అద్దంలో నా బొమ్మ నవ్వుతుంది! ఎందుకబ్బా?

పుట్టానో లేదో, నాకేవో పోలికలు లెక్కగట్టి,
లేనివన్నీ వరసబెట్టి వ్రాసిపెట్టి,
వున్నవీ లేనివి వంకరలంటగట్టి,
వూర్లో వారంతా ఒక పేరుపెట్టి వదిలిపెట్టారు.

అక్కడితో అయిందా, ఆ పేరు పలికిందెవరు?
పోలికలు పెట్టినట్లే పేర్లూ ఓ పదహారు పెట్టేసారు.
ఒక్కరంటే ఒక్కరైనా నా పేరు పలికారా?
నాన్నగారి కూతురు, నానిగారి కోడలు, ఇవి నా పేర్లలోకొన్నే.

అదేంటని అడిగానని ఇదేం విడ్డూరమోనన్నారు.
పోలోమంటూ వాడ వాడా నా పేరు చెప్పుకున్నారు.
అడిగినోడికి అడగనోడికి పిలిచిమరీ దండోరా వేసారు.
ఇంతకీ నేనడిగింది "మీకు నా పేరు తెలియదా" అనే కదా?

ఇంతోటి పనికే అంత బాగా నా పేరు మ్రోగిందేం?
ఈ ప్రశ్నకి మాత్రం జవాబెవరీయరేం?
ఇదేంటి అద్దంలో నా బొమ్మ ఇటురా అంటుంది?
"ఈ లోకంతీరింతే తల్లీ అడిగినోళ్ళంతా పేరుగలవాళ్ళే" అని నవ్వుతుందీ?

16 comments:

 1. హ..హ..హ ..పేరులో 'నేము'ఉంది??????

  ReplyDelete
 2. ఉష గారూ బావున్నారా( ఇప్పుడు సంతోషమేనా)

  ReplyDelete
 3. ఉషా.. అమ్మాయ్ ఉషా.. ఉషా..ఉషా..
  బాగా రాసావుగా :)
  అన్నట్టూ ఉషా.. ఉషా.. ఇలా పిలిస్తే ఓకే నా మరి :)))))

  ReplyDelete
 4. బాగుంది, బాగుంది, బహు ముచ్చటగా, ముదావహంగా వుంది. నా పేరిపుడు మరీ గొప్పగాతోస్తుంది.

  నేస్తం, భలేగా మున్ముందుగా ఓ మాట వదిలారు. భలె భలే! మరదే నాకు మంట, ఇపుడూ నా పేరు పెట్టి పిలవవేం?

  లలిత గారు, చాలా బాగున్నానండి. మీరెలావునారు? మీ కబుర్లు మన వనంలో చదువుతున్నాలేండి. ఇక ఈ గారూలు వదిలి ఎంచక్క ఉష, ఉష, ఉషోయ్ అని పిలిచేయండేం?

  మధుర, అబ్బా అచ్చంగా, ఇదే నేను అడిగింది, ఇంకోసారి గట్టిగా కేక పెట్టి పిలవ్వా, ఇక పై నో గారూలు కూదా. దెబ్బకి జెర్మనీ నుండి అమెరిచా దాకా ఇంకో సారి, నా పేరు మారు మ్రోగాలి మరి.

  మీ అందరకూ ధన్యవాదాలు. ఇలా చూసాం, చదివాం అన్న చిన్న చిహ్నాలే పెద్ద సంబరం.

  ReplyDelete
 5. "ఉషోదయం"

  మంచిపేరు పెట్టరు
  కొత్త రోజుకు నాంది నువ్వని
  పాత ఆశకు చిగురు నువ్వని
  కొత్త కాంతి పెంచుతావని
  మంచి తావిని పంచుతావని

  చెట్టును బట్టె ఏ పువ్వుకు పేరైనా నన్ను మల్లె పువ్వంటారని మల్లెలలిగినట్టుంది పువ్వు పేరే తావికి కూడాను మరువపు వాసన మరువలేం కదా

  సుగంధమన్నా సౌరభమన్నా వాసన అన్నా తావి అన్నా వెల్లి విరిసిన అందమొకటే అది తెచ్చిన అనుభవమొకటే

  నన్ను ఫలానా వారబ్బాయి అంటే అది ఫలానా వారికి గౌరవం
  ఫలానా వారిని నా తండ్రి అంటే అది నాకు గౌరవం.

