కవి హృదయం

[ఇదేమీ క్రొత్త కవితా ప్రయోగం కాదు. సాయం సమయం ప్రకృతి లో జరిగే వర్ణనలు నాన్నగారు వచనం గా వ్రాస్తే, నేను కాస్త అటు ఇటుగా మార్చి వ్రాసాను. ఇది ఆయనకి పంపుతాను. మీలో ఎవరైనా మీ కనుల్లో, కలంలో ఇంకేమైనా దాగొనివుంటే వ్రాయండి. ఆయన సంతోషిస్తారు. నాకీ భాష రావటానికి ఎంతో తోడ్పడిన నాన్నగారి ప్రతి మాట నాకు స్ఫూర్తే! ]

అదేమీ అవే ఉదయాలు సాయంత్రాలు
కానీ మదేమో చేయు చిత్రవిచిత్రాలు

తూరుపు కన్నియ కానుకిచ్చిన వెచ్చదనం
గడప గడపకీ పంచి,
పడమర కాంతకి కబురు పంపి
ఆమె కౌగిలి చేరగ పరుగులు తీసే సూరీడు

ఉదయాలు, మాగాణుల్లో తిరుగాడి
గరువు భూముల్లో ఆటలాడుకొని
కాలువ నీటిలో మునక వేసి
సాయంకాలం ఇంటిదారి పడుతూన్నాయి
గోగణాలు

గూడు విడవనంటే చెల్లునా?
మేత వెతుకుట తప్పునా?
ఎగిరి ఎగిరి అలిసిన రెక్కలు
గూటికి చేరు సాయం వేళలు

గూటిలో కూనల కువకువలు
అమ్మ వొడి కొరకు ఆనవాళ్ళు
అక్కున చేర్చుకొను అమ్మనాన్నలు
అరుదెంచు వేళలీ సాయంసంధ్యలు

జాజుల రాత్రులు, జావళి పాటలు
జంట హృదయాల తుంటరి సరాగాలు
జాబిలి నవ్వులు, వెన్నెల జాగారాలు
వేకువ కలలు, నిత్యజీవన రేయింబవళ్ళు

అదేమో అవే కాల గమనాలు
మరేమో ఇవే చిరు కవనాలు


********************************
నాన్నగారి వాక్యాలు:
కవిత్వమన్నది మనం సంపాదించుకుంటే రాదు. దానికి పూర్వ జన్మ సుకృతం కావాలి.
నిశ్చితాభిప్రాయాలు, నిలకడైన మనసు కావాలి. కవిత్వానికి మన చుట్టూ వాతావరణము, తెలిసిన వారి జీవిత సత్యాలు ఉపకరిస్తాయి. సాహిత్యము, కవితా స్రవంతి రెండూ సమపాళ్ళలో నడపటంలోనే వుంది కవిహృదయం. సాయంసమయమైంది అనేదాన్ని గురించి ఎంతో రాయవచ్చు. సూర్యుడు తన పడమర కాంతను చేరే వేళ అయింది. గోగణము ఇంటికివచ్చే సమయమయింది. పక్షులు ఆహారము వెదుక్కుంటూ వెళ్ళి తమ నివాసములు అంటే గూళ్ళకు చేరే సమయమయింది. చిన్న పక్షికూనలు తెల్లితండ్రుల ఆగమనమునకు ఎదురు చూసేవేళయింది.
*******************************

కనుక మీకు అర్థం అయిపోయింది కదూ, ఆ చివరి ఆరు పంక్తుల చమత్కారం నా మనసుదని. :)

46 comments:

 1. కవిత హృదయానికి హత్తుకుందిగా...

  ReplyDelete
 2. ఎప్పటివో నేను వ్రాసిన కొన్ని కవితలు గుర్తుకువచ్చాయి.

  రాత్రి

  కాళరాత్రిలో
  కారుమబ్బులు
  ఫెళఫెళార్భాటాల
  ఉరుములు మెరుపులు
  హోరుగాలుల హాహాకారాలు

  జడివానకు
  దడుస్తూ, తడుస్తూ
  దాగే దిక్కులేకనిక్కుతున్న
  చంద్రుడు
  భయం అవమానాన్ని
  కౌగిలించుకున్నట్లు
  బిక్కచచ్చి
  బిక్కుబిక్కుమంటూ నక్షత్రాలు

  హింసకు అభిమానం
  తల వొగ్గినట్లు
  విస్తుపోయి వంగిపోతున్న వృక్షాలు
  ఉత్పాతానికి తోడు కలిసిన
  ఉన్మాదంలా
  అలజడి చేస్తూ సముద్రం

  మారుతం
  మరణశోకం ఆలపిస్తున్నది
  చరిత్రను
  శోకప్రవాహం లాగేస్తున్నది.
  ===

  పగలు

  మసకబారు చీకట్లో
  మసిబారిన జగతిని
  మందలిస్తూ
  చీకటి గుండె చీల్చుకుంటూ
  నెత్తుటిముద్దలా
  వస్తున్నాడు సూరీడు

  వేకువరేకల పందిరిలో
  పిల్లగాలుల క్రాంతిరాగం
  కొత్త కోయిల గానం
  మరో పొద్దు పొడిచింది
  నిజం నిద్దుర లేచింది

  నల్లకొండల్లోఎర్ర సూరీడు
  లేచి నుంచున్నాడు
  నేనున్నానంటూ
  నిజాన్ని నిర్భయంగా
  చూడమంటూ
  చరిత్ర మరోమారు
  తిరిగి వ్రాయమంటూ...

