కాలానికి వేగం పెరిగిందేమో, లేక రోజులు ఎండుటాకులుగా రాలిపోయాయో!!!!! రెండేళ్ళు గడిచిపోయాయి. విస్సూని కాదన్నాక మిత్ర తనంత తనుగా సిద్దపడి పెళ్ళి ప్రస్తావన తెచ్చేవరకు ఇంకే సంబంధాలు తన దగ్గర ప్రస్తావించవద్దన్న మాధవయ్య గారి ఆజ్ఞ మేరకిక ఆ ప్రయత్నం అక్కడితో ఆగిపోయింది.
హైదరాబాదు నుండి మిత్ర బెంగుళూరికి మారటం, ఒక సంవత్సర కాలం క్రాష్ కోర్సులు చేసి, అమెరికాకి రావటం, ఒక సంవత్సరకాలం జరిగిపోవటం అయింది. వేష, బాషల్లో కొద్ది మార్పు తప్పించి పెద్దగా మార్పు లేదు. ఆహార విషయంలో శాఖాహారి అయిన తనకి కొద్దిపాటి ఇబ్బందులున్నా జరిగిపోతుంది.
***********************************************
శనాదివారాల్లో తప్పనిసరి ప్రయాణం, ప్రక్క స్టేట్ లో వున్న కజిన్ మృదుల కూతురి మొదటి పుట్టిన రోజు వేడుక. ఆరు గంటల డ్రైవ్, వెళ్ళిరావటం అయింది.
తను పనిచేసే చోట ఇంటినుండి పనిచేసే సౌలభ్యం వుంది. అన్న సమయానికి పని పూర్తి చేస్తే చాలు. మీటింగ్స్ వున్నప్పుడు, టీం అంతా కలిసి డిస్కస్ చేయాల్సిన అవసరం వున్నప్పుడు మాత్రం వెళ్ళితీరాలి. పని వత్తిడి తప్పదు. కానీ గుర్తింపూ అంతే సమంగా వుంటుంది.
మానేజర్ గుల్డెన్ టర్కీ నుండి వచ్చింది. ఎప్పుడూ చిర్నవ్వుతో హుషారిస్తూ వుంటుంది. తను కాక టీం లో మరో నలుగురు పనిచేస్తున్నారు. నాలుగైదు టీములకి కలిపి జర్మన్ దేశస్తుడైన హెల్ముట్ తీల్బర్ ఆర్కిటెక్ట్. తనతో ఎక్కువగా కలిసి పని చేసేది ఐవన్. బల్గేరియా దేశస్తుడు. భాష సమస్య కొంతవున్నా పనిలో మంచి ప్రావీణ్యం వుంది. తిరు శ్రీలంక తమిళుడు. ముభావి. జాన్ అమెరికన్. చురుగ్గా పనిచేయటంలో దిట్ట. శుక్రవారం మాత్రం నాలుగింటికి వెళ్ళిపోయి సోమవారం వరకు ఎక్కడున్నదీ తెలియనీయడు. "చార్జింగ్ మై సిస్టం" అని జోక్ చేస్తాడు.
సోమవారం ఉదయం బద్దకంగా వుండి మరో గంట పక్కమీదే గడిపి, నిదానంగా లేచి, స్నానం, ధ్యానం పూర్తి చేసుకునే సరికి ఎనిమిదయింది. బౌల్లో మొలకెత్తిన పెసలు, మెంతులు వేసుకుని సిస్టం ఆన్ చేసి, "వర్క్ ఫ్రమ్ హోమ్" ఈ-మెయిల్ పంపుదామనుకుంటూ ఫోల్డర్ ఓపెన్ చేసింది.
తొమ్మిదింటికి గుల్డెన్ స్కెడ్యూల్ చేసిన మీటింగ్ ఇన్వైట్ ఎదురు చూస్తూవుంది. షార్ట్ నోటీస్ ఇస్తున్నందుకు ఏమీ అనుకోవద్దని, ప్రాజెక్ట్ లో కొంత ఒక కన్సల్టెన్సీ కంపెనీకీ ఇవ్వాలన్న అప్పర్ మానేజ్మెంట్ నిర్ణయం కారణంగా, వస్తున్న ఇంజనీర్ని కలవటానికి, పనిని విభజింజచటానికి మీటింగ్ అజెండా పంపింది.
