వేసవి నుండి ఫాల్ కి ఋతువు మార్పు. అంటే మూణ్ణెల్లు గడిచిపోయాయి. ఇప్పుడు మిత్ర విశ్వ అప్పుడప్పుడు ఫోన్ల మీద మాట్లాడుకునే చనువు పెరిగింది. మిత్ర ప్రాజెక్ట్ పని మీద రెండోసారి విశ్వ ఆఫీసు విజిట్ చేస్తుందిపుడు. మునుపు పరిచయమైనవారే కనుక కొంచం వెసులుబాటు. శివ ఆ సాయంత్రం డిన్నర్ కి వెళ్దామని అడిగాడు.
సాయంత్రం ఆరున్నర సమయం లో వచ్చి తీసుకెళ్ళాడు. దారిలో గుడి దగ్గర ఆపాడు. ముందుగా చెప్పలేదితను అనుకుంది. దర్శనం చేసుకుని వెనక్కి వస్తుండగా ప్రతి సోమవారం అక్కడకి తప్పక వస్తానని చెప్పాడు. దారిలో సంభాషణ ఎక్కువగా అతని పరంగా నడిచింది. ఉదయమే ప్రయాణమై రావటంతో మిత్రకి కాస్త అలసటగా వుంది. మరో పావు గంటలో రెస్టారంట్ కి చేరారు.
"మిత్ర, ఇలా చనువుగా అడుగుతున్నానని ఏమీ అనుకోరుగా?" సంభాషణలోకి ఉపక్రమిస్తూ అన్నాడు శివ.
"ఏమిటది" అంది మిత్ర మెన్యూ కార్డ్ చూస్తూ.
"మీకింకా పెళ్ళి కాలేదు కదా?" అన్నాడు శివ.
"భలేవారే ఇందులో అనుకునేది ఏముంది, అవును కాలేదు" అంది మిత్ర.
శివ ఏదో అనబోయేంతలో ఆర్డర్ కోసం వెయిట్రెస్ వచ్చింది. "ఇక్కడ చిన్న ఇడ్లి, సాంబార్ మీరు తినాల్సిందే" చనువుగా అంటూ అతను ఆర్డర్ చెప్పటం మొదలు పెట్టాడు.
చేతిలో కార్డ్ ఆమెకి ఇచ్చేసి కుర్చీలో కాస్త వెనగా సర్దుకుని కూర్చుని, చుట్టూ పరికించింది. సోమవారం కనుక చాలా తక్కువమంది వున్నారు. ప్రక్క టేబుల్ మీద చిన్న పాప. నోట్లో పాసిఫయర్ పెట్టుకుని మిత్ర నే చూస్తుంది. చిన్నగా చేయి వూపింది. నోట్లో పాసిఫయర్ తీసి కుడిచేత్తో పట్టుకుని, ఎడం చెయ్యి వూపుతూ నవ్వింది. కుడిబుగ్గ మీద పడ్డ ఆ చొట్ట, మళ్ళీ విశ్వ మీదకి మళ్ళింది ధ్యాస.
'ఏదో ఆలోచనలో పడ్డట్లున్నారు" శివ మాటతో "అదేమీ లేదు, మీరు చెప్తున్నారుగా అని, ఇదిగో ఈ పాప ముద్దుగా వుందని చూస్తున్నాను." అంది.
"మిత్ర, మీరెంత కాలంగా వున్నారిక్కడ?" అడిగాడతను.
"రెండు సంవత్సరాలు దాటింది." అంది.
"నేను వచ్చి ఎనిమిదేళ్ళు అయింది. మాస్టర్స్ ఇక్కడే చేసాను. ఆరేళ్ళుగా ఉద్యోగం. ఇది ఈ కంపనీ నా మూడో ఎంప్లాయర్. అలాగే నాల్గో స్టేట్ ఇది నేను మారటం." అన్నాడు శివ.
"అలాగా అయితే త్వరలో మరో స్టేట్ కి మారతారన్నమాట." అంది నవ్వుతూ మిత్ర.
"అవునండి రెండు విషయాలున్నాయి ఇక చేయాల్సినవి. ఒకటి పెళ్ళి చేసుకోవాలి. రెండు జాబ్ మారాలి." అన్నాడు.
"అరే నేను సరదాగా అన్నాను, మీరు నాల్గో స్టేట్ అన్నారని." అంది మిత్ర.
"అలా కాదండి, హర్ష విశ్వని మానేజర్ ని చేయటం నాకు నచ్చలేదు. నేను సీనియర్ ని కదా." అతని గొంతులో అనీజీనెస్.
