వివశ గీతం

కాలం ఇంత అస్థిరమేం?
ఒక్క క్షణాన్నీ నిలవనీదు..
నీతో నడిచిన క్షణాల నీడలు
నేను వడిసి పట్టానందుకే.
రాక మానని రేపుకి
ఎపుడో బదిలీ చేసాను.

నీవున్ననేడు ఆగకున్నా,
నీవు లేని రేపు రాదందుకే.
నువు పదం చేర్చని నా పాట లేదు,
నీకు తెలియని నేనూ లేను.
నీవు లేని గతం వద్దు,
నను వదలని భయమూ వద్దు.

నీ ముద్ర వేసిన ఈ మోహం,
నే స్వరాలు కూర్చిన సంగీతం.
నీ కోసం నేను చేసిన గానం,
నిదురించే నీ హృదికి సుప్రభాతం.
నువు పిలిచిన పిలుపు,
యుగాంతం వరకు నాకు మేలుకొలుపు.

అసలు నీవెవరు, నేనెవరు,
మనదొకటే చిరునామా అయ్యాక?
నన్ను నీలో కలిపేసాక,
నా మదికేమిటీ మతిమరుపు?
మైమరపు బంధాన చిక్కిన నేను,
నీ మమతావేశపు పాశాన బందీని.

17 comments:

  1. "అసలు నీవెవరు, నేనెవరు,
    మనదొకటే చిరునామా అయ్యాక?"

    nice...

    ReplyDelete
  2. ఇంతకీ ఆ ముద్దుల రాకుమారుడు ఎవరో చెపితే మాకన్నా అర్ధం అవుతుంది గా.
    అతనికేలాగు అర్ధం కాదన్నారు కాబట్టి .

    ReplyDelete
  3. శివ ఝటాజూటము వీడి
    హిమశిఖర పీఠమును పారాడి
    ఉత్తుంగ తరంగయై
    ఉన్మత్త అభంగయై
    దూకే నీ భావ గంగాలింగమునకై
    హరి శయన తల్పమై
    సిరి జనకులా అనల్పమై
    హిమకర పూర ప్రకల్పమై
    అమోఘ సంగమమునకై
    నేనైపోతా సహస్ర బాహు కెరట
    విశాల సంద్రమై ...................

    ReplyDelete
  4. "కాలం ఇంత అస్థిరమేం?
    ఒక్క క్షణాన్నీ నిలవనీదు..
    నీతో నడిచిన క్షణాల నీడలు
    నేను వడిసి పట్టానందుకే.
    రాక మానని రేపుకి
    ఎపుడో బదిలీ చేసాను."

    అస్థిరమైన కాలాన్ని కట్టడి చేసిన అనుభూతి కోసం, బ్రమే అని తెలిసినా ఈ బదిలీ కన్నా మనం ఏం చేయగలం!! మీకవిత చాలా నచ్చేసింది.

    ReplyDelete
  5. నీతో నడిచిన క్షణాల నీడలు
    నేను వడిసి పట్టానందుకే.

    ఎంత మధురమైన భావన....

    ReplyDelete
  6. ఇదుగో ఉషా నీ కన్నయ్య సందేశం ఇమ్మన్నాడు ఇచ్చేసా. నా పని ఐపోయింది బాబు.

    కాలం అస్తిరమా
    ఆలోచించి చూడు నేస్తం....
    కలిపి గడిపిన క్షణాన్ని గురుతు తెలియని గమకాలలో కలిపి
    ముందున్న కాలంలో నింపిన స్తిరమైన క్షణాల సముదాయం కాలమైతే
    అస్తిరమెలా అవుతుంది....

    నీవున్న నిన్న, మనమైన నేడు
    గతమంత మనమే, గుర్తు తెలియని భావి తరం మనమే
    భయమెందుకే ఇంక బంగారు మొలక..

    నీవు నేను కలిసిన సంగీతమా
    నీ పాదం లో నా పదం కలిసిన కధకళియా
    మన జంట గొంతుల జతి గా సాగే
    సుస్వర మధుర కావ్య గానాల మీద ఆన
    మనకు లేనే లేదు యుగాంతాం
    మన ప్రేమ యుగ యుగాల కు అనంతం

    నువ్వెవరు నేనెవరు
    వేరు వేరే కాదు
    నీ నీడ నే కాద
    నా గుండె సడి నువు కాద
    వలపు మైత్రీ వనాన విరిసిన పుష్పాల రీతిగా
    బందీలమే కాక ఇంకేమిటే చెలి..

