విశ్వామిత్ర-12

ఆ చేరువలోని అనుభూతి ఇద్దరికీ క్రొత్తగా వుందో, విడివడాలనిలేదో. మిత్రకి మధ్యలో కాస్త వదిలి మళ్ళీ బిగిసిన విశ్వ చేతుల స్పర్శ తెలుస్తూనే వుంది.

"కన్నా! ఇలాగే వుండిపోవాలనుంది." మిత్ర మాటలో కాస్త గారం కలిసిన మురిపెం.

"అలాగేనేం. జోలపాట పాడతాను, ఇంకా పడుకోకపోతే నాలుగు దెబ్బలేస్తాను గట్టిగా." అన్నాడు విశ్వ.

ఇంత చనువు ఒక్క నిమిషంలో ఏమో సాధ్యమేనేమో. ప్రేమ దేన్నైనా అధిగమించగల ధైర్యాన్ని ఇస్తుందేమో. ఇద్దరూ పరిచయమైన ఇన్నేళ్ళకి, ఇన్నివేళ మైళ్ళ దూరాన వేళ కాని వేళ ఆ ఘటన.

విశ్వ మొహాన్ని రెండరచేతుల మధ్య తీసుకుని కొద్దిగా వంచి, తనూ కాళ్ళెత్తి నుదురు మీద చిన్నగా చుంబించి కాస్త దూరం జరిగి, నాలుగడుగులు వేసి సోఫాలో కూర్చుంది.

తనూ అమె వెనగ్గా వచ్చి అదే సోఫాలో అటుప్రక్కగా కూర్చున్నాడు విశ్వ. మరిక మాటలేమీ లేవు ఎక్కువగా. ఎగిసిన అల విరిగిపడ్డట్లు, ఇద్దరిలోను ఏదో ప్రశాంతత. ఒకరి మనసు మరొకరికి వ్రాసి ఇచ్చేసినంత ధీమా.

పదీ పదిహేను నిమిషాలు గడిచాయో లేదో మిత్ర గాఢనిద్రలోకి జారిపోయింది.

*************************************************

మరొక వారం గడిచిందో లేదో హెల్ముట్ రాజీనామా చేసాడు. ఒక ఆర్నెల్ల పాటు ప్రంపంచయాత్రలో గడిపి తర్వాత ప్లాన్ గురించి ఆలోచిస్తానని చెప్పాడు. మిత్రకి చాలా ఆశ్చర్యంగా వుంది. అలా నడివయసులో ఉద్యోగం వదిలి, కుటుంబాన్ని విడిచి వెళ్లటం తనవాళ్ళెవరైనా చేస్తారా అని ఆలోచన కూడ కలిగింది.

ఆ రోల్ కొరకు ఇంటర్నల్ కాండిడేట్స్ కూడా అప్ప్లై చేసుకోవచ్చని మానేజ్మెంట్ నిర్ణయించారు. మిత్రకి అప్పుడు కలిగింది ఓ ఆలోచన, విశ్వ కూడా ప్రయత్నించవచ్చు కదా అని. హెల్ముట్ కూడా ఇంటర్వ్యు చేస్తున్నాడు. విశ్వ కి మనసులో మాట చెప్పింది.

తర్వాత అంతా అనుకోకుండా సజావుగా జరిగిపోయింది. హర్షతో మాట్లాడి విశ్వ అప్ప్లై చేయటం, సెలక్ట్ కావటం జరిగింది. అక్కడ ఆఫీస్ లో శివ కి విశ్వ స్థానం ఇవ్వటంతో పెద్ద ఇంపాక్ట్ లేదని హర్ష కూడా అంగీకరించటంతో విశ్వ కూడా ఇతరత్రా ఆలోచనలు చేయకుండా మారగలిగాడు. అందులోను మిత్ర విషయం కూడా చెప్పటంతో హర్ష కూడా చాలా సంతోషించాడు.

మిత్ర ఇండియా నుండి వచ్చిన నెలన్నరకి విశ్వ తన వూరికి మారటం జరిగిపోయింది.

రోజూ ఆఫీసు లంచ్ లో కలవటం వీలు పడింది. మరొక నెలకి మిత్ర కమ్యూనిటి కాలేజిలో తనకి నచ్చిన టెక్నికల్ కోర్స్ తో పాటుగా, పాటరీ క్లాసులు కూడా తీసుకోవటంతో సాయంత్రాలు కలవటం పడటంలేదు.

శనాదివారాలు మాత్రం తప్పక కలిసి లైబ్రరీకి వెళ్ళటమో, లేదా డ్రైవ్ చేసుకూంటూ వెళ్ళి చుట్టు ప్రక్కల ప్రదేశాలు చూసిరావటం లేదా ఇద్దరి ఇళ్ళలో ఎక్కడో ఓ చోట కబుర్లతో కాలక్షేపం చేయటం. ఎంతసేపు కలిసున్నా తనివి తీరనట్లుగానే వుంటుంది.


**************************************************

ఆ యేడు మిత్ర పుట్టినరోజు శనివారం వచ్చింది. శుక్రవారమే విశ్వకి చెప్పింది.