గబగబా తినటం పూర్తి చేసి, ఫార్మల్ వేర్ గురించి ఒక నిమిషం యోచించి, ఆ ఆలోచన విరమించుకుని, పెద్దగా ఆలోచించకుండా చేతికందిన జీన్స్, టీ-షర్ట్ వేసుకుని క్లుప్తంగా మిగిలిన అలంకరణ పూర్తిచేసి, బయట పడింది. అప్పటికి ఎనిమిదిన్నర అయిపోయింది. దాదాపు ఇరవై నిమిషాలు పడుతుంది.
దార్లో అంతరాయం. కొంచం ముందు ఏదో యాక్సిడెంట్ అయిందో, కార్ బ్రేక్ డౌన్ కావచ్చు. అనుకోని ఆలస్యం. ఐవన్ కి కాల్ చేసి పది నిముషాలు ఆలస్యమౌతానని చెప్పింది. అఫీస్ కి చేరగానే చేతిలో బ్యాగ్ విసిరినట్లే పడేసి, కాన్ఫరెన్స్ గదిలోకి పరిగెట్టినట్లే నడిచి వెళ్ళింది. టీం అంతా వున్నారు. పరిచయాలు అవుతున్నాయి.
"ఓ కమ్ కమ్ మీట్రా" గుల్డెన్ నవ్వుతూ పిలిచింది. ఆమెకి అభిముఖంగా గుమ్మానికి వీపుపెట్టి కూర్చున్న వ్యక్తి కావచ్చు ఆ బయట కన్సల్టెన్సీ నుండి వచ్చింది అనుకుంటుండగా "దిస్ ఇజ్ మీట్రా" అంటూ "మీట్రా, హి ఈజ్ .." అంటుండగానే అతను లేవటం "హాయ్ ఐయామ్ విశ్వ" అంటూ నవ్వుతూ కరచాలనం కొరకు చెయ్యి చాపటం జరిగిపోయాయి.
ఆ చేతిలో మృదువుగా చేయ్యి కలుపుతూ కళ్ళెత్తి చూసింది. పరిచయమైన ముఖం, ఆ నవ్వు మాత్రం తెలియలేదు అనుకున్నంతలోనే స్ఫురించింది. అవును విస్సు కదూ. తల తిప్పి చూసింది. హెల్ముట్ తో మాట్లాడటానికి ప్రక్కకి తిరిగిన అతని కుడి బుగ్గ మీద చిరు దరహాసానికి పడ్డ చొట్ట.
ఆలీవ్ రంగు సూట్, టై తో నీట్ గా ఇన్షర్ట్ చేసిన హాఫ్ వైట్ చొక్కా, నొక్కి దువ్విన జుట్టు. విస్సూనే. సందేహం లేదు. ఎంత మార్పు అతనిలో. ఒక్కసారిగా గుండె ఝల్లుమంది. రెండేళ్ల క్రితం అతన్ని వద్దన్నాక మళ్ళీ ఇదే చూడటం. అన్యమనస్కంగా కూర్చుంది. లంచ్ వరకు సాగిన ఆ టెక్నికల్ మీటింగ్ లో కాంట్రాక్ట్ కి సంబంధించిన విషయాలు అన్నీ చర్చించారు. మరొక వారానికి వస్తానని అతను సెలవుతీసుకున్నాడు.
***********************************************
హెల్ముట్ అధ్వైర్యంలో మిత్ర సాఫ్ట్వేర్ స్టబ్స్ డిజైన్ చేయటం. విశ్వ కంపెనీ కోడింగ్ చేసివ్వటం. ఐవన్, మిత్ర ఇంటిగ్రేట్ చేయటం ఇలా టాస్క్ లన్నీ విడతీసారు. మరో వారానికి విశ్వ రావటం జరిగింది. ఈసారి సోమ వారం నుండి ఐదు రోజులు వుండేట్లుగా వచ్చాడు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు లంచ్ కి కంపెనీ ఇస్తున్నారు.
