విడివడని మబ్బుచాటునున్నా బాలభానుడు
తన వెలుగు లోకమంతా నింపాలని ఆరాటపడతాడు.
విరిసీ విరియని మొగ్గగానేవున్నా పూలు
తమ పరిమళం లోకమంతా పంచాలని త్వరపడతాయి.
మూసిన గుప్పిళ్ళ పసిపాపడి దశనే మనిషి మాత్రం
లోకాన్ని మొత్తం తన గుప్పిట చిక్కించుకోవాలని కలకంటాడేమో?
మంచిని ఎంచితే ప్రకృతికి మనిషికి ఎందుకు ఇంకెన్నో వైరుధ్యాలిలా!
ఆ ఇరువురు ఒకరీతిగా వుండాలన్న మాటే విస్మరించారా?
ఫలపుష్పాల తరులన్నీ ఒకేతీరున చూపేటి దాతృత్వం,
ధనదాన్యాల తులతూగే గృహస్తుకి ఇసుమంతైనా వుండదు.
నియమానుసారం ఎన్ని యుగాలుగా నిలిచిందో ప్రక్రతి ధర్మం,
సమయానుకూలంగా ఎన్ని రకాలుగా మారుతుంది మనిషి వైనం?
చెడుని వదలక ఆ వంకా ఒకసారి పోలిక వెదికామంటే
ఒకరితో ఒకరు హోరాహోరిగా వైరమాడుతూ సరిపడరా?
గనులు తవ్వి పోస్తూ ఇతను, భుకంపమై జ్వలిస్తూ తాను
పొగలు సెగల పరిశ్రమలు కడుతూ ఇతను, ఉప్పెనల ముంచేస్తూ తాను
అత్యాశ దురాశ ఆక్రమణల ఇతడు, అతివృష్టి అనావృష్టి పోకడల తాను
మారణహోమాలు ఇతనివైతే విలయతాండవాలు ఆమెవి.
ఇది కాదా లెక్క తప్పిన అనులోమ విలోమ నిష్పత్తి,
ఎప్పటికి సమకూరేను ఓ శాంతియుత సహగమనం?
ప్రకృతి ధర్మం కూడా అప్పుడప్పుడు (మాత్రమే సుమా) లెక్క తప్పుతోందండి..
ReplyDeleteఏమిటో, మీకు చిన్ని వ్యాఖ్య రాద్దామని మొదలు పెట్టానా అది కాస్తా ఒక పెద్ద పేరా అయ్యింది, కాసేపాగి ఒక పేజీ దాటింది
ReplyDeleteఅందుకే దాన్ని నా బ్లాగులో చదువుకోగలరు http://pradeepblog.miriyala.in/2009/05/blog-post.html
ఉష గారు,
ReplyDeleteమీకవితను ఉదయాన్నే చదివి, మసాలా చాయ్ తాగి కామెంట్ చేద్దామనుకొనే లోపు నాకో 2 కామెంట్లు :)
నియమానుసారం ఎన్ని యుగాలుగా నిలిచిందో ప్రక్రతి ధర్మం,
సమయానుకూలంగా ఎన్ని రకాలుగా మారుతుంది మనిషి వైనం?
సమయానుకూలంగా మనిషి ఎన్ని అవతారెలెత్తినా, ప్రకృతి కూడా మనిషిలో మార్పు బట్టి తన ప్రకృతి ధర్మాన్ని నిర్వర్తింస్తుంది... మంచైనా, చెడైనా , మనిషే కారణం.
మనిషి ప్రవర్తనకు ప్రకృతి మార్పునకు బాగా లంకె పెట్టారు.ప్రొద్దున్నే ( సూర్యుడు రాక మునుపే ) లేచి ప్రశాంతమైన ఆకాశంలోకి అలా చూస్తూవుంటే ఈ విశ్వంలో మనమెవరిమి అనే ఆలోచన రాకమానదేమో?
మీ కవితలోనీ దృశ్యాలు కళ్ళ ముందు నిలిచి వళ్ళు గగుర్పాటు పొడిచింది ...
ReplyDeleteమనిషి ప్రకృతిలో ఒదిగిపోతే అమ్మలా కడుపునింపుతుంది. మనిషి ప్రకృతినే శాసించబోతే ప్రళయమై కబళిస్తుంది. ఇక్కడా కర్మఫలమే మనచేతికొస్తుంది.
ReplyDeleteప్రకృతి, ప్రవర్తనల మధ్య Comparison బాగుందండి....
