శృంగార సూరీడు!
రేయి శృంగార శ్రీనివాసా అంటూ పాడిందో ఏమో ఛాయ!
ఏం ముదమార నాపైన గీతమొకటి కట్టవేమని అలిగినాడేమో ఆదిత్య?
ఏమైందో నాకైతే అసలు సంగతి అంతంత మాత్రమే ఎరుక,
ఏకంగా నాకేదో కైత వ్రాసిమ్మని విన్నపాలంపిన రవి సాక్షిగా.
ఎందుకంత ఎర్రగా ఇంటి బయటి కొస్తావ్?
మళ్ళీ ఎర్రెర్రని మోముతో ఇంటి దారిపడ్తావ్?
అంత వలపు చిలకలు అందిస్తదా ఏంటి నీ ఇష్టసఖి?
లేదూ ఆ పని నీదేనంటదా మరి?
ఈ పొద్దు మాత్రం ఎదో అయినట్లే వుందేం?
తమరిదా ఆ అలక, తమరి రాయంచదా నిజానికి?
సగం మొఖం చాటేస్తూ,
అటూఇటూ పోతున్న నల్లమబ్బుల్లో పక్కలేస్తూ,
ఏం చేస్తున్నావేం?
ఎరుపు ఆకసానికిచ్చి, మెరుపు నేలనేస్తానికి పంచి,
నీవు మాత్రం దాటేస్తునావ్
నా కన్నెక్కుఫెట్టిన గురినుంచి.
రేయేదో ప్రియభామిని వగచిందా తాను నలుపనీ,
నీవు చెప్పలేనన్ని వన్నెలున్న విలుకాడివనీ?
వేళకొక రంగు బాణాలు వేలకొద్దీ కిరణాలుగా
ఎక్కుపెట్టకనే వదుల్తావుగా?
వేగిరపడి ఒక్క క్షణమైనా ఆగక లిప్తపాటుగా
రోజులూర్లూ ఆవలీలగా దాటేస్తావ్ కాదూ?
మరీ పొద్దు ఆ నడకేది, ఉదయకాంతులేవి?
లేలేత ఎండబాకులేవి? సంధికొచ్చినట్లా చూపులేంటి?
ఏంటేంటి మళ్ళీ చెప్పు, ఇంకాస్త అర్థమయ్యేలా
మరికొన్ని మాటలు కలిపి చెప్పు?
రేయి చీకట్లొ నీ సరస రాగరంజితమైన
నీ నెచ్చెలి మోము నీకు కనరాలేదని,
వేయి బాసలిచ్చి, వేవేల కానుకలంపి,
వప్పించావన్నమాట ఆ పొద్దే మళ్ళీ నీ వాంఛతీర్చను!
అందుకలా నలుపులద్దుకుని,
నాకు గుట్టు తెలియనీయక అలా పడకింటి దారి పట్టావా?
అమ్మో, భాస్కరా, ఎంత తుంటరివి,
కాదేంటి మరి నీవూనొక శృంగార సూరీడువి?
*** ఒకమాట: ఉదయాన్నే సూర్యోదయం చూస్తూ ఒక 10ని. గడపటం అలవాటు. నిన్న సగం సగం మబ్బుల్లో దాగి, ఈ రోజు అసలు మొఖం చాటేసిన తనని చూసి వచ్చిన చిలిపి వూహిది. జీవితంలో శృంగారం అన్నది ఎంత సున్నితమైనదో, మీరంతా ఈ కవిత లోని భావాన్ని అంతే మధురంగా ఆస్వాదించాలని మనవి!
Subscribe to:
Post Comments (Atom)
ఉష గారూ..
ReplyDeleteఎలా వస్తాయండీ.. ఇలాంటి చక్కటి ఆలోచనలు..
అందరూ చూసే సూర్యుడే కానీ.. మీ పదాల్లో ఎంత ముద్దుగా ఉన్నాడో..
చాలా బావుంది ఈ కవిత.. మీకు అభినందనలు :)
ఉషకోసమో, సంధ్యకోసమో, రష్మి కోసమో, చాయకోసమో, కృష్ణకోసమో ఏవరికో కోసమో మీ మిత్ర, రవి,సూర్య,భాను, ఖగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవితృ, అర్క, భాస్కరుడి దొంగ చూపులు, కొంగుయవ్వారాలు. బాగుంది ఉషగారు.
