విశ్వామిత్ర - సమాప్తం

మిత్ర వర్క్ అయ్యాక లైబ్రరీకి వెళ్తూ, గిల్డా కి కాల్ చేసింది వస్తావా అంటూ. ఇద్దరూ కలిసి వెళ్ళటం అప్పుడప్పుడూ అలవాటే. మామూలుగా మాట్లాడుతున్నా మిత్ర కళ్లవెనుక కదలాడుతున్న ఆలోచనలు గమనించిందో లేక తను యధాలాపంగా అడిగిన ప్రశ్నకి మిత్ర స్పందించిందో ..

"మీట్రా, ఈజ్ ఎవ్రీ తింగ్ ఫైన్?" గిల్డా మాటకి మిత్ర కళ్లలో నీళ్ళు చిప్పిల్లాయి. తలవూగించిందే కానీ మాట రాలేదు.

"ఓ హనీ" మిత్ర చేతి మీద తన చెయ్యి వేసి సన్నగా నొక్కి "నాట్ ష్యూర్ వాట్స్ బాదరింగ్ యు, హోప్ ఇట్స్ నాట్ టూ సీరియస్.." అర్థోక్తిగా ఆగిపోయింది గిల్డా.

"గిల్డా, ఐ బీ ఫైన్.." మిత్ర తెప్పరిల్లి సన్న గొంతుతో చెప్పింది. విశ్వతోనే చెప్పాలనుకున్న భావనలు అలా వెలికి రాకుండా ఆగాయి. అవే మాటల్లో జాలువారి అతనికి చేరితే ఇలా వుంటాయి.

- నిను చేరక నేనుండలేను

జీవించడానికే ప్రేమిద్దాం
ప్రేమించడానికే జీవిద్దాం
ఈ మార్గానే ప్రయాణించాను
బీడు భూములు దాటాను
మోడు నీడల నిలిచాను
వాగు పొంగున ఈదాను
హరిత వనాల హసితనయ్యాను

రాళ్ళు, ముళ్ళు దర్శించాను
ఫలపుష్ప రంగుల ఆదమరిచాను
రెక్కల జోరు విన్నాను
అడుగుల జాడ కన్నాను
పయనం అన్వేషణైంది
పరుగుల ఆరాటమైంది

ఎగువ దిగువ ఎంచలేదు
వేగం పెంచటమాపలేదు
ఊర్ధ్వముఖమైంది చలనం
వూపిరి సలపని గమనం
కాలం లెక్కలు విడిచాను
చివరి మజిలి చేరాను
శిఖరాగ్రం కాంచాను

పుడమి గుండె పగులువారినా,
ఎదలోతుల ప్రేమ చెలమ పదిలమవదా!
గరికకాడ వెన్ను విరుచుకు నింగికెగిసినట్లు,
నాలోని నీకై నా నిరంతరాన్వేషణ సాగదా!
నీవున్న తావుల జాడకై మరిన్ని బీటలై విచ్చనా,
ఆ నడుమ పాయలై నిను చేరగ నాప్రేమసాగరాన్ని చీల్చనా!

ఆమె భావుకతని ఆరాదించే అతనికి తన భాష్యాలు సగమే అర్థమౌతాయని ఆమెకి తెలుసు. ఇంగ్లీష్ ఎక్కువగా వాడే అతనికి కవితల పట్ల అభిలాష, మక్కువ ఆమె పట్ల ప్రేమ కలిగించినవే.
********* ********* ********* ********* *********

తలస్నానం చేసిన జుట్టుకి చుట్టుకున్న టవల్, ఒక చేతిలో విశ్వ ఇచ్చిన ప్రేమలేఖల (వంటి) పుస్తకం. విశ్వ ఆ సాయంత్రం వచ్చినపుడు తలుపు తీసిన మిత్ర వాలకమది. విశ్వకి కొంచం ఆశ్చర్యం వేసింది.

సాధారణం గా మిత్ర శనివారం ఉదయాన్నే తలస్నానం చేస్తుంది. నియమానుసారం జీవితం గడిపే ఆమె గురించి అతనికి తెలిసిన విషయాల్లో అదొకటి.


"మిత్ర, కాసేపలా బయట వాక్ చేసివద్దామా?" అతనడిగిన ప్రశ్నకి తల అడ్డంగా వూగించి "విశ్వ నాకిక్కడే వుండాలని వుంది." అంది.

విశ్వకి యేదో మార్పు తోస్తుంది. మిత్ర వాకింగ్ రాననటం చాలా అరుదు.

దాదాపు నాల్రోజులుగా కాల్ కూడా చేయలేదు. తను లాండ్ లైన్ కి చేస్తే అన్సరర్ కి వెళ్తుంది. సెల్ ఫోన్ అంతే వాయిస్ మెసేజ్ వస్తుంది. బిజీగా వున్నపుడు కూడా తనలా వుండదు.

సోఫాలో కూర్చున్న మిత్ర వళ్ళో తలపెట్టుకుని పడుకున్న విశ్వ అలాగే ఓ పది నిమిషాల వరకు మాట్లాడకుండానే వుండిపోయాడు.

"మిత్ర, ఐ యాం సారీ." నెమ్మదిగా అన్నాడు.

"కన్నా ఇపుడా మాట ఎందుకు?" మిత్ర అనునయంగా అడిగింది.

"మిత్ర, నీ మౌనం నన్ను నిలదీస్తున్నట్లుగా వుంది. నా పరంగా యేదో జరిగింది కదూ?" అతనడిగిన తీరుకి మిత్రలో చిన్న కదలిక.

విశ్వ మాట పొడిగించాడు, "అమ్మలు, ఈ రోజు ఉదయం డ్రైవ్ చేస్తూ రేడియోలో విన్నానిది. ప్రేమించటానికే కాదు, ప్రేమని స్వీకరించటానికి మనసుండాలట. నాకు..నాకు అది లేదేమో, నీ అంతగా నన్నెవరూ ప్రేమించలేదు. నాకు అందుకే అందులోని లోతు తెలియటం లేదా? నేను నీ ప్రేమని రెసిప్రొకేట్ చేయలేకపోయానా? నిన్ను కోల్పోతున్నానా?"

అతనడిగిన తీరుకి మిత్ర కి ఆ క్షణంలో అతను ఆటబొమ్మ విరగ్గొట్టుకున్న పసిపాపలా తోచాడు.


