చినుకుల ఆకులు రాల్చనని
మబ్బు చెట్టు నల్లమొహమేస్తే
ఆకుల చినుకులు రాలుస్తూ
చెట్టు రంగులు అద్దుకుంది
చిరుగాలి ఈ వాడల్లోనే
ఇల్లు కట్టుకు స్తంభాలాటలాడుతుంటే
ఏట్లోనీరు ఆ పని నాదని
గట్టు మీద కెక్కి నింగికేసి దూకుతుంది
పగలు చలికి పళ్ళు గిట్టకరుచుకుని
చీకటి గదిలో బందీ అవుతుంటే
రేయి వొళ్ళు విరుచుకుని
వెచ్చని కంబళ్ళలో జాగారం చేస్తుంది
నా చూపులకి అందక తిరుగాడే నీవు
నా నీడనీ వదలక వెంటాడుతున్నావు
ఋతువు మార్పా, నా మది చేయు గారడీనా
ఏదైనా కానీ, మళ్ళీ మళ్ళీ కావాలి నీ ఒడి!
***************************
ReplyDeleteవేణు, తృష్ణ, భావన, ఆయ్ ఏమిటీ గారడీ, వేలలా పెట్టుకుని అని కూకలేయకండేం? ఇది గురువారం మధ్యాహ్నం [ఏమైందీ అని అడగకండేం? ;) ఒక మనసుకి రెక్కరొచ్చి ఎక్కడికో ఎగిరింది అని చెప్పేస్తా... ] భావనగా వెలికి వచ్చి, శుక్రవారం ఉదయమే కాగితం మీదకి వచ్చిన గారడీ ;) ఆదివారం దాకా నా ఎదురుగా కూర్చుని ఇప్పుడిక హారం లో చేరతానని పయనమైంది నా ముత్యమంటి ఈ కవిత. :)
"చినుకుల ఆకులు రాల్చనని
ReplyDeleteమబ్బు చెట్టు నల్లమొహమేస్తే"
అలా రాల్చక ప్రస్తుతం మమ్మల్ని ఇబ్బంది పెడుతోంది.ఓ గంట రాలిస్తే ఏంపోతుంది తనకు,మా రైతుల్నిలా క్షోభపెట్టకపోతే....
"ఆయ్" అనను కానీండి.."హన్నా..."!!ఎందుకని "చేతికి" శ్రమ ఇస్తున్నారు రెస్ట్ తీసుకో్కుండా..?
ReplyDeleteఅనకుండా ఉండగలమా అసలు?
The last two paras are just awesome
ReplyDeleteహ హ అలా ముందరి కాళ్ళకు బంధాలేస్తే ఇక ఏం చెప్పగలం :-) అయినా చక్కని కవితలతో మరువపు వన విహారాన్ని మరింత ఆహ్లాదంగా మలచడానికి ప్రయత్నిస్తున్న ఉషగారి మీద కేకలేసే ధైర్యం చేయగలనా :-) కాకపోతే అలా కష్టపడి టైప్ చేసేకన్నా తగు విశ్రాంతి ఇచ్చి త్వరగా నయం చేసేసుకుంటే మరింత వేగంగా సులువుగా రాసేయచ్చుకదండీ..
ReplyDeleteఅన్నట్లు కవిత చాలా బాగుంది.
ఉషా గారు, చాలా బాగుంది మీ కవిత. కలకాలం ఒకటే ఋతువంటే ఎలా! మీకన్ని ఋతువులు సక్రమంగానే ఉంటాయేమొ, కాని ఇక్కడ మాత్రం ఎప్పుడూ ఒకటే కాలం. ఎప్పుడు కోరుకున్న కాలం అప్పుడొస్తే ఎంత బాగుంటుందో! చేయి జాగ్రత్తండి.
