దశావతారాలు నీవేనైనావే? ఇదేం లీల?

అమ్మ గర్భమే ఆనంద కడలిగ దేవదుంధుబులు మ్రోగగ అరుదెంచి..
జననీ జఠరే శయనమంటూ అమ్మపంచిన గోరువెచ్చని పాన్పుపై పవళించిన వటపత్రశాయివి
ఆరు నెలల గడవకమునుపే అటునిటు ఈదులాడుతూ,
గిలిగింతలిడుతూ, చిరుపాపవై చిత్రాలు చేసిన మత్స్యావతారానివి
 
నెలలునిండి నడకకే అలిసిన అమ్మకి ఇసుమంత వెసులునీయని ఆకతాయివి
చేతుల, కాళ్ళ చిరు తాపులతో, చిన్ని శిరస్సుతో నా లోకాన ఉద్భవించిన కూర్మావతారానివి
 
అమ్మ స్తన్యమిచ్చిన తొలి క్షీరమారగించి ఆ వేవేలానుభూతి లోకాలు తిరిగిరాను,
నీతొ నన్ను తీసుకుపోయి, పుడమంత నా సంతసాన్ని నీవే మోసిన వరాహావతారానివి
 
నిండు మూడైన లేని నెలపాపవే, అయితేనేం, ఎంత సుధీర్ఘ సాధకుడివైనావు,
నీకు రాని చేష్టేదైనా నిలువునా చీల్చి, బోర్లడి, దొర్లాడి, పారాడిన నరసింహావతారానివి
 
బుడి బుడి అడుగుల నీ చిరునడకకి నే మడుగులొత్తుతూ, ఎండవానల నిను కాపాడుతూ,
నెమ్మదించని నీ ఉత్సాహాన్ని ఉల్లాసంగా చూస్తూ, తలపోసితి నీవొక వామానావతారానివని
 
మారాముల వేళ, గిల్లికజ్జాల వేళ, పంతమాడువేళ, కేళీ వినోదాలా,
ఆదమరువక, వెనుకడుగువేయక అరివీర భయంకురడవైన పరశురామావాతారానివి

అభ్యసించిన విద్యలెల్ల నీకనుక్షణం తోడుండగ, నీకబ్బిన సంస్కారం తావినద్దగ,
ఎల్లలులేని విశ్వాన నిత్యం కీర్తిజీవన పారాయణం చేస్తూ భాసిల్లిన శ్రీరామావతారానివి
యుక్తవయసుకి వచ్చావంటే 'నీవే కాదా నా నెచ్చెలివని మేళమాడిన' కొంటెవాడివి
చిలిపి నీ కళ్ళ ఏ చిన్నదుందోనని నన్ను కూతూహలపరిచిన కృష్ణావతారానివి
'నిర్వాణం చెందిన వేళ నిన్ను తెలుసుకుంటినమ్మా, నన్నెంత తీర్చావో, నీవెంత తల్లడిల్లావో,
పగలు, రేయి, కాలాతీతంగా, మనం మారదాం ఇక నేను నీకు ముందుటాన'న్న బుద్దావతారానివి
రేపేమి ఆపత్తు రానుందో, ఈ మాపేమి విపత్తు దాగునుందో, నాకిక సత్తువలేదీ శోధన చేయను,
వేదననిక నే తలవను, వెతలనిక స్వీకరించను, వాటన్నిటినీ ఖండించగ నీవే నాకు కలికావతారానివి
ఓ మాట:

యధా యధా హి ధర్మస్య గ్లానిర్భవతి భరత
అభ్యుత్తనం అధర్మస్య ఆదాత్మానాం స్రుజమ్యహం
పరిత్రాణాయ సాధునాం వినాశాయ చ దుష్క్రతాం
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే

నా పిల్లల వలన జీవితంలో నాకు కలిగిన అనుభవాలు, అనుభూతులు కొన్ని, కలగనున్నాయని నమ్మకం కలిగిస్తున్న మరి కొన్ని స్ఫూర్తిగా వ్రాసినా, ఈ వర్ణన ప్రతి భాద్యత గల బిడ్డకీ చెందుతుంది. అటువంటి మంచి వ్యక్తిని తీర్చిదిద్దిన ప్రతి అమ్మా, నాన్నకి ఈ కవితతో వందనం.

40 comments:

 1. చెప్పడానికి మాటలు లేవు. అద్భుతం అనడం తప్ప... ( http://pradeepblog.miriyala.in/2007/06/blog-post.html )

  ReplyDelete
 2. మరువంతోటలో మల్లెపూవు పూసిట్టుంది!