ReplyDelete"బుద్ది కర్మానుసారిణి" మనిషికి ప్రకృతికి నడుమ సంభవిస్తున్న అంతరానికి అదే హేతువు. ఎందరిలో సెల్ఫ్-రేలిజతిఒన్ పట్ల గ్రహింపు వుందో అది ఆపైవాడికే తెలియాలి.
ReplyDeleteమురళి, మీరన్నది నిజమండి, చిత్రంగా ప్రకృతి గమనం కలియుగాంతం గురించిన ప్రస్తావనల్లోనో, కాలజ్ఞానం చెప్పిన విధంగానో సాగినట్లుగ అనిపిస్తుంది. నా అన్వయింపు వలన కావచ్చంటారా?
ప్రదీప్, మీ కవితా రూపుగ వెలువడిన సమాధానం చాలా సంతృప్తినిచ్చింది. ఆ కవితకొచ్చిన వ్యాఖ్యల్లో "అమ్మ ఒడి" గారు అన్నట్లుగా కొందరమైనా అటువంటి సంకల్పం చేసుకుంటే కలకాలం మనగలదు మానవజాతి మనుగడ.
భాస్కర రామి రెడ్డి, మసాలా చాయ్ ఎలా చేయాలండి? ప్రకృతి మార్పునకు మనిషి ప్రవర్తన హేతువన్నది తెలిసినా ఎందరిని మన మాటలు, చేతల వలన ప్రభావితం చేయగలుతున్నాం? అది నా బాధ. నా వరకు నేను, నా చిన్ని ప్రపంచంలోని అతి తక్కువ మంది, అంతే. కానీ ఇంకేదో చేయాలన్న తాపత్రయం, బౌతిక విషయ వాసనలు, దైనందిన జీవిత బరువు, భాధ్యతలు అందుకు సవాళ్ళు.
ఇక పోతే, నిజానికి శుక్రవారం సాయంత్రం సుమారు ఆరు గంటల ప్రాంతంలో దాదాపుగా వూరి పొలిమేరల్లో పరుగెడుతున్నపుడు, కేవలం ప్రకృతి చాయలు ఎక్కువగా [చెట్లు, పొలాలు, మబ్బులు ఇలా వచ్చేపోయే అతి కొద్ది వాహనాల్ని మినహాయిస్తే] దోగాడే ప్రాంతాల్లో మనసుకి వచ్చిన వూహ ఈ కవితకి అంకురం, శనివారం ఉదయానికి కవితగా వెలికి వచ్చింది, దాదాపు రాత్రంతా అదే ఆలాపనలో వున్నాను.
నేస్తం, నిజమేనండి, మనం కావాలనుకే సుఖశాంతుల జీవితానికి ఈ ప్రకృతి వైపరీత్యాలు, మనిషి స్వార్థపు నైజం పట్టి పీడిస్తున్న పెను భూతాలు, బలురక్కసులు. మన ప్రయత్నం మనం చేద్దాం అవి నివారించను, ఆ పై పరమాత్ముని దయ.
"అమ్మ ఒడి" గారు, మనిషి అధిపతి, అధికారి పాత్రలకి సరిపడడేమో? అధిపతిగా చిరకాలం ప్రకృతితో సహజీవనం గడపటం పోయి, అధికారిగా మారి అరాచకాలు చేస్తున్నాడు. అందుకు ఫలితం అనుభవిస్తున్నాడు. "బుద్ది కర్మానుసారిణి" ఈ నడుమ యోగం, భోగం కూడా కర్మ నియంత్రణలే.
పద్మార్పిత, అంతకుమించి కారణభూతమేదీ తోచలేదు. మనిషి చేతలే ప్రకృతి కన్నెర్రకి మూలం, కదండీ?
అందరికీ కృతజ్ఞతాభివందనాలు.
hope my comment would be received by u. GOOD.
ReplyDeleteఇప్పటి ఉష్ణోగ్రత ఓ చిన్న ఉదాహరణ
ReplyDeleteకాదా మనిషి నిర్లక్ష్యానికి .....
అశ్వినిశ్రీ, బహుకాలదర్శనం ;) ముదావహం.
ReplyDeleteపరిమళం, ఉష్ణోగ్రత పెరుగుతున్న మాట నిజమేనండి. నేనందుకే టీ షర్ట్ వేసుకునో, మాస్క్ వేసుకునో, పెంగ్విన్ గా కానీ, పోలారు బేర్ గా కానీ STOP GLOBAL WARMING అన్న నినాదాలు చేస్తాను. అటువంటి ప్రయత్నాలకి యధోచిత సహకారమందిస్తుంటాను.