అద్దమంటి చెక్కిళ్ళు,
ఆదమరిచి నిదురబోవు కళ్ళు,
అమ్మానాన్నల అపురూప చిన్నారి,
విరబూసిన పువ్వంటి ఓ పొన్నారి.
అద్దం ఎరుగని కళ్ళు,
అలుపెరగకూడని వొళ్ళు,
అమ్మానాన్నలెరుగని అభాగ్యురాలు,
విధిత్రోసి పారవైచిన అనామకురాలు.
పొన్నారికి పని తెలియదు,
అనామికకి పని తప్పదు,
ఆ ఇద్దరికీ పైనున్నది ఒకటే కప్పు,
ఎన్ని యుగాలుగా జరుగుతున్నదీ తప్పు?
ఆ చేయి ఈ చేయి కొలత ఒకటే,
అర జాచిన ముంజేతి తీరు ఒకటే,
గీతల్లోనే రాతలు ముందే తెలుసుంటే,
గీతాసారం తెలిసినవారికైనా కలగదా కనువిప్పు?
*** *** *** *** *** *** *** *** *** ***
ప్చ్, పాతదే ఈ చిత్రం కానీ చిన్ని చిన్ని చేతులతో పని చేసే ఆ పనిపిల్లల దైన్య స్థితి నాకెప్పుడూ చాలా మనస్తాపం కలిగిస్తుంది.
గీతలు మారలంటే గీతాసారాంశం చెప్పినవాడిని వేడవలసిందే కదా.. గీత నే గీయలేదే లలన గత జన్మ గతానుభందమంటాడో, యుగాలకైనా తెలియక తెలియ చేసినా వేడక, తనకు తనే రాసుకున్న గీతంటాడో అడిగి చూడూ.. :-)
ReplyDeleteగీతల్లోనే రాతలు ముందే తెలుసుంటే
ReplyDeleteగీత చెప్పిన కృష్ణునికి విలువేముంది
గీతాసారం తెలిసినవారికి కనువిప్పైతే
గీతగీసి[ నొసటన] గీతకై ఎందుకా పరుగులు
ఆ చేయి ఈచేయి కొలతొకటైతే
చేయి చేయి కలిపే మనుషులేరి?
పొన్నారి పైకప్పు కృత్రిమ నక్షత్ర కప్పు
అనామికకు ఆరవిరిసిన ఆకాసమే పైకప్పు
ఏది తప్పు, కుంచించికు తిరిగే పొన్నారినా
లోకమంత తానై ఎగిరే అనామికదా?
This reminded me Mark Twain's historical fiction "the Prince and the Pauper" which is one of my childhood favourites...its a story of two boys who are identical in their looks..one is a prince and the other one is a poor boy...hope u know the story....
ReplyDeleteప్చ్! నాకెప్పుడూ ఆ పనిపిల్లల్ని చూస్తే జాలివేస్తుంది.
ReplyDeleteమీరు చెప్పిన తీరు బాగుంది.
గీత గీతలో ఎన్ని రాతలో
ReplyDeleteగీత రాసినవాని చిద్విలాసాలో
మార్చాలని మానవుడెన్ని ప్రయత్నాలో!
పాపం , పని పిల్లల గీతలేనా ? బుజ్జి బుజ్జి పాపాయిలని , మోడల్స్ గా పెట్టి లైట్ల వేడికి బలి చేస్తారే , వారి గీతలను చూసినా నాకు ఇదే భావన కలుగుతుంది . హుం !
ReplyDeleteప్చ్...
ReplyDeleteఇలా గుండెని మెలిపెట్టేస్తే ఎలాగండీ... ఈ చిత్రం మనకు పాతదే.. భావితరాలకు పూర్తిగా కనుమరుగైన చిత్రమవ్వాలి అని కోరుకుంటున్నాను..
ReplyDeleteభావన, మొత్తానికి కన్నయ్య పక్షపాతిననిపించావు. నిజమే అంతా కర్మఫలమేనా. సంచిత కర్మ ఫలమ్ తప్పదా? నిష్కామకర్మ చేయటం మనకు రాదన్నమాట. చిలకా ఇది ఎంత మమ్చి తత్వమే. తెలియని నేనిలా విలవిలా..
