యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ

జలపుష్పాభిషేకం ఉపసంహారం: ఎవని వర్ణించుటలో వాక్కు విఫలమై వెనుకకు మరలునో, ఎవడు మనసుకు అందడో - తనే దైవమైతే ఆ దైవాన్నినేను కాంచాను. సమస్త జీవరాశి కలిసి మెలిసి సాగించు సజీవచిత్రం గా వర్ణించాను, నా మానసాన ఆ సుఖశాంతుల కల్మష రహిత ప్రకృతినే దైవంగా నిర్వచించుకున్నాను.

*************************************************

స్వాప్నిక జగత్తు కాదది,
గడచిన ఘనచరిత్ర కానే కాదు.
సంపూర్తి కానున్న చిత్రమది.
సృష్ట్యాది నుండి సాగిన గానమది.
రానున్న మహత్తర భావి అది,
మానవీయ మధుర కావ్యమది.


తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ
నలుదిక్కుల నడుమ పృధ్వి ఒక్కటే.
వేలు, వేవేలు, లెక్కలేనన్ని, పాలపుంతల
పలుచుక్కల నడుమ ఆకాశం ఒక్కటే.
భాష, వేషం, రంగు, రూపు
భిన్నస్వరాల ఏకీభావం ఒక్కటే.


యుద్దభీతి, కీర్తికాంక్ష, స్వార్థభక్తి, కుటిలనీతి
పునాదులు పెకలించిన జాతి అది.
శాంతి, సమత, మమత, ఆత్మీయత
నాలుగు వేదాలుగా విలసిల్లిన రీతి అది.
తరులు, గిరులు, వనాలు, మైదానాలు
సాంత్వన చెందిన ప్రకృతి అది.


సాగరాలు నవ్వాయి అలలు అలలుగా,
జలపుష్పాలు ఎగిసిపడగా.
నదీనదాలు సాగాయి మెల్ల మెల్లగా,
పైరు పచ్చ చిన్నెలు మిడిసిపడగా.
గాలులు వీచాయి చల్ల చల్లగా,
నీలి మబ్బు వన్నెలు మెరిసిపోవగా.

"యతో వాచో
నివర్తంతే అప్రాప్య మనసా సహ"
వేదం వచించినా, దైవం నా వాక్కున కందిన తరుణమది.
నా మనసుకు అందిన దైవత్వమది.
మానవత్వమే సాధనగా నీవు నేను గరపు యాగమిది.
వసుధైక కుటుంబం మనదని చాటనున్నది భావి తరం.
"లోకాస్సమస్తా స్సుఖినో భవంతు" సాకారం కానున్న రేపు అది.

*************************************************

సంకలన ప్రయత్నం లో కాంచిన విలాపాల పిదప రానున్న యుగం విధంగా వుండాలని నా ఆకాంక్ష కవిత. మనిషి తలిస్తే అన్నీ సాధ్యమేను, తన మానసమే దైవ నిలయం. తన సాధన వలన సమస్త జీవకోటి సామరస్యంగా గడుపు జీవనం సుసాధ్యం.

34 comments:

  1. NOTE: I read this book and send the following note during the 911 opinion sharing. It was well appreciated then. Though started of with 'fish' my thinking expanded in to the entire life on the earth and hence this last kavita, though digressed a bit from the main theme, to convey my feelings.

    ***********************************

    Here goes a Sloka (couplet) from the Atharva Veda (one of the 4 Vedas - treatises on knowledge from ancient India) which embodies the true spirit of humanness expressed, not today, but four thousand years ago.

    We are the birds of the same nest,
    We may wear different skins,
    We may speak different languages,
    We may believe in different religions,
    We may belong to different cultures,
    Yet we share the same home - OUR EARTH.

