నా హాఫ్ మారథాన్ రన్!

ఈ రోజు ముగిసిన నా హాఫ్ మారథాన్ [తెలుగులో ఏమంటారో?] పరుగుని గూర్చి ఓ రెండు మాటలు.

 1. ఫుల్ మారథాన్, హాఫ్ మారథాన్, ఫైవ్ కె ఇలా అన్ని విభాగాలు కలిపి దాదాపుగా పధ్నాలుగు వేల మందిమి పాల్గొన్నాము.
 2. సాధన, ఆరోగ్య రీత్యా నా పరిమితి తెలుసు కనుక పాల్గొన్నానన్న స్పూర్తి, సంతృప్తి నాకు ప్రధానం. మొత్తం 13.1 మైళ్ళకి కలిపి పరుగుకి నేను తీసుకున్న సమయం మూడున్నర గంటలు.

అంతా సందడి, ఉరకలు, పరుగులు, హుషారు...ఇలా జ్ఞాపకాలు, పోయినేటి మాదిరే..


ఇంతకన్నా చెప్పటానికేముందిక ... ఎవరో కవి అన్నట్లుగా ""జ్ఞాపకాలే మైమరపు జ్ఞాపకాలే మేలుకొలుపు జ్ఞాపకాలే నిట్టూర్పు జ్ఞాపకాలే ఓదార్పు". మనసుని ఎత్తి కుదేసినా, లేపి ఎగరేసినా వాటికే సాధ్యం.

ఈ పరుగులో అనుభవంలోకి వచ్చినదిది. నేను పరిగెడుతున్నానని తెలియని ముగ్గురు ( Matt Jon Emily ) [వాళ్ళు అలా దారి ప్రక్కన నిలబడి పలుకరిస్తారని నాకూ తెలియదు] "హేయ్ ఉషా, లుకింగ్ గుడ్/యు కెన్ డూ ఇట్/....../ యాహూ! " అన్నప్పుడు, చిత్రమైన భావన, అన్ని వేలల్లో నేనొకరిని, అలా నిలబడిన వేలల్లో వాళ్ళు ముగ్గురు. అయినా గుర్తించి, నన్ను పిలిచి, ప్రోత్సాహించటం. జీవితంలోనూ అంతేగా..
కోటి కోటి శతకోటిక్షణాల పరుగులో కొన్ని మనతో నడిచే పాదాలు, కొన్ని పిలిచే గళాలు.. కలిసే వరకు అపరిచితం, అనూహ్యం. ఏ మలుపులో ఏ పిలుపు, అనుబంధం కలిసి విడిపోతాయో. అయినా ఆ జ్ఞాపకం నడిపిస్తూనే ఉంటుంది కడ వరకు.

పోయిన నెలలో కూచిపూడినృత్యం అభినయించాము, ఇదీ చాలా చాలా ఏళ్ల తర్వాతనే. అదీ సఫలమే అని భావన. అనుకోనిది, మేము నృత్యం అభ్యసించిన అందరు గురువుల్లోను మాపై ఎక్కువ ప్రభావం చూపిన మా గురువు గారు చాలా ఏళ్ళ తర్వాత ఎక్కడవున్నదీ తెలిసింది. నృత్య ప్రదర్శన కన్నా మాస్టారికి ఆ మాట చెప్పి ఆయన ఆశీస్సులు అందుకోవటం సంతోషం.

ఈ brag story మాకెందుకు అంటారా... చెప్పే మాటల్లో ఒకటైనా మరొకరికి స్ఫూర్తినివ్వకపోదా అనీను, ఆపై క్రియాశీలకంగా చేయాలనుకునేవారికి సమయం, సాధన ఆ భగవంతుడే కల్పిస్తాడని తెలపాలనీను.
బ్లాగు అన్నది సామాజిక స్పృహ అని చదువరి గారి మాట. అది చదివిన తర్వాత ఆలోచనల్లో ఆ మాట నలుగుతూనే ఉంది.

18 comments:

 1. ఆఫ్ మారథాన్ ను తెలుగులో సగం చచ్చిన పరుగు అందురు :)


  కంగ్రాచ్యులేషన్స్ ఉష.....

