చెవులారా, కనులారా, మీకూ చెప్పేయనా?

  1. కరణం గారి కొబ్బరి కారం [విన్నది]
  2. పంతులు గారి పడక్కుర్చీ [వున్నది]
  3. సాములోరి పట్టుపంచె [కన్నది]

నా చిన్ని చిన్ని కథల్లో కాదు కాదు నిజ జీవితానుభవాల్లో మీరూ కాసిని నవ్వులు వెదుక్కుని, మరికొన్ని నాకు కొన్ని పంచుతారని...

ఈ మధ్య లాఫింగ్ థెరపీ గురించి చదివి చదివి నాదీ ఓ చిరు ప్రయత్నం :)

కరణం గారి కొబ్బరి కారం

సాక్షాత్తు రామచంద్రుడంటటి దేముడని మంచి పేరున్న మా సర్జన్ మావయ్య చిన్నతనంలో మహా ఆకతాయట. మాంసాహార ప్రీతి, ఆటల ప్రియుడు. ఆయనకి తోడు పెద్ద కరణం [ఎందులో పెద్దో మరి? ] గారబ్బాయి, చిన్న కరణం.

ఆటల్లో పడి ఓ సారి వాళ్ళింటికి వెళ్తే, కరణం గారి భార్య మావయ్యని "నీసు తింటాడు, లోనికి రానీకు" అని అన్నారట. మరి అందుకు ప్రతిజ్ఞ పూనాడేమో!!!!!

అమ్మమ్మ గారు చేసిన కైమా వుండలు మునుపు కన్నా త్వరగా ఖాళీ అవుతున్నాయని వంట చేసే చిన్నాలమ్మ గారిని అడిగితే ఆ "శర్మ గారి పిల్లాడు" సగం తినేస్తున్నాడన్నారట. అర్థం అయిపోయిందా మా మావయ్య నిర్వాకం? కరణం గారి బుడ్డోడికి కి "కొబ్బరి కారం" అని చెప్పి, మీరు లౌజులు [బెల్లం + కొబ్బరి కోరు కలిపి చేసే వుండలు] తిన్నట్లే మేము కొబ్బరి+కారం కలిపిన వుండలు తింటాం అని రుచి చూపించాడన్నమాట. :)

చిన్న కరణం గారు ఇప్పటికీ మా వయ్యారి [పెద్దగా చెప్పనవసరం లేదు] ఇంట్లో అవి వండించుకుంటుంటారట. ఆయనకి వాటిని కొబ్బరికారం అనటమే ఇంకా అలవాటుట.


నిజానికి నన్నూ అలాగే మోసం చేసారు మావయ్య, అమ్మ కలిపి. కోడిగ్రుడ్డు పురటు ఇది "బీరకాయ పాలకూర" అని పెట్టేవారు. నాకు చాలా సంవత్సరాలు నిజం తెలియనీలేదు. కనుక ఆ కరణం గారు, నేను..... మాకు మల్లే ఇంకెందరో.

*** *** *** *** *** ***

పంతులు గారి పడక్కుర్చీ

ఇందులో హీరో మా నానీ గాడు. మా అన్న వాడు. నేను వున్నాను కనుక కాస్త సాగదీస్తాను ఈ కథనం. నా పేరు మార్చి కాసేపు "బుజ్జి" అని పెడదామా?

"బుజ్జీ! చెప్పింది గుర్తుంది కదా?" ఈ మాట నాని ఇప్పటికి చాలా సార్లే అడిగాడు. "ఊ" బుర్ర గబగబా ఆడిస్తూ "భయంగా వుందిరా" అన్నాను.

"అదిగో ఆ పిరికితనమే నాకు చిరాకు", బాలభారతం లో దుర్యోధనుడి పాత్రకి వీడు బాగా సరిపోతాడు. నేనేదో అనబోయేంతలో "పాపగారు అమ్మగారు పిలుత్తున్నారండి" అంటూ వచ్చింది సీతాలు.

చేతిలో పుస్తకాలు అక్కడే చాప మీద పెట్టి, లోపలికి తనవెంట నడిచాను. వెనకనుండి నానీ చప్పట్లు కొట్టి పిలిచి "ష్ గప్ చుప్" అని సైగ చేసాడు.

అమ్మమ్మ గారు పెద్ద లోటా గ్లాసులో పాలతో సిద్దంగా వున్నారు. "రా రా మళ్ళా ఆ పంతులు వస్తే గంట దాకా వదలడు. అర్భకపు పిల్లవి, నీరసపడతావు, తాగేయ్" అని ఇచ్చారు.

