అలవాటు, బలహీనత, వ్యసనం?

మూడిటికీ నిర్వచనాల్లో ఎంత విబేధం వుందని కనుక్కోవాలని అడుగుతున్నాను.

అలవాటు - సాధారణంగా ఇతరుల్ని బాధించకపోవచ్చు. ఇవి మారే తీరువుంది.
బలహీనత - అదివున్న వ్యక్తికే నచ్చపోవచ్చు. ఎదుటివారికీ నచ్చకపోవచ్చు. కానీ దాన్ని తొలగించుకోలేకపోవచ్చు.
వ్యసనం - మొదట్లో ఆనందాన్ని ఇస్తుందేమో కానీ పోగా పోగా నలిబిలిచేస్తుంది.

ఇవి సూక్షంగా వీటిపట్ల నా అభిప్రాయం.

ఇపుడు నేను వేసుకుంటున్న ప్రశ్న, అలవాటు [ఉదాహరణకి చిన్నపుడు పుల్లటి పెరుగే తినే నేను ఇపుడు వాసన కూడా భరించలేను, నా ఇష్టం/అలవాటు ఎపుడు మారిందో కూడా గుర్తు లేదు] మన మనస్తత్వాన్ని బట్టి మారుతుందా? లేక మనం మన్నించేవారో, మన మనసుపడ్డ వారి వలనో మార్చుకుంటామా? వారికనుగుణంగా మనని మనం వత్తిడీ లేకుండానే వారికి నచ్చే రీతిలో మారిపోతామా? మార్పుని మనకు మనమే ఆహ్వానిస్తామా లేక మనం అప్రమేయంగా మారతామా?

బలహీనత - కొన్ని మనకి నచ్చి చేస్తాము, కొన్ని ఎదుటివారికి నచ్చవని తెలిసీ చేస్తాము. మరి కొన్ని మనకు నచ్చక పోయినా మనకు నచ్చే వారిని మెప్పించటానికి చేస్తాము.

కనుక అలవాటు, బలహీనత - వీటిల్లో ఏది త్వరగా వదులుతుంది. అసలు వదిలించుకోలేని అలవాటే బలహీనతగా పరిణమిస్తుందేమో.

ఇక వ్యసనం - దుర్వ్యసనం వదిలేస్తే, అసలు వ్యసనం కూడా వక్రించిన అలవాటేనా - ఒకర్ని బాధించటం కూడా వ్యసనమేనా? అందులో ఆనందం వున్నా లేకున్నా పొరబాటుగా ముదిరిన బలహీనతే వ్యసనమా.

కవితలు వదిలి వచన వేదనలు ఏమిటా అంటారా? మునుపు కన్నా సామీప్యంగా విపులంగా కొంతమందిని గమనించటం మొదలుపెట్టాక, నన్ను బాధిస్తున్న కారణాలకి మూలం మూడేనని అనిపించి, మిగిలిన వారి అభిప్రాయాలు, అనుభవాలు తెలుకుందామని ఇదో ప్రయత్నం.

15 comments:

  1. alavaatu mudiri balaheenathai vyasanam laa ghaneebhavisthundi.

    ee mudaradaanikee, ghaneebhavinchadaanikee baahya vathaathaavaranam tho paatu padaardham yokka swathah gunam kooda oka karanam

    ReplyDelete
  2. చిన్న అలవాటు ఇతరులను బాదించదేమో కాని అదే బలహీనత అయ్యి,ఆపై వ్యసనముగా రూపాంతరము చెంది,తననూ ,తనవారినీ నలిబిలి చేసేస్తుంది.ఒకదాని కొకటి సంబందించినవే.

    ReplyDelete
  3. పద్మార్పిత, నిజమేనండి, అలవాటుని మీరు "పదార్ధం" తో పోల్చటం బావుంది, నాకు వ్యక్తులే ఈ మూడు గుణాల ప్రభావంతో పాషాణమంత గట్టిపడిపోయిన "జడ పదార్ధాలు" అని అనుమానం ;) అందుకే చలనం రాదేమో మనస్తత్వాల్లో?