మర్నాడు విశ్వ వచ్చేసరికి పదైంది. ఈలోపుగా మిత్ర తలస్నానం, ధ్యానం పూర్తి చేసి, గారెలు, కొబ్బరి పచ్చడి, పాయసం చేసింది. మధ్య మధ్యలో ఇండియా నుండి ఫోన్ కాల్స్. కాసేపు మనియాద.

విశ్వ రావటంతోనే మళ్ళీ మనసంతా ఆహ్లాదంగా మారిపోయింది. అనంత పెయింట్ చేసిచ్చిన పాలపిట్ట రంగు చీరలో మిడిసిపడుతున్న వంటి ఛాయ. సన్నని బసరా ముత్యాల దండ. గాలికే వూగినట్లున్న జూకాలు. చుక్క బొట్టు. అదీకాక ఏదో గ్రేస్ ఆ మొహమ్మీద. విశ్వ కళ్ళలో అదే ఆరాధన.

"అమ్మలు, మెనీ హాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే." ఆ మాట అంటూనే చేతిలో వున్న చిన్న డైరీ వంటిది మిత్ర చేతిలో పెట్టాడు. అదికాక చిన్న కేక్, మిత్రాకి ఇష్టమైన లెబనీస్ స్వీట్ బక్లవ కూడా తెచ్చాడు.

"విశ్వ, ఇది నీ డైరీ కదా?" అన్న మాట పూరికాకుండానే "అవన్నీ నీకు చెప్పాల్సినవే." చిన్నగా నవ్వేసాడు.

"పద పద కాస్త నోరు తీపి చేస్తాను." అన్న మిత్ర మాటకి అతని మొహమ్మీద కదలాడిన నవ్వుకి యేదో వూహ మదిలో కదలాడి నునుసిగ్గు ముంచుకు వచ్చింది.

కేక్ కట్ చేసి తీసుకున్నాక ఇద్దరూ కలిసి గారెలు తిన్నారు. తను తిన్నది తక్కువే కానీ విశ్వకి మాత్రం ఒకటొకటి అంటూ దాదాపు ఆరు గారెలు వేసేసింది. పాయసం తెస్తానని లేచింది.

"కాసేపు ఆగుదాం. అసలు ఖాళీ మిగిల్చితేగా." అన్నాడు విశ్వ.

సోఫాలో ఓ ప్రక్కగా వాలి కూర్చున్న విశ్వ దగ్గరకి చొరవగా జరిగి ఆనుకుని కూర్చుంది. నెమ్మదిగా పొదివి పట్టుకుని, పెదాల మీద అనీ ఆననట్టు చిన్నగా ముద్దు పెట్టాడు.

తొలిముద్దు. లేత పెదాల మీద అతని పెదాల తాకిడికి, శ్వాసలోని వేడికి చిత్రంగా తొలకరి జల్లు తాకినంత చిరు వొణుకు. నల్లటి కళ్ళ వెనుక సప్తవర్ణ కలల ప్రపంచం ఒక్క క్షణం లో భ్రమణం చేసింది. అతన్నీ, ఆమెనీ మరో లోకపు అంచుల్లోకి తోసేసింది.

ఆమెలోని జలదరింపుకి విశ్వలో మరింత కదలిక. అది గమనించిన మిత్ర నెమ్మదిగా విడివడి దూరం జరిగి కూర్చుంది.


"విశ్వ, మన ఈ బంధం శాశ్వతం కావాలంటే నాకు మరి కొంచం సమయం కావాలి. ఇది ప్రేమ అని తెలిసినా ఏదో అస్పష్టమైన భావన నాలో పెళ్ళి పట్ల గల విముఖతని తొలగనీయటం లేదు." అంది మిత్ర.

"నాకెన్ని లోపాలు ఉన్నా, అదృష్టవశాత్తు, అలుసు, అహం మాత్రం తక్కువ. అమ్మలు, నువ్వు చనువు ఇచ్చావని, ఎప్పుడూ అలుసుగా తీసుకోను, రుబాబు చెయ్యాలని చూడను, అహం ప్రదర్శించను, నీ వ్యక్తిత్వానికి విలువనిస్తాను,నిన్ను ఆరాధిస్తాను, నా గుండెల్లో పెట్టుకుంటాను, ప్రేమిస్తాను. YOU ARE MY LOVE" మృదువుగా అన్నాడు విశ్వ.

తల స్నానం చేసిన జుట్టు ఆరీ ఆరక నుదుటి మీద పరుచుకుని, ఆలోచనలో పడ్డట్లు కాస్త ముడుచుకునున్న పెదాలు, ముద్దుగా వుంది.

"మిత్ర, ఇక ఆ విషయం వదిలెయ్యి. పద అలా కాసేపు బయటకి వెళ్దాం." అన్నాడు.

"ఊ.." అంటూ లేచి "విశ్వ నన్ను అర్థం చేసుకున్నారు కదు. నాకు దూరం అవరు కదూ?" అని అడిగింది. అంతకు మునుపు మాటల్లోని బింకం లేదు. చివరి మాటకొచ్చేసరికి బేలతనం.