"ఇది మెతకే మాట వింటుంది, వాడే తుంటరి" ఈ మాట రోజూ అంటారు. "నువ్వు మా బంగారుకొండవి" అని వాడికీ చెప్తారు. ఆవిడకి మాటకారి అని పేరుట.

వాడు ఫోర్త్, నేను సెకండ్ క్లాస్. నాన్నగారు ఉద్యోగం చేసేచోట ఏదో గొడవలని అమ్మతో పాటుగా ఇక్కడికి పంపేసారు. అమ్మ మళ్ళి వెళ్ళిపోయింది. మేమిక్కడ వుండిపోయాం.

"కాన్వెంట్ చదువులు ఇక్కడ కుదరవు" అన్న అమ్మమ్మ గారు ఓ రోజు వెంకటరత్నం మాష్టారి దగ్గర ట్యూషన్ మొదలుపెట్టించారు. ఆవిడంటే వున్న భయం తో ఏమీ అనలేకపోయాము.

"ఏ ఫర్ యాపిల్" నుండి మొదలు పెట్టి "అకారకారముల ఆ" అంటూ సాగదీస్తూ ఓ గంట బాధపెట్టి ఆయాసపడుతూ వెళ్ళేవారు. హాయిగా పడక్కుర్చిలోకి వాలి కూర్చుని, మమ్మల్ని మాత్రం ఆ గంటా చాప మీద బాసిపెట్ల వేయించి కూర్చోబెట్టేవారు.

ఆయన్ని చూస్తే అమ్మమ్మ గారు మాకు పంపే బియ్యం బస్తా గుర్తొచ్చేది. సోడాబుడ్డి కళ్ళద్దాలు, చేతిలో రూళ్ళకర్రొకటి. ట్యూషన్ మొదలుపెట్టిన రెండో రోజే నానిగాడిని రెండు దరువులు పడ్డాయి.

వాడందుకున్న రాగానికి అమ్మమ్మ గారు వంటింట్లోంచి మజ్జిగ కవ్వంతో సహా వచ్చి "ఏమయ్యా పంతులు, పిల్లలకేదో పాఠాలు చెప్తావని రమ్మంటే ఇలా బాదుతావా? మా ఇళ్ళ సంగతి ఎరగవా?" అని అవేశ పడే సరికి దానికి పనిపడలేదు. కానీ నానీ, అదీ మేనమామ సాలు వచ్చిన మా అన్నీ గాడికి పగ రగలటం మొదలైపోయింది.


ఆయనకి కుక్కలంటే భయమని, దారంటా వాటిని అదిలించటానికే అది పట్టుకొస్తారని, ఆదివారం చర్చికెళ్తూ కూడా మరిచిపోరని సీతాలు కొడుకు వెంకన్న గోళీలాడేప్పుడు నానీకి చెప్పాడట. నానీ గాడి బుర్రలో మాంచి పథకం వచ్చేసింది.

వినగానే "అమ్మో" అన్నాను. "నా మాట వింటే ఆ నెల నా పాకెట్ మనీ నీకే ఇస్తాను" అన్నాడు. కాస్త లొంగాను. జాతి లక్షణం. "అమ్మమ్మ గారికి తెలిస్తే.." నా మాట వెంటే "తెలిస్తే కదా" వాడి గొంతులో ధీమా. నాకు సరదా వేసింది. ఆయనంటే నాకూ కాస్త విసుగ్గానే వుంది. వామనగుంటలు, వైకుంఠపాళీ ఆడే టైం తగ్గిపోయిందని. నానీ నాకు మాష్టార్ని భయపెడతా అని మాత్రం చెప్పాడు.


ఈ రోజే పథకం అమలు. నాకు భయం, కంగారు. జడలు వేయించుకుని, పూలు పెట్టుకుని ముందు వసారాలోకి వస్తూ జిప్సీ గాడి గదిలోకి తొంగి చూసాను. నానీ బిస్కట్స్ తినిపిస్తూ ఏదో చెప్తున్నాడు. వీడు రెండో జిప్సీ. అలా మా ఇంట్లో తరతరాల శునకవంశం వర్దిల్లింది. మన మాటలు చక్కగా అర్థం అవుతాయి.