  మరోమారు
  పగలు రాత్రిని జయించింది

  ReplyDelete
 3. మరో రెండు ....

  అమావాశ్య

  రంగులు మారుతున్న
  సాయంత్రం
  రాత్రిలా మారింది.

  అర్ధం కాకున్నా
  వదిలించుకోలేని ఆశలు
  నక్షత్రాలన్ని

  ముగింపు ముందే తెలిస్తే
  ఏ ఏ మార్పులుండేవో!

  రాత్రికి రాత్రి
  చీకటిలో కలిసిపోయా.

  ===

  ముగింపు

  చీకటి తెరల మధ్య
  చిత్రమైన ధ్వనులు
  ఆవలితీరం చుంబించిందని
  ఆకాశం
  అట్టుడికిపోతోంది
  ఉప్పెనలో
  ఊరుఉలిక్కిపడిలేచింది

  అన్నీ మరవాలనుకునే
  సమయంలోనే
  అర్ధనగ్నంగా
  మళ్ళీ అవే జ్ఞాపకాలు
  ఈ రాత్రి ఇంతటితో ముగిస్తే చాలు

  ReplyDelete
 4. మరో రెండు ...

  గొంగళిపురుగు

  వర్షం వెలిసిన
  ఆకాశం
  నవ్వే పూలు
  వెన్నెల స్పర్శ
  నిజాలని నిర్దయగా
  అభిశంసించే నాటకంలో
  చీకట్లో చిత్తరువులా
  నా పాత్ర నైరూప్యం
  అక్షరానికో కాలు పుట్టించి
  చీకటి గుహలో చొరబడే
  అవమానాన్ని
  అణగదొక్కాలన్న కసి
  నాకర్ధమైన సాయంత్రం మాత్రం
  జుట్టు చెదిరిన ఆకాశం
  విచ్చుకత్తులు
  వేడి కొలిమి

  ===

  ఉరుకులు పరుగులు

  వెలుగు పరదాలు
  పరుచుకుంటూ
  పిట్టలు పరామర్శిస్తున్న
  పాతకాలపు ప్రణయ దృశ్యం
  ఇంకెంతసేపని?
  పదడుగుల
  పరుగుపందెంలో
  తడబడుతూనైనా
  ఓ ప్రవాహంలా పారాలనేగా
  అంచునే నిలబడింది
  మబ్బుల రాపిళ్ళకు
  ఆకాశం
  రంగు మార్చేలోపు
  నీడపొడవు
  నిర్ధారించుకొవాలి

  ReplyDelete
 5. ఉషగారు, నమస్కారములు.

  మీ కవితలొ, "ఉషోదయపువేళ మరువం" వాసనలను గుబాళింపచేసారు. బాగు, బాగు.

  భవదీయుడు,
  మాధవరావు.

  ReplyDelete
 6. Ushagaaru, Namaskaaramulu.

  When I opened your blog site and tried to post a comment, it is failing warning Tech. problem. But, at the same time, I am able to post a comment on one of your poetry seen in JALLEDA. Can you check it up? If you can give me your e-mail ID, I can send my comment on one of your poems published under the head "AADHYAATMIKAM".

  Yours friendly,
  P.Madhava Rao.

  ReplyDelete
 7. beautiful

  here is my cent

  ఉదయాలు, మాగాణుల్లో తిరుగాడి
  గరువు భూముల్లో నెమరు వేసి/ఆటలాడుకొని
  కాలువ నీటిలో మునక వేసి
  సాయంకాలం ఇంటిదారి పడుతూన్నాయి.

  bollojubaba

  ReplyDelete
 8. Chaala chaaala bavundi... :)

  ReplyDelete
 9. సూర్యోదయం ...చంద్రోదయం ...కళ్ళముందు కదలాడాయండీ !

  ReplyDelete
 10. బాబా గారు, మీరన్నట్లు మార్చాను. "నెమరు వేసి" అన్న పదం వుంచితే గోగణాలు తీసివేయొచ్చు, కానీ "తిరుగాడి" "ఆటలాడుకుని" వరస క్రమం బాగుందని అలా మార్చటంలో చివర స్పష్టత కోసం "గోగణాలు" వుంచాను. ఎలా వుంది?

  ఒరిజినల్ వర్షన్:

  ఉదయాలు మాగాణుల్లో తిరుగాడి
  గరువు భూముల్లో నెమరు వేసి
  కాలువ నీటిలో మునక వేసి
  సాయంకాలం ఇంటిదారి పట్టే గోగణాలు

  బాబా గారు సూచించినది:

  ఉదయాలు, మాగాణుల్లో తిరుగాడి
  గరువు భూముల్లో నెమరు వేసి/ఆటలాడుకొని
  కాలువ నీటిలో మునక వేసి
  సాయంకాలం ఇంటిదారి పడుతూన్నాయి

  ReplyDelete
 11. కొండముది సాయికిరణ్ కుమార్, ఒకటి రెండు మాటలతో మీకు కృతజ్ఞత తెలుపుకోలేను. చాలా సంతోషం. మళ్ళీ చదవాలనివుంది. కొన్ని నాకు భలే అన్వయించుకోగలిగాను. కొన్ని మనసుని నివ్వెరపరిచేలా మీ పదాల్లో జొప్పించిన శక్తి మీ ప్రతిభకి గుర్తు. ఇప్పటికి అలా పట్టేసిన పాదాలు.