"మిత్ర, నీ మనసు తెలుసు నాకు. నీ ఆలోచన ఏదైనా కానీ నువ్వు సఫలీకృతంకావటానికి నా తోడు, అండ ఎల్లప్పుడూ ఉంటాయి, ఏమి చెప్తే అది చేస్తాను. I will never leave you, ever. నువ్వు నా దానివి ఐనప్పుడు, ఇంక నిన్ను వదిలి ఎక్కడికి వెళ్తానురా అమ్మలూ." మంద్రస్వరంతో పలికిన విశ్వ మాటల్లోని మార్థవం మిత్రకి మనసుకి వూరటనిచ్చింది.

తర్వాత గడిపిన సమయమంతా ఎప్పుడూ లేనిది విశ్వ మాటలతో మిత్ర మౌనంలో గడిచిపోయింది.

ఆర్ట్ గాలరీకి వెళ్ళి, బయట లంచ్ తిని, మొదట్లో ఇద్దరూ కలిసి వెళ్ళిన తోట కి వెళ్ళారు. కొంచం లోపలకి వెళ్ళాక అటుగా వున్న చిన్న చెరువు ప్రక్కగా కూర్చున్నారు.

చిన్న చిన్న పిట్టలు వొళ్ళంతా నీలిరంగు కలిసిన నలుపు, కంఠం దగ్గర మాత్రం నెమలిపింఛం లో వుండే ఒకలాంటి పచ్చని రంగు. వాటి కూత అదో మత్తు కలిసిన స్వరంలో ఏదో పాటలా వుంది. గుంపులు గుంపులుగా అక్కడక్కడే వాలి గాల్లో గిరికీలు కొడుతూ తిరుగూతువున్నాయి.


"ఏటిదాపున తోటలోపల ఎవరినే పిలిచేవు కోయిల ఎవరినే .." మిత్ర సన్నగా కూనిరాగం తీసింది.

"ఇంకెవరినీ ఈ రాజకుమారినే.." విశ్వ నవ్వేసాడు.

ఆ ఆహ్లాదకరమైన వాతావరణం, అతని సమక్షం. చెరువుకి ఆవలి ప్రక్కన ఇద్దరు చిన్నారుల కేరింతలు కొడుతూ ఫ్రిస్బీ ఆడుతున్నారు.

"నాకు చిన్న బాబు కావాలి." మిత్ర నోటి నుండి అనుకోకుండా వచ్చిందా మాట.

చటుక్కున అతని మొహం లోకి చూసింది. అదే ప్రశాంతత, తొణికిసలాడే ప్రేమ. ఆ కళ్ళలో ఎప్పుడో గానీ మరో భావం కనపడదు.

పాణీ గ్రహణం అయింది, కలిసి అడుగులు వేసేసారు. మనసులు కలిసాయి. మన మధ్య ఇక ఈ దూరం ఎందుకు మరి తన మనసు కోరుకుంటుంది. ఏమో!

*************************************************

ఆ రాత్రి మంచం మీద వాలాక విశ్వ ఇచ్చిన డైరీ గుర్తుకి వచ్చి, లేచి తెచ్చి అలా తిప్పుతూ ఓ పేజీ దగ్గర ఆగింది. నిజానికి తననుకున్నట్లుగా డైరీ కాదది. అన్నీ తనకి చెప్పినట్లుగా వున్న సంభాషణలు, ప్రేమ లేఖలు. తమ ఇద్దరి ప్రస్తావన తప్ప మరేమీ లేవు. కొన్ని చోట్ల తేదీలు వేసి వ్రాసి వుంటే, మరి కొన్ని పేజీల్లో ఏదో ఒక ఆలోచన యథాతథంగా పెట్టినట్లుగా వున్నాయి.

హెల్ముట్ ఇంటి దగ్గర నుండి వస్తూ మంచులో ఆగిన రాత్రి జ్ఞాపకం వ్రాసుకున్నాడు.


----------------------------------------------------------------------
దేవకన్య లా మెరిసిపోతున్న నా మనసైన మగువతో, ఈ రాత్రి నీలిమలోంచి నక్షత్రధారలుగా పైనున్న వారు జల్లుతున్న మంచు తలంబ్రాలతో మనువు జరిగినట్లుగా వుంది. నా మీద బాధకి బరువు ఆన్చి అడుగులు వేసినప్పుడు "ఇప్పుడే కాదు, ఎప్పటికీ నేను నీకు తోడవుతాను. నీ కంట కారిన ఆ చుక్క నీ బాధకి చివరి చిహ్నం కావాలి. నేస్తమా, నా సాంత్వన వచనాలు నిన్ను నిమ్మళించేనా?" అనాలని వున్నా చెప్పలేకపోయాను. కానీ తను నాదే అన్న భావన మాత్రం బలపడిపోయింది. తనని దాటుకుని ఇక ఎటూవెళ్ళలేను.
----------------------------------------------------------------------

ఆశ్చర్యం. విశ్వలోను ఇంత భావుకత వుందా? తనలో తనే ప్రశ్న వేసుకుంది. ఒక్కసారిగా మళ్ళీ తనని చూడాలన్న కోరిక. మళ్ళీ అతనికి అర్పితమైపోవలన్న భావన. తన వ్యక్తిత్వం ప్రక్కకి తొలగి అతనితో కలిసి సాగాలన్న ఆత్రుత. బలవంతంగా ఫోను చేయాలన్న ధ్యాస మళ్ళించి విశ్వ డైరీలోనే చివరి పేజీలో తన మనసు పరుచుకుంది.