  ReplyDelete
 3. kavita caalaa baaguNdi

  pradip's link is also interesting

  ReplyDelete
 4. chala bagundi,meeku yala vastandi ee aalochasnalu.meeru illane rastu undandi memu
  aanandistu untaamu.

  ReplyDelete
 5. ప్రదీప్, సోమశేఖర్, బాబా గారు, అశ్వినిస్రీ, సుభద్ర గార్లకు మరువపు వనాన విహరించి వెళ్ళినందుకు దన్యవాదాలు. మీ నెయ్యానికి, పలుకులకి నెనర్లు.
  ప్రదీప్,
  మీరిచ్చిన లింకు వెంటనే చదివా. బాబా గారు అన్నట్లుగా ఆసక్తికరంగా వుంది. కృతజ్ఞతలు.
  సోమశేఖర్,
  ఇక్కడో పూచిన మల్లె కుదురు నాటినందుకు కృతజ్ఞతలు.
  అశ్వినిస్రీ, సుభద్ర గారు,
  ఈ చిరు పలుకులే మరో కవితకి స్ఫూర్తిని, శక్తినీ ఇస్తాయి.
  మరోమారు హృదయపూర్వక దన్యవాదాలు.

  ReplyDelete
 6. ’ఉష’ గారికి నమః

  ఉ|| మానవ జీవితంబనెడు మాన్య విశేష విచిత్ర చిత్రమే
  కానగ దివ్యమైనదని, కాల పథాన దశావతారముల్-
  మీనము, కూర్మమాదులును మేళవమై నర జన్మమందునే
  లీనమునౌచు తోచునని లీలగ చెప్పిన మీకు వందనాల్!

  - డా. ఆచార్య ఫణీంద్ర

  ReplyDelete
 7. డా.ఆచార్య ఫణీంద్ర గారు, మీ ఈ పద్యం నా మరువపు వనానికి ఇకపై సంజీవని వంటిది. ఎపుడైనా నా కవితా శక్తి సన్నగిల్లినట్లుంటే ఇదే తారకమంత్రం. నాకీ రోజు పట్టభద్రురాలినైనంత సంతసం, అంబరమంటిన హృదయం అన్న అనుభూతి అమాంతంగా అనుభవమైంది. ధన్యురాలను సార్!

  I was an ex-scientist in SW development at Defense Electronics Research Labs. Yet another commonality I observed between two of us. Just thought tell you so.

  ReplyDelete
 8. ఇంత చక్కని కవితకు ఎంత మంచి గా కామెంటినా తక్కువే అవుతుంది.. అద్భుతం ఇంతకు మించి చెప్పలేను

  ReplyDelete
 9. చాలా బాగుంది ఉష గారు. అభినందనలు

  ReplyDelete
 10. ఉష గారూ..
  అందమైన మీ భావాలను అద్భుతంగా ఆవిష్కరించారు.
  నిజంగా అద్భుతం.. ఇంతకంటే ఏమీ చెప్పలేను :(

  ReplyDelete
 11. నేస్తం, ఆత్రేయ గారు, మధుర, అలవాటైన మీ పలుకులు లేక మరుపవువనం బోసిపోయినట్లైంది. ఆ లోటు కొట్టొచ్చినట్లుకనపడింది. ఇపుడు చూడండి తిరిగి పచ్చగా ఎంత కళ కళలాడిపోతుందో? మీ వ్యాఖ్యలు సవినయంగా స్వీకరిస్తూ...ఇట్లు మీ మరువపు వనవాసిని.

  ReplyDelete
 12. హర్షోల్లాసం గారు,

  నా బ్లాగుకు సాదర స్వాగతం. మళ్ళీ మళ్ళీ ఈ గాలిపీల్చను మరువకండేం?

  ReplyDelete
 13. పనుల ఒత్తిడిలోఎంత మంచి టపాను మిస్సయ్యాను,అద్భుతంగా ఉంది అభినందనలు.

  ReplyDelete
 14. ధన్యవాదాలు. ఇప్పుడు నాకు కూడా అద్భుతంగాతోస్తుంది. వ్రాసేట్టప్పుడు కూడా కలుగనంత ఆనందడోలికిది.

  ReplyDelete
 15. నాకు ప్రత్యేకంగా కృష్ణావతారం గురించి చెప్పింది మరీ నచ్చేసింది. హిహిహి. భలే వ్రాసారు :)

  ప్రతీ అమ్మానాన్నలకీ అంకితం... శభాష్.

  ReplyDelete
 16. మరి ఆ కొంటెవాడి కబుర్లు ఎవరికి కాదండి ప్రియం? అందునా యువకులు మీకు కాక మరెవరికి నచ్చుతాయేం? అసలాయన ఉధ్భవించిందే సరస సల్లాపాల్లోనూ ముక్తి, మోక్ష మార్గాలు వున్నాయని చెప్పేందుకే కదా? హ హ హ్హా. మరోమారు మళ్ళీ మళ్ళీ చెప్పే మాటే ధన్యవాదాలు.