నా పనల్లా నానీ ఏమి చేసినా చూసి వూరుకోవటం, అమ్మమ్మ గారు అడిగిన దానికి నాకేమీ తెలియదని చెప్పటం. ముందుకి వచ్చేసి చాప మీద కూర్చున్నాను. నానీ వాడివెంట జిప్సీ వచ్చారు. ఆసమయానికి దాన్ని కట్టేసి వుంచటం అలవాటు. అల్సేషియన్ కనుక కాస్త భీకరంగా కూడా వుంటుంది.

"సీతాలు" అంటూ ఆయన రానే వచ్చారు. రైలింజన్ కూతంటి ఆ కేకకి అర్థం నా పాల గ్లాసుకి డబల్ వుండే లోటాలో చిక్కటి కాఫీ తెమ్మని. అమ్మమ్మ పూజలో వుంటారారోజు ఆ టైంకి. సీతాలు ఎందుకో పలకలేదు. ఆయన జిప్సీని చూస్తూనే ఆగి పోయారు.

"సీతాలు" ఈ సారి ఆయనన్నది ప్రక్కనున్న నాకే వినపడలేదు. "రండి మాష్టారు" నాని చాలా మర్యాదగా పిలిచాడు. అడుగులో అడుగేస్తూ వస్తున్న ఆయన చేతిలో కర్ర చూస్తూనే జిప్సీ గాడు గుర్రుమన్నాడు.


"ఆ కర్రనలా పడేయండి" నాని గాడి గొంతులో ఈసారి అధికారం.

నిదానంగా కుర్చిలో సర్దుక్కూర్చోబోయి ఉన్నపళాన లోపలికి కూరుకుపోయారు. ఆ కుర్చీ కర్ర తీసేయటం కూడా నాని పనన్నమాట. ఇంతలో జిప్సీ చెంగున ఎగిరి ఆయన పొట్ట మీదకెక్కి , గుండెల మీద కాళ్ళు పెట్టి కూర్చుంది.

"నానీ, దీన్ని కాస్త దింపు నాయనా!" చాలా దీనంగా అడిగారు. వాడు విననట్లే వూరుకున్నాడు. నాకే జాలేసి జిప్సీ గాడిని దింపి గదిలో పెట్టేసి వచ్చి, ఆయనకి చేయి అందించి లేపాను.

కళ్ళజోడు సర్దుకుంటూ, ఒకటే పరుగు ఆయన. చేతికర్ర కూడా మర్చి పోయారు. అప్పుడు మొదలుపెట్టాం నానీ,నేను నవ్వులు. కుర్చీ సర్దేసి అమ్మమ్మగారి పూజ అయ్యాక "మాష్టారు" రాలేదు అని చెప్పాం.


ఆ రోజు నుండి ఈ రోజు వరకు ట్యూషన్ చెప్పటానికి మాత్రం రాలేదు. అలా ఎలా జరిగిందో తెలియదు కానీ ఆయనకి నేను మంచిదాన్నని మాత్రం నమ్మకం బలపడిపోయింది.

పోయినేడు కూడా "ఉషమ్మ వచ్చిందట" అంటూ వచ్చి పలకరించి వెళ్ళారు. "బుజ్జి బంగారు తల్లి. " :) నానీగాడు మాత్రం నమ్మకద్రోహి. అన్నమాట తప్పాడు. నాకు వాడి పాకెట్ మనీ ఇంతవరకు ఇవ్వలేదు. అదీ మన జాతి లక్షణమే కాదా?


*** *** *** *** *** ***

సాములోరి పట్టుపంచె

మా బిజ్జు గాడు అంటే యువ, మూడో తరం నరసింహనాయుడన్నమాట. ఆయన గారి ఘనకార్యం ఈ మూడో ముచ్చట. పూజలు, ఆచారాలు ఎక్కువగా పాటించే వారొకరు, దేముడుకి దణ్ణం పెట్టుకునే సమయంలో వీడిని విసుక్కున్నారట.

మర్నాడు మాటేసి, [అప్పటికి వీడికి మూడో సంవత్సరం] ఆయన కళ్ళు మూసుకుని నమస్కారం చేసే సమయానికి వంటి మీద పంచె లాక్కుని బయటకి వచ్చేసాడు మా చిన్ని కృష్ణుడు. పాపం ఆయన సిగ్గుతో బిక్కచచ్చిపోయి ఓ పది నిమిషాలకి నిదానంగా "అమ్మాయ్ అమ్మాయ్" అని పిలిచి చెప్పలేక చెప్పలేక చెప్తే, నేను నవ్వీ నవ్వీ నవ్వలేక ఆయన కో తువాలిచ్చి రక్షించాను ద్రౌపదీవస్త్రాపహరణం లో కృష్ణుని మాదిరి. అదీ మా ఇంటి మేనమామ పోలిక.


