మనమిక ఈలపాట రఘురామయ్య లేదూ మరో ఈడియట్!

తిరుపతి వేంకట కవుల భారత నాటకాలలో కృష్ణ పాత్రలో రఘురామయ్య గారు


..కనుక మనమిక ఈలపాట రఘురామయ్య [ఈలపాట రఘురామయ్యగా ప్రఖ్యాతిచెందిన కల్యాణం వెంకట సుబ్బయ్య గారిని గూర్చి తెలియనివారు ఆయన పేరు మీద నొక్కి చదువుకోండి] లేదూ మరో ఈడియట్.

“second place is the first loser.”

అయితే అవవచ్చు గాక అనుకుని ఆ మొదటి స్థానం భగవంతునికే వదిలేసి... నాకు నేను "“second place is the winner over third place.” అని గడుపుతూండగా మిగిలినవారంతా మొక్కులు, ముడుపులు, పొర్లు దండాలతో [a.k.a. దీక్ష, పట్టుదల, సాధన] తో నన్ను నెట్టివేసారని ఇక ఇప్పుడు నా వెనుక ఉన్నది మరొక్కరే, నా నీడ, అని గ్రహించి ఇంతవరకు రాని పని ఒక్కటైనా సాధించలేనా అనుకుంటుండగా నాన్నగారి మాటలు గుర్తుకువచ్చాయి.

తనకి చిన్నప్పుడు నత్తి ఉండేదట. పెద్దలెవరో నివారణ చెప్తే ఉదయాన్నే గోదావరి కాలువ దగ్గర గులకరాళ్ళు గొంతులో ఉంచుకుని, ఎలుగెత్తి అరిచేవారట. క్రమంగా నత్తి పోయిందట. అలాగే నాన్నగారి స్వానుభావపు మరెన్నో కథనాలు వినివున్నాను. సరే ఇక సాయంత్రం మళ్ళీ బైక్ తొక్కటం మొదలెడదామని 3 idiots చిత్రం లోని ఈపాట వింటూ సింగ్ అలాంగ్ చేస్తుండగా హఠాత్తుగా ఈ పార్ట్ నుంచి నేనూ ఈల వేయగలిగానని గమనించాను. అదీ రాని విద్యనే. ప్రయత్నించినంత కాలం రానిది అనుకోకుండా పట్టుబడింది. వచ్చేసిందోచ్...


దిల్ జో తేరా బాత్ బాత్ పె గబ్రాయె
దిల్ పె రఖ్ కే హాత్ ఉసే తు ఫుస్లా లే
దిల్ ఇడియట్ హై ప్యార్ సే ఉస్కో సంఝ లే హొంత్ ఘుమ
సీటి బజా
సీటి బజా కే బోల్
భయ్యా ఆల్ ఇజ్ వెల్

దీనికి వివరణ ఇవ్వలేను. 'మనసు లోని భావనకి ఈ పాటలోని పదాలకి సరిపడిందా, ఎక్కడో లోలోపల ఈల నేర్చుకోవాలనున్నా తెలియని జంకు ఆపిందా, లేదా ఆలోచన అటుగా ఉంది కనుక వెలికి వచ్చి సాకారమైందా నాకు తెలియదు. అసలిలా అన్నిటికీ కారణాలు, analysis ఎందుకూ,' అని విసుకొచ్చి, 'అంతే నాకు వచ్చేసింది కనుక మనమిక ఈలలో మరీ లైన్ చివర కాదు ముందుకు జరిగాం,' అని సర్దిచెప్పుకుని సంబరపడ్డాను.

2 comments:

  1. Yey, ALL IS WELL - it is funny but true in deed. ఎమ్మా ని గురించి ఇక్కడ రాసాను - http://maruvam.blogspot.com/2009/12/blog-post_31.html దాదాపుగా ఒక వారంగా పొద్దున్నే ఈ పాట వింటున్నాం కార్లో స్కూల్ కి డ్రాప్ చెసేప్పుడు. ఇవాళ ఉదయం చెప్పింది.. "ఈ పాట నా నోట్లోమ్చి పోవట్లేదు. మా డాడ్ అడిగారు ఏం పాట అని. తనకీ నచ్చిందట. నాకూ ఈల వేయటం వస్తోంది" :) సో, శంఖం లో పొస్తేనేగానీ తీర్థం కాదన్నట్లు, ఈ పాటలో ఈల తిరిగి ప్రాణం పోసుకుంది + నాలాగా ఎందరోనూను.. :) ఒక జ్ఞాపకం ఇలా పురుడు పోసుకుంది

    ReplyDelete
  2. ఈ వారాంతం అనుకోని విధంగా నా దగ్గర ఉన్న పాత పుస్తకాలు తిరిగేస్తుంటే ఈ అపురూపచిత్రం దొరికింది. ఈలపాట రఘురామయ్య గారి చిత్రాన్ని చూడాలనుందా..రండి మరి!

    ReplyDelete