  వేకువరేకల పందిరిలో
  పిల్లగాలుల క్రాంతిరాగం
  కొత్త కోయిల గానం
  మరో పొద్దు పొడిచింది
  నిజం నిద్దుర లేచింది

  అన్నీ మరవాలనుకునే
  సమయంలోనే
  అర్ధనగ్నంగా
  మళ్ళీ అవే జ్ఞాపకాలు

  పదడుగుల
  పరుగుపందెంలో
  తడబడుతూనైనా
  ఓ ప్రవాహంలా పారాలనేగా
  అంచునే నిలబడింది

  నెనర్లు.

  ReplyDelete
 12. ఉషా, నెమరు వేసేది గోగణాలేనా? ఇంకేమీ వెయ్యవా? ఆ స్టాంజా కి అందం గోగణాలు అనే నా అభిప్రాయం.

  కవితలోని వర్ణనలు మదిని చిన్ననాటికి తీసుకెళ్ళి ఉఱ్రూత లూగించాయి. ఇప్పుడు చూద్దామంటే గోగణాలు లేవు గోధూళీ కరువే. అప్పడు జంగిడి గొడ్లు అని ఊరి గేదలన్నింటినీ ఒకరే కాసేవారు. ఇప్పుడు ఎవరికి వారే, కాబట్టి మందలాగా గేదెలు కానీ గోవులు కానీ చూడడం బహు అరుదు.

  ఇక నా మదిలో తిరిగిన సుడులివి. మైన్ వర్షన్ కి సరిపోక పోవచ్చు కానీ వ్రాయాలనిపించింది. ఇలా ఎన్నో, వ్యాఖ్య కావడంతో ఇంతటితో ముగిస్తున్నాను.

  తూరుపు ప్రొద్దుల అరుణారుణం
  జగతికి మేలుకొలుపు సుప్రభాతం
  పడమటి సంధ్యన సందెజిలుగులు
  అలసిన జగతికి లాలి పాటలు.

  ప్రొద్దు పొడుపున కామందు మందలింపుల
  కానలందు కోనలందు కడుపు కోసం కలియ తిరిగి
  లేగ దూడ మోము చూడ పరుగులిడే గోమాతలు
  బిడ్డకై రక్తాన్ని పాలగ మార్చు బాలింతలు

  సూరీని పలకరింతల మోమున పులకరింత
  అందం చందం ఆత్రం ఆరాటం ఆ ప్రొద్దు వర్ణాలు
  సూరిని వీడుకోలుతో మోమున సంతృప్తి
  అందం చందం శాంతి విశ్రాంతి ఈ ప్రొద్దు వర్ణాలు

  ReplyDelete
 13. హమ్మయ్య మళ్ళీ మరువం గుభాళింపులు బ్లాగ్లోకంలో పరుచుకున్నాయి.
  పునరాగమనం ఉషోదయ కాంతులతో పరుచుకున్నందుకు ధన్యవాదాలు.

  తూరుపు కన్నియ కానుకిచ్చిన వెచ్చదనం
  గడప గడపకీ పంచేసి, తానే చల్లబడి
  పడమర కాంతకి కబురు పంపి
  ఆమె కౌగిలి చేరగ పరుగులు తీసే సూరీడు

  ఇంత బాగా ఎలా చెప్పగలిగారండీ. నాన్నగారికి నా నమస్కారములు తెలుపగలరు.

  ReplyDelete
 14. ఉషగారూ,
  మీ నాన్నగారికి నా పాదాభివందనాలు అందించండి.
  ఏవో నాకు తోచిన రెండు మాటలు.

  ఉదయం సంధ్య సాయం సంధ్య
  రెండూ సంధ్యలే అయినా
  ఉదయం ఏదో ఉత్తేజం మరి
  సాయంత్రమో బలే ఆహ్లాదం.

  ఒడ్డున ఉన్న రెల్లు పువ్వుకు
  ఏమిటే నీ సందేసం
  తెలిసి కూడా అడుగుతావేం
  మళ్ళీ సంధ్యకు ఊగమనే

  ReplyDelete
 15. క్షమించాలి..అచ్చు తప్పు
  ఒడ్డున ఉన్న రెల్లు పువ్వుకు
  ఏమిటే నీ సందేశం
  తెలిసి కూడా అడుగుతావేం
  మళ్ళీ సంధ్యకు ఊగమనే

  ReplyDelete
 16. భా.రా.రె. అవునండి గోగణాలు అందుకే వుంచాను. మీ కవిత చాలా నచ్చింది నాకు. చివరి పాదం సింప్లీ సూపర్బ్.

  మా అమ్మమ్మ గారు వున్నంత కాలం మాకు చాలా ఆవులు, గేదలు వుండేవి. ఎర్రావు దూడతో కలిసి పరిగెట్టేదాన్ని. :) ఇక పాలేర్లు/కాపరులు పేర్లన్నీ గుర్తే. అజ్జి తాత మరీను. ఖంగుమనే గొంతు. సత్తియ్య ఒకసారి నన్ను గేద మీదకి ఎక్కించి తామర చెరువులోకి తీసుకుని కూడా వెళ్ళాడు. ఏదో జ్ఞాపకం. మాకు అలా ఒకరే మందకాపరి వుండరు.

