enjoy life to the fullest if we do not have a combination of all these? If we don't "discover" life, what is the purpose of life itself.

    ** Courtesy: Jiddu Krishnamurti and a close friend of mine.

    ReplyDelete
  42. హరే కృష్ణ, భలే సమయానికి వచ్చి గ్రేడింగ్ ఇస్తారు మీరు. అందుకే ఎప్పుడూ మీ వోటు లెక్కేసుకుంటుంటాను ఎప్పుడూను. ;) ఇక కృష్ణయ్యని ఎందరు పట్టేసుకున్నారు, ఇక నాతో ఏమని పలికిస్తారు? కానీ త్వరలో ప్రయత్నిస్తాను. ప్రస్తుతం కన్ను మరోదాని మీద పడింది. అది కాగానే మీ మాట విషయం చూస్తాను. ఇంతలో వచ్చి పోయే పండుగలు జరుపుకోవటం మానకండేం మరి? థాంక్స్.

    ReplyDelete
  43. వుష !, అంతా క్షేమమా?నీవు తలపెట్టిన జలపుష్పాభిషేక యగ్నం లొ నా పాత్ర పూర్తయ్యిందనే భావనతో నా నిరంతర కార్యక్రమాల లో తలమునకలవుతున్నాను. మధ్యలోయిలా ఓ పలకరింపు.శుభాశీస్సులు...........శ్రేయోభిలాషి.......నూతక్కిరాఘవేంద్ర.రావు.

    ReplyDelete