    ReplyDelete
  7. ముందుగా ఉష గారికి అభినందనములు. ఈ క్రింది కామెంట్లన్నీ సరదాగా వ్రాసినవే. మరువపు వనంలో ఈ మధ్య పనివత్తిడిలో కోతి సరిగా తిరగలేక పోయింది. కాబట్టి అన్నీ కలిపి ఒకసారే

    మీ కవిత చాలా బాగుంది. కెవ్వు కేక కవిత ఇది. [ ఒకరి కామెంట్ ]

    అద్భుతమైన కవిత. మనసు చిత్రాన్ని ఆవిష్కరించారు [ మరొకరి కామెంట్]

    కవితనై నీ కనుపాపలో బొమ్మనైపోనా
    మమతనై నీ మధురస్మృతుల గిలిగింతపెట్టనా
    భవితనై నీ భావిబాటన పూలు జల్లనా
    సన్నిహితనై నీ సాంగత్యసాగరాన ఓలలాడనా [ ఇది పద్మార్పిత గారి కామెంట్ ]

    ప్రేమ దోమ [ ఇది శ్రీశ్రీ గారికి క్షమాపణలతో ]
    ప్రేమస్తే ఏమున్నది గుండె పగలడం తప్ప
    దోమకుడితే ఏమున్నది రకరకాల జ్వరాలు తప్ప.

    జీవం జీవం జనజీవనం
    లోకం లోకం సమస్తలోకం
    కాకుల వలె ప్రేమికులు
    కావ్ కావ్ అన్న అరుపులు
    దోమల వలె తల్లిదండ్రులు
    ముయ్ ముయ్ అన్న అరుపులు

    కాకులు కాకులు కాకులు
    దోమలు దోమలు దోమలు
    కలిసి మెలసి
    కరిగి విరిగి
    వింత జీవితం

    పోరాటం
    అస్థిత్వం
    దోమల నైజం

    అవిశ్వాసం
    అస్థిరత్వం
    కాకుల నైజం.


    ఇక అసలు కెలుకుడు.... నామీద కత్తులు విసిరిన భావన

    కృష్ణా, ఏమి చెప్పను, ఆ తెలిమంచు వేళలో అప్పుడే జారి పడుతున్న ఆకు పాడే నిర్వేదగానం ఎపుడైనా విన్నావా? తన గూడు వదిలి తల్లి పాదాల చెంత చేరుతున్నానని ఆనందమా! లేక ఇక అమ్మ పొత్తిళ్ళనుంచి విడిపడుతున్నానని నిర్వేదమా? ఎలా చెప్పనురా కృష్ణా. ఆ ప్రేమ బంధనంలో కరిగి అందునుంచి ఉద్భవించే వెలుగులో మండి తరించితే కానీ నీ కవిత అర్థంకాదు ఉషమ్మా...

    ఇక నా స్పందన చిరుస్పందనలో http://chiruspandana.blogspot.com/2009/12/blog-post_31.html

    ReplyDelete
  8. తృష్ణ, ఎత్తుగడ అదే, వెనక్కి కొనసాగింపు నాకలవాటే కవితలు వ్రాసేప్పుడు. నెనర్లు.

    వర్మ గారు, మీ అభిరుచికి తగ్గ ముక్క మాత్రం ఎన్నుకుంటారెప్పుడూను. :)

    వేణు, నిజమే కదా కనీసం అలా అనుభూతుల పంటలు/రాశులు ఈ క్షణాల విత్తుల నుండి సేద్యం చేయగలుతున్నాము. థాంక్స్, బాగా చెప్పారు మీ మాట కూడా.

    రాధిక, బహుకాల దర్శనం ఇచ్చారు నా చిరకాల వాంఛితం నెరవేరను. థాంక్యూ!