ReplyDeleteకవిత నాకైతే బాగా నచ్చింది. గురువారం మధ్యాహ్నం ఏమైవుంటుదబ్బా? ఏమైతేనేమి కానీ మీకీ అనుభూతులను పంచిన ఆ గురువారానికి కృతజ్ఞతలు. వర్షించిన ఆ ఉదయానికి అభివందనాలు. ఆ తరువాత మాకీ రచనద్వారా అనుభూతిని పంచిన మీకు అభినందనలు. ఇలా ప్రతిరోజూ వసంతోదయమైతే మాకు మరిన్ని రచనలు. హారానికి మరిన్ని ముత్యపు వెలుగులు.
ReplyDeleteమీ కవిత అందించిన అంతర్లీన అర్థంతో నాకో కవిత వ్రాయాలని పిస్తుంది. సాయంత్రామే మీ అభిమాన థియేటర్ లో జయసుధ నటించిన జీవనజ్యోతి సినిమా !
కవిత చాలా బాగుందండి!
ReplyDeleteజీవనజ్యోతి is released at http://chiruspandana.blogspot.com/2009/10/blog-post_26.html.
ReplyDeleteచాలా.....వేరే చెప్పాలా !..అయ్యో ఏమైందండీ ?కొంచెం రెస్ట్ తీసుకుని కుదుట పడినకే రాయండీ
ReplyDeleteఅందరికీ థాంక్స్. నా వేలిక వల్లకాదంటుంది. కొన్ని వ్యాఖ్య లకి మాత్రం కొంచం వివరణ, నా వేలి కథాను. ప్లీజ్ అన్యధా బావించవద్దు.
ReplyDelete*** *** ***
విజయమోహన్ గారు, అమెరికాలోని ఈ/మా వూర్లో వానలు చాలా అధికం. నాలుగడుగుల లోతునే జల పడుతుంది. వర్షాధారపంటల భూమి ఇది. పైగా చాలా రాబడీను. మనది వాతావరణ సమతుల్యం దెబ్బ తిన్న ప్రాంతం. సమస్యగా తీసుకోవాల్సిన విషయమది.
*** *** ***
వేణు, తృష్ణ, ముల్లు తీసే బాధ తట్టుకోవటానికి పచ్చని చెట్టు చూపుతారు కదా, అలాగే పళ్ళబిగువునా ఈ బాధ భరిస్తూ మరువపు వనంలో తచ్చాడుతున్నాను. పైగా నాకు అలా వ్రాసుకునే సమయం లో ధ్యానం లో కూర్చున్నంత ప్రశాంతంగా వుంటుంది. ఆ సాంత్వన కోసమే కానీ మరో ఉద్దేశ్యం లేదు.
*** *** ***
భా.రా.రె. అక్కడన్న మాటే ఇక్కడాను. I felt honored. Your kavita just elivates the feel in here. Thanks a lot!
చిన్ని, మొన్నీ మధ్య గులాబీ అలిగి ముల్లు దింపింది. అదీ లోతుగా ముదురు ముల్లు నా వేలిలో విరిగేలా. నా చిన్ని వేలు తట్టుకోలేకపోయింది. అలా అలా పెరిగి బీన్స్ వంటి వేలు దొండకాయ మాదిరిగా అయింది :( మైనర్ సర్జరీ అవసరపడవచ్చునన్నారు. ప్రస్తుతం యాంటైబయోటిక్స్ మీద వున్నాను. వేలి కొస నుండీ భుజం వరకు బాధ, ఈ రోజుకిక జ్వరం లోకి దింపింది. ప్చ్, ఎవరినేమి అన్నాను? ఎందుకిలా బాధ పడుతున్నాను. సరే మరి కొంచం గడువుతో తిరిగి వస్తాను. వారం పది రోజులు పట్టొచ్చు. మీరడిగిన తీరుకి ఈ వివరాలు ఇవ్వలనిపించింది.
*** *** ***
భావన, వ్యాఖ్య పెడతావని తెలుసు. నా మౌనాన్ని అర్థం చేసుకో నా ప్రియ సఖి.
