త్రిశంకు నరకం చూసొద్దామా? కాదంటే స్వర్గమొకటి కట్టేద్దామా?

నేనొక వూరు వెళ్ళాలంటే, ఒక్కత్తినే వెళ్తాను.
ఆ వూరి మొగల్లోనే వుంటుందో పొలిమేర, కొత్తగా చెప్పేదేముందిక?
వూరిలోకి దారి, వూరి నడుమ వూడల మఱ్ఱి,
వీధిలో కుక్కలు, వీధి చివర నీరు రాని నల్లాలు.

అటూ ఇటూ పక్కా ఇళ్ళు, వాకిళ్ళల్లో నలిగిన పక్కలు.
బట్ట కరువైన బిడ్డలు, ఒళ్ళు బరువైన పెద్దమనుషులు.
వుంటుందేమో ఓ బడి కొండొకచో, పక్కవూర్నుండొచ్చే పంతులుతో.
దవాఖానా ఏదని అడిగితే, డాక్టరు గారి అడ్రస్సే ఇస్తారంతా.

పలకా బలపం ఎరుగని ప్రతి పెద్దోడి చేతిలో వుండేవుంటుంది ఏదో ఒక సెల్లు.
మునుపటి మంగలి ఇళ్ళు పట్టి తిరిగితే, ఇపుడంతా ఇళ్ళు పట్టక తిరిగేవారే.
తాత వైద్యానికి లేని తీరిక తక్కిన చోద్యాలకి మాత్రం లెక్కలేదిక.
నా అనుమతికి ఆగక నను తడిమే కుర్రకళ్ళూ, నన్నడిగి దోచే నేర్పరులు.

ఇంకేంచెప్పను ఈ లెక్కకురాని కొండ గుర్తులు?
అయినా నేనే కాదు కళ్ళూ, కాళ్ళూ వున్నవారెవరైనా చెఫ్ఫేవివే.
కావాలంటే మీరూ వెళ్ళండి, నేనింకా వెళ్ళిరాని మరో వూరు.
అకడంతా ఇలానే వుండకపోతే అపుడు పంపండి నాకో ఇ-మెయిలు

ఎపుడో విన్నామే విశ్వామిత్రుని త్రిశంకు స్వర్గం?
ఈవూళ్ళేం తక్కువ కాదు ఇవన్నీ కలియుగ త్రిశంకునరకాలు,
మన నాయకులంతా దాదా గిరిచేసొచ్చిన విశ్వామిత్రులు.
ఇపుడేంచేద్దాం మనిద్దరం? కొత్తూరు వెదుకుదామా ? మనమే వొకూరు కొత్తగా కడదామా?

8 comments:

  1. చాలా చక్కగా చెప్పారు నేటి పరిస్తితి .. ఎప్పటిలా చాలా బాగుంది :)

    ReplyDelete
  2. హమ్మ్ .. కొన్ని వాక్యాలు చాలా బాగున్నాయి, కానీ మొత్తమ్మీద పద్యంలో ఉండాల్సిన ఆత్మ లేదు. మచ్చుకి .. ఏ లక్షణాల వల్ల ఈ వూరు త్రిశంకు నరక మైంది? మీరు పద్యంలో కొన్ని లక్షణాలు చెప్పారు గానీ ఆ లక్షణాలు ఒక వూరిని త్రిశంకు నరకం చేసేలాగా అనిపించడం లేదు.

    "ఆ వూరి మొగల్లోనే వుంటుందో పొలిమేర, కొత్తగా చెప్పేదేముందిక?"
    ఈ వాక్యం తెలియక రాశారో, తెలిసే చమత్కారానికి రాశారో అర్ధం కాలేదు

    ReplyDelete
  3. నేస్తం, ఆనవాయి తప్పక, మీ పలుకులు వదిలినందుకు సంతోషం.

    కొత్త పాళీ గారు, ముందుగా మీ సద్విమర్శకి నా కృతజ్ఞతలు. నేను సమాధానం ఇచ్చే ముందుగా ఒక ముందు మాట. నేను తెలుగు భాష అభ్యసించింది చాలా కొద్దికాలమే. blame me on my catholic convent education for my lack of depth and breadth of this ocean కేవలం నాన్నగారి అభిరుచి నుండి అద్దుకున్న సువాసనలు నిలుపుకునేదే ఈ నా కవితాయానం.