నెమ్మదిగా అతన్ని పైకి జరిపి, అతని మెడ చుట్టూ చేతులు వేసి మొహం అతని కుడి భుజం మీద ఆన్చి "కన్నా అలిసిపోయాను. తెలిసిన నీలో నాకే తెలియని మరేదో వెదుకులాడుతూ అలిసిపోయాను." నెమ్మదిగా అంది.

"నువ్వు బాగా అనలైజ్ చేస్తావు కదా. చెప్పు ఎందుకు నాలో ఈ సంఘర్షణ?" అడిగింది.

"అమ్మలు, వచ్చేముందు మన గురించే ఆలోచిస్తూ ఒక ఈ మెయిల్ పంపాను చూడు. నీ కళ్ళలోకి చూస్తూ చెప్పలేను." అన్నాడు.

Just like the way you look for messages from god for any occurrence in your life, not really similarly I got a tendency to analyze things. Our journey has brought us closer. Just felt like trying to analyze the journey.

Fate has brought us together. We both had roles in that, but I played major role in getting you from the shell you locked your self in. You resisted it for a long time.

After all that, some thing has touched your nerves, changed you, you opened yourself, you experienced kaleidoscope of emotions. Physical feelings were also thrown into mix. The ones you fought the most.


As you were going through all this, introspection started on how did it happen? who was responsible? how is this change possible? what happend to all my control? why am I feeling like I am in a spell?

ఇలా సాగిన ఆ ఈ మెయిల్ లో అతను తన మనసులోని ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తున్నట్లుగా అనిపించింది మిత్రకి. ఆమె అతని పట్ల యేర్పరుచుకున్న సాప్ ఫీలింగ్స్ కూడ వివరణ వుంది. ఆ భావనలతో ఆమె పడుతున్న వేదన త్రుంచాలన్న అతని ఆరాటముంది. జీవితం పరిచిన పరుధుల చిత్రీకరణ వుంది. తమ పయనం సాగాల్సిన వైనం వుంది. చివర పేరా చదువుతూ...

You have a willing partner who wants to keep
you happy, content and relaxed, enjoying each moment of life to the fullest for rest of your life.

It is on me to protect our relation, I stand by that. Each episode we go through is cementing our relation further.

From the reasons you are against the marriage, I see physical is one among them. I know that your love is beyond physical. I was absolutely sure of that.

I have told many times that is what I think of you. Physical factor is one dimension of whole thing, as we have not attained that, we will be restless until then. In a man-woman relation, that is the last bastion and it takes a lot to happen between their souls, before they offer themselves to the other person. We are reaching that stage.


ఆ పంక్తుల దగ్గర ఆగిపోయిన మిత్ర నెమ్మదిగా లేచి వంటగదిలోకి నడిచి గ్లాసులోకి నీళ్ళు తీసుకుని చిన్నగా సిప్ చేస్తూ నిలుచుంది. ఇంక అతని మనసు విప్పి చూడాలనిపించలేదు. తన మనసే మరొక కోణంలో నుంచి మరొక భాష్యంలో చదివినట్లుగా వుంది.

వెనగ్గా వచ్చిన విశ్వ వెనక నుండి ఆమెని చేతులతో చుట్టేసాడు. గ్లాసు ప్రక్కన పెట్టి తల వెనగ్గా వాల్చి అతని గుండె లయ వినపడేంత దగ్గరగా జరిగి పూర్తిగా అతనికి ఆనుకుని "కన్నా, ఇవి నా మాటలు కాదు. ఈ మధ్య ఒక కొలీగ్ పెళ్ళి శుభలేఖలో చదివి గుర్తుంచుకున్నవి..

Two lives, two hearts,
joined together in Friendship
united Forever in love

Neither of us can honestly say that we were looking for each other,
But it happened.....

We've known each other by CHANCE, became friends by CHOICE.....
still friends by DECISION....

And here were are.... two lovers by SOUL, Just happy being together,

Not knowing where to go, But very sure, that wherever it is.....
We'll be going together "

మంద్రస్వరం తో యేదో లోకంలో వున్నట్లుగా అంటున్న మిత్ర మాటలు పెళ్ళి మంత్రాల్లా తోస్తున్నాయి.

"నాకు నీ స్పర్శ కావాలి, నీ ఒడి కావాలి, నీ గుండె చప్పుడు జోల కావాలి. ఇపుడు నా మనసు ఆకాశగంగ అంత అమృతంగా, తనువు పాలధార అంత మధురంగా మారినట్లుగా వుంది . నాకు కోరికలు చాలా తక్కువ, వున్నా అవి ఎవరికీ అర్థం కావు. ఇప్పుడు త్రివేణి సంగమంలో స్నానంచేసి, కళ్యాణ శ్రీనివాసుని సన్నిధిలో, వెదురు పుష్పం మీద పవళించి, నీలో కరగాలని వుంది. నువ్వు, నా మనసుకి అధిపతి, తనువుకి సర్వాధికారివి, నా ప్రేమకి పిపాసివి, నా చూపుకి బానిసవీ అయిన ఈ ఘడియల్లో నేను నీ పూజకి విచ్చుకుంటున్న నాగమల్లిని.." ఆమె పెదాలని మూసేస్తున్నంత దగ్గరగా విశ్వ పెదాలు.

"అమ్మలు, ఇంక చాలు." విశ్వ మాటలు అతని అధరాలు తెలిపాయి.

కాసేపటికి ఇండియా కాల్ చేసి మిత్ర తాతయ్య గారికి, విశ్వ తండ్రికి తమ నిర్ణయం తెలిపాక ఇద్దరి లో తెలియని ఉద్వేగం. మిత్ర కి మొదటి నుండి అట్టహాసంగా పెళ్ళి చేసుకోవాలని లేదు. తాతగారికి తన మనసులో మాట చెప్పింది. ఇక్కడే గుడిలో పెళ్ళి చేసుకోవాలనున్నదన్న ఆమె అభీష్టాన్ని ఆయన కాదలేదు. విశ్వ ఇంటి నుండీ యే అభ్యంతరం రాలేదు. త్వరలో ఇద్దరం కలిసి వస్తామని చెప్పారు.

తర్వాత ఇద్దరూ మాట్లాడుకున్నది చాలా తక్కువ. తమ విభిన్న మనస్తత్వాలు, పరస్పరావగాహన, ప్రేమ, ఆకర్షణ ఇలా ఒక్కొక్క పరీక్షని తట్టుకుని ఒకటి కానున్న ఆ శుభతరుణం ఇద్దరికీ చాలా మధురంగా తోస్తుంది.