"విశ్వ, ఏమిటో నా మనసు పిచ్చిదైపోతుంది. ఈ నిశ్శబ్దంలో చిరు సవ్వడి నా గుండెది మాత్రమే. జేగంటలా ఏదో మంగళాలు వినిపిస్తుంది. స్నేహమంత్రాలు జపియిస్తుంది. అలుపుగా వుంది, ఇక ఆగిపోవాలనీవుంది. తోడుకావాలనీ, అదీ తొందరగా దొరకాలనీ వుంది. ఒంటరి పయనం నీ ముంగిట నిలిపి, నీతో కలిసి మరొకపరి నే చూసొచ్చినవన్నీ చూడాలనివుంది.

నువ్వెందుకు నాకు లొంగవని మునుపనుకున్న నేను, నా మీద నీకు సర్వాధికారాలు ఇచ్చేసే ద్రోహమెందుకు చేస్తున్నాను, అసలెందుకు నన్నిలా ఏమారుస్తున్నాను? ఎక్కడికి వెళ్ళిపోయావు. నాకు నువ్వు ఈ క్షణమే కావాలి.

ఆకాశంలో నా వలెనే ఒక ఒంటరి తార ఇంత వానలోనూ, బహుశా నే బిక్కు బిక్కు మనటం తాచూసిందేమో. తోటి చుక్కలకేం చెప్పి వచ్చిందో, వెన్నెల్లో తడిసే ఒంటిని వానధారలకి అప్పచెప్పి, నా వంక మినుకు మినుకున చూస్తూ నాకు తోడువున్నానంటుంది. నీకన్న అదే నయం, గగనాలనుండి స్నేహహస్తం అందిస్తోంది. నా కినుక నీ పైనా? నిను చేరలేని నా పైనా? తెలవారనీయని ఈ నిశిపైనా?

ప్రకృతి తన పురుషునిలో ప్రేమికుని వెదుకుతున్నట్లు, అందుకు తనకొక రూపు కావాల్సి నా దేహమరువడిగినట్లు, ఏడనో దాగి వేదిస్తున్న తన మగని వునికి నీ దాపుల్లో కనుగొన్నట్లు, నన్ను నిలువున క్రమ్ముకున్న దాహమో, విడలేని మోహమో విన్నవిస్తానన్నదీ ఈ క్షణం.

ఎంతకాలమింక నన్ను వేధించుకు తింటావ్? నిజమొకటి చెప్పనా - కాలంమీద చాలా కోపంగా వుంది. అది కదలను, కరగను పొమ్మంటుంది. పాడు నా మనసు నీ మాట వింటానంటుందేంటీ? ఎక్కడెక్కడో తిరగను ఇక్కడే నీతో వుంటానంటుంది."

అస్తిత్వం మరిచి ప్రేమకి అర్పితమైన ఆ విశ్వామిత్రల మనసులు, ఉదయపు వేళల సుమధుర పరిమళంతో దైవపూజకి సిద్దమయ్యే పారిజాతాలు.

[సశేషం]

36 comments:

 1. హమ్మ్.....ఆ తరువాత ..

  ReplyDelete
 2. ఎగిసిన విరిగిపడ్డట్లు,ఏమి విరిగి పడ్డట్లు?అల మిస్ అయ్యిందేమో?
  ఇంకా రెండో తప్పు వాన లో తార కనబడదు.మబ్బులు కమ్మిన ఆకాశం లో(వర్షం వస్తోంది కాబట్టి)తారలు వుండవు కదండీ?

  ReplyDelete
 3. Dear Usha garu,

  I am a regular visitor to your blog,though it is my first comment to your posts, and I always adore the feelings you express here with your poetry and especially in this short novel....I may can able to express my heart in to your posts in telugu than this foreign language,but for few reasons I could n't write in telugu script now.

  Sorry if I take more space in your commentary box..but would like to express my love to your blog...while reading especially this episode of "vishvamitra" i wondered why my eyes showed happiness in terms of tears...WOW ! a great narration in every line...i felt it from my heart.....great sensitivity in the lines..

  ReplyDelete
 4. I know I am not qualified to say any flaws in your narration....but i just would like to say few less important connectivities are missing....from episode 2 to this episode..specially

  Vishva presented his diary to mitra before mitra's proposal for marriage...but its written in second episode as mitra is not aware of the diary yet...

  or am i missing something

  ReplyDelete
 5. బాగుంది.తరువాత కోసం ఎదురుచూపు?మీ పోస్ట్లు చదివీ చదివీ నాక్కూడా కవిత్వం వచ్చేస్తుంది ఉషగారు:-)

  ReplyDelete
 6. ఉషక్క నే మీ బ్లాగుకి వచ్చినప్పుడల్లా కామేన్టడం మర్చిపోతున్నెందుకో తెలుసా ?