చురుగ్గా చూసింది మిత్ర అతని వైపు. "ఈ విషయం ఎందుకు చెప్తున్నారు నాకు" అని అడిగింది.
"నాకు మీరు నచ్చారు. మీకు ఇష్టమైతే మీ పెద్దవారు మా వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు" అన్నాడతను "అందుకే నా గురించి వివరాలు ఇస్తున్నాను".
ఏమిటితని ఉద్దేశ్యం. ఇక్కడకి వచ్చి ఉద్యోగం వుంది కనుక, పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాడు కనుక అడిగేయటమే. చిరుకోపంతో ఆమె ముక్కు కాస్త ఎర్రబడింది.
"నాకు గ్రీన్ కార్డ్ వుంది. ఒక్కడినే కొడుకుని. మీ ఆడపిల్లలు ముఖ్యంగా చూసేవి ఇవే కదా?" అతని గొంతులో ఏదో దర్పం.
"శివ, నాకు చాలా అలసటగా వుంది. ఈ సమయంలో ఈ విషయాల గురించి మాట్లాడాలని లేదు." కొంచంగా విసుగు ద్వనించింది ఆమె గొంతులో.
"ష్యూర్, మీరు ఆలోచించుకోండి. కంగారేమీ లేదు. మరో రెండు మూడు నెలల్లో నేను ఉద్యోగం మారిపోతాను. ఈలోగా చెప్తే పెళ్ళి అయ్యాక క్రొత్త ఉద్యోగంలో చేరతాను. నిజానికి చాలా సంబంధాలు వస్తున్నాయట. కాని నేనే ఆపాను." అన్నాడతను.
ఈ సారి పళ్ళ బిగువునా వచ్చింది కోపం. అతని తీరు ఇందాక నుండి చూస్తుంది. తనకి తోచినట్లు చేసేస్తూ, మాట్లాడేస్తూ, ఏమిటితని ఉద్దేశ్యం.
ఇంతలో ఫుడ్ వచ్చింది. తినాలనిలేదు. రూం కి వెళ్ళిపోవాలనివుంది. మర్యాదకి పూర్తి చేసింది. మరొక గంటలో డ్రాప్ చేసివెళ్ళిపోయాడతను.
మనసంతా చికాకు. స్నానం చేసి కాసేపు ద్యానం లో కూర్చుని లేచింది. చాలా డిస్టర్బ్ అయింది తను.
స్త్రీని ఇంకా ఇలా ట్రీట్ చేస్తున్నారా? అతనికి పెళ్ళి ఒక పని. అందుకు కంటికి నదురుగా వున్న తను కావాలి. తనకి అతని ఉద్యోగం, ఆస్తిపాస్తులు తెలిస్తే చాలా? ఇలా అంతులేని ఆలోచనలతో దాదాపు తెల్లారిపోయింది.
************************************************
రెండు మూడు గంటలు కలతనిద్ర తో, మామూలుగా లేచి ఆఫీసుకు వెళ్ళింది. అన్యమనస్కగానే వుంది.
మిత్ర మొహంలో పరధ్యాస విశ్వ గమనిస్తూనే వున్నాడు. మధ్యాహ్నం లంచ్ కి వెళ్దామా అంటే ఆకలిగా లేదు అని తప్పించుకుంది. ఏడింటి వరకు ఆఫీసులోనే వుండిపోయింది.
"రాత్రికి థండర్ స్టోర్మ్ ఫోర్ కాస్ట్ వుంది. మిమ్మల్ని దింపి వెళ్ళనా" విశ్వ మెల్లగా అడిగినా ఏదో ఆత్మీయత ధ్వనించిందా గొంతులో.
"సరే. ఒక పదినిమిషాల్లో వెళ్దాం" అంది మిత్ర.
డ్రైవ్ చేస్తూ, రోడ్డు వైపే చూస్తూ "ఆరోగ్యం బాగుంది కదా? కాస్త అదోలా వున్నారు" అడిగాడు.
"ఊ, అదేమీ లేదు." క్లుప్తంగా అంది.
"ఎక్కడైనా ఆపనా, కాస్త డిన్నర్ తీసుకోండి." అనటంతో "అలాగే, ఎక్కడికైనా ఫర్వాలేదు." అంది.
కార్ వెనక్కి టర్న్ చేసి వెనక్కి తిప్పాడు. మరో పదినిమిషాలకి చిన్న స్నాక్ బార్ వంటి ప్లేస్ కి వెళ్ళారు.
"మీకు రవ్వదోశ ఇష్టం కదా. ఇక్కడ బాగుంటుంది. ఇక్కడ మసాలా టీ నాకు ఇష్టం." అని చెప్పాడతను.