  ReplyDelete
 17. చాలా బాగా జీవితానుభవాల్ని జోడించి అవతార విశేషాలు బాగా చెప్పారండీ.

  ReplyDelete
 18. నా బ్లాగుకి సాదర స్వాగతం. వ్యాఖ్యకి ధన్యవాదాలు. మీ బ్లాగులో వున్న టపాలు చదవటం మొదలెట్టాను. నెమ్మదిగా వ్యాఖ్యలు వ్రాస్తాను. పని వత్తిడి తగ్గగానే.

  ReplyDelete
 19. దశావతారాల గురించి చాలా చక్కగా చెప్పారు.

  ReplyDelete
 20. సంతోషమండి, ఇలా మీరంతా చదవటం ఆ కవితకి మరింత వన్నె, గౌరవం కల్పిస్తున్నాయి. నాకు గాల్లో తేలినట్లుందే అన్నట్లుగావుంది. నా బ్లాగుకి మళ్ళీ మళ్ళీ రావాలని మనవితో సాదర స్వాగతం.

  ReplyDelete
 21. sisuvu perugudalalo dashavataaralanu choopimchina teeru adbhutam.

  ReplyDelete
 22. ధన్యవాదాలు, am half-way through, got to wait a bit more [though I feel I can't wait anymore] to come back to you all in pride rather contentment to said my imagination has come true and, I am pretty confident of such a precious/bound to occur moment.

  ReplyDelete
 23. చాల బాగా రాసారండి .. రాతల్లో మాత్రం నేనెప్పుడు మీకు పోటి కాదు సుమండీ ....ఏవో చిన్ని చిన్ని బిందువులు ...మరువంలా గుభాళింపు అయితే మాత్రం కాదు సుమా!

  ReplyDelete
 24. చిన్నీ, ఈ కవిత తాలూకూ భావన ఎపుడూ తాజాగానేవుంటుంది. ఉదయాన్నే మంచు ముత్యాలు అద్దుకున్న మరువపు లేచివుర్ల్ని ఎపుడైనా తాకారా? బహుసుందరం ఆ మొలక, మహదానందం ఆ భావన. మీ వ్యాఖ్యలు మరువానికి అటువంటివే. నేను చతురమాడానంతే, మీ శైలి చక్కగావుంటుంది. అంతమాత్రానికే నా మీద అలిగేస్తే ఎలా చిన్నీ? ;)

  ReplyDelete
 25. ఉష గారూ మరో పది అవతారలు వుంటే బాగుండేదేమో అనిపించింది.మీ దశావతార కవితా వర్ణన ఇంద్రధనుస్సులో సప్త వర్ణాలను మేళవించి తెలియని మరో మూడు రంగులను ఆవిష్కరించాయి.

  ReplyDelete
 26. ఎందుకండీ మరో 10. వున్న వాటి విశిష్టత ఎంతమంది ఎరుగుదురు? ఎన్ని అవతారాలు మహత్యాలు చూపినా కళ్ళెదుట వుండే మనుషుల్లో దేముళ్ళే మిన్న [నా వరకు] . మీ విషయమే చూడండి, ఆ తల్లికి ఆ ఆపత్ సమయంలో మీ అండలోనే దైవత్వం తోస్తుంది కదా? ఇంక వేరే దర్శనం అవసరమా. మీరు ప్రస్తావించారు కనుక మీ కోసం వేచివున్న హరివిల్లు కవితలు చూడండి హరివిల్లు - ౩ : భువిలో దాగినదేమో? http://maruvam.blogspot.com/2009/06/3.html హరివిల్లు - 5 : దొంగలు వేసిన హరివిల్లు http://maruvam.blogspot.com/2009/06/5.html అలాగే నా 100 వ టపా [శతటపోత్సవ వేళ..] శ్వేతం, రంగుల ఆవిష్కారమా! http://maruvam.blogspot.com/2009/06/blog-post_26.html ఈ మూడు వేచివుండగలవు. కానీ [ప్రేమ కావ్యం-2 శ్రీకారం ] ప్రేమని శ్వాసించే ప్రతి మనసులోదీను... http://maruvam.blogspot.com/2009/07/2.html తప్పనిసరిగా మీ వ్యాఖ్యని అలంకరించుకోవాల్సిందే. మన సాహితి మైత్రి సాధికారంతో అడుగుతున్నాను.

  ReplyDelete
 27. ఆలోచన అద్భుతంగా ఉంది.