  మీ శైలి, ఆ పదాల కూర్పు అన్నీ నను కట్టి పడేస్తున్నాయ్... ఒకసారి చదివి ఆ టపానే మళ్లీ చదివి అందులో నాకు తెలియని పదాలు వెతుక్కుని రాసుకుని అర్ధాలు చూసుకుంటూ చివరకు కమేన్తడంమర్చి పోతున్నాను...


  " తొలిముద్దు. లేత పెదాల మీద అతని పెదాల తాకిడికి, శ్వాసలోని వేడికి చిత్రంగా తొలకరి జల్లు తాకినంత చిరు వొణుకు. నల్లటి కళ్ళ వెనుక సప్తవర్ణ కలల ప్రపంచం ఒక్క క్షణం లో భ్రమణం చేసింది. అతన్నీ, ఆమెనీ మరో లోకపు అంచుల్లోకి తోసేసింది. "


  ఇది అద్భుతమైన వ్యక్తీకరణ ...:)

  www.tholiadugu.blogspot.com

  ReplyDelete
 7. ఉషా పొద్దుటనుంచి కామెంట్ వ్రాద్దామని కంప్యూటర్ ఓపెన్ చేయడం, టపా చదవడం మూసేయడం. ఇలానే రాత్రయిపోయింది. కల్పిత కథ బాగుంది.కలపని సరసాలూ బాగున్నాయి.పద పద నోరు తీపిచేస్తాను ఇంకా బాగుంది. :)

  ఇంతకంటే ఇంక కామెంట డానికి బద్దకంగా వుంది.

  ReplyDelete
 8. ఎక్కడో జరిగినట్టు గుర్తు. కొన్ని కొన్ని నా మాటలు కాపీకరించారా ఏమి? మధ్య మధ్యలో కొన్ని వాక్యాలు అడ్డు పడుతున్నట్టున్నామ్ చాలా బాగుంది. ముందేదో మైకంలో పడేసి మాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు మీరు. కవితాత్మకైన ప్రేమానుభవం ఇక్కడ రుచి చూశాను. I'm not my self now. Will come back to comment in a balanced state of mind. :-)

  ReplyDelete
 9. చిన్ని, రాఘవ, మరొక వారం ఆగితే మళ్ళీ "తర్వాత" అని అడగొచ్చు? ;)

  సునిత, మొత్తానికి మీ వచనం వేపు నుండి నా కవితల వైపు లాగేసానా. జనాకర్ష మేడం. :) నెనర్లు.

  ReplyDelete
 10. రవిగారు, ముందుగా అలా ప్రతి వ్యాక్యాన్ని పరిశీలనగా చూస్తున్నందుకు చాలా థాంక్స్.

  మొదటిది మిస్సయిన పదమే. సరిదిద్దాను.

  ఇక రెండవది - తప్పు కాదు. నేను ఈ కథకి ముందే వ్రాసుకున్న కవితలోని భాగమది. ఆ కవిత నేను చాలా భావావేశంలో వ్రాసుకున్నది. ఆ రోజు నిజంగానే ఓ తార అలా కనపడింది. చిరుజల్లులు, తేలికపాటి మబ్బులు అక్కడక్కడ మినుకు మినుకుమంటున్న తారలు. ఈ ఒక్కటీ నా కిటికీలోకి తొంగి చూసిన భావన. కనుక ఆ కవి స్పందనని మన్నించి అది అలా వదిలేయండి. థాంక్స్.

  ReplyDelete
 11. కవిత, ఒక రచనకి సార్థకత ఇప్పుడు మీరు వ్యక్తం చేసినటువంటి అభిమానం సంపాదించగలిగినప్పుడే. ఈ కథ ఒకరికిచ్చిన మాట మీద మొదలుపెట్టినా నాకు మొదటి రచన కావటంతో ప్రతి సద్విమర్శ, ప్రశంస రెండూ లైఫ్ లైన్స్ మాదిరి వున్నాయి. మొదటి వ్యాఖ్యలోనే నా స్వానుభవంలోంచి/భావావేశంలోంచి ఫీడ్ చేయబడ్డ ఫీల్ ని ప్రస్తావించినందుకు థాంక్స్. కల్పితమే కానీ కాస్త స్పందన కలపక తప్పటం లేదు.

  ఇక మీరు గమనించిన డైరీ మాట. విశ్వ డైరీ అన్నది ముందు భాగంలో అతనికి మిత్ర కలిసిన తొలినాటి రోజులది. అందులో మొదట బాహ్యాకర్షణగా మొదలైన పరిచయం స్థాయి నుండి అతని జర్నీ అది. నిజానికి ఆ సంఘటన విశ్వకి డైరీ వ్రాసుకోవటం అలవాటన్న విష్యం చెప్పటానికి వాడాను.