ఎలావున్నాయీ వూసులు? చేపల వాసన వదిలించుకుందామని కాస్త ఈ నవ్వుల ప్రయత్నం.

నవ్వితే నవ్వండి లేదా మీ దారిన మీరు పొండి.

46 comments:

  1. అన్నీ దొంగ పిల్లి లక్షణాలే... బయటకు మాత్రం ఉషమ్మ బంగారం.. అంతే..

    మూడోది అదుర్స్... గోచీ అపహరణం.. గోపికా రక్షణ.. కలికాలంలో కలియుగ భారతం :)

    ReplyDelete
  2. లాఫింగ్ థెరపీ.....మీ తోటలో పూలే కాదు బ్లాగ్ వనంలో
    నవ్వులు విరబూయించే ప్రయత్నం మొదలుపెట్టారన్న మాట :)

    ReplyDelete
  3. ఒక పెద్ద విజయం సాధించాక, తరువాత రాబోయేదాని మీద అంచనాలు పెరిగిపోతాయి. అప్పుడప్పుడు మనకే ఏ కొత్త ఆలోచనలూ రావు. దాన్ని తప్పించుకోవడానికి మీలాంటి తెలివైనవాళ్ళు ఇలా హాస్యపు బాట (లేదా జరిగిన సంఘటనల మాలిక) పడతారు.
    కధలు (సంఘటనలు) ఎలాగున్నా సరే కధనం మాత్రం బాగుంది. విశ్వామిత్రుని అనుగ్రహం బాగానే ప్రసరించింది మీమీద.

    ReplyDelete
  4. చాల సరదాగా వున్నాయండీ .

    ReplyDelete
  5. మీరు గాలంవేసి చేపలు పట్టడమేగాకుండ అందరికీ చేపలు పట్టమని చెప్పి పట్టిన ఆ చేపల్ని బుట్టలో వేసుకుని ఇప్పుడు చేపల వాసనంటారా? హమ్మా!
    :) నవ్వించే కళను కూడా ప్రదర్శించారన్నమాట.

    ReplyDelete
  6. బాగున్నాయి మీఇంటి మేనమామగారి పోలికలు !
    మీకు మరీ ఎక్కువగా వచ్చినట్లున్నాయ్ ! :)

    ReplyDelete
  7. అప్పుడప్పుడయినా ఇలాంటి సరదా విషయాలు మాతో పంచుకోండీ ఉష గారు...బాగున్నాయి...

    ReplyDelete
  8. ఉష గారూ చాలా బాగున్నాయ్ అన్నీనూ మరి ముఖ్యం మూదోదండి ........

    ReplyDelete
  9. మీరు మరీనూ, పాపం పెద్దాయనకి పంచూడితే నావ్వాపుకుంటారా? అయితే నవ్వనన్నా నవ్వాలి, గియితే గంభీరంగానన్నా ఉండాలి కానీ ;-)

    కొంచం ఎక్కడెక్కడో తొలిచేస్తోంది. అల్లరి పిల్లాడు బయటకొస్తున్నాడు. నాదమ్తా ఒక ప్రత్యేకమైన తరహా అల్లరి. టెక్నికల్‍గా ఉంటుంది. కాస్తిక్కడోలుక్కేస్తే మీరూ నవ్వుకోవచ్చు. అన్నట్టిది మీరు మమ్మల్ని నవ్వించినందుకు ఓ చిన్న బహుమతి. అప్పట్లో నాకు ఇంకా వ్రాతలో పద్ధతులన్నీ పట్టుబడలేదు. అందుకే కొన్ని narration లోపాలున్నాయి. అవొదిలేస్తే మీరే అంటారు ఇదో స్పెషల్ అల్లరని.

    http://gitasrujana.blogspot.com/2008/08/blog-post_03.html

    ReplyDelete
  10. భలే!భలే! చక్కటి చిలిపి వారసత్వం గత మూడు తరాలుగా, ఇంకా మంచి సరదా కబుర్లు రాయండి. కలిసి నవ్వుకుందాము.

