నా నిరీక్షణ త్రుంపగ రావా, ప్రియా?

ప్రియా, నా కంటి నీటి వరద నిన్ను ముంచకూడదని కనులు మూసి ఒక మనవి.

కాలపు కొమ్మల్లో చివురించే క్షణాలు,

వాడి రాలిన క్షణాల్నిచూసి వెక్కిరిస్తే,
నేలవాలినవి నవ్వుకుంటాయేమో,
ఆ పచ్చదనం రెప్పపాటేనని.

ఆశల గుబురు పొదలు,
వాటి చిక్కని చివురుకొమ్మలూ,

ఆ కొమ్మల వూగే చిగురుటాకుల
కవ్వింపే జీవితానికి కాదా వూపిరి?

నేల చేరిన నిరాశా, నిట్టూర్పుల
క్షణాల్ని తాము
చేరమంటూ
సేదతీరుస్తాయి,
వూరడిస్తాయి,
వూరిస్తాయి.


గుండెగూటిలో చేరిన తీపిక్షణాలు
కదలి వస్తున్న క్షణం
,
వున్నపాటుగా తమది కావాలంటూ
తపించి సంబరపెడతాయి.

ఎన్ని విధాలు
ఈ చిన్ని క్షణాల గమనాలు నేస్తం?

కంటి రెప్పల కన్నీటి క్షణాలు
తామూ మిగలమంటూ జారిపోతాయి.


పెదవి చాటు పద క్షణాలంతే
ఇట్టే పరుగిడిపోతాయి.

ఇన్నిటా గుప్పిట పట్టినన్ని
స్ఫటిక క్షణాలు దాచిపెట్టాను.

నీకు పంచి
నీ ప్రేమని వాటన్నిటా బింబించాలనీ,

నా ఎదురుచూపుల
నిదుర కనులకి
నెమ్మది అందించాలనీను.


కాలం మరో మారు చివురించక మునుపే నా నిరీక్షణ త్రుంపగ రావా, ప్రియా?

స్ఫూర్తి: పృధ్వీ గారి http://pruthviart.blogspot.com/2009/01/blog-post_28.html

8 comments:

  1. బాగుంది కవిత,
    ఒక ఊరటనిచ్చింది.

    ReplyDelete
  2. నీవు నా కొరకు ఎక్కువ సేపు నిరీక్షించరాదని ఇట్టే వచ్చేసి అట్టే కాంప్లిమెంటేసేసా! అబ్బో! మీ నాయికలు స్పృతిసీమని స్వైరవిహారం చేసేస్తున్నారు. వెరీ బ్యూటిఫుల్.

    ReplyDelete
  3. పృథ్వీ, ముందే చెప్పాగా, ఈ కవితకి స్ఫూర్తి మీ చిత్రమే.
    అశ్వినిశ్రీ గారు, చాలా ధన్యవాదాలు. వస్తూపోతుండండి.

    ReplyDelete
  4. ఆశల గుబురు పొదలు, వాటి చిక్కని చివురుకొమ్మలూ,ఆ కొమ్మల వూగే చిగురుటాకుల కవ్వింపే జీవితానికి కాదా వూపిరి?నేల చేరిన నిరాశా, నిట్టూర్పుల క్షణాల్ని తాముచేరమంటూ సేదతీరుస్తాయి, వూరడిస్తాయి, వూరిస్తాయి

    ఉష మ్యాడం మీ కవితలు ఈ రోజే చూచాను చాల బావున్నాయి మీరు రాసిన కవితలో ఆశల గుబురు పొదలు ,వాటి చిక్కని చివురు కొమ్మలూ అనే పద జాలం తో రాసిన కవిత చాల బావుంది

    ReplyDelete
  5. పవన్, చాలా చాలా థాంక్స్! ఒకరు ఇంత వెనుగ్గా వున్నా కవితని చదివి వ్యాఖ్య వ్రాసారు అన్న భావన మరింత తృప్తినిచ్చింది. కవిహృదయానికి ఇటువంటి గుర్తింపులు మరో ప్రేరణకి కారణాలౌతాయి. ధన్యవాదాలు. మీరీ మరువపు వనానికి తిరిగి రావాలని సాదర స్వాగతమిస్తున్నాను.

    ReplyDelete
  6. నేను మీకు ముందే తెలుసా? (అమాయకంగా అడుగుతున్నాను.) ;-)

    ReplyDelete
  7. Hey Priya, cute lil' girl, I expected this question a long time ago. finally the dawn unveiled this moment. Sure I knew you in my dreams.... ;)

    ReplyDelete
  8. priya,

    lokoking like u have cute sense of humor. gotta see ur blog

    ReplyDelete