మూడోరోజు మిత్ర, విశ్వ వెళ్ళారు. ముందుగా అతనే అడిగాడు, "మిత్ర! మీకు నేను గుర్తు వున్నానా?" అని.
మొహమాటంగా వుంది. "ఎలా వున్నారు, విస్సూ, ... విశ్వ?" అని అడిగింది.
మరొక అరగంటకి నెమ్మదిగా విషయాలు ఒకటొకటీ మాట్లాడుకున్నారు. నిజానికి విశ్వ ఉద్యోగం వివరాలేమీ తెలియదు. అతను హైదరాబాదులోనే సాఫ్ట్వేర్ రంగంలో వున్నాడని ఇప్పుడు చెప్పాడు. అతను వచ్చి సంవత్సరమున్నర అయిందట. అతని మిత్రుడు హర్ష ద్వారాగా వచ్చాడట.
అతని స్టార్ట్ అప్ కంపెనీకి సీనియర్ టెక్ లీడ్ గా విశ్వ రావటం జరిగిందట. మునుపు మీద చాలా మాటకారి అయ్యాడు. "మీరు చాలా మారారు." ఆ మాట అనకుండా వుండలేకపోయింది. తెలియని సంబరం, ఈ సంవత్సరకాలం లో పూర్వ పరిచితులని చూడటం ఇదే.
చిన్నగా నవ్వేసాడు. "మార్పు అవసరాన్ని బట్టి కలుగుతుందేమో." అన్నాడు. ఆ తర్వాత పెద్దగా మాటలు ఇద్దరూ పొడిగించలేదు వ్యక్తిగత విషయాలలోకి.
శుక్రవారం అతను వెళ్ళేముందు మరో సారి కాఫీకి కలిసి వెళ్ళారు. ఈ ఐదు రోజుల్లో మరికొంత చనువు పెరిగంది.
***********************************************
తర్వాత గడిచిన మూడు నెలలు ప్రాజెక్ట్ వర్క్ లో చాలా వరకు టెక్నికల్ ప్రాబ్లెంస్, డిబగ్గింగ్, అప్పుడప్పుడు హెల్ముట్ చపలచిత్త బుద్ది మూలాన చీకాకులు, ఐవన్ తో చక్కని టీమ్ వర్కింగ్. విశ్వతో భేటీలు చిటికెలో జరిగిపోయాయి. విశ్వ కంపెనీ ఆహ్వానం మీద మిత్ర ఈసారి అతని వూరికి వెళ్ళింది. తర్వాత ప్రాజెక్ట్ ప్రపోజల్స్ గురించి ఈసారి అలా ఏర్పాట్లు జరిగాయి.
అతని టీం మొత్తం నలుగురు. తను డెలప్మెంట్ మానేజర్. శివ, మైకల్, కెండల్ టీం మెంబర్స్. అంతా పాతిక నుండి ముప్పై లోపు వయసు వారే. ఆఫీస్ అసిస్టంట్ యాస్మిన్. ఆస్ట్రేలియన్.
టూరిస్ట్ గా వెళ్ళిన కెండల్ తో పరిచయం కొద్దిరోజుల్లోనే ప్రణయంకి దారి తీయటం, అతని కొరకు తను ఇక్కడికి రావటం జరిగిందని మిత్ర తో విశ్వ చెప్పినప్పుడు కొంచం ఆశ్చర్యం ప్రేమలో ఇంత మహిమ వుందా.
తన స్వదేశాన్ని, తన వారినందరినీ వదిలి వచ్చేసిందా? దాదాపు రెండేళ్ళుగా నిద్రాణంగా వున్న ఆలోచన మళ్ళీ తిరిగి మొదలైంది.