    ReplyDelete
  11. బాగుందండి. మీరు కవితలే కాకుండా చక్కటి వచనాలు కూడా రాస్తారు. కొంత కాలం ఇలాగే రాయొచ్హు కదా! ఇది చదవగానే హాయిగా నవ్వుకొని, మూడ్ మామూలై పోయింది.

    ReplyDelete
  12. హ హ బాగున్నాయండీ మూడు సంఘటనలూ నవ్వు తెప్పించాయి :-)

    రెండవదానిలో మాత్రం నాకు I am a very good girl అంటూనే నానా అల్లరీ చేసే లిటిల్ సోల్జర్స్ బన్నీ(బేబీ కావ్య) గుర్తొచ్చింది :-) ఆ సినిమాలో కూడా పక్కింటి బబ్లు మీదకి అన్నాచెళ్ళెల్లు ఇద్దరూ కలిసి కుక్కని తోలే సన్నివేశం ఉంటుంది.

    సినిమా మీకు గుర్తుండే ఉంటుంది, లేదంటే ఇక్కడ ఓ లుక్కేయండి :-) http://www.youtube.com/watch?v=mOiXWbo9w38

    ReplyDelete
  13. వుషా !,
    నా చిన్ననాటి గ్నాపకాల పుటలు తిప్పే పనికల్పించావు.,ఎన్ని అల్లర్లు,ఎన్నెన్నిగొడవలు.....నీవు రాసిన అన్ని సంఘటనలూ బాగున్నాయ్., సరదాగా నవ్వించావమ్మాయ్ .. చాల ఈజ్ వుంది నీ కధనంలో.త్వరలో ఓహాస్య కధా సంకలనం చూడ బోతున్నామనమాట.ఆల్ ద బెస్ట్.
    చిన్నప్పటి అల్లర్లు మాతో పంచుకొన్నందుకు సంతోషం.......అభినందనలతో నూతక్కి

    ReplyDelete
  14. భా.రా.రె. అవును సుమీ చాప క్రింద నీరు అనుకోండి. :) మీ వ్యాఖ్య ఉత్తరార్థం బాగుంది. అక్కడా మీ పదబంధం తొణికిసలాడుతుంది.

    ReplyDelete
  15. పరిమళం, చిన్ని, సుజ్జీ, ఏదో వూసుపోని వూసులు. ;) అలా కూర్చుని ఆలోచిస్తుంటే గుర్తుకువచ్చాయి గడచిన జీవితంలోని హాస్యపూరిత ఈ అనుభావాలు. మిమ్మల్ని అలరించినందుకు థాంక్స్.

    ReplyDelete
  16. ప్రదీప్, యధాలాపంగా చేసిన ఈ చిరు ప్రయత్నానికి అంత అర్థం వుందన్నామాటే? ఏమిటో మీ అంత తెలివితేటలు ఎప్పుడు వస్తాయో ఏమో. ఎంతైనా నా భాగ్యసీమ ఈ మరువం, బంగారం పండిస్తోంది. :) మీ వంటివారి వ్యాఖ్యల కాసులూ రాలుతున్నాయి. దీపావళీ వైభవలక్ష్మి దీవెనలివి!!!!!!!

    ReplyDelete
  17. విజయమోహన్ గారు, మరి మీరు "హమ్మా" అని అదిలించి ఆర్నెల్లాయే, ఏదో కాస్త కదలిక తెద్దామని, మీతో ఇలా ఓ తారాజువ్వ మా వూరికి పంపిద్దామని ;)

    ఆ చేపల గంప మార్కెట్లోనే వదిలేసాగాండి? నాకు మిగిలింది సంబరం మాత్రమే.... :)

    ReplyDelete
  18. చైతన్య, మీ తొలి చిర్నవ్వుకు నాదీ అదే బదులు. ;)
    తొలి అడుగు గారు, ఏమిటో మీ తొలి అడుగు నా స్వతహా బాణీ కాని ఈ హాస్య వల్లరి మీద పడింది :) నాది నిజానికి కవితా వనం. మరి మళ్ళీ వచ్చి నాల్గు కవితలు చదివి వెళ్ళండి. నెనర్లు.

    ReplyDelete
  19. భలే!భలే చాలా బాగున్నాయ్ సరదా కబుర్లు

    ReplyDelete
  20. " మీ అంత తెలివితేటలు ఎప్పుడు వస్తాయో ఏమో " - పొగిడినట్టా తెగిడినట్టా ...

