ముందుగా ఇది చదివిరండిక్కడకి ప్లీజ్
*******************************
కవి కానంటివి,
కానీ నా కవితవి నీవే.
మహిమాన్వితుడిని కానంటివి,
కానీ నా భవిత నీవే.
మనసు పడ్డానంటిని,
మరి నీ మమత పంచింది నాకే.
వలపు నీకేనంటిని,
కనుక నీ తనువు పానుపయింది నాకే.
ఎవరు ఏమంటారన్నది,
వలదు మనకు ఆ చింత,
ప్రకృతి మన పరమన్నది,
వసంతుని సాక్షిగా ఓ వింత!
మనం ఒకరికొకరం వరాలం.
తరతరాల ప్రేమ చరిత్ర ఇది.
మనం మనకు అపురూపాలం.
ఇహపరాల ఆత్మ సంయోగమిది.
మళ్ళీ వస్తా నండి కాస్త నిద్రపోయి. కందపద్యాలకు, గీత పద్యాలకు వెంట్రుక వాసిలో ఉన్నట్టున్నారు.
ReplyDeleteఅలాగే కానీండి, జోరుగా రాత్రంతా ఎన్నికల ఫలితాలు చూస్తూ జాగారం చేసినట్ట్లున్నారుగా! ఇక పద్యం వరకు ఓ నిర్దేశం వుందండి, త్వరలో పద్యమే అని చెప్పే రచన చేస్తాను. మీరు, ప్రదీప్ గారు కొద్దిగా ఆ ఛాయలు నా కవితల్లోకి తొంగిచూస్తున్నాయని గమనించినందుకు ధన్యవాదాలు.
ReplyDeleteso cute !
ReplyDeleteవసంతుడు ఎక్కడికెళ్తాడు? మరువపు పరిమళం గుభాళిస్తున్నంత వరకూ .....
ReplyDelete"మనం ఒకరికొకరం వరాలం.
ReplyDeleteతరతరాల ప్రేమ చరిత్ర ఇది.
మనం మనకు అపురూపాలం.
ఇహపరాల ఆత్మ సంయోగమిది. "
Beautiful.
మా డాన్సు టీచరుగారు రవీంద్రుని ఒక ఆంగ్ల కవితని పదంలాగా కోరియోగ్రాఫ్ చేశారు. అందులో
"We have played alongside of millions of lovers ..Unending love" అని వస్తుంది. ఆ వాక్యమే గుర్తొచ్చింది. నిజం, ఎన్నెన్నో జన్మల బంధం!
అదలా ఉండగా, భాస్కర్రామిరెడ్డిగారి వ్యాఖ్య పగలబడి నవ్వేట్టు చేసింది.
సుజ్జీ, పరిమళం, ధన్యవాదాలు. మరుని బారిన పడిన దేవుళ్ళే విలవిలాడగా నేనెంత సుమీ! ;)
ReplyDeleteకొత్త పాళీ గారు, చిరకాల దర్శనం. మీకు ఆ విశ్వకవి కవిత జ్ఞప్తికి రావటం నా కవిత నోచుకున్న భాగ్యం. ఇకపోతే మీ నవ్వుకి అర్థంతెలిసింది, పోనీలెద్దురు ఏదో రకంగా మిమ్మల్ని హాయిగా నవ్వించే యోగమూ నాకేపట్టింది ;) నవ్వండి సార్, మరి నవ్విన నాపచేనే పండుతుందటా, హ హ్హ హ్హా lighter vein alone please!
ReplyDeleteఉషగారు,
ReplyDeleteకవితా బానే ఉన్నప్పటికీ మీ నుంచి ఇంతకు ముందు వసంతం మీద వచ్చిన కవిత అంత బాగుందా అన్నది సందేహమే! (http://maruvam.blogspot.com/2009/05/blog-post_05.html)
ఇక నాకెందుకో కవితలో భావ అనిశ్చితి కనిపిస్తోంది. రెండు మూడు పేరాలు (లేదా పద్యాలు) భౌతిక లేదా తనువుల కలయిక గురించి రాస్తూ ... నాలుగవ పేరాకు వచ్చేసరికి అది ఆత్మ సంయోగం చేసేసారు.
నేను తప్పుగా అర్ధం చేసుకున్నానా లేక మీరు భావాల అనిశ్చితిలో ఉన్నారా ? నాకర్ధం కావడం లేదు.
సందేహం లేదు, ముందుదే మెరుగ్గావుంది. తనువుల కలయిక నుంచే ఆత్మల అనుసంధానం అవుతుంది, పోనీ నా స్వానుభవమది. ఇక భావ అనిశ్చితి అన్నది కవితకే కాదు, ఆలోచనకి వుంటుంది కదా, అందుకు మూలం మనసు అనిశ్చితి గురవటమేనేమో? నేను ఈ కవిత వ్రాసినపుడు మాత్రం ఒకవిధమైన అస్థిరత్వమో, మనస్తాపానికో గురయ్యానన్నది మాత్రం నిజం. తనువుల సమాగమం వద్ద ఆగిన తన ఆలోచనలు ఆత్మల సంయోగంలోకి రప్పించాలన్నదే నా ఈ చిరు ప్రయత్నం. అది నేను సరీగ్గా వ్యక్తీకరించలేకపోయానంటే ఆ ఓటమి బలహీనపడిన నా మానసికస్థితిదే.
ReplyDelete>> నేను తప్పుగా అర్ధం చేసుకున్నానా
చెప్పలేను, మీకు కొంతకాలానికి కూడా ఇదేలా అనిపిస్తే అపుడు మళ్ళీ అడగండి.