మనమిక ఈలపాట రఘురామయ్య లేదూ మరో ఈడియట్!

తిరుపతి వేంకట కవుల భారత నాటకాలలో కృష్ణ పాత్రలో రఘురామయ్య గారు


..కనుక మనమిక ఈలపాట రఘురామయ్య [ఈలపాట రఘురామయ్యగా ప్రఖ్యాతిచెందిన కల్యాణం వెంకట సుబ్బయ్య గారిని గూర్చి తెలియనివారు ఆయన పేరు మీద నొక్కి చదువుకోండి] లేదూ మరో ఈడియట్.

“second place is the first loser.”

అయితే అవవచ్చు గాక అనుకుని ఆ మొదటి స్థానం భగవంతునికే వదిలేసి... నాకు నేను "“second place is the winner over third place.” అని గడుపుతూండగా మిగిలినవారంతా మొక్కులు, ముడుపులు, పొర్లు దండాలతో [a.k.a. దీక్ష, పట్టుదల, సాధన] తో నన్ను నెట్టివేసారని ఇక ఇప్పుడు నా వెనుక ఉన్నది మరొక్కరే, నా నీడ, అని గ్రహించి ఇంతవరకు రాని పని ఒక్కటైనా సాధించలేనా అనుకుంటుండగా నాన్నగారి మాటలు గుర్తుకువచ్చాయి.

తనకి చిన్నప్పుడు నత్తి ఉండేదట. పెద్దలెవరో నివారణ చెప్తే ఉదయాన్నే గోదావరి కాలువ దగ్గర గులకరాళ్ళు గొంతులో ఉంచుకుని, ఎలుగెత్తి అరిచేవారట. క్రమంగా నత్తి పోయిందట. అలాగే కొన్ని కథనాలు విన్నాను. సరే ఇక సాయంత్రం మళ్ళీ బైక్ తొక్కటం మొదలెడదామని 3 idiots చిత్రం లోని పాట వింటూ సింగ్ అలాంగ్ చేస్తుండగా హఠాత్తుగా ఈ పార్ట్ నుంచి నేనూ ఈల వేయగలిగానని గమనించాను. అదీ రాని విద్యనే. ప్రయత్నించినంత కాలం రానిది అనుకోకుండా పట్టుబడింది. వచ్చేసిందోచ్...


Dil jo tera baat baat pe
Ghabraaye
Dil pe rakh ke haath usae tu fuslaa le
Dil idiot hai pyaar se usko samjha le Honth ghuma
Seeti bajaa
Seeti bajaa ke bol
Bhaiyaa aal izz well

దీనికి వివరణ ఇవ్వలేను. మనసు లోని భావనకి ఈ పాటలోని పదాలకి సరిపడిందా, ఎక్కడో లోలోపల ఈల నేర్చుకోవాలనున్నా తెలియని జంకు ఆపిందా, అది ఆలోచన అటుగా ఉంది కనుక వెలికి వచ్చి సాకారమైందా నాకు తెలియదు. అసలిలా అన్నిటికీ కారణాలు, అనాలిసిస్ ఎందుకూ అని విసుకొచ్చి, అంతే నాకు వచ్చేసింది కనుక మనమిక ఈలలో మరీ లైన్ చివర కాదు ముందుకు జరిగాం అని సర్దిచెప్పుకుని సంబరపడ్డాను.

సరే మరొక ఊసు చెప్పి సెలవుపుచ్చుకోనా... నేను పూర్తిగా అన్ని టపాలు చదివిన బ్లాగు గురించి చెప్పాలి. మరెన్నో ఉన్నాయి కానీ ఇది ఒకటి/మొదటిది.

నేను రెండేళ్ళ క్రితం కవితల ద్వారాగా బ్లాగులోకంలోకి వచ్చినపుడు చదివిన మొదటి వ్యాసం "చివుకుల కృష్ణమోహన్" గారి సిరివెన్నెల [సీతారామశాస్త్రిని కాదు] బ్లాగులో ఆదిభిక్షువువాడినేది కోరేది. రాయాలన్న అప్పటి తపనలో అదొక స్ఫూర్తి.

అక్కడే తర్వాత తెగ నచ్చేసిన కథ ఇది.

కారణాలేవైనా ఇప్పుడక్కడ తాజా టపాలు లేవు కానీ ఉన్నవన్నీ మననం చేయతగ్గవే. విజయనగర వాస్తవ్యులో, ఆ ఊరు స్వంతవూరో కానీ ప్రారంభానికిది ప్రారంభం అని రాస్తూ ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమసమూహాలు అని వాపోయారు. ఇంకా చాలా టపాలు ఇలాంటివి ఉన్నాయి. ఆసక్తి ఉన్నవారు చూడండి.

2 comments:

  1. Yey, ALL IS WELL - it is funny but true in deed. ఎమ్మా ని గురించి ఇక్కడ రాసాను - http://maruvam.blogspot.com/2009/12/blog-post_31.html దాదాపుగా ఒక వారంగా పొద్దున్నే ఈ పాట వింటున్నాం కార్లో స్కూల్ కి డ్రాప్ చెసేప్పుడు. ఇవాళ ఉదయం చెప్పింది.. "ఈ పాట నా నోట్లోమ్చి పోవట్లేదు. మా డాడ్ అడిగారు ఏం పాట అని. తనకీ నచ్చిందట. నాకూ ఈల వేయటం వస్తోంది" :) సో, శంఖం లో పొస్తేనేగానీ తీర్థం కాదన్నట్లు, ఈ పాటలో ఈల తిరిగి ప్రాణం పోసుకుంది + నాలాగా ఎందరోనూను.. :) ఒక జ్ఞాపకం ఇలా పురుడు పోసుకుంది

    ReplyDelete
  2. ఈ వారాంతం అనుకోని విధంగా నా దగ్గర ఉన్న పాత పుస్తకాలు తిరిగేస్తుంటే ఈ అపురూపచిత్రం దొరికింది. ఈలపాట రఘురామయ్య గారి చిత్రాన్ని చూడాలనుందా..రండి మరి!

    ReplyDelete