  ReplyDelete
 17. శ్రీలలిత గారు, ఇక మా నాన్నగారి సంబరానికి అంతు వుండదేమో?

  "ఒడ్డున ఉన్న రెల్లు పువ్వుకు" ఈ ఊహా చిత్రం ఎంత బాగుందో!

  చాలా థాంక్స్. ఈ టపా ఆయనకి నా జవాబులో పంపాలన్న ఆత్రం లో వ్రాసినది. సమయాభావం వలన మరువంలోనే కానీ మరెవరి బ్లాగుకీ రాలేకున్నాను. కానీ ఇలా సౌరభాలు పంచటం మాత్రం మానకండి. ధన్యవాదాలు.

  ReplyDelete
 18. కెక్యూబ్ వర్మ గారు, దీనికి ముందు నా డిస్నీ వరల్డ్ విహార యాత్ర గురించి వ్రాసాను. చదివి నా మీద ఏదో ఒక నిష్టూరమాడతారనుకున్నాను. "ఇక్కడ అర్థాకలితో వాళ్ళుంటే అక్కడ ఆకాశయానాల్లో మీరని" ;) నెనర్లు.

  ReplyDelete
 19. ఈ చిరు వచనకవితకి నాన్నగారి పదాలు [పైన కవిత క్రింద ఫుట్ నోట్ గా వ్రాసాను] ప్రేరణ ఇస్తే, స్పందించిన వారంతా ప్రాణం పోసారు. మరి మీకు అర్థం అయిపోయింది కదూ, ఆ చివరి ఆరు పంక్తుల చమత్కారం నా మనసుదని. ;)

  అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మరొక పదిరోజుల్లో జీవనసంధ్యలోనూ మంచి అభిరుచితో జీవించే ఒక వ్యక్తికి ఈ టపా వ్యాఖ్యలతో సహా అందుతుంది. అప్పుడే కదా సార్థకత.

  ReplyDelete
 20. ఉషమ్మా మొదలు నాన్న గారికి పాదాభి వందనాలు.
  అవును స్పందించే మనసు వుంటే కవిత కన్నియను తిప్పలేని స్థలం కలదా ఆమె స్పందించని క్షణమా ఆమె కు తెలియని అనుభవమా ఈ జగతి లో ఎంత బాగా చెప్పేరు నాన్న గారు. ఆయన మాటలు నా కలం లో

  వెచ్చ వెచ్చని సూరీడు తన వలపు తలపులతో
  చల చల్ల గా నవ్వుతూ పటమటింట తన కాంత కోసం పరుగులిడుతుంటే
  అమ్మకోసం ఎగిరే తువ్వాయి గంతులలోరేగే అరుణ కాంతి ని ప్రేమ గా
  పొదుగుల లో నింపుకుని మంద గమనపు మెత్తదనం తో చావిడి చేరే అమ్మ ,
  అలసి సొలసిన రెక్కల టపటప లతో చంద్రోదయానికి స్వాగత రాగాలల్లుతూ
  గూడు చేరిన సరస సల్లాపాల గువ్వల జంట కు
  కువ కువ లతో ఎదురు ఎగరాలనే చిట్టి గువ్వలు....
  విరిసిన చంద్ర కాంతల రాగం, జంట ల గుండెలలో
  పురివిప్పిన మయూర నాట్యం ...
  చెలుని చూసిన చెంచిత కళ్ళ
  అవి విరబూసిన జాజులా
  ఈ రాత్రి తన కానుక గా పంపిన
  కొలనులోని కలువల కిల కిల లా...
  అన్నీ ఇవన్నీ సాయం సంధ్య ను సాయమడిగి నా సఖుడు ప్రొది చేసి ఇచ్చిన కానుక... వరాల మాలిక... (నేను కలిపేను కూసంత చమత్కారం)

  ReplyDelete
 21. భావన, నువ్వంత ప్రేమగా పలికే నీ పిలుపుకి పడిపోయానోచ్ అది మా నాన్నగారి మార్క్. ఒక్కోసారి ఉషడు అన్నాగాని. ఇక నీ కవితకి ఏదో ఓ చిన్న మాట చెప్పి అందులోని ఉదాత్తత ని తగ్గించలేను.

  "చెలుని చూసిన చెంచిత కళ్ళ
  అవి విరబూసిన జాజులా"

  భాళారే చిత్రం. నా మాట నీ నోట... ;) నెనర్లు నేస్తం.

  ReplyDelete
 22. మేఉష గారికి నమస్తే,


  ఆత్మ (తనని తాను) నెరిగిన వాడు కవి అన్నది ఈశొపనిషత్తు..
  అలాంటి వాడు మాత్రమె
  ప్రతీ విషయాన్ని సున్నితంగా స్పందిచ గలడు
  ప్రకృతిలోని అన్ని విషయాలలో మమేకం కాగలడు
  (బయటపడగలడు కూడా)

  "లేని అనిభవాలన్నింటినీ తనకున్న స్పందనతో పొంద గలడు"


  నిజమే దానికి నిలకడతో కూడిన మనస్సు అవసరం...

