వాన

గాలి సందిట్లో రెమ్మల గిరికీలు
పెరడంతా తుంటరి తూనీగలు
గాలిపటాల్లా కదిలే మబ్బులు
వాన రాకకి ఎంత ఆర్భాటం

లేగదూడల్లా వాననీటి కాల్వలు
సీతాకోకచిలుకల దాగుడుమూతలు
కాగితపు పడవల నావికులు
వాన వచ్చివెళ్తే అంత ఆహ్లాదం

నిన్న కమ్మిన మబ్బులేవి?
కవ్వించిన మెరుపులెక్కడ?
వచ్చిపోయే వాన కోసం నేల కెందుకు ఇంత మక్కువ.
తేటపడ్డ మనసు ఎక్కడుందో నాకేం తెలుసింక..

11 comments:

  1. నీ రాక కోసం ఎదురు చూస్తున్నాం!ఎప్పుడు తడిసి ముద్దవుతామో?

    ReplyDelete
  2. సంధ్య వేళ ఎండలా పదును లేని కవితే ఇది!
    ఒకపరి కనులు మూస్తే ఆ సరికొత్త చిత్రం మీ స్వంతం!!! (ఆ క్షణం మస్తిష్కం లోని పదచిత్రాలివి)

    వాన జల్లు నేల మీద, కవి మనసు జల్లులు మీ మీద, పల్లేరు కాయల అక్షింతల జల్లులు నా మీద :)

    వలపు, వాన చినుకు ఒకటేనట! http://maruvam.blogspot.com/2009/04/blog-post_14.html అంటే ఎట్టెట్టా అన్నారు.

    జలరక్కసి వేవేల వ్రక్కలైతే... http://maruvam.blogspot.com/2009/06/blog-post_11.html హన్నన్నా అన్నారు

    ఇంకా అలానే మరెన్నో, తప్పదు మరి.

    విజయమోహన్ గారు, వర్మ గారు, మావి వర్షాధారభూములు. అవి ఏనాడు బీడు పడలేదు. అందుకే "మా వూరి మబ్బుకి నాకు మల్లే మమతలెక్కువనుకుంట,...వూరు నిద్రలో వుండగా లేపి మరీ కడుపు విప్పిచెప్పి పోతుంది." నెనర్లు

    ReplyDelete
  3. " వచ్చిపోయే వాన కోసం నేల కెందుకు మక్కువ " ఈ లైన్ ఎన్నో ఆలోచనలను కదిలించింది...

    ReplyDelete
  4. చాలా రోజులైంది మిమ్మల్ని చూసి. :)

    ReplyDelete
  5. తేటపడ్డ మనసు ఎక్కడుందో నాకేం తెలుసు..
    పై వాఖ్యం చాలా నచ్చింది.

    ReplyDelete
  6. మనసుకి హత్తుకునే కవిత...చాలా రోజుల తరువాత మరువపు గుబాళింపు, ఆలశ్యంగా ఆస్వాదించాను!

    ReplyDelete
  7. మిర్చీ, వేణు, సవ్వడి, పద్మార్పిత, థాంక్స్. అవును నాకూ కాస్త తెరిపిచ్చిందీ వాన. ఒక్క మాట కూడా చిరుజల్లేగా మనసుకి తోచాలేగానీ..

    ReplyDelete
  8. నేస్తం, ఆ మాట నేనూ అననా మరి..ఉభయకుశలోపరి! :)

    ReplyDelete
  9. చాల బాగుంది అమ్మాయ్ "వాన " . వానలో ఎంత తడిసినా యింకా తడవాలనిపించేలా . ఇంతకీ ఎలా వున్నావు ? ఇబ్బడిముబ్బడిగా ఇక్కడ వానలు.అతివృష్టి ..అనావృష్టి.

    వయసుతో వచ్చే ఇబ్బందులు గమనించుకొని వానా వాన వల్లప్పలాడకుండా మనసుకు కళ్ళేలూ బిగిస్తున్నా. లేకుంటేనా .....అయినా మా ఆవిడ చేతిలో కళ్ళేలూ ఎలాగో ఉంటాయనుకో .

    ."వచ్చిపోయే వాన కోసం నేల కెందుకు మక్కువ".....అందుకే
    ."భావోపేతం రసనిర్దేశం కావాలోయ్ నవకవనానికి యని " శ్రీ శ్రీ
    అంటాడనుకుంటా.

    ఇక్కడ నేలకేందుకు యింత మక్కువ అనివుంటే .... యింకా రిధమాటిక్ గా వుండేది అనిపించింది..

    Some how I missed this kavita 'VANA' so far. మరువపు వనానికి' వాన' మరికొన్ని సోయగాలు తెచ్చింది . క్షేమమని భావిస్తూ, ఆకాంక్షిస్తూ.... వుంటాను మరి.... శ్రేయోభిలాషి .... మీ బాబాయి.

    ReplyDelete