"ఊ, అదే చెప్పండి." అంది. కౌంటర్ వద్దే ఆర్డర్ ఇస్తూ "మాంగో లస్సీ చెప్పనా?" అడిగాడు విశ్వ.
ఇతనికి ఎలా తెలుసు. ఆమె మనసు చదివినట్లు "విష్ణువాళ్ళ అమ్మగారు అన్నారొకసారి మీకివి ఇష్టమని" విశ్వ మాటలకి మిత్ర మనసులో ఆశ్చర్యం కలిగింది. అది ఆశ్చర్యమో లేక ఆనందమో తనకే తెలియటం లేదు.
ట్రేలలో సర్దుకుని టేబుల్ వెదుక్కుని కూర్చున్నారు. అతని గొంతులో ఏదో గంభీరత. మంద్రంగా మృదువుగా ఏదో చెప్తున్నాడు. విశ్వ మాటలకి మిత్ర మనసు తేలిక పడింది.
"విశ్వ, నిన్న శివ నేను డిన్నర్ కి వచ్చాము...తన గురించి మీకు..." అర్థోక్తిలో ఆగింది, చెప్పాలా వద్దా సంధిగ్దత.
"మంచి టెక్నికల్ స్కిల్స్ వున్నాయతనికి. టీం లో తనే సీనియర్. హర్ష పీపుల్ మానేజ్మెంట్ విషయమై నన్ను మానేజర్ గా నియమించినా అతని నిర్ణయాలకి చాలా విలువ ఇస్తాము." అన్నాడు విశ్వ.
ఎంత భిన్నస్వరం శివ, విశ్వ ఈ ఇద్దరిలోను. పరిచయం తక్కువే అయినా అసూయ బయటపెట్టాడు శివ. శివ గురించి వ్యక్తం చేసిన ఈ అభిప్రాయాలు విశ్వ వ్యక్తిత్వానికి ప్రతీక.
వెనక్కి వచ్చే దారిలో వాన మొదలవలేదు కానీ నల్ల మబ్బులు. రాత్రి ఆకాశమైనా ఏదో అందం. ఆపై విశ్వ మాటలకి మనసంతా ఆహ్లాదంగా మారింది. సన్నని సంగీతం, నిద్ర ముంచుకువస్తుంది. కళ్ళు అరమూతలు పడ్డాయి.
"మిత్ర.." నెమ్మదిగా పిలుస్తున్న విశ్వ గొంతుతో ఉలిక్కిపడిలేచింది.
************************************************
రూం కి రాగానే ఐదే ఐదు నిమిషాల్లో నైటీలోకి మారింది.
సందేహం లేదు. తను విశ్వ తో గడిపే సమయాన్ని ఇష్టపడుతుంది. విశ్వ మాటలకి తన మనసు పురివిప్పి నర్తించింది. ఏదో తెలియని ఆశ్చర్యం, ఎప్పుడూ కలగని ఆనందం అతని వలన కలిగాయి. అతని గురించి తెలుసుకోవాలని మనసు త్వరపడుతుంది.
ఉదయమైనా కూడా వదలని నిద్ర మత్తు.
కాలం మారింది,
ఎవరో మునుపన్నట్లు
ఋతువు నవ్వేస్తోంది,
నా తనువు తొందరపడుతోంది.
అందుకేనేమో ఆకసాన అదో అందం
గాలి గొల్లడు మళ్ళీ మళ్ళీ తోలుతున్నా,
మత్తు వీడని నల్ల మబ్బు మేకపిల్లలు
ఒళ్ళు విరిచి దొల్లిగింతవేసినట్లు.
మరందుకేనో పరవశాన మదిదీచందం
రేయి తొలగి వెళ్ళివస్తానంటున్నా,
హత్తుకున్న తీపి తలపులు
మరలి మరలి సిగ్గు దొంతరలు
కనుల కప్పేస్తున్నట్లు.
నెమ్మదిగా కదులుతూ మిత్ర కలం ఆ పంక్తులు వ్రాస్తున్న సమయానికి విశ్వ చేతిలో కుంచె కూడా కదులుతూ వుంది. పడక మీద అలవోకగా వాలి నిదురలోనున్న రాజకుమారి చిత్రమది. మిత్ర పోలికలు కొట్టొచ్చినట్లు కనపడుతున్న ఆ చిత్రానికి తుది మెరుగులు దిద్ది, వేళ్ళు విరుచుకుంటూ మరోసారి పరిశీలనగా చూసాడు.