##### ప్రస్తుతానికిక సెలవ్. మరువానికిక కాస్త విశ్రాంతి కావాలి. పైన వ్యాఖ్యలో వివరాలున్నాయి. త్వరలో కలుద్దాం. మీ అందర్నీ తప్పక మిస్ అవుతాను. కానీ మొండిదాన్నైన నాకే విరామం కావాలనిపిస్తుందంటే మీరు అర్థంచేసుకుంటారుగా!!! :( #####
ReplyDeleteమీ గాయం త్వరగా నయమవ్వాలని ఆ కృష్ణభగవానుని వేడుకుంటూ.....
ReplyDeleteనువ్వెళ్ళాక..
ReplyDeleteచినుకు ఆకును రాల్చనన్న మబ్బేమో
మరి ఏమయ్యిందో నేస్తం
మనసు మార్చుకుని
ఆగక విసిరే వెర్రి గాలిని తోడు తెచ్చుకుని దిమ్మరించి పోయింది..
ఆగాగి రాలే ఆకేమో అలసి సొలసి పోయానని హేమంతాన్ని తోడెట్టుకుని
తిరిగి వస్తానని బాస చేసి మరీ వెళ్ళి పోయింది..
శిశిర మాసపు చలేమో వేల నాలుకుల వణుకులతో
కంబళీల వెనుకకు తరిమి తరిమి కొడుతోంది...
నువ్వూ నీ నీడ మరువపు వనానికి దూరం గా
గులాబి పెట్టే బాధ కు దగ్గరగా వున్నారు..
ఎవరిని శపించగలం ఏమని ఓదార్చగలం చెప్పు
విరబూసే వనమే ముల్లు గుచ్చి వెక్కిరిస్తే
స్వాంతన పరిచే తోటే ముల్లు కొమ్మై దారి కాస్తే....
అవాంతరాలన్ని దాటి వికసించే మా తూరుపోళ్ళ బుల్లెమ్మ
తిరిగి తొందర గా కోలుకోవాలని
మీ వూరి అన్నవరం స్వామి ని కోరుకుని
ఆ పైన అంతర్వేది లో మనః స్నానాలు చేసి
దాక్షారామ శివుడికి మొక్కి
కార్తిక మాసపు నత్తాలు చేయటం తప్ప..
త్వర గా వచ్చెయ్యి నేస్తం..
నువ్వు లేవని బెంగ తో కృంగి ముల్లుని రాల్చేసి
నీ కోసం మొగ్గల్నే వుంచుతానని
బాస చేసింది నాతో గులాబీల వనం
తోటలోని మరువపు కొమ్మేమో విరజాజి ని తోడు తెచ్చుకుని
నీ కోసం స్వాగత మాలలల్లుతున్నానని కబురెట్టింది నాకు
వచ్చెయ్యి మరి త్వరగా కోలుకుని మా మధ్యకు..
సరేనా..
విజయ మోహన్ గారు, ఇక్కడ , "కుదరని మనసు-కదలని చేయి" అన్న భా.రా.రె పలుకులకి నా కోసం మీరు చూపిన ఆదరణపూరిత ఈ వ్యాఖ్యలకి కృతజ్ఞురాలను. బహుశా నాకిలా ఒక్కచేతి పని అలవడాలనేమో కన్నయ్య ఈ నలత పెట్టి, కలత పడకుండా మీ అందరి మమతని పంచిపెడుతున్నాడు.
ReplyDeleteFirst you recover, and then I'l read and comment. :)
ReplyDeleteభావన,
ReplyDeleteనా మనసు వూటబావిని
పూడ్చి పెడదామని తలపెడితే
బావురుమంది, జల మీద జలగా
వేయిజల్లుల వరదగా ఉప్పొంగిపోయింది
శరదృతువు లోగిలికి కళ్ళ బళ్ళు కట్టుకువచ్చి
గట్టు తెగిన గోదారిలా వూళ్ళు ఏకం చేస్తుంది.
అపుడు అలిగిన తరువు ఇపుడు ఆత్రంగా అలిసిన తనువుకి
ఆకుల వీవెనలు వూపుతూ సాంత్వన ఇస్తుంది.