ఇద్దరిలోనూ ఒకరి కొరకు తమలో తెలియకుండానే మార్పు సంభవించింది. అది ప్రేమ చేసిన గారడీ. ఒకరినొకరు మార్చే ప్రయత్నం చేయకూడదని ప్రమాణం చేసుకున్న వారిరువురు తమకి తెలియకనే చేసుకుంటున్న ఆ సర్దుబాటు వారి జీవితాలకి ఆయువుపట్టు. ఒకరి తప్పిదాన్ని ఒకరు క్షమతో సరిదిద్దుకోనున్న ఆ రాజీ మనసు విజయానికి ప్రతీక. అక్కడ మ్రోగుతున్న ఆ మంగళ వాయిద్యాలు వారి హృదయాల చిరు స్పందనల సవ్వళ్ళే.


********* ********* ********* ********* *********

ఆఫీసులో టీంకి వార్త తెలిపి ఒక వారం సెలవు తీసుకున్నారిద్దరు.

అనుకున్నట్లుగానే గుడిలో పెళ్ళి చేసుకుని తిరిగి వచ్చారు.

ఒకరిలో ఒకరు ఒదిగి పోవటానికి, ఒకరినొకరికి అర్పించుకోవటానికి, ఒకరిలోనొకరిని కలిపేసుకోవటానికి ఆ మధుర క్షణాలకోసం వేచి వున్న వారి సమాగమం, దేవుడు నిర్ణయించిన సమయంలో జరుగబోతున్న ఆ శోభనం వారి అనురాగ సంగమంలో శ్రీకారం చుట్టుకున్న తొలి పుట.

మరోసారి తలారా స్నానం చేసి, తెలియని బిడియపాటుతో తడబడుతూ చుట్టుకున్న చీరలో, స్వాతిముత్యం లా ఎదుటికొచ్చి నిలబడిన మిత్ర విశ్వ కౌగిలిలో బందీ అయిపోయింది. అనుభూతులు కలతోడుకుంటున్న మనసు మూటగట్టుకున్న ఆ ప్రణయపు పరిమళాలు..

"ఈ రేయి నా ఉల్లం ఝల్లుమంది, ఒడలు వొణికింది, తనువు తీపిగాట్లతో తెల్లారేవరకు తబ్బిబ్బైంది. చెమరింపుల్లో తృళ్ళిపడింది, అలవోక నవ్వుల్లో మునకలేసింది. నునుసిగ్గు వరదలో మునిగిపోయింది. విల్లో, వీణో ఆ రెండూ కాని మరేదో నా వంటి రూపిపుడు.

గుండె జారిపోయింది, కాని తన సడి దుంధుబి వలే, డమరుకం వలే ఇంకా వినిపిస్తూనేవుంది. వలువలు వంటిపై వుండమంటున్నాయి, వడుపుగా పక్కకి తొలుగుతున్నాయి. ఎంత చిక్కబట్టుకున్నా ప్రాణం నీ దరికే పరుగులు తీస్తోంది. ఏదారిన వెళ్ళను? నా వాటిని తిరిగి పోగేసుకోను? ప్రకృతంతా ఈ నీ స్త్రీలోనే ఆవిష్కరించినట్లుంది. నిన్ను వూహల్లో ఎన్నో రూపాల్లో నిలిపాను, నీవు ఇంకా క్రొత్తగానే వున్నావు.

కన్నా, ఒక్కసారి ఆ గుట్టు విప్పేయనీ నువ్వూ నిజంగా నల్లనయ్యవేనని, అందులోనే నీ అందం దాగుందని. వురుముకి బెదిరే నన్ను చుట్టూ చేయి వేసి పొదివిపట్టే వేళ సిరిగంధపు చెట్టుని చుట్టిన నల్ల త్రాచు కాదా ఆ కరం. అది అందిన నాది కాదా వరం.

గోరువెచ్చని పొద్దులో వున్న వెచ్చదనం నను హత్తుకున్న నీ మేనిదా క్షణం. ఆ అభయంలో ఎంత భరోసా, జగద్విజేతకైనా సాధ్యమా నా ధీమా?

నిదుర రాని నిశీధుల్లో, నిట్టూర్పు వేకువల్లో, నిలదీసే ఏకాంతాల్లో, నిలవరించలేని వేదనలో నీకై లేఖలు పంపగా పదాలు ఇమ్మని ప్రతి సడిని వేడాను. ప్రేమికనై యాగాలు చేసాను. దక్కిన నిన్నే తిరిగి తిరిగి వరంగా కోరుకున్నాను. నీ ఒక్కడి కోసం నేను కోటి హృదయ గీతాలు వ్రాసాను. నన్నే శ్రోతని చేసుకుని నీకై గానం చేసాను, సాధన వలని ప్రేమ ఆలాపన ఇది.

నా కోసం కవితలల్లి, నా కన్నీట నీవూ కరిగి,నీ బాణిలో కథలల్లి,
నా నవ్వులో నీవూ కలిసి,నా కవితకి స్ఫూర్తివై,
నా అనుభూతిలో నీవూ తడిసి,నీ వాణిలో తేనెలునింపి,
నా బాధలో నీవూ గడిపి,నా తోడువై మెసిలి,
నా నిట్టూర్పులో నీవూ ఎగిసి,నీ కౌగిలితో కమ్మేసి,
నా వొడి నీవూ దోచేసి,నా ఉనికి నాకిక వద్దని,
నీ వినా నే మనలేననిపించిన నా ఆత్మబంధువా,
నీ నా బేధమిక లేనేలేదని మనవైక్యమైన ఆత్మలని నేడు చూపవా?
ఆత్మసంగమం అయిన అస్థిత్వంలో తనువు కలయిక అనివార్యమని, ప్రియా,
ఆ పడుగుపేకల మధురిమల మేళవింపే నాకు నీవిచ్చే కానుకని నిరూపించవా?


నీ చెంత నేను కలువల నవ్వుని నా సరసన నీవు నెలరాజువి. మన సావాసం రాగ భరితం మన కలయిక భువికి దివికీ నిత్య వాసంతశోభ.

