మనసు వెచ్చబడింది - కాస్త చూసివెళ్ళండి

ఏటి ఒడ్డున ఏదమ్మ నా ఆలిచిప్ప?
తోట మలుపున కానరాదే నా రామచిలుక?
కోట దాపుకి రాననదే నా కొండమల్లి?
గూటిలోపల తొంగొనదే నా గోరువంక?
వేటగాడికి చిక్కిందేమో నా లేడికూన?
వీడు దొరకక బావురందేమో నా కన్నెమొలక?
అమ్మో నా మనసు చింతకి వైద్యమేదీ?
*******************************
పైన నా మనిషి మానసాన్ని నేను కవితీకరిస్తే, ఇదిగో మా భావన భావన. :) మరిది నాకు తగ్గ సమాధానమే! కాదంటారా? ;)

ఏటి ఒడ్డున అల్చిప్ప...
ముత్యమంటి
మగని మనసును దాచి పెట్టి
ఏమి ఎరుగని నంగ నాచై
తళుకు నవ్వులు రువ్వుతోంది....
తోట మలుపున రామ చిలుక
కొమ్మ
పైని కొంగుచాటున
ప్రియుని విరహం చూసి చూసి తుళ్లుతున్నది
కొమ్మ చాటున కొండ మల్లి
ఆకు
చాటున వొదిగి వొదిగి
వలపు తలపుల పరిమళాన్ని రువ్వుతోంది నిలిచి చూడోయ్
గూటి లోపలి గోరువంక
కువ
కువ లతో నవ్వుతోంది
దిక్కులోంకన చూడకండా తొంగి చూడోయ్ చిన్ని కన్నా
వేట గానికి చిక్కునా నీ వలపు తలపుల జాజి మల్లె
అండ దండ విలుకానివి నువ్వు వుంటే.......
నీ మనసు చింత కు మందు వేయగా
నడిచి
వచ్చిన వలపు కొమ్మ
అల్ల నల్ల అధర మదరగా నక్కేనచ్చట చిట్టి చిలుక
అలక తీర్చి శయ్య పరచగ వేచివున్నది కలహకంఠిత

34 comments:

  1. చాల బాగుంది అండి

    ReplyDelete
  2. ఉష గారు, చాలా బాగున్నాయండి మీ కవితలు. అంత చింతపడే మనసుకి వైద్యం ఎక్కడుంటుందండి, వెతుకుతున్నది దొరికితే తప్ప. ఇంకా ఎన్నో ముత్యాలు మీ కలం నుంచి రాలాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను
    బాటసారి

    ReplyDelete
  3. ధన్యవాదాలు,బాటసారి గారు. మీ బ్లాగు చూసాను, మీ అలోచనలు బాగున్నాయి. మళ్ళీ మజిలీ తీసుకుంటానాచోట.

    ReplyDelete
  4. నా పాత కవిత [అదీ నాకు అత్యంత ప్రియమైన రోజునాటిది 12/17/08 12:44 AM] తిరిగి పోస్ట్ చెయ్యటానికి భావన కారణం. ఆ చిరు కవితకి ఈ సాయంత్రం తనిచ్చిన ఆ పొడిగింపుతో కొందరికైనా నచ్చుతుందని పెట్టానిక్కడ.

    పైన పాదం అలిగి వెళ్ళిన నెచ్చెలి జాడ కొరకు అల్లాడే ప్రియునిది. తరువాయి భాగం అతనికి సాంత్వన నిచ్చిన పలుకులు. భావనది "కన్నయ్య" మానసం కనుక ఆ పోకడ వుందక్కడ. మరవరైనా ఇంకేమైనా పూరిస్తారా?

    ReplyDelete
  5. "కొమ్మ చాటున కొండ మల్లి ఆకు చాటున వొదిగి వొదిగి
    వలపు తలపుల పరిమళాన్ని రువ్వుతోంది నిలిచి చూడోయ్"

    ఎందుకో ఈ లైన్లు చాలా చాలా నచ్చేశాయండీ.

    ReplyDelete
  6. చూసి చూసి నాకూ కవితలు బాగా నచ్చటం మొదలుపెట్టాయ్

    ReplyDelete
  7. "ముత్యమంటి మగని మనసును దాచి పెట్టి
    ఏమి ఎరుగని నంగ నాచై
    తళుకు నవ్వులు రువ్వుతోంది..."
    చాల బాగా రాసారండి తెగ నచ్చేసింది ..