అసలు చదువు, ట్రైనింగ్, ఇక్కడికి రావటం, ఇక్కడి వాతావరణం, ఉరుకుల పరుగుల జీవితం వీటిల్లో పడి పెళ్ళి ధ్యాసే రాలేదు. విశ్వ మూలాన అప్పటి ఆలోచనలు తిరిగి చోటుచేసుకుంటున్నాయి.
తిరిగి వచ్చినా తనలో తెలియని మార్పు. ఒంటరితనం కొట్టొచ్చినట్లుగా తెలుస్తుంది. అప్పుడప్పుడు మాట్లాడొచ్చా అని అడిగి నంబరు తీసుకున్నా ఇంతవరకు అతన్నుండి ఎప్పుడూ కాల్ రాలేదు.
***********************************************
విశ్వ డైరీలో అప్పటి రోజుల్లో ఒక పుట.
"మిత్ర. అదే రూపు. చూడగానే నా గుండె చప్పుడు గొంతులోకి తెలిసినట్లు, మనసు అదుపు తప్పినట్లు అదే అపురూపమైన భావన. మునుపు మిత్ర తిరస్కారంతో నాలో బాధ కలుగలేదు. ఆమె నిర్ణయం సహజంగా అనిపించింది. ఒక్కరాత్రిలో మార్పు రాదు. కానీ తనకోసమే నా పట్టుదల పెరిగింది.
మిత్రకి తెలియని నిజం ఆమెని గెలవటానికే నేనింత కష్టపడ్డాను. ఇప్పటి వరకు జరిగిన సంఘటనలన్నీ ప్రయత్నపూర్వకంగా ఆమె జీవితంలో మళ్ళీ తారసపడటానికే, తనని నా స్వంతం చేసుకోవటానికే. కానీ అది ఆమె అభీష్టానికి వ్యతిరేకంగా కాదు, ఆమె నా గురించి తెలుసుకోవాలి. నన్ను కోరుకోవాలి. తను నా గమ్యం. ఆమెని చేరేవరకు నా గమనం. ఆమె నా ప్రేమకి చివరి మజిలీ. అంతదాకా ఎంతకాలమైనా వేచివుంటాను."
సన్నగా అతను హమ్ చేస్తున్న పాట "ఏ రోజైతే చూసానో నిన్ను ఆ రోజే నువ్వైపోయా నేను కాలం కాదన్నా ఏ దూరం అడ్డున్నా ... "
***********************************************
మిత్ర మనసులో మళ్ళీ తొలకరి జల్లు వంటి మధురోహలు. ఉద్వేగం. ఏవేవో మధురోహలు. ఇంకా చిరునామా తెలియని తన తోడు కోసం అభిసారిక గా తను వ్రాసుకున్న ఓ లేఖ... ఆమె కవితల పుస్తకాన్ని అలంకరించింది.
ఎంత మౌనమీ ఉదయం!
గలగలల కొబ్బరాకుకే కదలిక రాని మౌనం,
విడివడని మొగ్గల్లో విడదీయలేని మౌనం,
అంతటా స్తంభించిన గాలిలో మౌనం,
తెల్లగా విస్తరించిన మబ్బులో మౌనం,
ఇవే నీకు నా రాయబారం!
ఇన్నిటా మరింత మౌనంగా చలించే నా హృదయం,
మెల్లగా సాగుతున్న నా నిరీక్షణం,
చల్లగా వస్తున్న మన సంగమతరుణం,
నీకై నాకై నేల్కాంత వేసిన పూపొదరిళ్ళు,
తరువులు పరిచిన చివురు పరుపులు,
నీ ఒడిలో నిదురించే నా కళ్ళు,
అవిగో అక్కడే నా వూహల వేణువులు,
నాలోని మౌనం తటాలున పరుగిడే నీ దర్శనం!
సెలవిక ప్రియా! అపూర్వమీ ప్రేమ జీవనం,
అంతులేనిదీ మధుర కవనం.