నిన్నటి గూట్లో పదిలంగా దాగిన గువ్వ నా మది.
రేపటి వలలోకి కలల కడలిలోకి లాగినవాడివి నీవె కదా!
మన వేదం మన సాంగత్యం, మన పయనం మరో ప్రేమ ప్రస్థానం.
మనమిరువురం బహుదూరపు బాటసారులం, సవాళ్ళకొగ్గని సహవాసులం."

విశ్వ వక్షస్థలం మీద తృప్తిగా నిదురపోయిన మిత్ర మర్నాడు ఉదయం కాస్త అలాస్యంగా లేచేసరికి విశ్వ లేవటం, ముందు గదిలో కూర్చుని వుండటం కనపడింది. స్నానం చేసి అలవాటుగా మొలకలు తీసుకోబోయి, మనసు మార్చుకుని ఒక కప్పులో కాఫీ కలుపుకుని "విశ్వ నువ్వేమి తాగుతావు?" అని అడిగింది. విశ్వకి ఉదయాన్నే కాఫీ అలవాటు.

"నీ అధరామృతం" అన్న ఆ సూటి సమాధానానికి చిరుసిగ్గు కమ్మేసి "పో దొంగమొహం నాకు తెలియని కళలు చాలా వున్నాయి నీలో." మురిపెంగా అంటూ అతన్నానుకుని కూర్చుని యేమిటి వ్రాస్తున్నాడా అని కుతూహలంగా చూసింది.

"ఓ అందాల రాణి
నా వలపుల బోణీ
ఓ సుగుణాలా రాణి
నా హృదయపు అలివేణి
నీ మనసు వెన్న
నీ సాంగత్యం నా అదృష్టం
నీతో గడిపిన సమయం నాకు మృదుమధురం
జన్మ జన్మల మన అనుబంధం అపురూపం!"

చదవటం పూర్తి చేసి, విశ్వ బుగ్గమీద మీటి నవ్విన మిత్ర నవ్వు తెరతెరలుగా, పూల జల్లులు కురిసినట్లుగా విశ్వకి శీతల పవనాల మాదిరి తాకింది. అదే అతని తొలి ఆశుకవిత.

విశ్వ,మిత్ర - వారి జీవితాలే వారి పయనం. ఒకరి ప్రేమ అన్వేషణ ఆఖరి మజిలీ మరొకరు. గలగల గోదారి మిత్రవింద. తనని తాను ఆమె ప్రేమలో ఆవిష్కరించుకున్న మౌనమూర్తి విశ్వనాథ్. విశ్వామిత్ర ప్రేమైక జీవన ప్రతినిధులు.

మనం ఒకరికొకరం వరాలం.
తరతరాల ప్రేమ చరిత్ర ఇది.
మనం మనకు అపురూపాలం.
ఇహపరాల ఆత్మ సంయోగమిది.

అని జీవనగీతం పఠిస్తున్న ప్రేమికులు.

[సమాప్తం]

54 comments:

  1. was kind of waiting for this
    విశ్వామిత్ర label మీద click చేసి కిందనుంచి పైకి చదవడం మొదలెట్టా ;)

    ReplyDelete
  2. నేస్తం, మిత్ర మనసులోని భావాలకు అడ్డుకట్ట వేస్తూ సహజీవనానికి అడుగిడిన శుభసందర్భమో ఏమో కానీ రచన ఒక ప్రవాహంలా సాగింది.ఆ ప్రవాహాన్ని అలా కొనసాగించి వుంటే ఇంకెంత సాహిత్య సృష్టి జరిగి వుండేదో. చాలా బాగుంది.

    ReplyDelete
  3. నని తాను ఆమె ప్రేమలో ఆవిష్కరించుకున్న మౌనమూర్తి విశ్వనాథ్

    My GOD!!! Maruvapu vanam lo spelling mistake bharinchalemandee. Sorry telugu available kaaledu. Okavela adi typo aithe twaragaa sarijeseyyandi.

    ReplyDelete
  4. ఎప్పుడెప్పుడా అనుకున్నాను అప్పుడే అయిపోయిందా....చాలాబాగుందండి!

    ReplyDelete
  5. పరిచయం నుండి ప్రణయం వరకూ సాగిన ప్రయాణాన్ని చాలా బాగా రాశారు :)
    కాని...., ఏదో క్లుప్తంగా చదివిన భావన...అక్కడక్కడా చాలా వివరంగా ఉంది, మధ్య మధ్యలో ఇంతలోనే 2,3 ఏళ్ళు గడిచాయా అనిపించింది...

    ReplyDelete
  6. అయ్యో! అప్పుడే ఐపోయిందా?

    ReplyDelete
  7. రెండు మూడు వారాలు గా త్వరలో ముగిస్తారు అని అనిపిస్తుంది కానీ కనీసం ఇంకో నాలుగు వారాలు ఉంటుందేమో అనుకున్నాను. అప్పుడే అయిపోయిందా అనిపించింది.

    ReplyDelete
  8. హ్మ్ ....విశ్వనాథ్ , మిత్రవిందల సమాగమనంతో విశ్వామిత్ర పరిసమాప్తమైందన్న మాట !వారు హనీమూన్ కి , మనం ఇంటికి ..అదే మన బ్లాగుకి ! పదండి పదండి వారికి ప్రైవసీ నిద్దాం :) :)

    ReplyDelete
  9. సరిజేసినందుకు నెనెర్లు. ముగింపు తియ్యగా ఉంది. మరోసారి చదివి మళ్ళా కామెంటుతాను

    ReplyDelete
  10. భా.రా.రె. నా మీద అభిమానానికి థాంక్స్. ఏదో జీవకావ్యం కానీండి సాహిత్యసృష్టి అంత పెద్ద మాట వుందంటారా? ;)

    ReplyDelete
  11. గీతాచార్య, రాత్రంతా కూర్చుని వ్రాయటంలో దొర్లిన టైపోని పట్టుకున్నందుకు ఆ వారా నాకు మరో రెండు కనపడేలా చేసినందుకు థాంక్స్. క్లుప్తంగా చెప్పినా గానీ మళ్ళీ వస్తానన్నారు కనుక, మీ అభిప్రాయానికై చూస్తూ..

    ReplyDelete
  12. పద్మార్పిత, సునిత, అవును హమ్మయ్యా అయిపోయింది. మొదటి నుండీ చదువుతూ ప్రోత్సాహం ఇచ్చినందుకు థాంక్స్.

