ఇదేమి సవ్వడి?
నా గుండె సడిలో రాగాలే.
ఇదేమి తాకిడీ?
నా మేని విరుపులో వయ్యారాలే.
నాలో అదేమో అలజడి?
రానున్నది తానే కదా!
నాలో అదేమో ఒరవడి?
విరహాన వేగిన తనువనా!
తనకోసమె కల కన్నానా?
ఆ కలలో తననే కలవరించానా?
కలలో తనని వరించానా?
ఆ కల కరిగిపోతుందని కలత చెందానా?
ఉదయానికి వీడుకోలు పలికానెందుకు?
రాత్రినీ ఆగొద్దని వేడుకున్నానెందుకు?
ఒక రోజు గడిచిందని నిట్టూర్పు విడిచానెందుకు?
నిరీక్షణా ఓ ప్రేమేనని నలుదిక్కుల చాటేందుకే!
అధ్భుతం అనడం తప్ప ఏమీ అనలేకపోతున్నా... నా నోట మాట లేదు... విరహపు జల్లుల పరవశంలో మునిగిపోయానేమో!!
ReplyDelete(ఇది వరలో ప్రియుడు వైపు నుంచి ఇలాంటి కవిత ఒకటి రాసాను. పెద్ద పోలిక లేకపోయినా అదే మీ కవితకు వ్యాఖ్య అనుకోండి ఈసారికి... ఒకసారి తొంగిచూడండి ఆ కాల రక్కసిని http://pradeepblog.miriyala.in/2008/12/blog-post.html )
మీ కవిత చదివాను. నా మనసులోని స్పందనా తెలిపాను. "ప్రేమకు గెలుపోటములేమిటి" అన్నారు, అది మాత్రం నిజం. ప్రేమికుల నడుమ కానీ, ప్రేమకీ విధికి మధ్యన కానీ, ప్రేమకీ కాలానికీ వున్న సంబంధంలో కానీ సంధి/శాంతి ఒప్పందం కుదురుతుంది. అదే ప్రేమలోని మహిమ. అలా కాని నాడు అది ప్రేమే కాదు, లౌకికంగా ఏర్పర్చుకున్న భావనౌతుంది. ప్రేమ మనసుకి సంబంధించింది, దానికి రాగద్వేషాలు అంటవు. గెలుపు, ఓటమి పట్టవు.
ReplyDeleteఅలాగే ఎడబాటు, విరహాలు, నిరీక్షణలు, ఏకాంతాలు కేవలం ప్రేమించేమనసుకి మాత్రమే అర్థమయ్యే నిఘంటువులు. ఎంత పఠించినా ఇంకా ఏదో మిగిలేవుంటాయి వాటిలో. అందుకే మీరు కూడా "విరహపు జల్లుల పరవశంలో మునిగిపోయారేమో" నా మాదిరిగా.
ఉషగారు,
ReplyDeleteచక్కగా చెప్పారు. ముఖ్యంగా నా కాల రక్కసిలోని అలౌకిక భావనను మీరు గ్రహించారు.
ఇక ఎడబాటు, విరహాలు, నిరీక్షణలు... మూడూ ఒకేలా కనిపించే విచిత్ర పదాలూ మరియు అనుభూతులూ...
ఇక ఏకాంతమంటారా.. మనల్ని మనం తెలుసుకోవటానికి చక్కని సాధనం. నేనేదైనా కోల్పోయానని అనుకున్నప్పుడు ఏకాంతంలో అది తిరిగి సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తుంటాను.
మీరన్నట్టు అవి మాటలు చాలని నిఘంటువులే.. అందమైన అనుభూతులే.
ఇది మీకు స్వానుభవమైన భావనకు రూపం అయితే....నో కామెంట్.
ReplyDeleteకానీ...ఒక చిన్న భావన ఏదో తడితే...దాన్ని తీసుకు రాసిన కవితయితే మాత్రం....ఏమంత బాలేదండీ....చివరి నాలుగు పాదాలు తప్ప....ఎందుకో మెలోడ్రామా మరీ ఎక్కువయినట్టనిపించింది...తెలుగు సినిమాల్లోలా :-)
You can definitely do better.