  మిత్రకి ఇచ్చినది ప్రేమలేఖల వంటిది. కానీ మీరన్నట్లు కాస్త తడబడ్డట్లున్నాను ఆ వివరం అందించటం లో. [సంజాయిషీ కాదు కానీ నిన్న బిజీ వర్కింగ్ డే తర్వాత గూగుల్ డాక్స్ కాస్త విసిగించింది, కొన్ని తిరిగి టైప్ చేసాను. అలా కొన్ని మిస్సయి వుంటాను. రవిగారు ఒకటి పట్టుకున్నారు. మీరు ఇది.] ఇప్పుడు కాస్త వ్యాక్యాలు కలిపాను. బహుశా ఇకపై ఈ అస్పష్టత రాబోదు. చాలా ఆనందంగా ముగిస్తూ..

  ReplyDelete
 12. కార్తీక్, సహజమైన వ్యక్తీకరణల్లో అనుభూతి బాగా ప్రకటితమౌతుంది. మీకు నచ్చిన పంక్తి అదే. థాంక్స్.

  ReplyDelete
 13. భా.రా.రె. కలపని అంశాలు మీ అవగతం చేసిన మీ వూహాతీరం బాగుంది. నెనర్లు. :)

  ReplyDelete
 14. గీతాచార్య, అసలు, నకలు, కాపీ ఇవంతా బ్రహ్మ చేసాడన్న మాట. :) ప్రేమికులు, మనసులు, స్పందనలు ఇలా ఆయన వద్ద వున్న తానుల్లోంచి మనని బొమ్మలుగా చేసి వదిలాడు. కనుక భావసామ్యం, భాష సామీప్యం వున్నాయేమో. నాకు రాని విద్య నాది కాని భావనని/అనుభూతిని నా మాటల్లో వ్రాయటం. నెనర్లు.

  సృజన, చానాళ్ళకి ఇద్దరూ కలిసి వ్యాఖ్యానించారే? థాంక్స్.

  ReplyDelete
 15. ఒక అనిర్వచనీయమైన అనుభూతిని మనకు సొంతం చేసే ఈ ప్రేమ...
  నీవే తానైయ్యాకా నీదంటూ ఏదీ లేదనే ఈ ప్రేమ...
  తన ఆనందంలోనే నీ ఆనందం దాగుందని తెలిపే ప్రేమ...
  నీవుంటే వేరే కనులెందుకూ....అనిపించే స్వచ్చమైన నిజమైన ప్రేమ నిండి ఉన్న ఈ కధలోని "ప్రేమ" ఎంతమాత్రం కల్పితం కాదు సుమండీ...!!
  very good presentation of "true love"...!!

  ReplyDelete
 16. తృష్ణ, ముందే చెప్పాను - ప్రేమ ఒక మనసుకి కలగటం ఓ వరం. అంత వరకు నావి నిజానుభూతులే. మిత్ర కి ప్ర్రాణం పోసింది నా జీవితమే. నా జీవితాన ఈ అనుభూతులు పంచింది నా కన్నా అన్నది కూడా నిజమే. కథలో కొంత కల్పన మాత్రం వుంది. అదీ నిజమే...

  భావనది ఓ టపాకి వ్రాసిన నా వ్యాఖ్య ఇది.

  "ఆ ప్రేమ లో తీవ్రమైన ఆకర్షణ అవతలి వ్యక్తి పట్ల భరించలేని మోహావేశం.... కాల్చాలి మనసు ను. ఎప్పుడు తలుచుకున్నా ఆ మోహావేశం అప్పుడే పుట్టిందా అన్నట్లు కాల్చి శుభ్రం చేయాలి మనసు మూల మూలలను" అన్న తన మాట కి నా బదులిది.

  ఎన్నిసార్లో భస్మమైన నా మనసు సాక్షిగా ... నా మానసం నీ ఎదుట పరుస్తున్నాను.

  తనకోసమె కల కన్నానా?
  ఆ కలలో తననే కలవరించానా?
  కలలో తనని వరించానా?
  ఆ కల కరిగిపోతుందని కలత చెందానా?

  ఉదయానికి వీడుకోలు పలికానెందుకు?
  రాత్రినీ ఆగొద్దని వేడుకున్నానెందుకు?
  ఒక రోజు గడిచిందని నిట్టూర్పు విడిచానెందుకు?
  నిరీక్షణా ఓ ప్రేమేనని నలుదిక్కుల చాటేందుకే!

  కన్నా! గుబులు గుబులుగా వుంటుంది. నిన్నే చూస్తూ గడిపేయాలనిపిస్తుంది. నీ కళ్ళలో కళ్ళు కలిపే ఆ క్షణం కోసం అర్రులు చాస్తూ బ్రతుకుతుంటాను. మునుపటి నీ రాకలోని ఆనందాన్ని పునశ్చరణ చేస్తుఓటాను. ఇన్ని అనుభూతులని పంచుతున్నందుకు, ఆ నవరస భరిత జీవితంలో నన్ను ముంచి తేల్చుతున్నందుకు నీకు ఏమిచ్చినా ఎప్పటికీ వెలకట్టలేను ఈ అనుభవాన్ని."

  ReplyDelete
 17. మీ భావుకత చూస్తుంటే ముచ్చటేస్తోంది. కవిత్వమన్నది ఒక సాధన కాదు. అలాగే అది సహజాతం కూడా కాదు. అలా అనుకుంటే చాలా అఙ్ఞానంలో ఉన్నట్లే.

  కవిత్వమంటే సృష్టి.