  ReplyDelete
 28. చాలా బాగా రాసారు ఉషగారు.జీవితపు ఆటుపోట్లని,ఒడిదొడుకులని తట్టుకుని నిలబడి మళ్ళి పయనం సాగించటానికి భగవంతుడు మనకిచ్చిన వరం ఈ పిల్లలు.

  ReplyDelete
 29. మహేష్, ధన్యవాదాలండి. నా తల్లితండ్రుల పట్ల నేను 99.9% నా పిల్లలు నా పట్ల 50% స్థాయికి వచ్చాము. మరేమి ఆలోచనలు వెలికి తెస్తానో? ఇది అతిశయం కాదు, ఆత్మ విశ్వాసం. ఆడపిల్లైనా ఎంతో అండ అన్న ఆ ఒక్క మాటతో కాస్త బాధపడతాను, ఆడపిల్ల ఇచ్చే మానసిక బలం లెక్కలోది కాదా అని. నా పిల్లలు ఇద్దరూ, బాబు, పాప కలిగించిన స్ఫూర్తి ఇది.

  ReplyDelete
 30. తృష్ణ, ప్రతి ఏడాదీ వచ్చి పోతున్నా వసంతం ఎన్ని సార్లు చూసినా తనివి తీరనట్లే, ప్రతి మనిషి జీవితంలో పిల్లలు spring వంటి వారట. ఆ మధురిమ జీవితకాలం అస్వాదిస్తామట. నా వరకు నాకు 24X7 అమ్మతనమన్న ఆ వృత్తి మహా ప్రీతి. వాళ్ళని నాతో విడీవిడనట్లు విడదీసేది ఈ ఒక్క మరువం మాత్రమే, ఇదీ నా మానస పుత్రికే. నెనర్లు. వస్తూవుండండి.

  ReplyDelete
 31. .......................................
  .......................................
  .......................................
  .......................................
  .......................................

  ee madhya ekkado amma gurinchina nabhootho... ane laanti vyakhyananni chusanu. preyasi tho sarasa sambhashanala madhya amma goppathananni cheppina a katha link na bad luck koddi miss ayyanu. still anduloni matalu nannu ventaduthunnayi. ippudu me kavitha.

  idi chadivithe ade gurthochhindi. adikuda meru rasindena? mee gurinchi telisina vallu rasinda? (this question is a bit absurd). asalu idela chooshanantara? meru na blog lo vadilina link chadivi comment pettaka malla okasari chuddamanukunte link miss ayindi. adi january post ani open chesanu. idi dorikindi. chinnappudu missing letters fill chesthe marks vachinatlu nenu miss ayyina link ee manchi kavitha chadivinchindi. comment pettalenu. aa chukkale comment anukondi.

  dayachesi aa paina cheppina post link meku telisthe naku isthara? ma ammaki choopedudamanukunnanu.

  ReplyDelete
 32. a.gaa. gaaru,

  I am 99% sure this is it - http://dheerasameereyamunaateere.blogspot.com/2009/08/blog-post.html#comments

  i have a strong connection to that post in deed!!!! :)

  And, if you like to please check out my other kavita "అమ్మ అమ్మే - తను కాదా అనాది దేవత? " http://maruvam.blogspot.com/2009/04/blog-post_24.html

  ReplyDelete
 33. a.gaa. gaaru, you are the first to dig out this kavita without me providing a link months after its publication. Thank you so much.

  Since you seem to have appreciated this kavita, you do not want to missout on వెదురుపువ్వు రేకువిచ్చి నవ్వింది at http://maruvam.blogspot.com/2009/08/blog-post.html [Please spare about 10 minutes to this post, might take less than a minute to read it but what makes it more interesting is the responses and comments that added so much value to it. This is my all time fav.]

  In general this year so far June had me pen down a variety and that is the hit of the year for Maruvam. :)

  ReplyDelete
 34. Usha garu,

  You understood my requirement quite well. Yes. That's the same post I read months ago, in fact it was the one post that inspired me to blog.

  I have commented about your post already. Really Great efforts.

  Now itself I'm going to read the posts you suggested.

  btw... "i have a strong connection to that post in deed!!!! :)" annaaru. elaa? meeku abhyantharam lekapothe cheppandi.

  ReplyDelete
 35. అ.గా.గారు, నేనిచ్చిన సమాచారం మీకుపయోగపడినందుకు సంతోషం. కాస్త తరిచి చూస్తే మీ ప్రశ్నకి సమాధనం మీకు దొరికిపోతుంది. :)

  ReplyDelete
 36. కవిత అద్బుతం గా వుంది . చెప్పేందుకు మాటలు లేవు .

  ReplyDelete