    ReplyDelete
  9. రవిగారు, ఎవరూ అడగని ప్రశ్న వేసారంటే మీవొక్కరికే తెలియదింకానన్నమాట. నా ప్రిన్స్ ఇడిగో ఇక్కడే వర్ణించబడ్డాడు :) http://maruvam.blogspot.com/2009/08/blog-post_17.html

    ReplyDelete
  10. Rakhee గారు, అంత సంక్లిష్ట కవితగా వ్యాఖ్య వ్రాసినందుకు ధన్యవాదాలు. మీ కవితలు చదువుతుంటాను. మీవంటి వారి భాషాపరిజ్ఞానం అనన్యం. నెనర్లు.

    ReplyDelete
  11. భావన, ఒక్కోసారి నాకు మౌనం కన్నా మరే భాషా గుర్తుకు రాదేమిటీ అని ప్రశ్నించుకుంటే అది తనని చూసిన ప్రతి క్షణం నాలో కలిగే మార్పు అని సమాధానం వస్తుంది. తనని చూపే వూసు, తన తలపు అన్నీ నాకు మైమరపే. యుగాలు చూసిన ప్రేమ, వరాలు కురిపిన ఆత్మలు మావి. చాలా థాంక్స్.

    ReplyDelete
  12. భా.రా.రె. గారు, ఏమీ అనుకోవద్దు ఇలా అడిగానని, కోతి మామాలు కోతేనా [అమాయకంగానే సుమా! ;)] కల్లు కూడా తాగివచ్చిందా? మీ వ్యాఖ్య చూసి నేను నవ్వుతుంటే నా ప్రక్కనే కూర్చుని "లవ్ ఆజ్ కల్" హిందీ సినిమా చూస్తున్న తెలుగు రాని నా స్నేహితురాలు, నాకు హిందీ రాక రేగిచెట్టు క్రింద గుడ్డివాడి మాదిరిగా నవ్వుతున్నానేమోనని నన్ను చూసి నవ్వుతుంది. ఇద్దర్నీ నవ్వించిన మీ వ్యాఖ్య తప్పక మరొక పదుగురిని నవ్విస్తుంది. ఒకరు, మరొకరు చిరునామాలు మీకే ఎరుక. శ్రీశ్రీ గారు స్వర్గలోక వాసుల పని పడుతున్నారుట. పద్మార్పిత మంచి పిల్ల, యేమీ అనదు. కాకపోతే కన్నయ్య ప్రేమిక భావన మాత్రం మిమ్మల్ని తూర్పారబోస్తుంది. ;) ఇకపోతే నాకు ప్రేమించటం తర్వాత బాగా వచ్చిన పని నవ్వించటం... అందుకే..

    Smiling is infectious,
    you catch it like the flu,

    When someone smiled at me today,
    I started smiling too.

    I passed around the corner
    and someone saw my grin

    When he smiled I realized
    I'd passed it on to him .

    I thought about that smile
    then I realized its worth,

    A single smile, just like mine
    could travel round the earth.

    So, if you feel a smile begin,
    don't leave it undetected

    Let's start an epidemic quick,

    and get the world infected!

    Keep the smile going by
    sending this on to a friend.

    Everyone needs a smile!!!

    ReplyDelete
  13. "నువు పిలిచిన పిలుపు,
    యుగాంతం వరకు నాకు మేలుకొలుపు"..నాకు బాగా నచ్చిన లైన్ అండీ.. ఎప్పటిలాగే చాలా బాగుంది కవిత..

    ReplyDelete
  14. మురళీ గారు, చాలా రోజులకి వచ్చారు. ధన్యావాదాలు.

    ReplyDelete
  15. ఉషా, తెగ తెగ నచ్చేసింది. ఏ పాదాలు బాగా నచ్చాయి అని వెతుక్కున్నాను. అన్నీ ఒకదాన్ని మించి ఒకటి వున్నాయి. ఇంత బాగా ఎలా రాయగలరు మీరు.. అసూయ పడాలి మిమ్మల్ని చూసి. జస్ట్ కిడ్డింగ్.

    ReplyDelete
  16. కల్పన, ధన్యవాదాలండి. మనసు వూసు తోచినట్లు దింపటమే కానీ దానికి బాగు వోగు వుంటాయటండి? :)

    ReplyDelete