మాటల చివుర్ల మరువపు కొమ్మ నీ గుమ్మానికి తోరణంగా సమర్పిస్తూ.... నీ నేస్తం
good
ReplyDeleteGetting closer to 40k. May your Marathon quest be fulfilled. Amen!
ReplyDeleteIf you ask which Men? I can not say a word. ;-)
So, congrats on both occasions.
గీతాచార్య, మీ అభిలాషకి థాంక్స్. I still and will always cherish that first time excitement when Maruvam had hit 5k and when I stepped on the finish line of 13 mile Marathon. In fact 10k and 25k I made my kanna's golden touch to finish the milestone in here. All my spirit originates from that heart and grows in this garden of love among you all.
ReplyDeleteభావన, చూసారా మీ కవితా ఝరి సృష్టించిన ఆనంద తాండవాన్ని ( ఉష గారి ప్రతికవిత )?
ReplyDeleteఎప్పటిలాగే బాగుందండీ.. ఆరోగ్యం జాగ్రత్త...
ReplyDeleteకవిత్వం మిమ్మల్ని నిలవనీయకపోవడమన్నది సహజమే. కానీ విశ్రాంతి కావాలని అంటూనే మరల జవాబులివ్వాలా? మీ అంతరంగాన్ని తెలియని వారు లేరు కదా మేడం. ఈ ఎడబాటు మా కందరికీ భరించలేనిదయినా మీ ఆరోగ్యం కూడా ముఖ్యమే కదా? దయచేసి మా విన్నపాన్ని మన్నిస్తారని...
ReplyDeleteమీరు తొందరగా కోలుకోవాలని ఆ భగవంతుణ్ణీ మనసారా ప్రార్ధిస్తున్నాను.
ReplyDeleteఉష గారికి, నమస్కారములు.
ReplyDeleteమీ కవిత సున్నితంగానూ, చక్కగానూ వున్నది.
భవదీయుడు,
మాధవరావు.
బహుచక్కని గారడీ, కన్నుల ముందే ప్రకృతి చేసే కనికట్టు.
ReplyDeleteమందలించిన మిత్రులకి, మమతపంచిన ఆప్తులకీ, ప్రేమతో పలకరింపు పంపుతూ.... మీ మరువం.
ReplyDeleteనచ్చినపుడు "పట్టుదల ఎక్కువ" అని, విసిగినపుడు "తిక్క, మొండి" అని ఇంకెన్నో అని నన్నాపలేకపోయిన మా అమ్మానాన్నల కన్నా మీ ఎవరికీ శక్తి లేదు కనుక నాకు కూడా వ్రాయకుండా వుండగలగటం కష్ట సాధ్యం కనుక... ;) [అబ్బా!!! మీరే పూర్తిచేసుకోండిక... ]
"పగలు చలికి పళ్ళు గిట్టకరుచుకుని
ReplyDeleteచీకటి గదిలో బందీ అవుతుంటే
రేయి వొళ్ళు విరుచుకుని
వెచ్చని కంబళ్ళలో జాగారం చేస్తుంది"
ఈ లైన్లు అదిరాయండీ !
వేమన, అదే కదా ప్రకృతి చేసే గారడీ, ఋతువు మార్పు సంబరమూను. నాకైతే ప్రతి ఋతువు రాకా, పోకా లెక్కలేనన్ని పోకడలతో మురిపించినట్లేవుంటుంది. థాంక్స్.
ReplyDeleteమీ కవితల గారడీ మేమెరిగినదే ఆ మైకంలో మేమేప్పుడో పడిపోయాం కానీ చేతికేమైంది ?ఏమా కధ ?
ReplyDeleteఅయ్యో ఉషాగారు మీ సమాధానంలో చూశాను వెలికి సర్జరీ అని .క్షమించాలి ! ఇప్పుడు నేనూ ఊరుకోను హమ్మా ! రెస్ట్ తీసుకోకుండా ఏమిటీ రాతలు ?
ReplyDeleteపరిమళం, ఈ గారడీ వ్రాసాక నా మనసు తనంత తానే ఏదో గారడీ చేసుకుంది. తగ్గిందండీ. :)
ReplyDelete