    ReplyDelete
  13. నేను, మీరు రావటం మానారని తెగ ఇదైపోయాననుకోండి. చివరాఖరుకి తాంబూలం ఇచ్చి పుచ్చుకోను వచ్చేసారు. టాంక్యూ... :)పరిచయం నుండి ప్రణయం వరకే కదా యే జంటకైనా అసలు పయనం. ఆ తరువాత అలుకలు, అవగాహనలు తప్పవు. అదే అనుబంధం, అనురాగం లోని బలం. అందుకే కొన్నిసార్లు వేగంగా నడిపింది. అది సరేగానీ ఈ మొదటి కథకి మార్కులివ్వరా మరి? ;)

    ReplyDelete
  14. వేణు, మరీ సాగదీయాలపించలేదండి. ఇంత వరకు సాగిన కథలోనే అన్నీ చెప్పేసా. ఇక పునరావృతాలే కానీ లేని వూహాగానాలు, కొత్తందనాలు కల్పించాలనిపించలేదు. :) మీకు చాలా థాంక్స్. మీ ప్రతి వ్యాఖ్య ఒక అర్థాన్నిచ్చిందీ కథకి.

    ReplyDelete
  15. పరిమళం, చక్కగా సరైన మాట అని ఆ జంటని వారి ఏకాంతానికి వదిలేసారు. ;) ఈ కథకి 12/30 చాలా క్రిటికల్ డేట్. అది నా పదహారవ భాగంతో నవలని పూర్తి చేయాలని పెట్టుకున్న డెడ్ లైన్. ఆ లక్ష్యం నెరవేరింది. థాంక్స్.

    ReplyDelete
  16. ఎన్ని జన్మల బంధమో తెలియని జన్మాంతర రుణాల బంధాలు కొన్ని వుంటాయి, ఆ బంధాల విలువ అనుభవానికే కాని అర్ధం అయ్యేట్లు చెప్పటం చాలా కష్టం అటువంటి ఒక అందమైన బంధాన్ని అనూభూతుల పర్వం గా మలచి వింటర్ లో నే చైత్ర మాసపు సుగంధాలను అందించిన నీకు అభినందనలు ఉషా.

    ReplyDelete
  17. భావన, చాలా థాంక్స్. నా గుండె లోని మాట ఇట్టే వ్యక్తపరిచావు. ఎంతో వేవ్ లెంత్స్ కలిస్తే తప్ప ఇలా సాధ్యం కాదు. నిజానికి ఈ కథ ఎత్తుగడ లో నా ఉద్దేశ్యం కొద్దిగా మార్చి ప్రేమకావ్యం లిఖించేసానేమో ఇక్కడ ;) అందుకే ఇలా వెలికివచ్చింది.

    ReplyDelete
  18. హమ్మయ్య మొత్తానికీ ముగించేశారన్న మాట. బాగుందండీ. మొత్తం సరిగ్గా చదవలేదు. అంతా అయ్యాక చదువుదామని. మీరు దీన్ని ప్రచురించే ప్రయత్నం చేస్తారా? ఇక ప్రింటు తీసుకుని ఇయరెండులో తీరిగ్గా చదవాలి. చదివాక మీకిష్టమైతే అప్పుడు చెప్తాను కొన్ని విషయాలు. అప్పటిదాకా... హ్యాపీ బర్త్ డే

    పిఎస్ దయచేసి నా పేరు పక్కన గారు తగిలించండి. ;) లేక పోతే బావోదు. అలా గారు లేకుండా అనేది మా అమ్మ ఒక్కతే.

    ReplyDelete
  19. అడ్డ గాడిద (The Ass) గారు, నాకు గుర్తున్నంత వరకు బహుశా ఇంతకు మునుపు రెండు సమాధానాల్లో మీ పేరుకి "గారు" తగిలించలేదు. అవి సరిదిద్దాను. ఇప్పటికైనా చెప్పారు కనుక ఇకపై జరగదలా. నేను ఆ "గారు" నా పేరు నుండి వదిలించుకునే ప్రయత్నంలో, మిగిలినవారికీ ఆ సంబోధన ఆపాను కానీ చిన్నతనం చూపాలనో/చేయాలనో కాదు.

    "హ్యాపీ బర్త్ డే" ఎవరిదో నాకు తెలియదు.

    ఈ రచనని నాకు ప్రచురించే ఉద్దేశ్యం లేదు. మీ అభిప్రాయం ఎపుడైనా ఇవ్వొచ్చు. పైన అదే వ్రాసాను. నెనర్లు.

    ReplyDelete
  20. చిన్నతనం అని కాదు ఉష (గారు) సమస్య నా పేరులో ఉంది. అడ్డ గాడిదా అనే కన్నా కాస్తంత మర్యాదగా అడ్డ గాడిద గారు అంటే బావుండును కదాని. వేరే ఉద్దేశ్యం లేదు. లేదా సింప్లీ మొదట్లోలా అ గా అన్నా ఓకే.

    ఎవరికన్నా బై చెప్పటం కన్నా ఇలా హ్యాపీ బర్త్ డే చెప్పతం నాకున్న ఒక వెధలవాటు. మీ బర్త్ డే నాడి ఆ విస్శ్జెస్ తీసుకుంటే చాలు ;-)

    ReplyDelete
  21. అయ్యో అప్పుడే ఐపోయిందా ? ఈ ప్రేమకథ చాలా బాగుంది . చక్కని ముగింపు నిచ్చారు . మీ నుండి ఇంకో వెరైటీ ప్రేమ కథ ,( ఈ సారి బ్లాక్ అండ్ వైట్ లో ) కోసం ఎదురుచూస్తూవుంటాను .

    ReplyDelete
  22. అప్పుడే అయిపోయిందా? ఎలా చెప్పాలో తెలియటం లేదు కాని..ఏదో అసంతృప్తి..చివర చివర మరీ పరుగెత్తారా? మొదట్లో లీనమయినట్లు చివర్లో కథలో లీనమవ్వలేకపోయాను. May be the fault is not yours..it may be mine.

    ReplyDelete
  23. మాలాకుమార్ గారు, మంచి కితాబిచ్చారు కానీ రంగుల లోకంలో విహరించి, రంగురంగుల కలలు కనే నాచేత "బ్లాక్ అండ్ వైట్" కథ అదీ ప్రేమ కథ వ్రాయించటం నను సృజించిన బ్రహ్మకి కూడా సాధ్యం కాదు, కనుక ఆ నిరాశ మీకు తప్పదు.