  మెట్చ్యూరిటి అవసరం...

  ఏ కవి కైనా కావల సింది... మీ నాన్న లాంటి శ్రోతలే
  మీ నాన్నగారి పాదాలకి నమస్కారాలు ...
  మీ కవిత కూడా మీనాన్నగారి వచనాలని అందుకుంది.. శుభాకాంక్షలు
  "భావాల బరువుని తేలిక పరిచేది,
  కర్కష హృదయాలలో కనికరం నింపేది,
  అందాన్ని ఆగిచూసే సమయం లేని వాడికి
  'అందాన్ని ఆపి ' చూపేది .......కవిత్వమొక్కటే
  (అందుకు మీకు కృతజ్ఞతలు )
  ------- సత్య

  ReplyDelete
 23. సత్య, "లేని అనుభవాలన్నింటినీ తనకున్న స్పందనతో పొందగలడు" అక్షరసత్యాలన్నీ పొందిగ్గా అమర్చి చెప్పారు. అనుభూతులే ఆస్తులుగా అనుబంధాలే వారధిగా బ్రతిగే కవిజీవన రాగాలవి. నేను అలా వూహల్లో తిరగూఅదబట్టే ఇలా నిలిచివున్నానింకా! మా నాన్నగారు నాకు అన్నిటా స్ఫూర్తి. నెనర్లు.

  ReplyDelete
 24. వేణు, మీ సంతకం వచ్చేసింది. ఇక అచ్చువేసేయొచ్చు ;) థాంక్స్. పనిలో పని మరికొన్ని [హాస్య ప్రధాన] వూసులు. ఈ టపాతొ మరువం పోయినేడూ డిశంబర్ నుండి ఈ రోజుకి 50,000 కౌంటర్ కి చేరింది. లెక్కల పిచ్చి కనుక ఈ మైలురాయి గమనించాను. ఈ మైలు రాయి నా మొదటి మార్గదర్శి నాన్నగారి మాటలతో కలవడం అదో ఆనందం.

  ReplyDelete
 25. నేనెప్పుడూ సంతోషంగా వుండాలి అని కోరుకునే, ఏదో ఒక హాస్యప్రస్తావనతో నవ్వులు పంచే ఓ నేస్తం ప్రస్తుతం మాట్లాడ[లే]ని పరిస్థితి కనుక ఈ వ్యాఖ్య మాత్రం తప్పక చదువుతారు కనుక -

  నాన్నగారు మాటలు, భాషే కాక మరి రెండు విషయాలు నన్ను మహా విసిగించేవారు. అది ఆహారం, రెండు మాతో వేళా పాళా లేకుండా భజనలు, పద్యాలు పాడించటం. పౌరాణిక పాత్రల్లో నటింపచేయటం. ఒక్కోసారి NTR మాదిరి ఆయన నాలుగు, నేను రెండు ఏక కాలంలో వేసేవారం. తర్వాత కాలంలో పబ్లిక్ స్పీకింగ్ రావటానికి అవే దోహదపడ్డాయి.

  ఒకసారి ఇదేమిటీ ఈ పిల్లనిలా తయారుచేసావు, మన ఇళ్ళలో మాంసం తిననంటే కుదురుతుందా అని ఎవరో ఆయన్ని అడిగారు. అంతే రొయ్యలు తెప్పించి ఇవాళ ఎలాగైనా తినిపిస్తాను అని కూర్చున్నారు. నేను కంటిమింటికి ఏకధారగా ఏడుస్తూ అందరికీ తండ్రి అయిన ఆ దేముడు దగ్గర కూర్చుని "మా నాన్నని ఎక్కడికైనా తీసుకుపో, నన్నీ కష్టం నుండి బయటపడవేయ్" ప్రార్థించాను. అంతే ఆయనకి బాస్ నుండి కబురు, అర్జంట్ గా వెళ్ళాల్సిన కాంప్. అమ్మ కూడ శాఖాహారి కనుక మా ఇంటి ప్రక్కనున్న ఉన్నీసా బేగం గారికి అవి ఇచ్చేసి ఆవిడతో మల్లెపూల జడ వేయించేసుకున్నాను. దేముడున్నాడనీ నమ్మకం పెట్టేసుకున్నాను. ;) కాకపోతే కూరి కూరి తినిపించటం మాత్రం ఎన్ని ప్రార్థనలు చెసినా తీర్న కష్టమే! :(

  అలాగే నాకు అర్థమైనట్లు చదువుకోవటమే కానీ ఆయన చెయ్యి పెడితే చిరాకు పడేదాన్నీ నా హోంవర్క్లో. ఒకసారి చెప్పిన మాత వినవా అని అరిచారని, నువ్వూ వినవా అని గట్టిగా మొట్టికాయ వేసి పారిపోయాన[ట]. ఇప్పటికీ ఎంతో నవ్వుతూ చెప్తారు. మీలో ఎవరికి ఈ ధైర్యం వుందీ? :)

  అందరికీ మరో సారి ధన్యవాదాలు.

