చర్విత చర్వణం

జ్ఞాపకాలు జాతర జరుపుతున్నాయ్
మనసు బెంబేలుపడుతూంది

విరివనాలతో, గ్రీష్మ తాపాలతో
కాలం ఉడికించేస్తుంది..
మారాకు వేసిన మల్లెకొమ్మ
పరాకు వదిలిన గువ్వపిట్ట

కలిసి కేరింతలాడుతున్నాయ్

జ్ఞాపకాల జన్మదినాలు తిరిగొస్తున్నాయ్
మనసు ఉక్కిరిబిక్కిరి అవుతుంది

వెలిసిన లేఖల్లో, ఆరని కంటి తడిలో,
గతం మిడిసిపడుతుంది..
రాగం కట్టని గానము,
దారి మరిచిన అనామిక
కలిసి సాగుతున్నాయి

జ్ఞాపకాలు మరణంతో జతకట్టనంటున్నాయ్
మనసు కలలో సంవత్సరీకం జరుపుతుంది

3 comments:

  1. బావుంది కానీ, విరివనాలతో కూడా కాలం ఉడికిపోతుందా

    ReplyDelete
  2. బావుంది ఉష. మిడిసి పడ్డ గతమెంత గొప్పదైనా అది గతమేగా గతించిన జ్నాపకమేగా.
    లోకేష్ శ్రీకాంత్ గారు... విరహాల గ్రీష్మ తాపం విరి వనాలను విరబూయించటమే కాదు తాపాలతో వుడికించగలదు కూడా ... ఇక విరగబడ్డ గ్రీష్మం, విరి తాపాలు జతకడితే... విరి వనాల ను కాలం వుడికించక ఏమి చేస్తుంది చెప్పండి.

    ReplyDelete
  3. శ్రీకాంత్ గారు, "ఉడికించేస్తుంది" అనటానికి "ఉడికిపోతుంది" అనటానికి తేడా ఉందిగాండి? వేసవే కాదు వేసవిలో మల్లెలు కూడా ఆ పని చేయగలవు. మరోమారు చదవండి. నెనర్లు.

    భావన, వ్యాఖ్యకి థాంక్స్.

    ReplyDelete