ప్రతిసారీ, ఇంతే..

ఆరుద్ర పురుగు

వాన పలుకరిస్తే,
తడి పచ్చిక మిసమిసలు,
నడిచివచ్చే ఆరుద్ర పురుగులు,
ఇంత పదిలమా మనోచిత్రం?

నేల కనపడితే,
వానమబ్బు వయ్యారాలు,
అలికి ముగ్గేసిన వాకిళ్ళు,
ఒకరి సొంతమా తీపిగతం?

తలపు ఎదురుపడితే,
ఊసుపోని కలబోతలు,
రేయింబవళ్ళ కలనేతలు,
ఎంత చేరువ దూరతీరం?

పలకరింపు తడిమితే,
అలవికాని పరవళ్ళు,
అదుపులేని పలవరింతలు,
ఇదేనేమో చివరికి మిగిలేది?

6 comments:

 1. ఆరుద్ర పురుగులు అనేవి ఉన్నాయా అండి ..
  తొలి సారి చూసాను ఈ పదం ..మీ పదాల్లో ...
  ఎలా ఉంటాయో కాస్తా చెప్పరూ......

  ReplyDelete
 2. "పలకరింపు తడిమితే
  అలవికాని పరవళ్ళు"
  బాగు బాగు:)

  ReplyDelete
 3. రేయిపవళ్ల కలనేతలు.. wow! :-)

  ReplyDelete
 4. @ సంతోష్, ఆరుద్ర పురుగుని మేము "కుంకుమ పురుగు" అని కూడా అనేవాళ్ళం. మంకెనపూవు రంగు కుంకుమ చూర్ణం తో ఒక చిన్న వూలుబంతి చేస్తే ఎలావుంటుందో అలా ఉంటాయివి. నేను అత్యధిక సంఖ్యలో వీటిని చూసింది నందిగామలో. నా దగ్గర ఫోటోలేమీ లేవు. విరజాజి రేకు మెత్తన అన్నట్లుగా, మిడిసిపడే ఛాయలో ఉండే ఈ పురుగులు పచ్చని గడ్డిమీద ఉన్నా, మైకా రేకుల మీద పాకినా వాటి అందం అద్వితీయం. ఇవాళ ఉదయం జాలంలో వెదికితే ఆరుద్ర పురుగుని "ఇంద్రగోపపురుగు" అని కూడా అంటారని తెలిసింది. నేను అరచేతిలోకి తీసుకుని అబ్బురపడటం గుర్తే ఇంకా! ఇవి వానాకాలం వచ్చేవి. అసలుకి ఆరుద్ర కార్తె లోనే వస్తాయట. వికిపీడియా వర్ణన "ఇది మొఖమల్ 'క్లాత్ ను చుట్టుకున్నట్లుగా ఉండి, ఎర్రగా బుర్రగా, బొద్దుగా ఉంటుంది. అందంగా ఉండే ఈ పురుగు పంటలకు ఎలాంటి హానీ చేయదు. ఏడాదికి ఒకసారి మాత్రమే ప్రత్యక్షమౌతుంది." అలాగే చక్కని పద్యం దొరికింది - పోతన పద్య రత్నము:::"వర్ష ఋతువు " http://konamanini.blogspot.com/2008/11/blog-post_3013.html

  వ్యాఖ్యలకి అందరికీ నెనరులు.

  ReplyDelete
 5. chala bagumdi anDi, nd happy mothersday anDi.

  ReplyDelete
 6. అభినందనలు వుషాజి, మీ కవిత చాల బాగుంది.
  @ సంతోష్ ! కుంకుమ రంగు ముఖమల్ గుడ్డ మూడు మిల్లి మీటర్ల సైజులో కట్ చేసి వర్షాకాలం లో పరచు కుంటున్న పసిరిక పై వేదజల్లితే ఎలా వుంటుంది.?అలా వుంటాయి అవి తిరుగాడుతుంటే.కుంకుమ రంగు ముఖమల్ లా అతి నాజూకుగా అందంగా చేతిలోకి తీసుకొంటే ముడుచుకొని పోతూ...ప్రస్తుతం నేను పోస్టులు పంపడం లేదు. నెక్స్ట్ సీజన్ లో ఫోటో తీసి మీకు మెయిల్ చేస్తా.

  ReplyDelete