  మీ అమ్మాయిని చిన్నీ కన్నా అనకు మరి లేకపోతే తను కూడా నిన్ను
  పేరుగల వాళలోకి జమ వెయ్య గలదు అద్దాలతో బంధమెయ్య గలదు.

  ఏదో చనువు తీసుకుని చెప్పాను. అబ్యంతర మైతే తీసేయండి.

  ReplyDelete
 6. అబ్యంతరమా మీరు భలేవారే ఆత్రేయ గారు, నా పేరుని నేనెంత సగౌరవంగా ప్రకటించుకున్నానో అంతే ఆత్మీయంగా నా మూలాల్ని ప్రేమిస్తాను, అభిమానిస్తాను. నిజానికి నేను నాన్న కూతుర్నని పెద్ద పేరు గడించినదాన్నే. కనుక మీ కవిత నేను సవినయంగా, సంతోషంగా స్వీకరిస్తున్నాను. కేవలం నా అస్థిత్వం కోసమే నా ఆరాటం. మీకు తెలియదండి ఏళ్ల తరబడి ఫలానా ..., ఫలానా అన్న పలుకుబడులకి వొగ్గి బ్రతకాలంటే, ఎంత బాధో, అదీ మనకంటూ ఒక పేరు, గుర్తింపు వచ్చాకాను. సరే మరి మళ్ళి మళ్ళీ వచ్చి నాకు ఇలా ఎదురుచెప్పమని కోరుకుంటూ ... :)

  ReplyDelete
 7. ఓ మరువం బ్లాగరీ! .. ఉన్నపిలుపులూకి ఇది ఇంకోటి చేర్చుకోండి! :)

  ReplyDelete
 8. సరేనండి కొత్తపాళీ గారు, ఏంచేస్తానిక, సెంచురీకి దగ్గరగా వున్న నా పేర్లలో కలిపేస్తా. ఇంకొన్ని ఆ జాబితాలో పడ్డాక, ఎపుడైనా ఇంత తీరిక చిక్కితే అవన్నీ అష్టోత్తరం [ఏమిటీమె సాహసం అనుకుంటున్నారా?] మాదిరిగా ఓ టపాగా వ్రాస్తా. మీరు పెట్టిన పేరు కనపడకపోతే మరి మీరే గుర్తుచేయాలేం? ;)

  ReplyDelete
 9. ధన్యురాలిని వేణూ గారు, నా పేరుతొనే పిలిచినందుకు, నా గోడుని మెచ్చినందుకూను. వేవేల ధన్యవాదాలు.

  ReplyDelete
 10. ఉష గారు ఇంతకీ మీ పేరు కి అర్ధం ఉదయాన్నే ఉసోదయం లో రవి ఇచ్చే కిరణాలా?ఆ ఎర్రటి కాంతా?ఉషా కిరణాల వల్ల రవికి పెరోస్తోందా? లేక రవి నుంచి రావడం వల్ల ఉష కి పెరోస్తోందా?

  ReplyDelete
 11. అయ్యయ్యో అలా జరిగిందా?ఇంతకీ మీ పేరు మరువం కదూ.హమ్మయ్య ఇక మర్చిపోనులే. :)

  ReplyDelete
 12. రాధికా, మీరూనా, కమాన్, మనం మనం ఒకటే, నా పేరు మాత్రం ఉషే, అదంతే మరి! :)

  ReplyDelete
 13. రవి గారు, ఇవన్నీ మునుపెపుడోనోనే సమాధానాలున్న ప్రశ్నలు. ముందా resourcesలో వెదకండి. ఇంకా doubts వుంటే అపుడు ఆలోచిద్దాం మరి ;)

  ReplyDelete
 14. ఉషగారు,

  మీ స్వగత౦లో మీ గత౦
  మీ వ్య౦గ౦లో మీ అద్ద౦(అదే, మీ మనసు)
  చాల బాగా వర్ణి౦చారు.

  బోసినవ్వుల చిన్నపిల్లల మనసులోని ప్రశ్నలకు ఓ భాషన౦ది౦చారు.

  మీ అక్షరాలు మీ పేరును మరి౦తగా మోగిస్తాయని
  మీ అన్వయాలు నాలా౦టి కొత్తకవులకి మరిన్ని పాఠాలు నేర్పిన్చాలని
  ఆశిస్తున్నను.

  ReplyDelete
 15. ఆనంద్ గారు, నా బ్లాగుకి సాదర స్వాగతం, మీ వ్యాఖ్యకి వినమ్ర వందనం.

  ReplyDelete