    Born on the same planet
    Covered by the same skies
    Gazing at the same stars
    Breathing the same air
    We must learn to happily progress together
    Or miserably perish together,
    For man can live individually,
    But can survive only collectively

    -- courtesy: "Ancient India's Contribution to Our World's Material (Temporal) Culture" by Sudheer Birodkar

    ReplyDelete
  2. ఉషా... రాయలనుకున్నా చేయి కదలనంటోంది... చెపుదామనుకున్నా మాట రానంటోంది... పొగుడుదామనుకున్నా పదం కొలవలేనంటోంది.. నేస్తం... గుండె నిండుగా పొరలిన ఈ అభిమానపు వెల్లువ కంటి నుంచి ఆనంద భాష్పమై జాలువారుతోంది..... జీవిత సారాన్ని వారి అసమాన్యమైన అనుభవాలతో కలబోసి రాసిన ఆ గొప్ప వాక్కులు ఇంతందం గా సంధర్బానుసారం గా నీ గళాన/కలాన వెల్లువెత్తుతుంటే మిత్రమా... ఆగక నా గుండె కొట్టే చప్పట్ట్లు నీకే సుమా... వినపడుతున్నాయా? I feel like hugging you my dear. give me a big hug...you deserve a big one.

    ReplyDelete
  3. " ఆ రేపు " కోసం ఎదురుచూస్తూ...... అభినందనలతో....!

    ReplyDelete
  4. ఉష గారు నాకీమద్య ఒక డౌట్ వస్తుంది మీ పోస్ట్ కి వాఖ్య రాసే అర్హత నాకున్నాదా అని :( ఇది నిజం గా నా మనసులో మాట ..

    ReplyDelete
  5. చాలా బాగుంది ఉష గారు, మీ ఆకాంక్ష సఫలమవ్వాలి అని కోరుకుంటున్నాను.
    అన్నట్లు మీ మరువపు వనాన్ని మించిన ఉద్యాన వనాన్ని చూశాక నా స్పందన ఇది... వెంటనే మీకు చేరాలని ఇక్కడ మళ్ళీ చెప్తున్నా...

    ------

    ఉష గారు... నా నోట మాట రావడం లేదండీ... చాక్లెట్ లు ఐస్ క్రీం లు నచ్చకపోవడం వల్ల కాదు కానీ మీరు నిజంగా చాలా అరుదైన వ్యక్తి. మీ తోట అద్భుతం, ఫోటోలు వేటికి అవే ప్రత్యేకం గా చాలా బాగున్నాయి ఇక వాటికి మీ వ్యాఖ్య లు మరింత వన్నె తెచ్చాయి. మన లొ మనమాట నిజం చెప్పండి మీరు ఆ దేవుడితో కుమ్మక్కై రోజుకి కనీసం 30 గంటలు సంపాదించారు కదూ... అదికాక పోతే, నాలాటి వాళ్ళు రోజుకి ఎనిమిది గంటలు నిద్ర పోతే బహుశా మీరే పది నిముషాలో నిద్ర పోతూ ఉండి ఉండాలి. ఇన్ని పనులు ఎలా చేయగలరండీ బాబు. అసలే చలి ప్రదేశం లో ఉంటూ అంత మంచు మధ్య లో ఇంత అందమైన తోట ని maintain చేయ గలుగుతున్నారంటే నిజంగా మీకు శిరసు వంచి నమస్కరించాలి. మనసుంటే మార్గముంటుంది అని నిరూపించడానికి ఇకపై నా నేస్తాలకు మీ ఆల్బం నే ఉదాహరణ గా చూపిస్తాను.

    ReplyDelete
  6. వసుధైక కుటుంబం మనదని చాటనున్నది భావి తరం

    ఇది అనాదిగా మానవుని ఆకాంక్ష. దీనిని సాధించేందుకు నిత్యమూ అలుపెరుగని పోరాటం చేస్తూ వస్తున్నాడు. అందరి కల సాకారం కావాలని కోరుకుంటూ మీ ఈ నిష్కామ కర్మకు మేమూ సమిధలం అవుతామని ప్రమాణం చేస్తున్నాను.

    ReplyDelete
  7. "....నివర్తంతే....."