    ReplyDelete
  24. సిరిసిరిమువ్వ గారు, నా కథ కంత సీన్ వుందని గానీ, ముగించేస్తే అయిపోయిందా అని అడిగేవారుంటారా అని గానీ అనుకోలేదు సుమీ! ఏమిటో ఇప్పటికిప్పుడు పార్ట్-2 అమ్మో దేముడా ఇదెక్కడి గోల అనిపించనా అని ఆలోచిస్తున్నాను. ;) మొదట నిదానంగానే కదా పరిచయాలు మొదలయ్యేది, ఇందులో కథేమీ లేదండి. కథనం వరకు నాకు తెలిసినంత న్యాయం చేసాననే అనుకున్నాను. మొదట్లో పేస్ స్లో గా వుందని అనటంతో కాస్త వీలైనంత ముందుకు జరపటం జరిగింది. ఇక ఇదొక జీవ కావ్యం వంటిది. ఆ ఇరువురి పయనం కీ చివరి మజిలీలు వాళ్ళ కలయిక. ఇక కొనసాగింపు అనవసరమనిపించింది. మీ తుది వ్యాఖ్యకి చాలా థాంక్స్.

    ReplyDelete
  25. చాల బాగా రాసారండీ .మీ విశ్వచెప్పలేనంత నచ్చేసాడు -:)

    ReplyDelete
  26. ఉష గారు మంచి story present చేసినందుకు ధన్యవాదములు . కాకపొతే ఈ story మీదేనేమో అని అనుకుంటున్నా.

    మీ విశ్వామిత్ర మొదటి నుండి ప్రతి వారం miss కాకుండా చదువుతున్నాను . క్లైమాక్స్ కోసం టెన్సన్ తో ఎదురు చూస్తూ ఇప్పటివరకు comment పెట్టలేదు .

    మీ Hero విశ్వ ఏ అమృతం త్రాగిన మీరు మాత్రం మంచి సాహిత్యామృతం త్రాగించారు మా చేత .

    నాకు సాహిత్యం గురించి అంతగా తెలియక పోయిన నాకు మాత్రం ఈ స్టొరీ కాదు కాదు ప్రతి word కూడా చాలా చాలా బాగా నచ్చేసింది.its true.

    ReplyDelete
  27. మిత్ర, విశ్వ ఒకరిలో ఒకరు లీనమైపోయి నన్ను పట్టించుకోరని, directగా పెళ్ళి భోజనాలకి వచ్చేశాను ;)

    పిల్లకాయ్ ని నేను మార్కులు వెయ్యడం ఏమిటండి...
    సమాప్తం అని శీర్షిక పెట్టారు కాని, మీరు ఇప్పటివరకూ చెప్పింది మిత్ర కధ, విశ్వ కధ. విశ్వామిత్ర ఇప్పుడేగా మొదలైంది...

    ReplyDelete
  28. సమాప్తం సరే. ఇంతకూ మాకు పుస్తకమెప్పుడు పంచుతున్నారు ?

    ReplyDelete
  29. చాలా అందమైన ముగింపు. ఈ ముగింపు చదవగానే నాకు ఎంతో ఇష్టమైన కూచిపూడి యక్షగానం "గిరిజా కల్యాణం" లో మంగళం పాట గుర్తు వచ్చింది. అది.. "బిడియపడి భీష్మించి పెండ్లికొడుకైనట్టి జగమేలు తండ్రికీ జయ మంగళం.." అని వస్తుంది. విశ్వాని తలుచుకుంటే ఆ విశ్వనాధుడే గుర్తు వచ్చాడు.
    మరిక మన మిత్ర గురించి చెప్పాలంటే..ఏమని చెప్పాలి?
    అందమా... కాదు.. వర్ణిస్తే అందమే చిన్నబుచ్చుకుంటుంది..
    మరి తెలివా...ఊహు..అదీకాదు..తెలివితేటలు ఆమె భావుకత్వం ముందు మోకరించాయి
    పందిరి నల్లుకున్న జాజిమల్లి వాసన పందిరి కంటినట్టే
    మిత్ర చుట్టూ ఉన్న పరిసరాలన్నీ ఆమె ప్రభావంలో పడిపోయాయి.
    భావుకత్వమైనా...వాస్తవికత అయినా ఆమె దృష్టిలో అపురూపమే..
    ప్రతి చిన్న సంఘటనా ఒక కావ్యమే
    ప్రతి చిన్న మలుపూ ఒక మైమరపే...
    ప్రతి కదలికా ఒక ప్రేమ భంగిమే
    ప్రతి రాత్రీ వసంత రాత్రే...
    అవును అంతే...

    ReplyDelete
  30. అవునండి మర్చేపోయాను. మాకు పీడీఎఫ్ ఎప్పుడు పంచుతారు? త్వరగా చేసి పంచుతారని ఆశిస్తూ...

    పంచకపోయినా ఫర్లేదు. బ్లాగులో కథనలా ఉంచేయండి. అప్పుడప్పుడూ చూస్తుంటాం. ఈ మధ్య టపాల్ని టపాకాయల్లా డిలీట్ చేస్తున్నారు.

    ReplyDelete
  31. ushagaaru, no words...that was a great happy ending...my hearty congrats for a successful 'first writing'...!!

    ReplyDelete
  32. చిన్ని, మీ మీద అలిగేసా. ఆ మౌనమూర్తి విశ్వ చెప్పలేని భావాలన్నీ భాష్యాలుగా మలిచిన మిత్రనొలిలేస్తారా ;) అంతేలేండి మాట్లాడనివాళ్ళే మంచోళ్ళు ..

    సుజ్జీ, ఆసాంతం చదివినందుకు, చివరి భాగాన మీ సంతకం చేసినందుకు థాంక్స్.

    ReplyDelete
  33. శివరంజని గారు, మీ అభిప్రాయానికి నిజంగా గర్వం కలుగుతుంది. ;) నెనర్లు. కథ నాదంటారా, పోనీ అలాగే కానీండి. కాదు బాబోయ్ అంటే మళ్ళీ మనం ఎక్కడినుండో మొదలెట్టాలి. నా విశ్వ అందరికీ నచ్చేసాడు కనుక నాకు ఓకె. :) వాడంతే, దొంగమొహం ముందే చెప్పాగా కథలో. అంచేత కథని కథగా వదిలేద్దామా?