మిత్రకి గిఫ్ట్ గా ఇస్తే .... ఆ ఆలోచనకి నవ్వు వచ్చింది. అసలు అంత చనువు తీసుకోగలడా? ఇంకొంచం సమయం కావాలి. తమ మధ్య బంధం బలపడాలి. ఈ స్నేహితం ముందు తమని దగ్గర చేయాలి.
కాఫీ తాగాలనిపించి కిచెన్ వైపు నడిచాడు.
[సశేషం]
రోజు రోజుకూ రాటుదేలుతున్న మీ కథన శిల్ప నైపుణ్యాన్ని చూసి ఇక్కడ మేము కూడా ఉలిక్కిపడుతున్నాము. గుడ్ వర్క్.
ReplyDeleteభాస్కర్ గారు చెప్పింది నిజం......
ReplyDeleteఉషగారు ఈ ఇన్స్టాల్మెంట్స్ లో కధే కాస్త కష్టంగా ఉంది:)
ఒకేసారి మొత్తం రాసేయండి...లేకపోతే దొంగతనంగా వచ్చి మీ కధ స్క్రిప్ట్ అంతా దొంగలించేసి చదివెయ్యాలన్నంత ఆత్రంగా ఉంది...very very interesting..!!
ReplyDeleteee saari chaala chinnadiga raasaru..tondaraga raaseyandi
ReplyDeletechaalaa baagundi. Waiting for the next post.
ReplyDeleteభా.రా.రె, పద్మార్పిత, హరేకృష్ణ, తృష్ణ, సునిత - చాలా సంతోషం. మొదటి నవల అదీ అమెరికా నేపథ్యం లో + "ప్రేమ, పెళ్ళి" వంటి అంశాల చుట్టూ నడుస్తుంది కనుక కొంచం ఆలోచన జోడించి వ్రాయటం, సృజన జొప్పించటం నాకూ కసరత్తు చేయాల్సిన అవసరం మరి మరి కలుగుతుంది. స్పందన ఇలా పాజిటివ్ గా వుండటం కూడా నాలో ఉత్సుకతని పెంచుతుంది. కవితావేశం నీ కథన్నాన్ని మించకూడదు, కథలోని పాత్రలతో నువ్వు ఎమోషనల్ అటాచ్మెంట్ పెంచుకోకూడదు అన్న విషయాలు గట్టిగా మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూవ్రాస్తున్న కథ మీరిలా ఆదరిస్తున్నందుకు థాంక్స్!!!!!!!!!!!!!!!!
ReplyDeleteఇదన్యాయం ...ఈ భాగం మరీ తక్కువ రాశారు తర్వాతభాగం నిడివి పెంచకపోతే చదువరులంతా ధర్నా చెయ్యాల్సొస్తుంది మరి !బ్లా.చ .సం ......జిందాబాద్ !
ReplyDeleteఈ మాట ఎత్తిన ఇద్దరికీ, ఇక చెప్పక తప్పటం లేదండి. నా కుడిచెయ్యి ఉంగరం వేలు సర్జరీకి దగ్గర పడింది. మళ్ళీ ఎంత ఆలస్యం అవుతుందోనని ఈ భాగం నేనే అతి ప్రయత్నం మీద దాదాపు మూడు గంటలు తీసుకుని టైప్ చేసాను. పంక్తుల కూర్పు, టైప్ చేయటం ఏకకాలం లో జరిగాయి కనుక మరొకరి సహాయం అడగటం కుదరలేదు. ఇప్పుడు కూడా పళ్ళబిగువునా నెప్పి భరిస్తూ వ్రాస్తున్నాను. వచ్చేవారం నుండి ఇలా చేయను. :(
ReplyDeleteI came I saw I read :-)
ReplyDeleteఉషగారు, ముందుగా ఈ వారం ఎపిసోడ్ మా శనివారం ఉదయానికల్లా అందించినందుకు ధన్యవాదాలు :-)
ReplyDeleteసీరియల్ అందంగా సాగుతుంది. తరువాయి భాగం కోసం ఎదురుచూస్తున్నాను. మొత్తానికి హీరో ఎలివేట్ అవ్వడానికి ఓ విలన్ ని ప్రవేశ పెట్టేశారు :-) అయినా కధ అనుకుంటాం కానీ నిజ జీవితంలో కూడా ఇటువంటి బేరీజు వేసుకునే సంధర్భాలు కోకొల్లలు.
మీకు శీఘ్రంగా స్వస్థత చేకూరి, పూర్తిగా కోలుకోవాలని మనఃపూర్తిగా కోరుకుంటున్నాను.