    -- తాడేపల్లి

    ReplyDelete
  8. You deserve a big hug!True! I too agree with Bhaavana.

    ReplyDelete
  9. ఎవరి బ్లాగ్ గురించి వర్నించుటలో వాక్కు విఫలమై వెనుకకు మరలునో ,
    ఎవరి బ్లాగ్ రవిని గాన్చగానేఉషోదయపు కాంతులు వేదజల్లునో,
    ,ఎవరి బ్లాగ్ లో వసుదైక కుటుంబం అనే భావన రగులునో ,
    ఎవరి బ్లాగ్ ఎప్పటికి మరువమో
    ఎవరి బ్లాగ్ మరి యెంత దూరమో మరి అంత చేరువో.
    ఆ కల్మష రహిత బ్లాగరే ఉషగారు అందుకోండి అభినందనలు

    ReplyDelete
  10. There is no smily for claps. Simply claps.

    ReplyDelete
  11. Where the mind is without fear...
    where the eyes are without tears...
    When the world is without liars...
    Itz only that people are with their dears,
    Cometh this Beauty.

    ReplyDelete
  12. ఇంతకు మునుపు చూడనివారికి చూడచక్కని నా ఉద్యానవనం ఇదిగో...

    http://picasaweb.google.com/ushaa.raani/PDZRDL?authkey=Gv1sRgCKukhcLq8o7NEA

    ReplyDelete
  13. @YIM,

    పెట్టేశారా గురువు గారు. వెల్లు.

    ఉష గారు,

    అందరి మాటే నాదీనూ.

    ReplyDelete
  14. నిజం చెప్పండి, నేను మొన్న రాసిన "సమాధానం తెలియని ప్రశ్నలు" తరువాత వచ్చిన భావనేనా ఇది? ముందు మీరు చెప్పండి. more to follow (ఎక్కడో విన్నట్టుంది కదా)

    ReplyDelete
  15. [ప్ర] దీపు బాబు, అంతే అనుకో మరి ;) అవును ఏమిటో మీ మాటలన్ని ముందుజన్మలో విన్నట్లే వుంటాయి యెందుచేతో. మరి పూర్తి వ్యాఖ్య వ్రాయండిక. ఈ శీర్షిక మీద వ్రాయాలని ఎప్పటినుండో వుంది. మీ కవిత ఈ కవిత కార్యరూపం దాల్చటానికి ఉపకరించింది. థాంక్స్.

    ReplyDelete
  16. frankly speaking,
    "సాగరాలు నవ్వాయి అలలు అలలుగా,
    జలపుష్పాలు ఎగిసిపడగా" - ఈ వాక్యంలోనికి హటాత్తుగా దిగిపోయిన ఫీలింగ్
    అలాగే, విశ్వంభరా కావ్యంలోని భావాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. గొప్పగొప్ప కవులు ఒకేలా ఆలోచిస్తారట. (మీరు చదవలేదని చెప్పారు, గుర్తుంది)
    ఇక ఇది జలపుష్పాభిషేకానికి ఉపసంహారమెటుల అయినదో అర్ధము కావటంలేదు. వివరింపుము
    ====
    ఇక, మీ వ్యాఖ్య కూడా ఏందబ్బా ఎక్కడో విన్నట్టుంది.

    ReplyDelete
  17. వేలు, వేవేలు, లెక్కలేనన్ని, పాలపుంతల
    పలుచుక్కల నడుమ ఆకాశం ఒక్కటే.
    భాష, వేషం, రంగు, రూపు
    భిన్నస్వరాల ఏకీభావం ఒక్కటే.