    ReplyDelete
  8. ఎంటండీ సునీత గారూ,

    అంత మాటన్నారు? సినీ వారసుల్ని చూసి, చూసి ఏదో నాటికి జనం ఒప్పుకున్న దానిలాగా... ఇంత చక్కని కవితలతో మనకి విందు భోజనం అందిస్తున్న ఉష గారిని? ;-)

    ReplyDelete
  9. ఉషాగారు గుండెలోన వొక మాటుంది
    గొంతు దాటి రానటుంది
    వుండలేకా , వెలికి రాక
    ఉబ్బి తబ్బిబ్వుతోంది
    ఏదో అనుకునేరు నేను మీతో ఇక్కడ పంచుకోలేని సమాచారం
    అందుకని మీ మిత్రుడి గా నా విన్నపం
    నా మెయిల్ ఇడి కి మెయిల్ చెయ్య గలరు
    మెయిల్ ఇడి నా బ్లాగ్ లో వుంది .

    ReplyDelete
  10. చిన్ని కన్నయ్యా,
    నేనెంత పిచ్చిదాననయ్యా..
    అందరినీ ఆడించే నిన్ను
    ఆడిద్దామని అనుకున్నాను కదయ్యా.


    కాదు కాదు.. నేను చాలా తెలివైనదానను.
    ఆలిచిప్ప లో దాగుంటే కనపడను అనుకున్నాను..
    కాని నువ్వు కూడా అందులో కనిపించావు కదయ్యా..
    మరి ఎక్కడ దాగను?

    కొమ్మపైన రామచిలుక
    కొండచాటున కొండమల్లె
    గూటిలోపలి గోరువంక
    అందరం గొప్పవాళ్ళమే...

    మమ్మేలు కన్నయ్యని
    మరిపించి మురిపించాలని
    గొప్పగా చేసేసామనుకుని
    పిచ్చిఆటలు ఆడుతుంటే
    ఎందుకయ్యా కన్నయ్యా మిన్నకున్నావు?

    మమ్మల్ని గెలిపించి
    నిన్ను మేము గెలిచేస్తుంటే
    నీ కొంటె నవ్వు చూస్తుంటే
    వచ్చిందయ్యా అనుమానము
    అమ్మక చెల్లా.. ఎంత గడసరివయ్యా..

    మాకోసం వెతికినట్టు నటించి
    మాచేతే నీకై వెతికించి
    మమ్మల్ని మెచ్చుకున్నట్టు పొంగించి
    మాచేతే పొగిడించుకుని
    అమ్మదొంగా.. ఎంతవాడివయ్యా...

    మాకు నీగురించి అన్నీ తెలిసిపోయాయి
    మరింక నీ మాయలో పడకూడదనే అనుకుంటాము..
    నిజం.. నమ్ము.. కాని మాయ విడిన తర్వాతగాని
    తెలియదాయె అంతదాకా ఉన్నది నీ మాయలోనే నని..

    ReplyDelete
  11. సవరణ


    కాదు కాదు.. నేను చాలా తెలివైనదానను.
    ఆలిచిప్ప లో దాగుంటే కనపడను అనుకున్నాను..
    కాని నువ్వు అందులో కూడా కనిపించావు కదయ్యా..
    మరి ఎక్కడ దాగను?

    ReplyDelete
  12. భలేగా నచ్చేసింది...ఎంతైనా మీరు గ్రేట్!

    ReplyDelete
  13. శ్రీ లలితా.. చప్పట్లు చప్పట్లు చాలా బాగుంది.. కృష్ణయ్య లీల చాలా బాగా చెప్పేరు. మనకోసం వెతికి మనతో వెతికించుకుని, అంతా తాననిపించి కాని మనతోనే తను అనిపిన్చే లీలా మోహనుడూ కదు... బాగుంది అండి.

    ReplyDelete
  14. very nice.
    "కలహకంఠిత" - you mixed up two heroines :)
    It is either కలహాంతరిత or విరహోత్కంఠిత

    ReplyDelete
  15. వచ్చామండీ మీ మనసు వెచ్చదనాన్ని చూడడానికి. ఇదుగో ఈ రకంగా ఆ మనసుకు వైదిగం చేసుకోండి.


    కన్నెమొలకా మనసుపెట్టి చూడవే
    మనసు చింతకి వైద్యమున్నది నీ చెంతనె!

    ఏటిఒడ్డున ఆల్చిప్పలు వెతకకే
    నీ ప్రక్కనున్న ముత్యపు మొలకను చూడవె!

    తోట మలుపున కానరాదే నీ రామచిలుక
    నీ మల్లెపూల మత్తులోన మునిగిఉన్నది చూడవె!

    గూటిలోన నిద్దురెక్కెడె నా గోరువంకా
    నిద్దురోని జాబిలమ్మ బుగ్గలన్ని తడిమి చూడవె!

    సరస సయ్యాటల వేటగాడిని నేనేనే
    నన్నుమించిన వేటగాడు ఇంకెవ్వరే!