  క - బ్రహ్మ
  వి - విషయం
  త్వం - నీవు.

  నీవే బ్రహ్మవనే విషయాన్ని అర్ధం చేసుకోవటం. బ్రహ్మ తత్వాన్ని అవగాహన చేసుకుంటమే కవిత్వం. రాయాలనిపించిందల్లా రాసేసి అది కవిత్వం అనకోమంటే కుదరదు. మనసులో ఉప్పొంగే భావాలను ఒడిసి పట్టి ఒక రమ్యమైన రసానుభూతిని దానికి మేళవించి, అక్షర రూపంలో అందించటమే కవిత.

  చాలా చోట్ల ఈ మూటిలో ఏదో ఒకటో, రెండో ఉంటాయి. బ్రహ్మ తత్వమంటే వేరే ఏమిటో కాదు. ప్రేమ. అవ్యాజమైన ప్రేమ. పూలూ, చెట్లూ, మన చుట్టూ ఉన్న ప్రకృతిని మనలో భాగంగా భావించ గలిగే ప్రేమ. మీరే అన్నారు కదా, నేను ఆకులు తింటం గురించి అడిగినప్పుడు.

  ఇక ఇక్కడి విషయం. మీరు ఇంతలా వ్రాయగలుగుతున్నారంటే్ అది మీలోని కవిత్వ ధార వల్ల. నిజానుభవాలే నిజానికి అద్భుతంగా ఆవిష్కరించ గలం. కల్పితం కన్నా జీవితం సృష్టించిన కథలే మరింత కమ్మగా క్రొత్తగా ఉంటాయి. Very nice to read such a cute and romantic story.

  BTW have u seen this?
  http://booksandgalfriends.blogspot.com/2009/12/motorcycle-diaries-fatal-night-2.html

  No hurry. You can read it in leisure. All the incidents are true. But see how strange those true incidents are.

  కవిత్వమేవాహాన్ని సాధించిన మీకు నా జోహార్లు.

  ReplyDelete
 18. మర్చేపోయాను. వర్షంలో నక్షత్ర దర్శనం నాకు కూడా జరిగింది. దాని ఫోటో కూడా ఉంది. ఎప్పుడైనా బ్లాగులో పెట్టాలి. అది అసాధ్యమేమీ కాదు కూడా. It is possible according to physics in some special situations. It was when Dhana and I were on a ride towards Chennai.

  ReplyDelete
 19. గీతాచార్య, "కవిత్వమంటే సృష్టి" అని చక్కని వివరణ ఇచ్చారు. ఎన్ని విధాలుగా నిర్వచించినా ఇంకా అందది అది [నా దృష్టిలో] పరమాత్ముని మాదిరే. ఇక ప్రేమ అన్నది నా పేరుకు పర్యాయపదం. అదొక్కటే నాకు బాగా తెలిసిన విద్య. థాంక్స్.

  ఆ మధ్య "ఈమాట" లో చాల చక్కని వ్యాసాలు కవిత్వం మీద వున్నవి చదివాను. అప్పుడే కాసింత గర్వం, సంతృప్తి కలిగాయి, కవిత్వమన్న పాత్ర నుండి నా హృదయం కొంచం అమృతాన్ని వొంపుకున్నదని.

  అలాగే బాబా గారి సమీక్షల్లో మరెన్నో విషయాలు చెప్తారు. ఉదాహరణకి...

  "అనుభూతికి భాషనివ్వటం అంత తేలికేమీ కాదు. ఎందుకంటే కొన్ని అనుభూతులను వ్యక్తీకరించటానికి భాష సరిపోదు....వాస్తవాన్ని తన అనుభవంతో మిక్స్ చేసి సృష్టించే కవిత్వం పఠితను సరసరా తనలోకి లాక్కొంటుంది. రాసింది నాగురించే, ఇది నా ఆలోచనే అనుకొనేంత గాఢంగా. ఎందుకంటే..

  Poetry is when an emotion has found its thought and the thought has found words. -Robert Frost"

  కనుక నాకు మమేకం కావటం అన్నది అనుభవంలోకి వచ్చినా ఇంకా నేను కూడా ఇంకా పయనించాల్సిన బాట చాలా వుంది.

  మీ టపా వీలుని బట్టి చదువుతాను. నెనర్లు.

  ReplyDelete
 20. Chaala chala bavundi.. :) Tarvata enti...??

  ReplyDelete
 21. జాయ్ గారు, తర్వాత కథ మరొక వారంలో ఎంజాయ్ చేద్దురు గానీ అందాక ఆగాలి. నెనర్లు. :)

  ReplyDelete
 22. The romantic feel in this post is very fascinating. మనసునెటో పంపించచేశారు. But I can wait till you post again

  ReplyDelete
 23. Thanks Pria. After long time, nice to have you visit this blog. And, yes these feelings only compliment the love. Unless there is love, these are of no value, right? And the heart that went through such moments is casting the spell here :) hence you're spell bound... thanks.

  ReplyDelete
 24. కథ సాఫీగా నడుస్తోంది . బాగుంది .

