చీకటి-నిశ్శబ్దం

చుట్టూగోడలు కట్టుకున్నాయా,
గదిలోపల బందీలా?
ఏదైతేనేం ఒంటరి కానపుడు,
వెలుగు వైపు అడుగు పడనపుడు?

గది లోపల సహవాసులు చీకటి,
సవ్వడికి వణుకుతూ నిశ్శబ్దం.
తీయని తెర వెనుక నాటకం,
పాత్రలన్నిటికీ ఒకటే స్వరం.

కిటికీ పగుళ్లలోంచి
వెలుగు దొంగ జొరబాటు,
మారని బల్లితో సావాసం
రెక్కల పురుగు గ్రహపాటు.

ఓరగ మూసిన తలుపు మీద
అగంతకుల వేలి ముద్రలు,
తీరని కలల బతుకు మీదా
అ/పరిచితుల వీలునామాలు.

చీకటికి భాష అలవడింది,
స్తబ్దతకి ఘోష అర్థమైంది.
మలగని దీపాలు తలుపుతడితే,
నిశ్శబ్దం దూరతీరాలకి నడిచిపోయింది..

***************************
పట్ట పగలు పచ్చని పచ్చిక మీద ఆడుకుంటూ పాడుకుంటున్న పిట్టల పాటలు వింటూ పరవశించాల్సిన మనసు ఈ పదాలు రాసిందంటే ఏమిటర్థం? ఏమీ లేదు :) కాకపొతే నాకు బాగా నచ్చిన ఒక అభిప్రాయాన్ని ఇక్కడ పంచులోవాలనిపిస్తుంది.. మరి కొందరికి "నిజంగానే కదా" అనిపించవచ్చని..." కవిత్వం ప్రధానంగా వైయుక్తికము అంటే, యుక్తికి సంబంధించినది అని -- అంటే, దీన్నో థీరమ్లా అబ్జెక్టివ్ గా ఏది గొప్పది, ఏది తక్కువ అని నిర్ధారించలేం.."

2 comments:

  1. ఓరగ మూసిన తలుపు మీద
    అగంతకుల వేలి ముద్రలు,
    తీరని కలల బతుకు మీదా
    అ/పరిచితుల వీలునామాలు

    గుండెగదిలోపలి మాటలను ఒలికించారు. ధన్యవాదాలు.

    ReplyDelete
  2. వండ్రంగిపిట్ట గారు, ఆలస్యంగా చూసానిది. చీకటి, నిశ్శబ్దం వీటితో నిత్యం పోరు సలిపే కవి మానసం నిత్యం చవిచూసేది మాత్రం "ఒంటరిగా ఉంటాననే మౌనం, తోడుగా వచ్చే నిశ్శబ్దం, వేదికగా నిలిచే శూన్యం" అదీ ఏ రంగూ లేని నల్లటి నిశీధివేళల్లోనే..

    ReplyDelete