    ReplyDelete
  21. ఆదివారం చర్చి కి పాల్ వెళతాడు గాని పంతులుకు ఏం సంభంధమో అర్ధం కాలే?మొత్తానికి మీరు చుపా రుస్తుం .

    ReplyDelete
  22. చైతన్య, మీకు కూడా నా నుండి అదే సమాధానం :)
    @ తొలి అడుగు, ప్చ్, మీ తొలి అడుగు నా స్వతః సిద్దమైన కవితల్లో కాక ఈ అరువు గడ్డ మీద వేసారా? మరి మళ్ళీ రావాలి, కవితల మీద వ్యాఖ్యానించాలి సుమీ!

    ReplyDelete
  23. గీతాచార్య, మీ లోతైన సునిశిత హాస్యం అర్థం చేసుకోవటానికి ఆ కథ కోసం ఈ వారాంతం కేటాయించాను. ఇక్కడ కామెంటినందుకు థాంక్స్!

    ReplyDelete
  24. @సునిత, జయ, నేస్తం, ప్రయత్నిస్తాను కానీ ఇలా నిజ జీవితానిభవాలే నేను వ్రాయగలను. కల్పన జోడించటం కష్టం. సరదా సరదా అంతా నవ్వుకోవాలనే ఈ కథనం. నెనర్లు.

    ReplyDelete
  25. మరువంలో నవ్వుల ఉషాకిరణాలు.

    అయినా చివరి కొటేషం చేపల వాసన అనడం బాలేదు నాక్కూడా.

    ReplyDelete
  26. Hahaha. A very good laugh when tred with work. I like the third...

    ReplyDelete
  27. Revisited. ;-) నెలకోటైనా ఇలాంటివి రాయకూడదు... మీకెలా కావాలో అలా అర్థం తీసుకోండేఁ :-D

    ReplyDelete
  28. మాలా గారు, నాకూ చాలా ఆశ్చర్యమేనండి ... ఆహార్యంలో వాళ్ళ ముగ్గురికీ భలే పోలిక, మావయ్య ఎరుపు, అన్న, యువ తెలుపు తప్పితే పడగ వంటి ఆ వెన్నుపట్టు, నడక, కొంతవరకు నడత అన్నీ పోలికలూ దిగాయి. కాకపోతే నాకు బాగా ఆపుతురాలైన మా ప్రియమైన మావయ్య భార్య/అత్తయ్య మట్టుకు "అన్నీ మీ మావయ్య పోలికలే నీకు, ఖాళీగా కూర్చోలేవు. పనే మీకు వూపిరి" అని. వారానికి 150 సర్జరీల నుండి 35 తగ్గినా, ఆయన పని తీరు, నిబద్దత, నిజాయితీ ఈ 40+ సం. గా మారలేదు. నాకూ ఆ అంకితభావం వస్తే చాలు.

    ReplyDelete
  29. అదేంటి నా ప్రశ్నకి సమాధానం ఇవ్వలేదు ?

    ReplyDelete
  30. శేఖర్ పెద్దగోపు, ఇక్కడ జరిగిన పెద్ద కుట్ర మీకిప్పటికి అర్థమైందనుకుంటాను. ;)

    నా బ్లాగులో మీ చేత కామెంటించటానికే ఈ కబుర్లు. లేకపోతే మరువాన్ని మరుస్తారా ఎవరైనా .... :)

    నెనర్లు.

    ReplyDelete
  31. నూతక్కి వారు, సంతసం, ధన్యులం. నా ప్రయత్నం సఫలం.

    ReplyDelete
  32. వేణూ శ్రీకాంత్, అదే కదా నా బాణీ, కాస్త కుదురు, కాస్త ముదురు... ఇది నిజంగానే జరిగింది నా చిన్నతనంలో, నమ్మండి బాబోయ్. పోతే అది జరిగిన ఒక వారంలోపే మావయ్య వెనక నానీ, నేన్ను, నేను ముందు అంటే నేను ముందని పరిగెడుతుండగా, మామూలుగా ముందుండే నేను కాస్త వెనక పడ్డాను. మా ఇద్దరికీ మధ్య ఒక పిచ్చి కుక్క వచ్చి వాడ్ని కాటేసింది. :) అమ్మో బాబో అంటూ బొడ్డు చుట్టూ 14 షాట్స్. అది మాస్టారి శాపం కావచ్చు... ;)

    ReplyDelete
  33. రవి గారు, మీరు వెనగ్గా వచ్చారా లేదా. మరి ఆగరా ఏమి మీ వంతు వచ్చేవరకు :)

    నిజంగానే ఆయన పేరు అదే. ఆయన చర్చికి వెళ్ళటమూ నిజమే. ఆయన తరంలోనే వారు మతమార్పిడి చేసుకున్నారు. నిజానికి వాళ్ళ పాప పేరు "పద్మ".