[సశేషం]
గమనిక: ఇది ప్రేమకథ. విశ్వ మిత్రల ప్రేమ అన్వేషణల చివరి మజిలీ. ఇందులో లాజిక్స్ వెదికి ఈకలు పీకుతానంటే అలాగే, అవన్నీ ఓ టోపీగా తయారు చేసి మీకే వేస్తాను. చక్కని ప్రేమ సాగరంలో ఈదులాడి వెళ్ళండి. ప్రేమైక జీవన మధురిమ ఆస్వాదించి వెళ్ళండి.
Well. kaanee kathani paatrala kannaa meere ekkuva nadipinchesthunnaru. ;-) Writer should not dominate characters ani vinnanu. Otherwise chala baga rasaru.
ReplyDeleteఅ.గా. గారు, ఇమ్త సునిశితంగా నా కథని గమనించి అర్థవంతమైన సద్విమర్శ ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇకపై పరిగణలోకి తప్పక తీసుకుంటాను. ఢక్కామొక్కీలు తప్పవేమోనులెండి :) కానీ చెప్పటం మానకండి.
ReplyDeleteమీ కధలలొ పరిణితి క్లియర్ గా తెలుస్తోంది..అప్పుడే అయిపొయిందా అనిపించింది..great going
ReplyDeleteinteresting కధలు రాయడం లొ కాంపిటిషన్ పెరిగిపొయింది..:)
మరువపు కవిత బోనస్ ఇచ్చారు కదా diwali కి :):)
interesting twist..good going...!!
ReplyDeleteఈకలు పీకే చాన్స్ మాకు ఇచ్చారాండి!
ReplyDeleteమాకు అంత టాలెంట్ ఎక్కడ ఉందండి!
ప్రేమకావ్యాని ఆస్వాధిస్తున్నానండి...:)
ఉష గారూ,
ReplyDeleteబాగుంది ఈ ప్రేమిక ప్రయాణం. మేము ఫాలో అవుతూనే ఉన్నాం.
Keep going.!
Next part?
ReplyDeletevisva ,mitralu tirigi kalusukoevatamu cinimaatik gaa baagundi.
ReplyDeletechakkagaa saagipoetuu appudae ayipoeyndaa anipistoendi mee katha.
maalli eduru chuupulu aadi vaaram eppudostundaa ani !
మొత్తం ఒక్కసారే రాసేసి పోస్ట్ చేయొచ్చు కదండీ ....మరల వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది ....ఇప్పుడు కొంచెం సులభం అయ్యింది .ఈడులాడ లేము కాని ఒడ్డునుండి ఆస్వాదిస్తాం -:)
ReplyDeleteబాగుందండీ.. వచ్చేవారం కోసం ఎదురుచూస్తున్నాను..
ReplyDeleteస్ఫందిస్తున్న అందరికీ మరోసారి ధన్యవాదాలు.
ReplyDelete@ మాలాకుమార్ గారు, మీకు రెండు యధార్థ సంఘటనలు చెప్పాలి. మిమ్మల్ని సమాధానపరచటానికి కాదు కానీ నేనలా వారిని కలపటానికి ప్రేరణలవి. మా రాత్రి/మీ ఉదయపు వేళల ఆ వూసులు వస్తాయి [అందాకా ఏమా అవని వూహిస్తూ కూర్చోండిక! ;) ]
విస్సు సామాన్యుడు కాదన్నమాట. ఈ సారి కథ వేగం పెరిగింది. తరువాతి భాగానికి మరోవారందాకా ఆగాలా?