ReplyDeleteశృంగారానికి ఇన్నాళ్ళుగా తానే రారాజుననుకున్న చందమామ చిన్నబోయాడు.రోజు రోజు కి మీ అభిమాని నయిపోతున్నా.
ReplyDeleteచాలా బాగుంది ఉష గారు. ఈ పాట గుర్తొస్తుంది.
ReplyDelete’గోరు వెచ్చనీ సూరీడమ్మా...పొద్దుపొడుపులో వచ్చాడమ్మా...
వద్దన్నా రావద్దన్నా గుండెల్లో గుడిశ వేసి అది గుడిగా చేసీ ఆ గుడి లో దాగున్నాడమ్మా..’
" ఎరుపు ఆకసానికిచ్చి, మెరుపు నేలనేస్తానికి పంచి,"
ReplyDeleteచాలా చక్కగా చెప్పారు
చాలా చక్కని కవిత .. భలే వస్తాయండి మీకు మంచి మంచి ఆలోచనలు
ReplyDeleteఅవును, రవి గారు, ఎందుకంత జీవించేసారండీ? మరోసారి చదవండి, నేను వ్రాసిన రవి మా వూరి సూరీడేనండి, ఆ మొదటి పాదానికి కాస్త చమత్కారమద్దానంతే, మన దెబ్బకి అదిరిపోయినట్లున్నాడు,ఇవాళ ఏం ఎరగనట్లే పూర్తిగా బయటకి వచ్చాడు. మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు.
ReplyDeleteమదురవాణీ, నేస్తం, మురళి, మిరియాల శ్రీ సత్య భ్రమరార్జున ఫణి ప్రదీప్ గార్లు, మీవంటి వారి ప్రోత్సాహమే నా ఈ ఉత్సాహనికి ఆధారం. మరోసారి కృతజ్ఞతలు.
ఆత్రేయ గారూ, ఇక లాభంలేదండీ, నిఘంటువులు వెదికే పనిలేకుండా ఇక మీ సహాయం అర్థిస్తే చాలనుకుంటా ఇలా మారు పేర్లకీ, పర్యాయపదాలకీనూ. అమ్మో అమ్మో ఎన్ని వ్రాసారు. కాస్త కుళ్ళుకున్నాను,అది వేరే విషయమనుకోండి. ధన్యవాదాలు.
వేణూ గారు, ఎంత చక్కని పాట గుర్తు చేసారండి, urgentగా చిమట మ్యూసిక్లో వెదుకుతా.ఆ పాట గుర్తుకొచ్చినా సరే నా కవిత నచ్చినందుకు బోలెడంత సంతసిస్తున్నా. ధన్యవాదాలు.
మండిపడే సూరీణ్ణి శృంగార నాయకుణ్ణి చేసిన మీ కవితా శక్తి అమోఘం.
ReplyDeleteచిన్నప్పుడు రేడియోలో భక్తిరంజనిలో వచ్చే "శ్రీసూర్య నారాయణా మేలుకో" పాట తప నాకు ప్రత్య్క్షానుభవం కావు సూర్యుడి మీద పాటలేవీ. పాతకాలపు వారి రచనలు చదువుతూ మన ఇళ్ళల్లో పొద్దుటి పనులు చేసుకుంటూ స్త్రీలు పాడే పాటలు చాలా ఉండేవని తెలుస్తోంది.
మరి మారే కాలంతో మనుషులూ, దేముళ్ళూ మారక తప్పదు కదా, కొత్తపాళీ గారు? నిజమేనండి, బాగా గుర్తు చేసారు. మా అమ్మమ్మ కవ్వం చిలుకుతూ, మా నానమ్మ కూరగాయలు వంటకి సిద్ధం చేస్తూ మీరన్న పాటలవంటివేవో పాడుకుంటూ వుండేవారు. http://www.andhrabharati.com/ ఆంధ్రభారతిలో వెదికాను కానీ వెంటనే ఏమీ కనిపించలేదు మరి. మీరిచ్చిన కితాబుకి బహు పసందుగావుంది. ధన్యవాదాలండీ.
ReplyDeleteQuite nice.
ReplyDelete