    ఇక మరో కథ. మావూర్లో ఆర్.యెం.పి. డాక్టర్ సాయిబు గారు. మా వాళ్ళందరికీ అంతవరకు వున్న డాక్టర్ గారికి సత్యనారాయణవ్రతం జరిపినప్పుడే సం. ఫీజ్ కానుకలుగా చదివించటం అలవాటు. ఈయన గారు మొదటి సం. ఆ వారా దెబ్బ తిన్నారు. మరుసటి ఏడు "ఎక్స్ ఎక్స్ ఎక్స్" అనబడు "సత్యనారాయణవ్రతం" జరుపుకుంటున్నాను కనుక, మీరంతా రావాలి అని సదరు హుస్సేన్ గారు ఆహ్వానం పంపారు. జనాలకి అప్పుడు సరీగ్గా పద్దతి తెలిసింది. అది నేను చాలా రోజులు దాచాను. ఈ మధ్యే చాలా కాగితాలు క్లీన్ అప్ లో పోయాయి. :)

    కనుక పేర్లు చూసి పడకండి. సిడ్నీలో "స్వామి రెడ్డి" అనే ఫిజీ ఇండియన్ వుండేవారు, వారి పూర్వీకులంతా ఉత్తరాది వారే, ఆ పేరు నచ్చి పెట్టుకున్నారట.

    ReplyDelete
  34. కుమార్ ఎంత మందికి కోపం వస్తుందా అని చిన్న పింగ్/పల్స్ చెక్ అది. అందులో తప్పేముందండి అసలు? ఇక జలపుష్పాభిషేకానికి శుభం/సమాప్తం అంటే ఏమీ అనరు కానీ అదే ఇలా జనభాషలో వాడితే ఘోషిస్తారా ఏమి.. Just take it easy, I have all respect for my compilation and you all. Words mean nothing for the regard/honor I got for it at all. Those umpteen hours I pour in to it must tell it all.

    ReplyDelete
  35. @ Srujana, Thanks.

    @ Gitacharya, I might try but not so often

    @ Pradeep, no comments :)

    ReplyDelete
  36. రవి రాగానే ఉషాకిరణాలు వచేస్తాయి కదా యి రోజేంటి యి మబ్బులు అని అడిగా మొత్తానికి మబ్బులు వీడి నా సందేహం తీరి మీ సమాధాన ప్రేరణ తో'' నాయుడుచౌదరిశర్మ'' అర్ధం కాకపొతే మీ ఖర్మ వుప శీర్షిక తో వొక కొత్త బ్లాగ్ ఓపెన్ చేస్తే ఎలా వుంటుందా అన్న ఆలోచన వచ్చేసింది .

    ReplyDelete
  37. రవి గారు, నిన్న సాయంత్రం నుండి నాకు ఇంటెర్నెట్ సర్వీస్ లేదు. ఇపుడే రెస్యూం అయింది. సరేనా. ఇకపోతే ఉదయపు ఉషాకిరణాలే కాదు, వెన్నెల కాంతుల వేళల కూడా నా సమాధానాలు వస్తాయి. స్వామిరెడ్డి గారికి ఈ క్రొత్త పేరు పంపుతాను ఆయన వారసులకెవరికైనా పెడతారేమో! మీ బ్లాగులు మీ ఐఛ్ఛికం. ఇక ఈ టపాని వదిలి విశ్వామిత్ర చదివిరండి. :)

    ReplyDelete
  38. వేణు, మీరిచ్చిన లింక్ లో పాట ఇప్పుడే చూసాను. చాలా థాంక్స్. చాలా రోజులైంది కానీ పాట గుర్తే - చిత్రీకరణ మళ్ళీ గుర్తు చేసారు. నేనూ నాన్న కూతుర్నే. ఆయన కోసం అలా గుమ్మంలో వేళ్ళాడి, రాగానే అందరి మీద పిత్తిరీలు చెప్పేదాన్ని. అన్నయ్య పి.టి. ఉష అంటే "పిత్తిరీల టాంక్ ఉష" అని ఏడిపించేవాడు. ఒక్కోసారి నేనే ఓ దెబ్బ వేసేసుకుని వాడి మీద నెపం పెట్టేదాన్ని అందుకే మిగతా వారికి నేనంటే హడల్. :)