అమ్మాయి ప్రేమ లో పడిందే.....:-) బాగా నొప్పి గా వుందా వేలు, మరీ స్ట్రెయిన్ చేసుకోకు.. నీ సర్జరీ జరిగి శ్రీఘ్రమే కోలుకోవాలని కోరుకుంటున్నా..
ReplyDeleteI watch, I know, I concur [as in agree] that గీతాచార్య, the great reader! :)
ReplyDeleteవేణు, "విశ్వ" [తనకి మరొకరు అవసరమా? ;)] ని యెలివేట్ చేయటానికి వాడిన విలన్ అని కాదు కానీ, నేను ముందుగానే చెప్పినట్లు ఈ కథలో కొన్ని నిజ జీవితం లో తారసపడ్డ వ్యక్తులు. ఉదాహరణకి సుబ్బాలు అలాగే ఈ శివ. మొదటి భార్య తో విడాకులు, రెండో పరిచయం తొలిపరిచయాల్లో ముగిసి, మూడోది పెళ్ళికి రోజుల ముందు తెగాక, ఆ డిప్రెషన్ లో నా అరచేతుల్లో మొహముంచి విలపిస్తూ, నాదేమిటీ తప్పని తర్జన భర్జన పడ్డ వ్యక్తి ఇతను. అహంకారం చివరికి ఎక్కడకి తీసుకువెళ్ళి వదులుతుందో తెలుసుకున్న మనిషి. ఇది స్త్రీలకీ వర్తిస్తుంది.
ReplyDeleteమీ విష్ కి థాంక్స్. ఒక్క వేలి + ఒక్క చేయి టైపింగ్ అలవాటైంది కాస్త. :)
భావన, నా సృష్టి ప్రేమలో కాక ఇంకెక్కడ పడుతుంది బంగారం? ;)
ReplyDeleteవేలు మరొక వారం పది రోజులకి నయమౌతుందేమో :( నీ పరామర్శకి ఎందుకో ఉపశమనం. ఎవరమో తెలియని మనం ఒకరికొకరం ఆత్మబంధువులం కదా... అసలు అలా తెలియాల్సిన అవసరమూ లేదు. ఈ ఆత్మీయత కలబోసిన కబుర్లు చాలు కదా?
oh..read just now...take care ma'm..dont strain ur finger..!!
ReplyDeleteఅవును కదా.. ఉష సృష్టి ప్రేమ లో పడక....:-) అవును మనమెప్పుడూ ఆత్మ బంధువులమే... ఎరుగుదుమా చిన్నప్పుడు నువ్వు నేను ఎదిగేక ఇలా మూసిన రెక్కల వెనుక వికసించే ఆశ్రు గంధాన్ని కలిసి ఆఘ్రాణించవలసి వస్తుందంది....వినిపించే మౌన గాత్రి మన మైత్రి. ఆరోగ్యం జాగ్రత్త అమ్మ.
ReplyDeleteభావన, ఎన్నడూ ఎరుగని ఈ చిత్రాలు చూడగలమనే ఎదిగామేమో ఇలా, అశ్రుగంధాలు రంగరించిన ఆనంద నననీతాలు పంచుకుందామనే ఎదిగిందేమో మన బంధం. విరించి నీవైతే విపంచి నేనై, లేదంటే అటూ ఇటూ తారుమారై సాగుతామేమో ఈ మైత్రి బాట వెంబడి.. కంటి చుక్కతో సంతకం లిఖిస్తూ....
ReplyDeleteతృష్ణ, ఆ ఒక్కమాట పదివేల వచనాల పెట్టు. థాంక్స్.
కథ లో కి విలన్ వచ్చేసాడే !1 రచనా శైలి బాగుంది .
ReplyDeleteకాని మీరింత శ్రమ తీసుకోవటమే బాగాలేదు. వేలు జాగ్రత్త . మీ వేలే మా మహా భాగ్యము !!
మాలా కుమార్ గారు, మనకి తారసపడే విభిన్న వ్యక్తుల్లో శివ ఒకడు. నిజానికి అతన్ని విలన్ గా చూపటానికో, విశ్వని ఎలివేట్ చేయటానికి తీసుకురావటమో చేయలేదు. నిజానికి ప్రతి భాగంలోను ఒక వ్యక్తో, అంశమో కథలో కలుపుతూనే వున్నాను. పైన వ్రాసాను. ఈ శివ నా నిజ జీవితంలో కలిసిన వ్యక్తే.
ReplyDeleteనిజంగానే ఒక వారం సెలవు తీసుకుంటున్నానిక.
Twist - ద మలుపు!
ReplyDeleteబాగుంది. బాగుంది.
అ. గా. (The Ass), Thanks and I hope it's your candid and real opinion of this part. Keep coming..
ReplyDelete