    ReplyDelete
  34. నేను, చిన్నవాళ్ళైనా పెద్దమాట అన్నారు. సహజీవనం అసలు కథ. అది మాత్రం ఎవరికీ పంచ[లే]ను. ;)

    ReplyDelete
  35. ప్రదీప్, ఎంతచక్కగా చెప్పారు :) అది సరేగానీ పుస్తకం అచ్చేయించి, పంచటానికో చెయ్యేస్తారా మరి?

    ReplyDelete
  36. గీతాచార్య, పిడియఫ్ చేయటం ఇప్పట్లో కాదు గానీ ఇక్కడి కథ ఇక్కడే వుంటుంది, తీరిక లేని మీకు ఎప్పుడు తీరితే అప్పుడే చూడండి. మొదటి నుండి ప్రత్యేక శ్రద్దతో చిన్న చిన్న తప్పుల్ని కూడా ఎత్తి చూపి, అలాగే తగు సద్విమర్శ చేసినందుకు థాంక్స్. ;)

    అ.గా. గారు, మీ సూచన మీ అలవాటు యేదైనా అది నాకు చెందటానికి ఇంకా కొన్ని నెలలు ఆగాలి. బై. ;)

    ReplyDelete
  37. శ్రీలలిత గారు, నేను గిరిజాకల్యాణం లో శివుడుగా నర్తించాను. మీకది జ్ఞప్తికి రావటం అదీ నా హీరో గారి పోకడని బట్టి ప్రస్తావించటం భలే. ఇక మిత్ర మాటల్లో విశ్వని మూర్తీభవించి, ఆ ఇరువురి మీద కవితలల్లి, మొదటి నుండి ప్రత్యేక తరహాలో ప్రోత్సాహించినందుకు మీకు మటుకు ఋణపడిపోయాను. విశ్వామిత్ర సృష్టిలో నిజానికి ఒక జీవితకాలం తిరిగి జీవించి వచ్చాను. నెనర్లు.

    ReplyDelete
  38. చాలా రాయాలని ఉన్నా...మాటలు రాక... ఇందాకా ఆ ఒక్క వాక్యమే రాసానండీ......మాది పెద్దలు కుదిర్చిన వివాహమైనా మీ ముఖ్య పాత్రలలో మా ఇద్దరినీ కూడా చాలా సార్లు చూసుకున్నాను...అందుకే మీ పాత్రలు మరింత దగ్గరైయ్యాయి...మైమరిపించాయి...!!

    ReplyDelete
  39. తృష్ణ, సమాధానాలు వ్రాస్తూ కాస్త బ్రేక్ తీసుకోవాల్సివచ్చేసరికి మీ రెండో వ్యాఖ్య. ;) మీరీ కథలో నాకన్నా ఎక్కువగా లీనమయిపోయారన్నది చాలాసార్లు నిరూపించారుగా. పైగా మీ కథని నా కథేనని దబాయించారు. ఇంకా కథ మీద అత్రుతతో మీవారి కనులెర్రబరిచారు. నన్ను చెప్తావా లేదాని నిలదీసి, కనీసం తననడిగే అవకాశం అయినా ఇవ్వకుండా నాతో నిజం కాని నిజాలు, నిజాలంటి అబద్దాలు, అబద్దాలు అనలేని నిజాలు చెప్పించేసారు. అబ్బో ఒకటేమిటీ ఎన్ని ఘాతుకాలు చేసారని ;) హమ్మయ్యా ఫైనల్ గా మన ఇద్దరి అక్కౌంట్ సెటిల్ అయింది. చాలా థాంక్స్ తృష్ణ. అనుభవం లోని అనుభూతి మీకు తెలుసును కనుకనే అంతగా ఇష్టపడి చదివి నాతో మరింత ఇష్టంగా వ్రాయించారు. నా తర్వాతి తరానికి నాదంటూ ఓ కథని మిగిల్చాను [కాస్త భారం గా అయిందేమో, ఈ సాప్ బుద్ది పోదు]. కథ ఇక వ్రాయను అనుకుంటే ప్చ్ కాస్త బెంగ.. ;)

    ReplyDelete
  40. ఉషగారు నాకు కవిత్వం చదివే అలవాటు కాస్త తక్కువే... మీరు మొదట్లో రాసే కవితలు నాకు చాలా వరకూ సరిగా అర్ధమయ్యేవి కావు నా తెలుగు పరిఙ్ఞానం ఒకకారణమైతే పైపైన చదివేసే అలవాటు మరో కారణం. మీకాన్వెంట్ చదువులు గురించి తెలిశాక నాలో ఓ రకమైన పట్టుదల వచ్చి శ్రద్దగా ఏకాగ్రతతో చదవటం మొదలుపెట్టాను అప్పటినుండీ మరింత ఆస్వాదించగలిగాను.

    ఏదేమైనా కేవలం ఓ బాటసారిగా అప్పుడపుడూ వచ్చి పోయే నన్ను మీ మరువపువనాన నిత్యవిహారిని చేసింది మాత్రం మీ విశ్వామిత్రనే. ఫలానా కారణం వలన ఈ కథ నచ్చింది అని విశ్లేషించలేకపోవచ్చు కానీ కథమాత్రం చాలా నచ్చింది. నిజంచెప్పద్దూ ఇకపై కథ వ్రాయరు అంటే మీకే కాదు నాకూ కాస్త బెంగ గానే ఉంది.

    ReplyDelete
  41. వేణు, ఈ కథకి ముందు నుండీ కీలకమైన పాఠకులలో మీరొకరు. ఇందులో అంశం, నా రచన స్థాయి అన్నది ప్రక్కన పెడితే, ఒక రచయిత్రిగా నేను చూసిన ఫీడ్బాక్ మీ నుండి నిత్యం అందింది. నేను ఎంత పట్టుదలగా భాష నేర్చుకున్నానో, అంతే ఇష్టంగా ఉపయోగిస్తాను. విశ్వామిత్ర తర్వాత ఏమిటీ అన్నది నాకింకా తెలియదు. ఈ విరామాన్ని, అది నా మనసుకి వేస్తున్న కళ్ళాన్ని గమనిస్తూ, ప్రస్తుతానికి నేనూ మరోసారి అన్ని భాగాలు చదువుకుంటూ, ఎక్కడ ఇంకాస్త మెరుగ్గా వ్రాసివుండొచ్చు, ఏదీ బాగా వ్రాసాను అని అధ్యయనం చేసుకుంటున్నాను. ఇకపై కూడా మీరు రావాల్సిందే అని నిర్భంధించను, కానీ నా కవితలు కూడ మిమ్మల్ని అలరిస్తాయి అది మాత్రం నిజం ;) నెనర్లు.

