చివరకు మిగిలేదేది?

నీకు నిఘంటువు భాషే కానీ,
నిజ జీవిత బాసలసలు తెలియవని,
మరో సారి నేను తెలుసుకున్నాను.

నేర్పుగా నాకేదో తెలియచెప్పానని,
నువు మురుసుకున్నావనీ తెలుసుకున్నాను.
నీకేమీ ఇకపై నేర్పించవద్దనే వూరుకున్నాను.

ఎగిసే కెరటం విరిగే తీరతదని కదూ చెప్పావ్?
ఇదీ ఎక్కడో విన్నమాటే, కొత్తేమీ అనిపించలేదు.
నువు వల్లెవేసిన పదంతో పోల్చుంటావ్ నా బాధకదే సరని.

మరి, అదేదోపాటలో మాటే, "పడిలేచే కడలి తరంగం,"
తెలియదా నీకిది, అవసరమైతే ఆ అలే సునామీ కాగలదనీ,
ఏడు వూర్లు అమాంతం ముంచివేయగలదనీన్నూ?

వూసులు ఐసుక్రీములు కరిగిపోకతప్పవనీ,
కదూ చమత్కరించావ్ నీదైన హాస్యతీరులో?
ఆశలకీ అలాగే ఇంకేదో పోలికచెప్తావ్. ఆవిరో, నివురోనని,

మరెపుడు, అసలు జీవితమే ఇంకా త్వరగా కరిగిపోతుందనీ,
రాదు జారిపోతున్న ఏ అవకాశం తిరిగి నీ చేతికనీ,
కాలాన్ని క్షణక్షణంగా ముక్కచేస్తే చివరకు మిగిలేదేదీలేదనీన్నీ తెలుసుకుంటావ్?

9 comments:

 1. తెలియనిదారుల్లో నిన్నుతెలుసుకోలేక తగులుకున్నాను
  తప్పుకోకునేస్తమా తప్పులుంటేమన్నింపుము.
  తెలియకనే చెప్పావు తెలుసుకొమ్మని
  తడిపేమాటలతో హృదయం తెల్లబరిచావు.
  ఎంత ఎగిసి పడినా కెరటం తిరిగిచేరేదెక్కడ?
  వూసులు కరిగినా, ఎప్పటికీ కలిసే కనురెప్పలస్నేహమే కదా మనది?
  కాలకాలుడు చూస్తునే వున్నాడు కరిగిపోయే కాలంలో నేన్నించిన దోషాల్ని
  అందించుము నేస్తమా మదిలో నేవదిలిన నీ స్నేహహస్తాన్ని..

  ReplyDelete
 2. పృథ్వీ! ఎంత బాగా వ్యక్తపరిచారు. మదిలోని బాధ ఇట్టే మాయమయ్యేట్లు, నా మనిషిలో మీరు పరకాయప్రవేశంచేసి పలికించినట్లు... ధన్యవాదాలు!

  ReplyDelete
 3. చాలా బాగుంది ఒక లైను అర్దం కాలెదు ..మళ్ళీ వచ్చి చదివి అర్దం చెసుకుంటా :)పృధ్వి గారు చాల బాగా రాసారు

  ReplyDelete
 4. హ్మ్మ్...ఆలోచన ఒకపక్కే ఆగిపోకూడదు.ఎంత బాగా చెప్పారండి.పృద్వి గారి కవిత కూడా చాలా బాగుంది.

  ReplyDelete
 5. చాలా బాగుంది ఉష గారు.

  నా స్పందన " మళ్ళివస్తా " ను చూడగలరు.
  http://aatreya-kavitalu.blogspot.com/2009/01/blog-post_15.html

  ReplyDelete
 6. ఉష గారూ..
  మీరు చెప్పిందీ, పృథ్వీ గారు చెప్పిందీ రెండూ చాలా బావున్నాయి.

  ReplyDelete
 7. రాధిక, అదే కదా చిత్రం, మనకగుపించీ అగుపించనీ అన్నిటికీ మరో ప్రక్క వుంటుందనీ ఎప్పటికీ తెలుసుకోలేం.

  ఆత్రేయ గారు, చదివానండి. ఒక్కోసారి మౌనాన్నే అస్వాదించి, దాన్నే వరించి తరించాలనిపిస్తుంది. నా స్థితి ఇపుడచ్చంగా అదే. నిజంగా అ మౌనంలోని భావాలు, వర్ణనలు వ్రాయాలంటే ఈ జీవితం చాలదు, అంతటి అనుభూతి, నా వ్రాతలు ఇంతటి చక్కని కవితకి ప్రేరణలయ్యాయంటే! పండక్కి బహు చక్కని తాంబూలం లభించిందండి. ధన్యురాలను.

  మధురవాణీ, మీ ఈ ఒక్కమాటా చాలా మధురంగావుంది.

  ReplyDelete
 8. నేస్తం! మీకర్థం కాని ఆ ఒక్క లైనూ చదివి ఆకళింపు చేసుకున్నారా? నేనే విడమరిచి చెప్పాలా, అయినా మీరేనా మరీ ఇంత చిన్నపిల్లలా ఆ మాటనేది, ఎంత బాగా వ్రాస్తారనీ మీ బ్లాగులో? ;)

  ReplyDelete
 9. mIrannaTTlu bhAva sAmipyam koncham takkuva unnaa
  bhaavOdrEkam okE vEDi lOnchi puTTi unDavachchEmo nanDii..

  ReplyDelete