ReplyDeleteభా.రా.రె. మీ ప్రతి స్పందన బాగుంది కానీ అనామిక కి తన స్వేఛ్ఛాలోకం అనుభవించే/అస్వాదిమ్చగల అవకాశం జీవితం ఇవ్వదే అదే అసలు సమస్య. పొన్నారికి మరొక లోకం మరింత విశాలమైనదొకటున్నదనీ గ్రహణ రాదు.
ReplyDeleteఆ చేయి ఈచేయి కొలతొకటైతే
చేయి చేయి కలిపే మనుషులేరి?
ఇది మొత్తానికి మనిషి కులానికున్న జాడ్యం. నెనర్లు.
తృష్ణ, I used to carry a DVD of "the Prince and the Pauper" but never could watch it. కాకపోతే "రాజు-పేద" వంటి కథ కావచ్చు అనుకున్నాను. ఈ కవితకి స్ఫూర్తి అక్కడకి వచ్చినపుడు కనపడే పనిపిల్లలు, ఒకసారైతే ఎనిమిదేళ్ల పిల్ల పెద్ద దాకతో ఆన్నం వార్చటమ్ చూసి నివ్వెరపోయాను. మరొక మూడురోజుల్లో తన ఎనిమిది నెలల తమ్ముడి చెయ్యి ఆ వేడి గంజిలో కాలిందని చూపినప్పుడు చాలా బాధ పడ్డాను.
ReplyDeleteసృజన, పద్మార్పిత, సునిత, సానుభూతికి ధన్యవాదాలు. ఇది ఆ చైల్డ్ లేబర్ సమస్యని మట్టుబెట్టటానికి మొదటి దశ.
ReplyDeleteమాలాకుమార్ గారు, బలమైన మరో సమస్యని ఎత్తిచూపారు. నిజానికి కాన్వెంట్ చదువుల పేరిట పిల్లల్ని నిర్బంధం చేయటం చూసి కూడా నాకు చాలా వేదన కలుగుతుంది. ధన్యవాదాలు.
ReplyDeleteవేణు, నిజమేనండి ఎప్పుడు చూసిన మనసుని మెలిపెట్టి, మన నాగరికతని సవాల్ చెసే సమస్య ఇది. ఒకప్పుడు "పరిచారికలు, దాసీలు, బానిసలు, పనివాళ్ళు..." ఇలా ఆ వంతు తమ బాధామయ జీవితాన్ని గడుపుతూనేవున్నారు. ఇప్పుడు గణనీయంగా తగ్గినా చైల్డ్ లేబర్ ఇంకా సమస్యే. వ్యక్తిలో అవగాహన, సామాజిక స్పృహ, సంఘటిత పరిష్కారం కావాలి, వ్యవస్థలో మార్పు రావాలి. అక్ష్యరాస్యత పెరగాలి. మీరన్న భావితరాలు ఈ చిన్ని చేతుల కష్టాన్ని ఇకపై చూడకూడదని ఆశిద్దాం. కృతజ్ఞతలు.
ReplyDeleteఉషాగారూ,
ReplyDeleteఈ టపా చదువుతుంటే నాకు భానుమతి, ఎ ఎన్నార్ నటించిన బాటసారి సినిమా లో పాట ఙ్ఞాపకం వచ్చింది. ఏదైనా ప్రశ్న తర్కానికి అందకపోతే వేదాంతం లోకి దిగిపోతాముకదా.. అదే అందులో ఉంది. ఎప్పటిదో పాట.. గుర్తు చేసుకుని రాస్తున్నాను.. అక్కడక్కడ తేడాలుంటే తెలిసున్న వాళ్ళు చెప్పం డి. ఈ పాట నాకు చాలా ఇష్టం.
ఆ సినిమాలో భానుమతి బాల వితంతువు. ఆమె స్నేహితురాలు అత్తవారింటినుంచి పుట్టింటికి వచ్చినప్పుడు భానుమతి ని కలవడానికి వచ్చినప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగే సంభాషణలా ఉంటుందిది.
సృష్టి చేసినది దేవుడైన మరి నాశము నేల సృజించె
కనుల నొసగినది దేవుడైన మరి అంధుల నేల సృజించే..?
వేద శాస్త్రములు చదివినవారే ఎరుగరు సృష్టి విలాసం
అల్పబుధ్ధితో ఙ్ఞానదాతనే సలుపకు పరిహాసం
బ్రతుకంతా పలు ప్రశ్నల మయమై బ్రతుకును జన సముదాయం
బదులు కోసమై వెదకుట మాని బ్రతుకుటయే న్యాయం.