    ప్రపంచ మానవాళికిది మహత్తర సందేశం

    సంకల్పం,క్రుషి, దీక్ష,దక్షత, పట్టుదల, తగు పాళ్ళలో కలిపి కరిగించి మూస పోయగా తెలుగు బ్లాగ్లోకానికి అందిన వుషఃకిరణమా! అందుకో నా యీ అభినందన. ప్రపంచ తెలుగు సాహితీ నందనాన మరువంపు సిరిగ గుభాళించు.
    యిదే నా అభినందన,యిదే నా శుభ కామన. ...ఆశీస్సులతో......హితైషి,,,,,,,,,,,,,,నూతక్కి

    ReplyDelete
  18. ప్రెజెంట్ మేడం.. క్లాసుకు రాకుండా హాజరు వేయించుకొనే మార్గమేమన్నా వుందేమో..కొద్దిగా చెప్పరూ :)

    ReplyDelete
  19. @ విజయమోహన్ గారు, చిన్నమాటల్లో మీ పెద్దరికం కనపరుస్తారు. ధన్యవాదాలు.

    @ నూతక్కి వారు, చాలా సంతోషమండి. మీ వాత్సల్యం మరువలేను.

    నమస్సులతో,
    ఉష.

    ReplyDelete
  20. @ భావన, తృష్ణ, సునిత, థాంక్స్.

    భావన, నీ వ్యాఖ్య చూసేసరికి రానా మాననా అన్నట్లున్న ఆ కొంచం నిద్ర పారిపోయింది. అవధి లేని ఆనందం. నాకూ కళ్ళు చెమర్చాయి.

    మీ ముగ్గురి ప్రేమపూరిత ఆలింగనం ఆపేక్షగా అస్వాదిస్తున్నాను. ఆ చప్పట్ల ఆలాపనలో మునిగితేలుతున్నాను.

    ప్రియసఖులారా, నెనర్లు.

    ReplyDelete
  21. @ నేస్తం, మనమొకసారి ఒప్పందం చేసుకున్నమని గుర్తు - మీరా మాట అననని :) దగ్గరగా వుంటే చెవి మెలేసేదాన్ని. హన్నా నన్ను మునగచెట్టు ఎక్కిచ్చేద్దామనే ఇదంతా...

    @ ప్రియ, ఈ పైన వ్రాసిన మాటే మీకూను... ;)

    ReplyDelete
  22. @ వేణు గారు, ఏమనాలా అని ఇంతదాక ఆలోచిస్తూనేవున్నాను. నేను అతి సామాన్యురాలిని, అదీ కాదంటే ఏ చెట్టూ లేని చోట ఎదిగిన ఆముదం చెట్టుని కావొచ్చు. ;) తోట పని, ధ్యానం, నృత్యం, వంట ఈ నాల్గు నాకు ఒకేరకమైన విశ్రాంతి, మనశ్శాంతి కలిగిస్తాయి. తోటపనిలో తనచేయి ఎక్కువగా పడుతుంది. కనుక ఇవన్నీ సాధ్యం. అసలు విషయం చెప్పనా. నాకు నిద్ర అంటే అసలు పడదు. ఇక దేముడితో వాదనలే కానీ కుమ్మక్కులుండవు. అదెందుకు, ఇదెందుకు అని ఆయన్ని ప్రశ్నిస్తూ గడుపుతాను. నేను అమావాస్య అర్థరాత్రి పుట్టానట. అరికాల్లో పుట్టుమచ్చ. ఈ మూడు కలిసిన వారిలాగే వుంటారేమో వాకబు చేద్దామాండీ? ;) నెనర్లు.

    ReplyDelete
  23. @ కుమార్ గారు, మీరు ఆ మాట మీదనే వ్యాఖ్య వ్రాస్తారని నాతో నేనే పందెం వేసుకున్నాను. నన్ను గెలిపించినందుకు నెనర్లు మిత్రమా!

    @ భా. రా. రె, గైరు హాజరు అయితే ఏమిటి అన్నది ఒకసారి ప్రయత్నించండి. వద్దురా బాబు ఇదే బెటరు అనుకుంటారు. ;)

    ReplyDelete
  24. @ రవి గారు, మీరంత దూరానవుండిపోయారు. ఇక్కడి నా మోమున నవ్వు విరబూయిస్తున్నారు. అస్లు మీరు కవులుగా, నేను కథకురాలిగా మారిపోవటం బహు చిత్రం. మీ చక్కని అభినందనకి నా హృదయపూర్వక ధన్యవాదాలు.

