స్మైలీ - జెకెల జుగల్బంది

అతి కొద్దికాలం క్రితం వరకు JK అంటే పంపినవారి ఇనీషియల్ అనుకున్న స్థాయి నుండి ఈ నాడు స్మైలీ, జెకెల ప్లేబాక్ తో నేనూ మూగవోయి [అనగా నేనూ నా స్వరం వదిలి వాటి యుగళగీతం లో మునిగి].. నన్ను నేను నిరసిస్తూ, ఏవగించుకుంటూ.. వాటి సృష్టికర్తకి నా సత్యాగ్రహం తెలుపుకుంటున్నాను. ఓ నెల క్రితం వచ్చిన లేఖలో J అన్న అక్షరంకి అర్థం తెలియక అది JK కావచ్చా? లేక సంబంధం లేని అదనపు అక్షరమా అని ఓ రెండు గంటలు తలబద్దలు కొట్టుకుని చివరికి కనుక్కున్న సత్యం - మంటనక్కకి, మైక్రోసాఫ్ట్కి ఇలా రకరకాల టూల్స్ కి కాస్త సమన్వయం తక్కువని - మరిక తప్పదు నేనూ ఇకిలించక ;)

""j" Means a smiley face has been lost in the translation."


*******************************************************

మూగ
సైగల్లో అలసిన మనిషి సృష్టి,

కోటి పదాలుగా వెలిసిన భాష.

భావాన్ని మోస్తూ విసిగిన భాషకి మజిలీ,

ఏ భావాన్నైనా దాచేసి, ఇంకేదో విప్పిచెప్పే
స్మైలీ :)

ఉడుకు ఊసులు, దుందుడుకు చేతల సమిష్టికృషి,

కలం విసుర్లకి కొంగ్రొత్త కొసరు.

అసలని నకలని తెలియనీయని కిటుకు,

ఏ మాటనైనా పలుచన చేసే జెకె [JK]


మౌనం మెసిలిన మనోప్రాంగణమిపుడు భూస్థాపితం,

మృత మానసానికి కైమోడ్పు ఘటించే జోడుజీవాల స్వైరవిహారం.

మనసుల స్వరాలు, రాగాలు రంజిల్లిన హృదయమండలం,

మనిషిని లొంగదీసిన
స్మైలీ, జెకెల జుగల్బందీకి రంగస్థలం.

******************************************

అయినా స్మైలీ, జెకె, రెండూ నాకు ఎప్పటికీ విరోధులే. ఎందుకంటే తనని వంచుతున్న కొమ్మల విషాదాన్ని గెలిచి పువ్వుల నవ్వుల్లో మెరిసే ఈ వీపింగ్ చెర్రీ నాకు ఆదర్శం కనుక.
10 comments:

 1. హి హి హి చేతికి ఏదొస్తే అది రాసేసి అనదలుచుకున్నది అనేసి తప్పించుకొను సౌకర్యార్ధం కనిపెట్టబడిన రెండు ముక్కల కంటీ తుడుపు ఈ jk అనేది అని నా ఆభిప్రాయమోయ్..

  ReplyDelete
 2. కలం విసుర్లకి కొంగ్రొత్త కొసరు.
  అసలని నకలని తెలియనీయని చిటుకు,
  ........బాగా రాసారండీ. అక్షరాలా నిజం....ఏ మాటైనా చెప్పేసి ఓ స్మైలీ పారేసి తప్పించేసుకోవచ్చు :)

  ReplyDelete
 3. మళ్ళీ తలుపులు తెరిచారన్నమాట సంతోషం.

  ReplyDelete
 4. :-)ఇది నా పలకరింపు .....హు బయటకూడా ఇలాగే 'ఇకిలిస్తాం'

  ReplyDelete
 5. mee taste baagundi.. mee blog maree baagundi..
  skybaaba.blogspot.com

  ReplyDelete
 6. అందరికీ ధన్యవాదాలు నాతో కలిసి స్మైలీ పట్ల నిరసన గళం కలిపినందుకు. :) [తప్పదు మరి]

  ReplyDelete
 7. ఉషా మీరు చెప్పిన విషయంతో నేను ఏకీభవించను గానీ మీ కవిత మాత్రం చాలా బావుంది.

  ReplyDelete
 8. నకు JK ఎంతొ అర్ధం కలేదంది :(

  ReplyDelete
 9. @ రాధిక, ;) థాంక్స్.
  @ మిరియప్పొడి, JK == Just Kidding :)

  ReplyDelete