  ReplyDelete
 2. హాయ్ .:-)..చాల రోజుల తరువాత "మరువం"సువాసననులు నా బ్లాగ్ డాష్బోర్డ్ లో !

  ReplyDelete
 3. గ్రేట్
  అభిననందనలు

  ReplyDelete
 4. కంగ్రాట్స్ ఉషా గారు. ఇది తప్పకుండా ఇంకొకరికి స్పూర్తే. నృత్యప్రదర్శన ఫొటోలు మాక్కూడా చూపించొచ్చు కదా.

  ReplyDelete
 5. చాలా రోజుల తరువాత మీ బ్లాగు చూస్తున్నాను. మీ పరుగు విజయవంతమైనందుకు అభినందనలు.

  ReplyDelete
 6. చాల రోజులకు కనిపించారే?

  ReplyDelete
 7. అభినందనలు ఉషా గారూ! ఎన్నాళ్ళకెన్నాళ్ళకెన్నాళ్ళకి!! :-)
  చాలా చాలా రోజుల తరువాత మీ మరువపు తోటలోకి మాకు ప్రవేశం కల్పించినందుకు ధన్యవాదాలు :-)

  ReplyDelete
 8. మీ పునరాగమనంతో బ్లాగులోకంలో మరల మరువపు గుభాలింపు... సుస్వాగతం ఉషగారు..

  ReplyDelete
 9. అందరికీ ధన్యవాదాలు. కొంతకాలంగా ఈ-మెయిల్స్ ద్వారాగా అభిప్రాయాలు పంచిన పాతికమంది మిత్రులకి మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ, ఆ అసౌకర్యం తొలగిస్తున్నాను.

  ReplyDelete
 10. చాలా రోజులైంది టపాల్లేవేమని రాద్దాం అనుకుంటున్నాను..ఇంతలో..వచ్చేసారు..!చాలా ఆనందం మిత్రమా..!!హమ్మయ్య మొత్తానికి తోటలోకి వచ్చేసాం మళ్ళీ...అన్ని ఋతువుల సమాహారంలాంటి మీ కవితలకబుర్ల కోసం మేమంతా రెడీ...

  ReplyDelete
 11. congratulations Usha. అవును ఏమంటారో మరి half marathon ను?... భా.రా.రె చెప్పినట్లు సగం చచ్చిన పరుగు అనరేమో కాని ;-)

  ReplyDelete
 12. అభినందనలు ఉష గారు :-)

  ReplyDelete
 13. ప్రపంచ కార్మికులారా ఏకం కండి. పరిగెడితే పోయేదేమీ లేదు. ఇక మిగిలిన దూరం తప్ప. :D

  ReplyDelete
 14. గీతాచార్య, అంటే మీరింకా మొదలుపెట్టలేదనేగా.. శక్తుల్నీ, వ్యక్తులనీ సమీకరిస్తూ, నినాదాలిస్తే పనులవుతాయా? :)

  ReplyDelete
 15. అయ్యో ఉష గారు, మీరు బొత్తిగా అమాయక బాలికలా ఉన్నారు. :D పనిజేస్తూ పోయే వాళ్ళకు నినాదాలిచ్చే టైముంటుందా? అమ్దుకే నేను నినాదాలివ్వను. ని (నిండైన) నాదాల్ని చేస్తుంటాను.

  As of our previous conversation, I achieved my goal of 12 second 100 metre sprint.

  ReplyDelete
 16. మీరు రాసిన టపా చదివాక నాక్కూడా పరుగు సాధన చెయ్యలనిపిస్తోంది.
  మీ తోటలోకి ప్రవేశమ్ ఇచ్చినందుకు ధనయవాదాలు.

  పరుగు పూర్తిచేసినందుకు,కూచిపూడి నృత్యం చేసినందుకు మీకు నా అభినందనలు.

  ReplyDelete
 17. oka nenu, నాకూ మిమ్మల్ని అభినందించే అవకాశం పైయేడుకి రావాలి. నెనర్లు.

  ReplyDelete