    మాలాకుమారు గారు, మీ అభిప్రాయాం పంచుకున్నందుకు కృతజ్ఞతలు. యోచన వున్న మనిషి కనీసం అలవాటు,బలహీనతల వద్ద ఆగి అది వ్యసనంగా వికటించి, మానసికంగా మరొకరిని బాధించకమునుదే మేలుకుంటే బాగుండు. నాకు "మరిచిపోవటం నాకు అలవాటు" అన్న మాట కూడా భయాన్ని కలిగిస్తుంది. ఆ మరపే ఒక బంధాన్ని విరిచే మహమ్మారి కావచ్చేమో అని.

    ReplyDelete
  4. అలవాటు కి మీరు చెప్పినది సత్యం ..అలవాటులో వున్నప్పుడు మన మనస్సు గ్రహించలేక వ్యసనానికి బానిస అయ్యేలా చేస్తుంది..నాకు జరిగింది అదే

    ReplyDelete
  5. మనశాంతి కరువై ముక్కలపోయే బతుకు లా తయారవుతుంది

    ReplyDelete
  6. వీటి గురించి వ్యాఖ్యానించేంత అనుభవం నాకు లేదు. ఎందుకంటే వీటి మధ్య తేడా లేకుండానే బతుకుతున్నానేమో...
    నాకు తెలిసినంత వరకు
    అలవాటు కాలానుగుణంగా మారుతూనే ఉంటుంది.
    అలా మారనిది బలహీనత లేదా ధృడ సంకల్పం,
    మార్చాలనుకున్నా మారనిది వ్యసనం.
    అయినా చర్చలో పాల్గొన్నా అనే హాజరు కోసమే ఈ వ్యాఖ్య....
    (చిన్న ప్రశ్న, పద్మార్పిత గారి వ్యాఖ్య కోసమెదురు చూస్తున్నారా, ముందే సమాధానం చెప్పారు)

    ReplyDelete
  7. gaddipati sreekanth గారు, క్షమించాలి. ఉదయపు పని హడావుడిలో దొర్లిన cut and paste error ఇది. పద్మార్పిత అని సంబోధిస్తూ నేను సమాధానం వ్రాసింది మీ వ్యాఖ్యకు బదులుగానే. నా బ్లాగుకి సాదర స్వాగతం. ప్రదీప్ గారి వ్యాఖ్యతో గమనించాను నా పొరపాటు. కాని ఇది మాత్రం నా అలవాటు కాదు సుమా!

    ReplyDelete
  8. ప్రదీప్, ముందుగా చర్చలో పాల్గున్నందుకు, ఆపై మీరు పంచుకున్న అభిప్రాయానికి, సున్నితంగా నా తప్పిదాన్ని ఎత్తిచూపినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
  9. హరే కృష్ణ గారు, మీ అనుభవం పంచుకున్నందుకు, తొలిసారి నా బ్లాగుకి విచ్చేసినందుకు కృతజ్ఞతలు. వ్యసనం, దాని పర్యవసానం పట్ల ఇంతగా గ్రహింపు/అనుభవం వున్నవారికి దాన్ని తప్పిచటం కష్టతరమైనా అసాధ్యం కాదేమో? ప్రదీప్ అన్నట్లు దృఢసంకల్పం అవసరమేమో కాని.