  ReplyDelete
 26. చెవిలో సెల్లుఫోను గీతాలు
  చుట్టురా బస్సు హారన్ల పకపకలు

  పైకి చూస్తే మిల మిల మబ్బులు
  ఎదురుగ చూస్తే తళ తళ తారకలు

  ఇంటికెళ్ళే గేదెలు
  బడి బైట కెళ్ళే పిల్లలు

  సిమెంటు రోడ్డు మీద నడకా
  ఓపికుడిగి ఇంటికి చేరిక
  ఇవే కదా సాయంకాలపు కబుర్లు
  (రోజూ తప్పని ట్రబుళ్ళు)

  (మళ్ళా రిఫ్రెష్ అయి రంగంలోకి దిగుతాననుకోండీ)
  *** *** ***

  మగనిక సారీ గమనిక ;-):

  అసలే కవిగాని వాణ్ణి, బాలేక పోతే ఏమనకండి. కాలేజ్ బస్ దిగగానే కనిపించే స్పష్టాస్పష్ట దృశ్య రూపమిదే నాకు. వచనమంటే బోల్డంత వస్తుంది కానీ, కవిత్వమంటే బ్యారే నండి.అసలే భావుకత లేని బీస్టని కంప్లైంట్లు నాపైన. ;-)

  రేపో వచనం వదులుతాను. కవితీకరించి పెడతారా మీ వీలుననుసరించి? చాలా అందమైన దృశ్యాలే కనిపిస్తాయి నాకు. కనపడక పోతే మాత్రం ఊరుకుంటానా? ఊహించి పారేయనూ? ;-) ఆ మధ్యన ఆకులు చదవటం నేర్పమని అడిగాను. దానికిచ్చినట్టు హాండిస్తారా? వద్దు వద్దు ;-)

  ReplyDelete
 27. అబ్బో! నాన్న గార్లతో ఇదే సమస్యండీ బాబూ, they always bring the BEST out of their children :-D మీ నాన్నగారి ప్రస్తావనలు నాలుగైదు సార్లు చూసినట్టు గుర్తు. నావో నాలుగైదు వందనాలు చెప్పండి.

  ReplyDelete
 28. చంద్రోదయానికై ప్రకృతి కాంత
  వేచి చూస్తూ గోధూళితో
  ఆకసానికి లేఖ రాసి పంపింది
  రాకేశును జాడ తెలిస్తే కబురంపవమ్మా
  చుక్కల చీరె కట్టుకొనే నెచ్చెలీ
  ఓపలేకున్నది నీ ప్రియ సఖియని
  *** *** ***

  True indeed. సాధన చేస్తే వచ్చేది కాదు కవిత్వం. అది హృదయాంతరాళాల్లో ఉండి ఉబికి రావాలి. ఉండే దౄశ్యం ఒక్కటే చూసే దృక్కోణం మారుతుంది. మన మానసిక స్థితిననుసరించి. మంచి ప్రయత్నమే పెట్టారు మీరు. నేనొచ్చి కోతి గంతులేస్తున్నానేమో మరి. I took this a challenge, and tried to write, ఇప్పుడమ్త కుదర్లేదు కానీ, రేపింకా బాగా వ్రాస్తానేమో...

  ఇక వచ్చి మీ స్[ఏస్ వేస్ట్ చేయను. ;-)

  ReplyDelete
 29. ప్రచండ చండ చారులతా ముఖార్చిత తేజోమయ మరువపు వన విహారాజ్ఙ్నీ, నఖండ నవఖండవన కవితా మండలాభరణ విరితాండవ తారామణీ,సమరసమయసమున్నత విదుషీమణీ, ఉత్తుంగ తరంగ రంగనాటక నాట్యశాస్త్రవిపంచీ,సరస్వతీమనోభండారచౌర్యకారిణీ ఈ దీనుండు జేసిన పాపంబేమీ. ఆ శాపనార్థాలేమియో తెలియకున్నవి మహారాజ్ఙ్నీ.

  ReplyDelete
 30. గీతాచార్య! ;) యెస్ మీ మార్క్ వ్యాఖ్యానం. మొదటి వచన కవితలోని వాస్తవికత బాగుంది. ఆకులు చదవటం మాని తినటం మొదలుపెట్టాను. ఆ విద్య నేర్పుతాను కావాలంటే. నాకున్న శక్తికి ఏవో తోచిన వ్రాతలే కానీ ఒకరి భావాల్ని కవితీకరించగలనా? నాన్నగారి పట్ల అది నా భాధ్యతగా అనుకుంటాను. ఇక మీ రెండొ కవితలో భావుకత, క్రొత్త ప్రయోగం అమోఘం. "పువ్వుల కొమ్మలు చుట్టుకునే నా సఖీ నీ వాడి జాడ నే కనిపెడతానని" తిరిగి జాబు వస్తుందేమో! బాగుంది. మీ ముచ్చటైన మూడు వ్యాఖ్యల కవి సమయం/హృదయం.

  ReplyDelete
 31. ఉష అక్క చాల బావుంది...
  ఒక్క కవితకు తోడు ఎన్ని పొడిగింపులు.. మరెన్నో కవితలు ..
  http://tholiadugu.blogspot.com/

  ReplyDelete
 32. 10power గారు, అండ పిండ బ్రహ్మాండమండల భాషాధిపతి, విమర్శ శాఖ స్థపతి, ధీపతి, బృహస్పతి, [హమ్మయా, అయిపోయింది] మీకు గానీ మరొక మారుపేరు అంటే ఇది లెక్కలపేరు కనుక "సూత్రాలు" కలిపే పేరుగానీ వుందా? ;) దాదాపు ఇరవై ఎనిమిదీ/తొమ్మిదీ పదాల వ్యాఖ్యని ఖండించి, విభాగించి కాస్త అర్థం చేసుకోవటానికి ఇంతసేపు పట్టింది, మాష్టారు. తారామణీ, విదుషీమణీ వరకు మహా నచ్చేసాయి కానీ ఆ శాపనార్థాల మాటేమిటిటా? నా కసలు నిందాస్వరాలు రావు. ఈ కథ మీ నోటివెంటే వినాలని ఆకాంక్ష. మీ మాటలకి ముదావహం. శ్లేషకి సాలోచన. మొత్తానికి మురిపెం.