    పద్యంలో ఉండాల్సిన ఆత్మ లేదు అన్నారు - సుమతీ శతకంలో చెప్పినట్లు "అప్పిచ్చువాడు, వైద్యుడు," ననుసరించి మరి కొన్ని నేను అనుకున్న లక్షణాలు లోపించతం బట్టి నాకా వూర్లు నరకంగానే తోచాయండి. పోతే ఇవన్నీ వ్యక్తిగత+సాపేక్ష భావనలు కదా. నా వరకు,
    ఎక్కడ పసి బిడ్డల్ని ఆకలి దహించివేస్తుందో,
    ఎక్కడ వృద్ధులు అనాదరణకి గురౌతారో,
    ఎక్కడ రోగికి వైద్యం అందదో,
    ఎక్కడ గుడి, బడి భావిపౌరుల్ని తీర్చిదిద్దవో,
    ఎక్కడ నాయకులు భక్షకులౌతారో,
    ఎక్కడ నీరు, గాలి కలుషితమో, లేక కరువో,
    ఎక్కడ కుటుంబవాతావరణం లోపించిందో,
    ఎక్కడ సాంకేతిక అపరిజ్ఞానం సంస్కృతిని ఆణగదొక్కేస్తుందో,
    అదే నరకం. అవాన్నీ నా పద్యంకి ఆత్మగా మీకు గోచరించటంలేదంటే, మీది నాదీ ఏకీభవింపు కాదన్నమాట.

    ఇకపోతే, మీరనుకునే నరకపు లక్షణాలు తెలిపితే సంతోషిస్తాను. అలాగే, ఆ చివరి చమత్కారం నా తెలియనితనానికి ఆపాదిస్తే మీరు దాన్ని ఎలా సరిదిద్దుతారో అదీ తెలుపగలరు. ముందుగానే ధన్యవాదాలతొ, మీ వ్యాఖ్య కొరకు చూస్తుంటాను.

    ReplyDelete
  4. ఇది మరీ బాగుందండి.... పొద్దునే అద్దంలో నాముఖం నేనే చూసుకున్నాను. అందుకేనేమో ఒక కవిత తరువాత మరొకటి చదివిస్తున్నారు.కవిత నాకు నచ్చింది. కాకపోతే త్రిశంకు నరకమనేకంటే జీవన వేగం పెరిగిందేమో... సాంకేతిక పరిజ్ఞానము దగ్గరయ్యేకొద్ది మనుషులు ఎదురెదురుగా మాట్లాడుకోవడం తగ్గిపోతుంది కదా.. ఇంతెందుకు ఎదో ఫంక్షన్ అని వెళతామా.. ఎదురుగా వున్న జనాలతో మాటాడుకోకుండా ఫోన్లో ఎక్కడో వున్నవాడితో మాట్లాడుతుంటాము ప్చ్ :(

    ReplyDelete
  5. భా.రా.రె, కవితలు చదివే ఆసక్తివుంది నాకు సద్విమర్శ ఇస్తారనే కదా మీతో చదివించింది. కృతజ్ఞతలు. కార్లో ముందు సీట్ వెనుక సీట్లోకూర్చుని టెక్స్ట్ మెసేజెస్ పంపుకుంటున్న ఒక భార్యా భర్తని చూసాక మీరు గమనించినది నాకు వింతగా అనిపించలేదు. సాంకేతిక అధిరోహణలో సంస్కారాల అధోగతి ఇది. ప్చ్ ఛ్ఛా ఏమీ బాలేదీ పరిస్థితి....

    ReplyDelete
  6. >>భా.రా.రె, కవితలు చదివే ఆసక్తివుంది నాకు సద్విమర్శ ఇస్తారనే కదా మీతో చదివించింది

    అయ్యో, మీరు నొచ్చుకున్నట్టున్నారండీ.. సరదాకి మాత్రమే అలా అన్నాను. ఇష్టం లేకపోతే అసలు చదువను కదా.

    ReplyDelete
  7. Not really, what is there to get hurt. We are all matured to sense a tone used, right? :)

    ReplyDelete
  8. kavitha sare, meerichhe vivaranalu bagunnayi. ika kavitha inkoncham baga rayochhu. manchi concept. adi matram cheppagalanu.

    "ఇపుడేంచేద్దాం మనిద్దరం? కొత్తూరు వెదుకుదామా ? మనమే వొకూరు కొత్తగా కడదామా?"

    idi matram kavitha mothanni oka range ki teesukellindi.

    ReplyDelete