ReplyDeleteవిశ్వామిత్ర - 6 : మాలాకుమార్ గారికి కాస్త వివరణ:
ReplyDeleteఒకటి: నేను ఒక ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్ళినపుడు, దాదాపుగా నా పేరు ఖరారు అయినాక, ఆ పానల్ లో వున్న తెలుగు వారొకరు, నాకు ఇంటికి కాల్ చేసి చెప్పారు. అలా చెప్పకూడదు కానీ తెలుగువారమన్న అభిమానం. ముగ్గురం మిగిలాం - ఒక రష్యన్ డాక్టరేట్ వున్నా భాష సమస్య. నేను, డెంటిస్ట్ గా పది సంవత్సరాలు చేసి కంప్యూటర్ ఇంజనీరింగ్ చేసి వచ్చిన ఒక ఆస్త్రేలియన్. చివరి క్షణం లో నాకున్న అనుభవం రీత్యా మరొక చోటైనా అవకాశం ఎక్కువ కనుక ప్రోత్సాహం ఆ చివరి అతనికి అవసరమని అతనికి ఇచ్చారు. ఆయన ఆ తర్వాత నాకు ఉద్యోగం వచ్చే వరకు ఎంతో తోడ్పడ్డారు. మీరు నమ్మలేకపోయినా ఇది నిజం. నాకు ఒకే రోజు అప్పుడు నాల్గు ఉద్యోగాలు వచ్చాయి. నాకు వర్క్ ఎక్ప్సీరియన్స్ అవకాశం ఇచ్చిన చోటే జీతం తక్కువైనా చేరాను. ఇది ఒకటి.
రెండవది - ఒక పెద్ద గ్లోబల్ కంపనీకి పని చేసినపుడు మా సెక్టర్ నుండి సర్వీస్ అందుకునే మరొక సెక్టర్ ఉద్యోగి ఒకరు ఇండియా నుండి వచ్చారు. అతన్ని నేను గుర్తు పట్టలేదు. ఎందుకంటే నాకు అతన్ని అంతకు మునుపు చూసినట్లపించలేదు. కానీ అతను నన్ను చూసిన వెంటనే మీరు ఫలానా కదా అని అన్నీ ఏకరువు పెట్టారు. అతని పొట్ట, బట్టతల, కళ్ళజోడు తీసి, పుష్కరకాలం వయసు తగ్గించినా నాకతని రూపు పరిచితం అనిపించలేదు. అతనికి ఎన్నో జ్ఞాపకాలుమా చదువుకున్ననాటివి. అలాగే మా స్కూల్ నుండి నా కన్నా మూడు సం. చిన్న అయిన వ్యక్తి నన్ను ఇరవై సం. తర్వాత చూసి కూడా వెంటనే ఫలానా కదూ అని అడిగాడు. అంతా మన ఫేస్ వాల్యూ అనుకోండి మరి! ;) అబ్బాయి-అమ్మాయి అంటారా అలాగే కానీండి. :)
ఆ రెండీటినీ కలేసి, మిత్ర కంపెనీ స్టార్ట్ అప్ అయినా విశ్వ టీం సర్వీసెస్ తీసుకుని ప్రోత్సాహం ఇవ్వటానికి అవకాశం, మిత్రాని ప్రయత్న పూర్వకంగా విశ్వ కలవటం సహజమని వూహించి వ్రాసానలా. ఇక్కడ గుజ్జూలను, ఒకరి వెనుక ఒకరుగా కుటుంబ సభ్యుల్ని , స్నేహితులనీ తెచ్చే మన వార్ని చూస్తే మీరు అన్నీ జరగొచ్చు అని అంగీకరిస్తారు. ఇవి సినిమాటిక్ కాదు సహజమాటిక్ కథలు సుమీ! ;)
భా.రా.రె, నా సామాన్యుడు కవిత చదివారా లేదా? ;) థాంక్స్ కథ గమనాన్ని గమనించినందుకు, అన్యాపదేశంగా నచ్చిందని చెప్పినందుకు...
వసుధైక కుటుంబంలా అన్ని దేశాలవాళ్ళను కలిపేసారు కదా ఒకే టీములో. ఒకే టెంపో సాగుతోంది మొత్తంగా మరోసారి ఆహ్లాదంగా.. (తరువాయి భాగానికి నా వ్యాఖ్య ఆలస్యమయితే "ఆహ్లాదం" అని మీరే వేసేసుకోండి హాజరు)
ReplyDeleteమొత్తం కధ పూర్తయితే, చివరగా ఒక పెద్ద వ్యాఖ్య రాస్తాను (ఆలోపు పి డి ఎఫ్ ) పూర్తి చేసెయ్యండి. అంతవరకు ఈ కధకు నేను వ్యాఖ్య రాసినా ఒకటే రాస్తాను ఎలాగూ.