బావుకుడన్ గారు, మీ సద్విమర్శని స్వీకరిస్తున్నాను. కవితలు నేను ప్రయత్నపూర్వకంగా వ్రాయనండి. మనసు ఒక్కోసారి ఒక్కోలా స్పందిస్తుంది, అది స్వానుభవం కావచ్చు, లేదూ మదిలో కదలాడిన భావన కావచ్చు. కొన్నిసార్లు ఆ స్పందనలో గాఢత అధికంగా వుండి భావాలు అలవోకగా వెలికి వస్తాయి, మరి కొన్నిసార్లు జ్ఞాపకాల్లో నిక్షిప్తమై బావిలో చేద వేసి తోడినట్లు మది కొన్నిటిని పట్టుకొస్తుంది. అయినా అన్ని మాటలు అందరికీ ఒకేలా అర్థం కావు కనుక, ఇది మీరన్నట్లు ఒక భావన మనసుకి అనుభవంలోకి వస్తేనే తెలుస్తుంది.
ReplyDeleteఇక మెలోడ్రామా సంగతంటారా, ఏమో వుందేమో, తెలుగు సినిమాలు చూసిన అనుభవం ఇలా ఉపయోగపడిందేమో ;) నిజంగానే నిరీక్షణలో (అందుకే ఆ చివరి పాదం సజీవంగా వుందేమో) ఇహం పరం మరిచున్న నా మనసు కుదుట పడ్డాక మళ్ళీ మీరన్నట్లు మీరు మెచ్చే కైతలు వ్రాస్తుందేమో.
ఈ పాట విన్నారా "మాటలకందని భావాలు మంచి మనసులు చెపుతాయి, కవితలకందని ..." ఈసరికి అలా సరిపెట్టేసుకుంటున్నాను. తప్పక ఈ మాదిరి సమీక్షలు నిష్పక్షపాతంగా వ్రాస్తూవుండండి.
కాలసర్పకాటు ఎడబాటు తర్వాత చెలి(చెలుని) కన్నుల్లో నవ్వుని వెతికే
ReplyDeleteక్షణికానందానికి నిరీక్షణ, మనసు నైజం, సృష్టి ధర్మం.
మనసున అలజడిని సవ్వడిగా, సంగీతంగా, సరాగంగా వినిపించే
మధురోహల కోసం నిరీక్షణ, మనసు నైజం, సృష్టి ధర్మం.
కలలతో కన్నులు ఆడే సరసాలనూ, మూసిన కన్నులకైనా వెన్నెలనూ చూపే
విరహాల ప్రేమకై నిరీక్షణ, మనసు నైజం, సృష్టి ధర్మం.
ప్రేమ నిరీక్షణైతే, నిరీక్షణ కోసం నిరీక్షణ, మన నైజం, మన ధర్మం(?).
నాతో కవితలు రాయించే మీ కవితలకీ, మీలోని కవికీ పాదాభివందనం, నా ధర్మం!
ఆనంద్, హాయ్, మొత్తానికి మీ లోకం నుంచి మన లోకంలోకి తొంగి చూసే తీరిక చిక్కిందన్నమాట. అవునూ, అపుడే నిరీక్షణ మంత్రానికి వచ్చారేం?
ReplyDelete>> ప్రేమ నిరీక్షణైతే, నిరీక్షణ కోసం నిరీక్షణ, మన నైజం, మన ధర్మం
ప్రేమ కోసం నిరీక్షిస్తూ, ఆ నిరీక్షణే నైజంగా మార్చుకుని ఎన్నాళ్ళిలా అనుభూతి-జీవనం గడిపానో!
అనంద్, ముందుగా మీ వ్యాఖ్య చూసి మీరు తొంగిచూసారన్న ఆనందంలో అచివరి పంక్తిని నిశితంగా చూడటం విస్మరించాను.
ReplyDelete>> నాతో కవితలు రాయించే మీ కవితలకీ, మీలోని కవికీ పాదాభివందనం, నా ధర్మం!
ఇది మీకు బొత్తిగా తగదు. మన అందరిలోను వున్న ఈ కవితా శక్తికి వినమ్రంగా వందనం సమర్పిద్దాము. పాదాభివందనం కొంచం పెద్ద మాట కాదూ? మీ కవితాశక్తి నన్ను ఎప్పుడూ అబ్బురపరుస్తుంది. ఈ విషయాన మీకు మీరే సాటి.