    ReplyDelete
  10. వీటి మూటికి పెద్దగా నాకు తేడా తెలియదు కానీ నాకున్న అలవాట్లు,బలహీనత వ్యసనాల గురించి ఆలో చిస్తే ( ఆలోచింపచేసినందుకు ధన్యవాదాలు )

    వీటిల్లో ఏదీ కూడా పుట్టుకతో రాదు.
    అలవాటు : ఇది మనము పెరిగే వాతావరణము నుంచి సంక్రమిస్తుంది. ఇంకా చెప్పాలంటే మన రోల్ మోడల్స్ నుంచి తేరగా అలవాటవుతుంది. వుంటున్న సమాజము మారే కొద్దీ అలవాట్లు కూడా మారుతుంటాయేమో !
    బలహీనత : ఇది అలవాటంత బాగా పైకి కనిపించకపోయినా... బలహీన క్షణాల్లో దీనివల్ల జీవితాలు బలి అవుతుంటాయేమో !! అలవాటుకంటే ప్రమాదకరం. ఈ బలహీనత సహజంగా మనిషిలోపల నిద్రాణంగా వుంటుంది...దానిని నిద్రమేల్కొలిపే సందర్భం ఎదురయ్యేదాకా..

    వ్యసనం : అలవాటు ముదిరి ఊసరవెల్లై వ్యసనంగా మారి పరులకు కూడా ఇతోధికంగా అశాంతి ని కలిగిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే బ్లాగు వ్రాయడం వ్యసనమైతే ఇంట్లో అందరూ అసహనానికి గురౌతారు కదా :)

    ReplyDelete
  11. భాస్కర రామి రెడ్డి గారు, ఆలోచించి మరీ ఇంత విపులంగా చెప్పినందుకు కృతజ్ఞతలు. నా అలవాట్లు, బలహీనతలు మీరు చెప్పిన బాణీలోకి వస్తాయి. ఉన్న ఒకటీ రెండూ బలహీనతలని కూడా వదిలించుకోలేకపోయాను For Ex; sensitive and possessive nature అలాగే విపరీతంగా స్పందించటం ఆ చలనంలోపడి రోజుల తరబడి మనసు అలిసి పోయేలా ఆలోచించటం - నిజానికి నా బలిమి కూడా ఇవే కొన్ని కొన్ని సందర్భాలలో. ఇక వ్యసనమంటూ ఏదీ ఇంతవరకు కాలేదు కనుక చెప్పలేను. బ్లాగింగ్ గురించిన మీ కొసమెరుపుకి హ హ హ్హా

    ReplyDelete
  12. భగవద్గీత చదివినా కూడా ..భరించలేని భాద ఉంటుంది వ్యసనానికి ఇంతకీ మించి నిదర్సనం నాకు తెలీదు

    ReplyDelete
  13. ఉష గారు ..అలవాటు,బలహీనత ,వ్యసనాల్లొ
    జీవితం నడుస్తది అనెది సత్యం.వ్యసనం అంటే అర్ధం
    భాస్కర్ గారు చెప్పినట్లు ,{ఇంట్లొ కొపాలు} బ్లాగు రాయదం తొ
    తెల్సింది ..

    ReplyDelete
  14. rishi అవునండి, ఆ మూడూ కలియికే జీవితమైనా, ఏవెంత పాళ్ళు వుంటే అది సమపాలు + సరైన తరాజు అవుతుందో తెలియటం లేదు. అలాగే అలవాటు పరిణామ క్రమమూ అర్థం కాలేదింకా. ఇక వ్యసనంగా మారేది ఏదైనా దాన్ని వదిలించుకోను మనకి కొంత గడువు ఇస్తుందేమో తను బలపడి మనని నిర్వీర్యులని చేసేముందు.

    ReplyDelete
  15. హరే కృష్ణ, ప్రయత్నంతో మనసు తనకు తగిన ఉపశమనం వెద్దుక్కోగలదు. అది ఒకచోటనే దక్కపోవచ్చు. గీత కావచ్చు, తోటపనిలో కావచ్చు. ఇలా దైవం, కాలం, ప్రకృతి - అనుకూలించిన ఆ ప్రశాంత క్షణం మిమ్మల్ని త్వరలోనే చేరుతుంది. ఇది ఈ సాహితీ మిత్రురాలి ఆకాంక్ష, నమ్మకం. అవి ఎప్పటికీ వమ్ము కావు.

    ReplyDelete