    ReplyDelete
  39. "ఒక్కోసారి నేనే ఓ దెబ్బ వేసేసుకుని వాడి మీద నెపం పెట్టేదాన్ని" హహ హ హ :-D మీరు సూపరంటే సూపర్ అంతేనండీ ఇంకో మాట లేదు... పాపం మీ నాని అన్నయ్య :-)

    మా ఫ్రెండ్ కూతురు వైష్ణవి ని గుర్తు చేశారు. తనకి రెండేళ్ళపుడే వాళ్ళన్నయ్యకి చిత్రమైన ఐడియాలు ఇచ్చేది. సోఫాపైకి ఎక్కి దూకడం లాంటివనమాట.. చెప్పి తను ముందుగా సైలెంట్ గా దూకేసి పక్కన నుంచుని చూసేది, పాపం వాడేమో తర్వాత హె.. అని అరుచుకుంటూ దూకి వాళ్ళ అమ్మకో నాన్నకో దొరికి పోయి దెబ్బలు తినేవాడు :-)
    తను ఇచ్చిన జోల్ట్ లు ఇంకా ఇక్కడ చూడచ్చు...
    పైనాపిల్ , బుడుగులు

    ReplyDelete
  40. Rendodi Super

    Okati Moodu maatram ...paapam :-)

    ReplyDelete
  41. వేణు గారు, వాడి మీద అంత జాలి పడనవసరం లేదండి. నాన్నగారు కాంప్ కెళ్ళిన రోజుల్లో కాల్చుకు తినేవాడు. అలాగే మాకు ప్రతి నెలా చాక్లెట్స్ కోటా వుండేది. వాడివి దాచేసుకుని, నా దగ్గర చాలా దీనంగా అడుక్కున్నంత పనిచేసి, నావీ సగం నొక్కేసి, కిక్కిక్కి అని నవ్వుతూ వాడి డబ్బా బయటకి తీసేవాడు. ఎన్ని మంగమ్మ శపథాలు చేసుకున్నా జాలిగుండె కారణంగా మళ్ళీ మళ్ళీ మోసపోయేదాన్ని. అసలే మా కాన్వెంట్ వూరుకోరు అంటే హోంవర్క్ రెడ్ ఇంక్ పెన్ తో మార్క్ చేసేసేవాడు. వాడి ఆగడాలు తట్టుకోలేకే నేనలా చండికావతారం ఎత్తేదాన్ని. లింక్స్ కి థాంక్స్. వీకెండ్లో చూస్తాను.

    ReplyDelete
  42. భావుకుడన్ గారు, మీకు నచ్చినందుకు సంతోషం. రాక రాక వచ్చారు. కనుక మిమ్మల్ని నవ్వించటం నా భాగ్యం. :)

    ReplyDelete
  43. ఉషమ్మ.. బాగున్నాయి వారసత్వపు చిలిపితనపు చేష్టలు... మీ మావయ్య గారు మరీనూ.. పాపం కరణం గారి అబ్బాయి. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కన ఆమె కోడి గుడ్డు అనకుండా అనసూయమ్మ గారు విభూతి పళ్ళిస్తారా అని తీసుకునే వారు.. అది గుర్తు వచ్చింది..
    మీ అన్నయ్య బాగా అల్లరి బ్యాచ్ అన్నమాట.. పాపం మాస్టారు. బుజ్జమ్మ మంచి పిల్ల..;-)
    మీ అబ్బాయి అలా చేస్తే మాత్రం నువ్వు అంత నవ్వాలా మరీను.. పాపం (నేను కూడా నిజానికి నవ్వుతున్నా ఇది రాస్తూ కూడా వూహించుకుని ఆయన బాధ ను) ;-)

    ReplyDelete
  44. @ భావన, ;) మీరో క్రొత్త పేరు చెప్పారు. అన్నయ్య అంతే నేను మాత్రం "మంచి పిల్ల" నే. నిజానికి ఈ టపా వ్రాస్తూ తిరిగి తిరిగి ఎంత నవ్వుకున్నానో? ;)

    @ హరేకృష్ణ, పోన్లేండి శుక్రవారం పూట కాస్త నవ్వించాను. :)

    ReplyDelete