  ReplyDelete
 33. Ok. Am ready to learn eating leaves. :-D

  జస్ట్ సరదాకడిగాను కానీ, నాకు నా సొంతంగా వ్రాస్తేనే తృప్తి. ఒరిజినల్ ఆంగ్లమూ, అనువాదమూ రెండూనూ.

  ఇది మాత్రం రెండూ direct తెలుగులోనే వచ్చాయి. ఆంగ్లానువాదం ఎప్పటికి కుదిరేనో...:-(

  ఎప్పుడు నేర్పుతారు ఆకులు తింటం గృష గారు? ఇదేం పిలిపనుకోకండి. నేర్పుతానన్నారు కదా (గురువు + ఉష = గృష) ;-)

  ReplyDelete
 34. కార్తీక్, బహుశా కవిహృదయం ఉప్పొంగిన సమయం కావచ్చిది, లేదూ మరువం భాగ్యరేఖ ఉన్నతస్థితి కావచ్చు. హెచ్చుతగ్గుల ఆకళింపు మనసు మరవనంతకాలం అహంకారం తావుచేసుకోదు. ఇదే మాట మునుపు కొందరన్నారు - ఇక్కడ సవ్వడి సందడి ఎక్కువ అని. మరి విహారాల్లోనే కదా మనసు పురి విప్పేది. నెనర్లు.

  ReplyDelete
 35. గీతాచార్య, అవును తృప్తి అన్నది మన మనసు నిర్వచించుకునేది, దాని కోసం మనసు ఎప్పుడూ సంసిద్దంగా వుండి మనకి అవసరపడే శక్తియుక్తుల్ని ఇస్తుంది. తృప్తి ననుసరించి సుఖశాంతులు. ఉదయపువేళల ఆలోచనలు ఇలాగే వుంటాయి. ఫీల్ గుడ్ ఫాక్టర్స్ మాత్రమే సుమీ!

  ఇక ఆకులు మాట - గృష అన్నా గుర్వాణి అన్నా NP. భా.రా.రె. గరికి సంధులు బాగా తెలుసు. ఆయనేమన్నా అంటారేమో.

  మీరు మన సామ్ప్రదాయ ఆకుకూరలు తింటూవుంటారనే assumption - ముందు బీట్రూట్ ఆకులు పప్పులో వేసి/వేయించి వండి ట్రై చేయండి. పాలకూర పచ్చిది ఓ నాలుగాకులు నవలండి. ఈ పాఠం చాలు. ఈ నేర్చిన పాఠమే మీకు కనపడిన ప్రతి edible ఆకు విశిష్టతని తెలుసుకుని ఆహారంలో భాగం చేసేలా చేస్తుంది. [ఉదా: చేమ, లెట్టూస్, మునగ, గ్రేప్ లీఫ్, కాబేజ్...] ఇక నా పేరు మళ్ళీ "ఉష" అని మార్చేసుకున్నానోచ్! ;)

  ఆకులు చదవటానికి మొక్కల్ని ప్రేమించి సంభాషించాలి, అప్పుడు వాటి పత్రాలు లిఖించే భాష్యాలు ఎవరికి వారికే తెలుస్తాయి. :) I do this all the time and don't care what others say/think about it. I have seen an evidence of their life and survival with that. Thanks for reminding this too!

  ReplyDelete
 36. నేను మరీ అంత కరడుకట్టిన వాడిని కాదులెండి. ఆనందం అందరికీ కలగాలని కలలు కంటున్నవాణ్ణి. మీరూ అందుకు తక్కువేమీ చేయడంలేదు జన్యా కాంట్రిబ్యూషన్ తో నాకంటే మీరే బాగా పనిచేస్తున్నారనిపిస్తోంది. నిజంకూడా.

  ReplyDelete
 37. ప్రభాతప్రద్యోతనకిరణ్మయీ జన్యా రక్షక సంరక్షకా పీడితతాడితప్రజాఘృణీ జన్యాఛవీ చకోరపక్షుల గభస్తీ మరువపువనవిరాజితా శాపనార్థాల ఆంతర్యమే తెలియకున్నదా? అండ పిండ బ్రహ్మాండమండల భాషాధిపతి, విమర్శ శాఖ స్థపతి, ధీపతి, బృహస్పతీ,అంక బీజ సూత్రాసమాస సమార్పితుండ అనిన అవి మాకు ప్రియమైన శాపనార్థాలగనే గన్పట్టుచున్నవి కదా. మరువపు తీగల ఊయలగట్టి మనసుల ఊహల ఊయలలో ఊగించు ఉషా మయూఖమా , మరీచి వీచికల సౌభాగ్య భాగ్య విధాతా!