  ReplyDelete
 25. Is this a serial? Looking nice, but I can not understand what's what

  ReplyDelete
 26. రంగురంగుల పూలలో
  ఏమిటీ అందాల సొబగు
  రమ్యమైన ప్రేమ కురియగ
  మిత్ర కాంచెను విశ్వను..

  ఇంద్ర ధనుసున వెల్లి విరిసే
  కలల కలయిక ఎవరిదో
  తొలగించితే అవనిక
  కనిపించదా ఆ దృశ్యము.

  తేలియాడే నల్ల మబ్బుల
  తీరమేదో తెలియునా
  ప్రణయరాజ్యపు ముఖ్య సౌధం
  ప్రేమికులకే ప్రవేశము.

  లలిత లలిత మృదు పదమ్ముల
  పాడరారే పదములు
  తీయ తేనియ లొలుకు తీరున
  పరవశమ్ముగ ప్రేమను..

  ఎందుకీ మొగమాటము
  మరి ఎందుకీ తడబాటులు
  ఎదురుగా నీ మదిని దోచిన
  సుందరుని ముందుంచుకుని..

  ReplyDelete
 27. సమీరా వైఙ్ఞానిక్, మీ బ్లాగుని బట్టి క్రొత్తవారని వూహిస్తూ, స్వాగతం. ఇక పోతే తెలుగు బాగా చదవగలరని ఆశిస్తూ... ప్రక్కనున్న "సూచికలు" నుండి "కథ" కానీ "విశ్వామిత్ర" కానీ మీరు ఎంపిక చెస్తే మొత్తం భాగాలన్నీ వస్తాయి. మొదటి భాగం - కేవలం అభిప్రాయసేకరణ. కవితలు వ్రాసే నాకు రచన చేయటమ్ వచ్చా అన్నదానిపై జరిగిందది. మీరు "విశ్వామిత్ర-౦" నుంచి చదివి మళ్ళీ అస్పష్టత వుంటే అడగండి. థాంక్స్. ఇదే నా మొదటి/చివరి ప్రేమ కథ [కావచ్చు!] ;)

  ReplyDelete
 28. Mine is convent school telugu :-) Thanks for the reply. First reply for me. Will read in the weekends.

  మీ గురించేనా, ఈనాడు వసుంధరలో, పుస్తకంలో వచ్చింది. కవిత్వం రాస్తారని? Nice template. Wings of thought.....

  ReplyDelete
 29. మాలాకుమర్ గారు, నెనర్లు.

  శ్రీలలిత గారు, మీలోని కవితాభారతికి పాదాభివందనం. నా ప్రేమకథ మీలో ఈ భావావేశాన్ని కలుగజేస్తున్నందుకు ధన్యవాదాలు. నా జీవితంలోని ఆ క్షణాలు మీ కవితల జల్లుల్లో పులకించిపోతున్నాయి. ధన్యురాలిని.

  ReplyDelete
 30. సమీరా వైఙ్ఞానిక్, నాదీ మీ బడే. కాకపోతే తెలుగు పట్ల అభిమానం ఈ మాత్రం వ్రాయగల శక్తినిచ్చింది.

  ఇక మీరన్నది http://2.bp.blogspot.com/_Ldj17B6B4Uc/StBxAOvnhiI/AAAAAAAAAPM/9QBPUUSvdpk/s1600-h/Vasu123.jpg గురించి అయితే, యెస్ అది నేనే ;) కాకపోతే అంతటి గౌరవం నాకా అన్నది ప్రశ్నార్థకం. ఈ సింధువులో నేనొక బిందువుని. నాకన్నా మహామహులు కోకొల్లలు. నెనర్లు

  Thanks for liking my template. It was suggested to me by yogi gaaru of logili.

  ReplyDelete
 31. ఉషా, మనసంతా ఏదో ఏమిటో తెలియని మధురమైన అనుభూతి తో నిండినపుడు ఒకోసారి మాటలు దొరకవు మౌనమే సమాధానమౌతుంది. ఈ భాగం చదివాక నా స్పందన కూడా అదే... చాలా చెప్పాలని ఉంది కానీ ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియడం లేదు.

  ReplyDelete
 32. అలా కామెంటి వెళ్తుంటే బాలుగారి స్వరం లోని ఈ పాట గుర్తొచ్చిందండీ.
  "మల్లెలు పూసే.. వెన్నెల కాసే..ఈ రేయి హాయిగా..
  మమతలు వేయిగ..పెనవేయి నన్ను తీయగా..."
  వినే ఉంటారు మళ్ళీ వినాలంటే ఇక్కడ వినవచ్చు. http://www.chimatamusic.com/playcmd.php?plist=5524

  ReplyDelete
 33. వేణు, అభిప్రాయానికి థాంక్స్. పాటకి కృతజ్ఞతలు. చాలాసార్లు విన్నాను. పనిలో పని అదే పనిగా పరుగులు తీసే నా మనిషికి కూడా సరీగ్గా ఒక వారంలోగా వినిపించితీరతాను. అంతకన్నా వీలు ఇద్దరికీ లేదు. నేను మాత్రం పాటవింటూనే ఈ వ్యాఖ్య వ్రాస్తున్నాను. నెనర్లు.

  ReplyDelete