"విశ్వామిత్ర" - ప్రదీప్, మీకు అనుభవమయ్యే వుండాలే ఈ వసుధైక కుటుంబం ;) మీరన్నాక లెక్క వేసాను. ఇంతవరకు నేను ముప్పై ఐదు దేశాల వారితో కలిసి పనిచేసాను. కొందరి వద్ద నాణాలు కూడా సేకరించాను. మరికొన్ని అరుదైన వస్తువులూను. బల్గేరియన్ వారు వాడే కాఫి వేడి చేసుకునే రాగి కాడ పాత్ర [మా ఐవన్ ప్రేమగా ఇచ్చినది] అలాగే తను పని చేసిన విమానం విడిభాగాల్లో నుండి తీసిన చిన్న భూతద్దం మా హెల్ముట్ కానుక. నాకు డాన్స్ ఇష్టమని గుల్డెన్ ఇచ్చిన డాన్సింగ్ డాల్. యాస్మిన్ ఇచ్చిన భగవద్గీత. ఇలా కొన్ని జ్ఞాపకాలు తవ్వితీసారు మీ వ్యాఖ్యతో.
ReplyDeleteకథ నచ్చినందుకు నెనర్లు. నాకీ ముళ్ళకిర్రిటమ్ ఎపుడెపుడు తీస్తానా అని మాత్రం వుంది. ;)
ఇంతందమైన ప్రణయ కావ్యం రాస్తూ ....చివర్లో ఈ ఈకల గోలేవిటండీ బాబూ ! ప్రదీప్ గారన్నట్టు ఆహ్లాదభరితంగా ఉంది . నేనైతే మీ ప్రేమ కావ్యపు మధురిమను ఆస్వాదిస్తున్నాను.
ReplyDeleteముళ్ళకిర్రిటమ్
ReplyDeleteLOL
yep noticed the typo yet too tired then to correct and assumed that readers would get it in the flow as it is supposed to be "ముళ్ళకిరీటం" అని.
ReplyDeleteఅది టైపో ఎంతమాత్రం కాదండీ. My LOL is for మీరు ఆ కథని ముళ్ళ కిరీటం అనటం నాకు కాస్త నవ్వొచ్చింది. టైపోకోసం నవ్వాల్సిన పని లేదు కదా. :-) ఎవరికైనా అవి సహజమే కదా.
ReplyDeleteవిశ్వామిత్ర-6: గీతాచార్యా! అదేమీ కాదులేండీ, ఆ మాట అయితే మీరు సరిచేసి వ్రాసే పని, నా తప్పుల తడకని పెట్టి ఎందుకు LOL అంటారు కానీ .... :)
ReplyDeleteఇకపోతే నిజంగానే ఈ కథ వ్రాయటం కాసేపు సరదాగా [శని-బుధ] కాసేపు ఆలోచనగా [గురు-శుక్ర] చివరికి శుక్రవారం రాత్రి ,శనివారం ఉదయం పరీక్షలాగా అనిపిస్తుంది. బహుశా కథ పూర్తయే నాటికి మరికొంచం పట్టు వస్తుందేమో కానీ ఇప్పటికి మాత్రం ముళ్ళకిరీటం పెట్టుకున్నట్లేను.. :(
విశ్వామిత్ర-6: పరిమళం, ఈకలు పీకే చదువరులను బట్టి అది ముందు జాగ్రత్త అన్నమాట. పేరులోనే పరిమళాన్ని దాచుకున్న మీరు ఈ కథలోని మధుర భావనలని అస్వాదించటం సహజమేకాదా! వూరునుండి రాగానే హోంవర్క్ పూర్తి చేస్తున్నందుకు :) థాంక్స్.
ReplyDelete