నిష్కామ కర్మ చేయగలం కాని దానికి ఎన్ని జన్మల సాధన కావాలి ఉషా. ప్రతిది ధర్మ యుక్తం గా చేసిన ధర్మ రాజుకే తప్పలేదు మనమెంత.. చేసిన ప్రతి పని కి మరి ఇప్పుడో అపుడో మనమే కదా భాద్యత దారులం. పలాయన వాదం అంటారేమో కాని కొందరు.
ReplyDeleteఎత్తుకున్న వస్తువూ, చెప్పిన తీరూ, కవితనల్లిన విధానం ముచ్చటగా ఉంది. అందుకు నా అభినందనలు.
ReplyDeleteతెలుగులో ఇదే తొలి కామెంట్. ఎందుకో ఇక్కడే చెయ్యాలనిపించింది.
అన్నీ బాగానే ఉన్నాయి కానీ, ఇక్కడో విషయం ఉంది. వాళ్ళు పని చెయ్యకా తప్పదు. మనం బాధ పడకా తప్పదు. ఎవరన్నా పూనుకుని ఉద్ధరిస్తారా అంటే... అదీ లేదు. అది అలా జరిగిపోతూనే ఉంది తర తరాలుగా.
ReplyDeleteమరీ మరీ తల్చుకుని గుమ్మడి గుండె పట్టుకుంటే జనాలు నవ్వేంత ఎక్కువ చేసినట్టు ఇలాంటి విషయాల్లో మాటలకన్నా, చేతలే మిన్న.
మీరేమన్నా ఇలాంటీ వాటిని సరి చేసే ప్రయత్నం చేస్తే ఇక మీకు బాధ అనవసరం. ఆ ప్రయన్తం చెయ్యందే మీకు బాధ పడే అర్హత కూడా లేదు. మీరు మొదటి రకానికి చెమ్దిన వారని నా ఆశ. జన్యా చూశాక
మీ ఫీల్ పట్ల సంఘీభావం తెలియజేస్తున్నా. మీరు జన్య ద్వారా చేస్తున్న కృషివలన కొందరి అరచేతి రేఖలైనా మసిబారకుండా వుంటాయని ఆశిస్తూ...
ReplyDeleteNo Comments...
ReplyDeleteశ్రీలలిత, భావన, అలౌకిక కోణంలో ఈ సమస్యని చర్చించినందుకు థాంక్స్.
ReplyDeleteప్రదీప్, అయితే వాకే... :)
“ ఆ చేయి ఈ చేయి కొలత ఒకటే,
ReplyDeleteఅర జాచిన ముంజేతి తీరు ఒకటే,
గీతల్లోనే రాతలు ముందే తెలుసుంటే,
గీతాసారం తెలిసినవారికైనా కలగదా కనువిప్పు?”
అబ్బా ఎంత బాగా చెప్పారు ఉషా! బావుంది.
కల్పన, ధన్యవాదాలు. నా చిన్నతనం నుండీ వ్యతిరేకించి నా వంతు కృషి సలుపుతున్న సమస్య ఇది.
ReplyDeleteఅడ్డ గాడిద (The Ass) గారు, వర్మ గారు, అన్ని సమస్యలకీ పరిష్కారం ఒక్క రోజులో రాదు, ఆ పరంగా కలిగిన ఆలోచన పంచుకోవటం లోనూ తప్పులేదు.
ReplyDeleteఇక జన్యా నేను చేసే/చేయగల సేవల్లో ఒకటి మాత్రమే. నా వలన ఏదో ఒక సహాయం అంది ఒక ప్రయోజనాన్ని సాదించినవారి పేర్లు వ్రాయటం నా అభిమతం కాదు. సంఘసేవ అన్నది నిర్వచించటం నాకు రాదు, నేను ఆర్థికంగా వెనుకబడిన వారికి మాత్రం బంధువుని. అది నాకు తెలిసినవారి నుండే కాదు, నా మనసుకి తోచిన యే సమస్యకైనా నా వంతు సేవ చేస్తాను. అందునా చిన్న పిల్లలు, వృద్దాప్యంలో వున్నవారు, అసహాయ స్థితిలో వున్న స్త్రీలు నాకు దగ్గిరవారు. నెనర్లు.