    కన్నెమొలకా కనులు మూసి వెతకవె
    మనసు చింతకు మందు వున్నది నీ చెంతనె.

    ReplyDelete
  16. వెచ్చనైన నా మనసుని పరామర్శించిన అందరికీ నెనర్లు. నిజానికి ఈ పొగడ్తలన్నీ భావనకి చెందుతాయి. [హల్లో భావన అలాగే తెగడ్తలు కూడనామ్మా నీకే!] ;)

    ReplyDelete
  17. అక్క మీ భావుకతకు మళ్లీ నే బందీనై పోయాను..
    కవిత చదివేసి కామేన్తడంమర్చిపోయి అయ్యో
    ఉషక్క బ్లాగ్లో కామేన్టడం మర్చిపోయానని మళ్లీ ఇదిగో ఇప్పుడు వచ్చా!

    కవితలో అద్భుతమైన ప్రశ్న .. అద్భుతమైన సమాదానం..

    రెండు మూడు సార్లు చదవాలనిపిస్తునది.. మంచి భావ వ్యక్తీకరణ

    www.tholiadugu.blogspot.com

    ReplyDelete
  18. సునిత, 'తినగ తినగ వేము తియ్యగ నుండు' అన్న తీరున అన్నమాట. మీ వచనం నుండి ఈ భావుకత వైపు లాగేసానా? హమ్మయ్య ఒక చేప పడ్డది వలలో ;)

    సృజన, నాకు తెలిసినంతలో మీరు సినిమాలు చూడటం తక్కువ, మరి సినీ వారసుల పోకడల వరకు వెళ్ళారేం? చిత్రం. నచ్చిందుకు థాంక్స్.

    ReplyDelete
  19. శ్రీలలిత గారు, నేనేదో నా కన్నని ఆటలు పట్టియటానికి నాల్గు రోజులు బింకాలు పొయ్యాను, బెంబేలెత్తి బేర్ మన్నాడు. అది కైతగా గిలికాను. భావనమ్మ దానికి అంత తులసీదళం వేసి తులాభారం చేసింది. మీరు పారిజాతం కలిపి దైవత్వాన్ని ఆపాదించారు. ఎంతైనా మా వాడు పెట్టిపుట్టాడు. థాంక్యు మేడం. :)

    ReplyDelete
  20. కొత్తపాళీ గురువుగారు, వచ్చేసారా? నెనర్లు. ఇకపోతే భావన దగ్గర ఆ రెండో భాగం తనది కనుక ప్రచురుణ హక్కులే కానీ అచ్చుతప్పులు అగ్రీమెంట్ తీసుకోలేదు. కనుక నా అష్టనాయిక కవిత ద్వారాగా నాకు ఆ ఎనిమిది నాయికలు తెలుసునని మనవి చేసుకుంటూ, మన భావనమ్మ అష్టభార్యల్నీ కలిపి కన్నయ్యకి ఈ క్రొత్త మగువని సృష్టించిందేమో తననే అడిగి తెలుసుకుందాం..... ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ భావన గారు, ఇకపై వ్యాఖ్యాభారం తమ మీద వేస్తూ... మీ నెచ్చెలి ఉష. ;)

    ReplyDelete
  21. భా.రా.రె. హమ్మయ్య, నా కవితకి సరిగ్గా తగ్గ ప్రతి-కవిత. ఇప్పుడిది సై సై జోరెడ్లా బండి నడక. ;) ఎంతైనా జాతి విరోధం కనుక అలా అనక ఎలాగంటారు? చాలా బాగా సమాధనం వచ్చింది. ఇప్పుడిక మంగళం పాడొచ్చు. చాల థాంక్స్.

    కార్తీక్, చాలా థాంక్స్. కామెంట్ వ్రాయాలి అని నియమం ఎందుకు తమ్ముడు? చదివి అస్వాదించి, అవసరపడినప్పుడు కాసినన్ని సద్విమర్శలు గుప్పిస్తే చాలు.

    ReplyDelete
  22. కొత్త పాళి గారు... ఉష తన కన్నయ్య మనసు ఆవిష్కరిస్తే తన పదాలతో, ఆ కన్నయ్య కు ఉష మనస్సు ను పునః పరిచయం చెయ్యటానికి ప్రయత్నించాను. కలహాంతరిత నే పరిచయం చేద్దామనుకున్నా కాని ఇంతలోనే ఆమె కలహాన్ని వుపసంహరించుకుని విరహోత్కంఠిత ఐపోతే నేనేమి చెయ్యను అండి.. నా పదం అలా వచ్చింది. కలహాంతరిత అలా వుండాలి కదా మరి అంతలోనే జాలి పడి విరహఫడితే నాదా తప్పు.. ;-)

    ReplyDelete
  23. ఒకళ్ళని మించి ఒకళ్ళండి. స్వర్గానికి తీసుకెళ్ళి పోయారు.