    @ పద్మార్పిత, I feel so honored for all the +ve feedback on this work so far.

    ReplyDelete
  25. @ సృజన, వినిపించాయి వీనులవిందుగా ఆ కరతాళధ్వనులు. ;)

    @ చంటి, ఈ పిలుపే పొదుపుగా తేలిగ్గా వుంది, గీతాచార్య! ;)

    మీ చిరు కవిత స్పందన, విశ్వకవిని తలపుకి తెచ్చింది.

    Where The Mind is Without Fear

    WHERE the mind is without fear and the head is held high
    Where knowledge is free
    Where the world has not been broken up into fragments
    By narrow domestic walls
    Where words come out from the depth of truth
    Where tireless striving stretches its arms towards perfection
    Where the clear stream of reason has not lost its way
    Into the dreary desert sand of dead habit
    Where the mind is led forward by thee
    Into ever-widening thought and action
    Into that heaven of freedom, my Father, let my country awake.

    -- Rabindranath Tagore

    ReplyDelete
  26. @ ప్రదీప్, సమయానికి గుర్తు చేసారు. ఆ విశ్వంభర అనుకుంటూనే చదవలేకపోతున్నాను. ఆనంద్ పంపిన కృష్ణపక్షం పూర్తికాగానే ఈ రచన కూడా ఎక్కడైనా పి.డి.యఫ్. గా లభ్యమైతే చదువుతాను.

    ముందే చెప్పాను కదా, విలాపాల నుండి వ్యధకి లోనయ్యాక, ఇలాంటి లోకామొకటీ వుంటే బాగుండునని అంతే!!!!! అయినా మీరంటే అభిమానం యికపై ఈకలు పీకనన్నారు, భావ్యమా, అసలే కష్టకాలం, చలికాలం, ఇలాంటి ప్రశ్నలేసి ఇంకా వణుకు పుట్టిస్తారా నాకన్నా బాగా వెనగ్గా పుట్టి మరీ? ;)

    ReplyDelete
  27. SRRao, తాడేపల్లి గార్లకు, స్వాగతం. ధన్యవాదాలు.

    తాడేపల్లి గారు, kamakoti.org వారి రచన ప్రామాణికంగా వ్రాసాను కాని, ఈ ఒక్క ముద్రారాక్షసం చోటుచేసుకోవటం తప్పిదమే. కారణాలు వెదకను, సమయానికి మీరు సరిదిద్దినందుకు కృతజ్ఞతలు. మునుపొకరు ఇలాగే వచ్చి అచ్చుతప్పు దిద్దారు కాని మళ్ళీ రాలేదిటు వైపు [కారణం చెప్పి వెళ్ళారు]. మీరు అలాకాక మళ్ళీ మళ్ళీ రావాలి సుమా! ఇంకా బాధ్యతాయుతమైన రచనలకి మీ అందరి ప్రేరణ అవసరం.

    ReplyDelete
  28. @ చదువరులు, నిశ్శబ్దపాఠకులకు, నా నమస్సులు. మీ అందరు వస్తుంటారని నా సూచిక చెప్తూనేవుంటుంది. :)

    ReplyDelete
  29. "లోకాస్సమస్తా స్సుఖినో భవంతు"
    ఈ పదం ప్రతి ఒక్కరి గుండెల్లో వేదంలా మారుమ్రోగేలా అద్భుతంగా రాశారు!
    ఉషాగారు ,చివరి పేరా చదువుతున్నప్పుడు ఎంత ఉద్వేగానికి లోనయ్యానో మాటల్లో చెప్పలేను .

    ReplyDelete
  30. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ: పరిమళం గారు, నాకీ సంకల్పాన్నిచ్చిన దైవాలకు ప్రణమిల్లుతూ మీ వ్యాఖ్యకి మరింత ఉత్తేజపడుతూ - మీ ఉష

    ReplyDelete