    ReplyDelete
  42. ముగింపు బాగుంది. నేను పని పూర్తి చేసి సెలవ పెత్తేసరికే ఐపోయింది. ఇప్పుడు మొత్తం చదువుతాను

    ReplyDelete
  43. సమీరా వైఙ్ఞానిక్ గారు, చివరగా వ్యాఖ్యానించేవారిలో మీరూ మిగిలారని అనుకున్నాను. మీవలె ఒకరిద్దరున్నారు, చదివి చెప్పాలి అన్నవారు. చూస్తుంటాను మరి. నేనూహించిన ఒక విమర్శ మీ నుండి వస్తే అపుడు చెప్తాను. లేదూ ఇంతే సంగతులు. ప్రస్తుతానికి సెలవు. ;)

    ReplyDelete
  44. ఉషగారూ,
    అయితే మీ నర్తన చూసి తీరాల్సిందే.. ఎప్పుడో మరి. నేను ఆశాజీవిని.

    ReplyDelete
  45. నిజ జీవితం లో మానసిక పరిపక్వత వచ్చాక ప్రేమలో పడి పెళ్లి చేసుకోవడం వల్ల
    ఇంకా ఆనాటి భావాలూ చెదిరి పోకుండా ఇన్నాళ్ళైనా పదిలంగా వుండి మీ చేత
    ఈ కధ రాయించాయి .ఇంకా నాకు అనిపించిన లోపం ఏంటంటే
    కధ వేగంగా ముందుకు నడిపించవలసిన సందర్బాలలో
    వర్ణన ఎక్కువై కొన్ని కొన్ని చోట్ల స్కిప్ చేసి ముందుకు
    వెళ్ళిపోయే అవకాశం ఉండింది .మా సుబ్బాలు ఊసు మళ్లి ఎత్తకుండానే
    కధ ముగించేసారు . చార్మినారు నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలను విస్మరించడం తగునా?

    ReplyDelete
  46. రవిగారు, మీ అభిప్రాయానికి/సద్విమర్శకి థాంక్స్. మానసిక పరిపక్వతకి వయసుకన్నా ఆయా వ్యక్తుల మనస్తత్వం, పెరిగిన వాతావరణం, పెంపకం కీలకం, ఇది నా అభిప్రాయం. నా వరకు ఆ పరిణితి జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకొనాల్సిన అవసరం, తరుణానికి వచ్చిందనే చెప్తాను. కథలో కల్పన వుందన్న వాస్తవాన్ని మీరు విస్మరించవద్దు. ఇక నా నిజ జీవిత సుబ్బాకి చెప్తే ఇపుడు మా వూర్లో కురుస్తున్న మంచంత తెల్లగా, చల్లగా నవ్వుతుంది. నెనర్లు.

    ReplyDelete
  47. శ్రీలలిత గారు, ఇక మీ పని అయిపోయినట్లే ;) ఈసారి వచ్చినపుడు మీ ఇంట్లోనే మరో ఆరంగేట్రం అదీ ఫ్యూజన్ మాత్రమే. మీరే సాకు చెప్పినా ఇక "వదల బొమ్మాలి నిన్ను వదల" ;) నాకు కవితలకన్నా ప్రాణం డాన్స్ అంటే. వీటికన్నా అందులోనే నేను మెరుగు.. నెనర్లు..

    ReplyDelete
  48. విశ్వామిత్ర పిడియెఫ్ : సాహితీ మిత్రులకి మరోసారి మీరంతా ఇచ్చిన ప్రోత్సాహానికి సవినయంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, బ్లాగులో సన్నిహితమైన జ్యోతి తనంత తనుగా ఇదిగో నీకొక చిరు కానుకని నన్ను ఆశ్చర్యాన ముంచి చేసి ఇచ్చిన పిడియెఫ్ మీ అందరి కోసం.

    ప్రక్కనున్న "ఇవీ చూడండి...!" విభాగంలో వున్న లింక్ మీద నొక్కి గానీ ఈ క్రింద వున్న లింక్ తెరిచి కానీ చదవవచ్చు. నమస్సులతో - మీ నేస్తం

    http://docs.google.com/fileview?id=0ByYmzYchoOSIYzQ1ZDBkYTctMjc3NC00ZjBkLWI2NjMtMWFlMGIwNjJkOGYw&hl=en

    ReplyDelete
  49. ఉషగారూ,
    "మా ఇంటి తలుపులు మీకోసం ఎప్పుడూ తెరిచే ఉంటాయి.." అన్న డైలాగ్ మరీ కృతకంగా ఉంటుందేమో నని..
    మీకు
    మా హృదయపూర్వక ఆహ్వానం....

    ReplyDelete
  50. వచనంలో ప్రేమ కావ్యం చదివిన అనుభూతి. కావ్యాలలోని నాయికానాయకులు నిజ జీవితంలో ఉంటారని నమ్ముతున్నాను. ఇక తోచిన అభిప్రాయం ఏమిటంటే కొన్ని చోట్ల సంభాషణలు, వర్ణన వాస్తవానికి దూరమేమో! అని. అయినా ఇటువంటి ప్రేమ కావ్యాల్లో తర్కాలు పనికి రావని కూడా అనిపిస్తుంది.

    ReplyDelete
  51. వెంకటరమణ గారు, నిజమేనండి ఇది కథగానో, రచన కి కావాల్సిన వస్తువుపరంగానో, శైలి పరంగానో నిలిచే వర్క్ కాదు. ఒక ప్రేమ కావ్యమంటి కథ. నెనర్లు.

    ReplyDelete
  52. great way of Ending
    first ever story in maruvam is awesome
    congratulations

    ReplyDelete
  53. థాంక్స్ హరే కృష్ణ గారు. ఇకపై వచనం వ్రాసినా ఇంత సుధీర్ఘంగా వ్రాయలేనేమో. పైన వ్రాసిన వ్యాఖ్యల్లో, ముందు బాగాల అభిప్రాయాల్లో ఈ జర్నీ లో నేర్చుకున్న అంశాలన్నీ కూడా వ్రాసాను. నెనర్లు.

    ReplyDelete