    ReplyDelete
  24. wow!good!both the poems are fantastic!

    ReplyDelete
  25. అశ్వినిశ్రీ, థాంక్స్. "అటక మీద టృంక్ పెట్టి దింపి పాతపుస్తకం చదివినట్లే..." ఇదీను. :) అది మొదట్లో వ్రాసినప్పుడు ఆ ప్రేరణకలిగించిన మనిషికి మాత్రం చూపాను. మళ్ళీ ఎందుకో అనుకోకుండా ఆ రోజు గుర్తుకువచ్చి ఈ కవితని వెలికి తీసాను. భావన కదంబం చేద్దామన్నది. నా మరువం, తన తులిసీదళం, శ్రీలలిత గారి పారిజాతం, భా.రా.రె. గారి మల్లియలు కలిసి/వెరసి ఈ సుమధుర మాల. చుట్టూవారి పలుకులు అది వాడకుండా చిలకరించే మమతల తీర్థం. :)

    ReplyDelete
  26. జయ, అవునూ ఎవరండి వాళ్ళు? ;) నాకూ కాస్త చిరునామా ఇవ్వరా. ఈ చలి భూతం నరకం చూపిస్తుంది. కాస్త అలా అలా మీరన్న స్వర్గం చూసొస్తేనైనా ఇలా మనుషులుగా మిగులుతామేమో! థాంక్స్. ముందే చెప్పానుగా, నాది గోరంత మా భావనది కొండంత... మిగిలినవారివి శిఖరాగ్రాలూను..

    ReplyDelete
  27. నేను గోళ్ళు కొరుకుతాను కనుక వాటి గురించి మాట్లాడను. మా ఊరి చూట్టూ కొండలున్నాయి కనుక బోరు కొట్టింది. కనుక వాటినీ వదిలేద్దాం (మూడు కనుక లొచ్చాయి కదా. నా ప్రార్థన ముగిసింది). ఇంతకీ ప్రార్థన ఏంటంటారా? కను (చూడు నాయనా) క (బ్రహ్మా) కవితా శిఖరాలను మాకు చూపిస్తున్న ఉష గారికి ఆ చిన్న కోరికేదో తీర్చిపెట్టమని... ;-)

    ReplyDelete
  28. ఇక కవితకి నా వ్యాఖ్య.

    వీడెవడండీ బాబూ, ఎప్పుడూ ఇదే గోల అనుకోక పోతే ఎందుకో రెండో కవిత ఎత్తుగడ ఎంత బాగుందో చివరకొచ్చేసరికి తేలిపోయిందని (పదాల కూర్పులో తేడా అనుకుంటా) అనిపించింది.

    కలహ కంఠిత పదం బాగుంది. దాన్ని నేనూ వాడుకున్నాను ఒక ప్రచురితం కాని కథలో.

    భావం గురించి చేప్పేదేముంది? ఇద్దరు మాస్టర్లు కలసి సృష్టిస్తే. టాప్ క్లాస్

    ReplyDelete
  29. I'm back and you're up with simply superb piece

    vechchabadina manasuki svaaMtana dorakalEdaa ?
    oDDu chErina aalchippa muthyaalu kuripistE, thOta malupuna kOtagOdapai daagina raamachiluka, rammani pilichiMdi.

    ReplyDelete
  30. గీతాచార్య, భలే కొంటె మొదటి వ్యాఖ్య వ్రాసారే :) నిజంగానే ఈ మంచు, ఐసింగ్ రెయిన్, ఫ్రోజన్ లేక్ మరొక ఐదు నెలలు చూడలంటే బాధే :(

    కవిత మీద వ్యాఖ్య: థాంక్స్. నిజానికి భావన అది దాదాపుగా క్షణాల మీద వ్రాసింది. అందుకే యధాతథంగా వుంచేసాను. తను నాకు చెప్పింది ఏవైనా పదాల కూర్పు అవసరపడితే సర్థమని. నాకే మనస్కరించలేదు.

    ReplyDelete
  31. ప్రదీప్, చాలా సంతోషం, మీరు తిరిగి రావటం. సాంత్వన సగం కవిత వ్రాసాక, సగం ఆ పలుకులు పలికించిన మనిషి పలుకులతోను కలిగింది. నెనర్లు.

    ReplyDelete
  32. సృజన, నాకు తెలిసినంతలో మీరు సినిమాలు చూడటం తక్కువ, మరి సినీ వారసుల పోకడల వరకు వెళ్ళారేం?

    Hahaha.
    He writes in Navatarangam, and we are fiction buffs.

    ReplyDelete