  >>ఉత్తుంగ తరంగ రంగనాటక నాట్యశాస్త్రవిపంచీ : వువ్వెత్తున ఎగిసిపడే ఈ నాటక రంగమునకు నాట్యశాస్త్ర విపంచివి
  >> సరస్వతీమనోభండారచౌర్యకారిణీ : సరస్వతీ దేవియొక్క మనసు భాండాగారన్ని దొంగిలించిన వనిత (నానా విషయ పరిజ్ఙాని)

  అమ్మోయి గారూ, ఇది అలంకరణగానే తీసుకొనండి. :)

  ReplyDelete
 38. Usha gaaru

  just saw the email / fwd'd link - :)

  I am not the 10power who is posting / disguising as me (or atleast copying my narration / diction!) in your blog. So just an FYI. Though he copied few lines/sentences from a comment I posted yesterday in vangurifoundations blog :).

  All the best buddy for your future endeavors!

  If you already know the thing, just ignore my comment. Or you can check / compare the I P addresses to confirm. :)

  Thanks

  Sastri

  ReplyDelete
 39. వర్మ, సరదాకి అన్నాను. పిల్లలకి వినోదం,విజ్ఞానం రెండూ అందించటం మన బాధ్యత కదా? మీకు కవితల పట్ల మక్కువ, వాటికే ఎక్కువగా స్పందిస్తారని తెలుసు. నెనర్లు.

  ReplyDelete
 40. 10power గారు, మీ ఆ రెండో వ్యాఖ్య అర్థం చేసుకోవటానికి మాత్రం మరో జన్మ కావాలి. ;) కానీ శ్రద్దగా మళ్ళీ తొంగిచూసినందుకు నాకీ భాషాప్రవీణ వంటి పరీక్ష పెట్టినందుకు థాంక్స్. ఏదో ఒకనాడు నా కల నెరవేరి నేనూ మీలా వ్రాయగలనని ఆశ. :)

  ReplyDelete
 41. జలసూత్రం/కిట్టయ్య మేష్టారు, కారణమేదైనా గానీ మీరు మళ్ళీ తొంగిచూసారు. ఆయ్ అననంటే ఓ మాట ;) నిజానికి పాట ... గుంటూరు శేషేంద్ర గారిది "నిదురించే తోట లోకి పాట ఒకటి వచ్చింది కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది" అన్నంత ఫీల్ కలిగింది నాకు. నిజ్జంగా నిజం.

  పోన్లేండి ఆ మాటలు మీవి కాకపోయినా ఈ మాటలు మాత్రం నాకు అర్థమయ్యే భాషలో చెప్పారు. నెనర్లు.

  ReplyDelete
 42. ఉష గారు చల్ల బడ్డ సూర్యుడు పడమర కాంత వళ్ళో సేద తీరు తాడు గాని '
  చల్ల బడ్డాక కౌగిలి కి ఆరాట పడతాడా?అయిన కౌగిలికి కబురు పెట్టడం రవి కి అవమానం
  అప్పటి కాల మాన పరిస్తితుల బట్టి ప్రవర్స్తిస్తాడు , అంటే వొక వేల మబ్బులు పడితే?
  పడమర కాంత రాలేదు కదా?

  ReplyDelete
 43. రవిగారు, ఇవే కవి సమయాలు. మీ మనసుకి అలా తోచవచ్చు. నాకు మరోలా. నెనర్లు. మా వూర్లో చలి ఎక్కువ అంతా హీటర్స్ మీదే బ్రతికేది. కనుక ఆయనకీ తప్పదట. ;)

  ReplyDelete
 44. ఉష గారు అమెరికా అయితే వాకే .వానలో కనిపించే తార , చల్ల బడ్డ సూర్యుడికి కూడా అవసరమయ్యే హీటర్ , సో కవియిత్రి రాసే కాల మాన పరిస్తితుల్ని కుడా ద్రుష్టి లో పెట్టుకుని చదవాలి ఇక నుంచి .

  ReplyDelete
 45. రవిగారు, అర్థం చేసుకున్నందుకు థాంక్స్.

  కాస్త మార్చాను.

  నూతక్కి వారి సమీక్ష, సలహాని బట్టి క్రింద పాదంలో ఒక పంక్తి మాత్రం కాస్త మార్చాను.
  *****
  పద పదమున నీ జీవన యాన గతిన అణువణువున స్ఫూర్తి పంచి బ్లాగ్లోకానికి వుషస్సునందించిన సూరీడు..... మీ తండ్రి గారికివే నాసాహితీ అభివందనాలు.

  నీ కవితలో ...

  తూరుపు కన్నియ కానుకిచ్చిన వెచ్చదనం
  గడప గడపకీ పంచేసి, తానే చల్లబడి
  పడమర కాంతకి కబురు పంపి
  ఆమె కౌగిలి చేరగ పరుగులు తీసే సూరీడు ..

  అధ్భుతమ్ వుషా !.అయినా యిందులో పంచేసి ని పంచి గా మార్చి"తానే చల్లబడి" అన్న పదం (అవసరం లేదనిపించింది) తొలగిస్తే ఫ్లో కు యిబ్బంది వుండదనిపించింది. యిప్పటికి యింతే! త్వరలో మరలా కలుద్దాం.శుభాకాంక్షలతో...

  ReplyDelete