నిక్షిప్త నిధి

నిశ్శబ్దాన్ని చీల్చే కీచురాళ్ళ కవాతులు,
ఖండ ఖండాల్లోను ధ్వనించు నగారాలు.
స్తబ్దతని పెకలించే కడలి కెరటాలు,
ద్వీప ద్వీపాంతరాల్లోనూ ఎగిసే సునామీలు.
ఇవే నా మాట పదునుకి కొలమానాలు

నిశీధిలో వెలుగు జెండాలు,
రెక్కనాపక శ్రమించు మిణుగురులు.
నిదుర కన్నెరగని తేనెటీగలు,
కాంతితో నింగిపట్టు నింపేటి నక్షత్రాలు.
అవే నా వూహ వునికికి చిరునామాలు

కసాయి గుండె రగిల్చిన కారుచిచ్చు,
చీకటింట అణగారిన నూనెదీపం.
ఆర్తనాదాల నర్తించు అరాచకం,
ఆరుబయట పారేసిన దివిటీ.
నేను సైతం ధిక్కరించు అనాగరీకం

వివేకంతో వినోదానికి హెచ్చవేతలు,
నలుగురితో నాకున్న బాంధవ్యాలు.
విజ్ఞానంతో విచక్షణకి కూడికలు,
పదుగురిలో నా పలుకుబడి.
నేను సభ్యసమాజ ప్రతినిధిని.
**********************

నేను అన్నదిక్కడ మానవుడు/మానవి కి ఆపాదించాల్సిన పాత్ర.

19 comments:

  1. ముందు సరిగ్గా అర్థంకాలేదుకానీ కామా-ఫుల్‌స్టాపులని గమనించాక..చాలా బావుంది.

    ReplyDelete
  2. ఏంటో కొంచం కష్టంగా అర్ధం అయ్యీ కానట్టుంది.

    ReplyDelete
  3. superlative degree లో ఉందండి...
    మొదటిసారి చూపులు వీటిపై ఆగిపోయాయి...

    స్తబ్దతని పెకలించే కడలి కెరటాలు..

    రెక్కనాపక శ్రమించు మిణుగురులు.
    నిదుర కన్నెరగని తేనెటీగలు,
    కాంతితో నింగిపట్టు నింపేటి నక్షత్రాలు.

    ReplyDelete
  4. చెప్పీ చెప్పక, మానవుని లోతు చెప్పారు మరోసారి నాకు " విశ్వంభర " గుర్తు చేసారు

    ReplyDelete
  5. సాలభంజికలు, మునుపొకసారి ఈ పేరు బ్లాగ్లోకంలో చూసానని గుర్తు. నా వనవిహారం చేసినందుకు, ఈ చిరుకొమ్మని ఆస్వాదించినందుకు థాంక్స్.

    ReplyDelete
  6. సునిత, నేను, సంక్షిప్తంగా చెప్పాలంటే ప్రతి మనిషిలోను నిక్షిప్తంగా వున్న నిధి ఇది. మనిషికి మాత్రమే మనసు ఇచ్చాడు దేముడు. ఆ మనసుకి వూహ, యోచన, అవి వ్యక్తం చేయను భాష, మాట కూడా ఇచ్చాడు. అవే అతని ఆయుధాలు - శాంతికైనా, వినాశనానికైనా. ఈ కవిత ఆత్మ అదే. నేను మొదటిదే ఆ సభ్యసమాజాన నిలువగలదు, రెండవది తన అంతం తనే చూసుకుంటుంది అని విశ్వసిస్తాను. నెనర్లు.

    ReplyDelete
  7. ప్రదీప్, మరొక్కసారి ఆ మహామహుని రచనతో నా చిన్ని కవితకి భావసామీప్యం చూపి నన్ను ఆనందసాగరాన ముంచేసారు. నిదానం గా ఈదుకుంటూ వెలికివస్తాను. థాంక్స్.

    ReplyDelete
  8. సూపర్ డూపర్ బండీరా ఇది
    జంపర్ బంపర్ ఉషరా ఇది
    మండే గుండెల్ రేగే కోపమ్
    బిగిసిన పిడికిలి ఉరికిన రక్తం
    చీలిన గుండెన పారిన పాట
    అలగా కదిలి నదియై ఉరికి
    రగిలే మంటల మసి చేసి
    అరాచక అగ్నికీలల ఖననం చేసి

    వెలుగు జెండాల్ ప్రతిష్టించె ఖండఖండాల్లో
    నవ సమాజ మహిళా ప్రతీక ఈ నిక్షిప్త నిధి.

    ReplyDelete
  9. భా.రా.రె. గారు, మొత్తానికి ఎపుడో మీ బ్లాగులో అన్నానని నన్ను కదిలివచ్చిన కనకదుర్గ రేంజ్ లో వర్ణించారుగా ;) మాట, కలం/కీపాడ్ కున్న శక్తి ఇదే కదా?

    ReplyDelete
  10. ఉషగారు కవిత చాలా బాగుంది.. భరారే గారి కవిత మరీ బాగుంది :-)

    ReplyDelete
  11. కదిలివచ్చిన కనకదుర్గ ./. :) naa valla kaavaatla!title miru select cheasukunnadaanni chuusi potta chekkalautoendi:)kk

    ReplyDelete
  12. బాగుందండి,
    స్తబ్దతని పెకలించే కడలి కెరటాలు,
    బాగుంది.

    ReplyDelete
  13. నిశీధిలో వెలుగు జెండాలు,
    రెక్కనాపక శ్రమించు మిణుగురులు.
    నిదుర కన్నెరగని తేనెటీగలు,
    కాంతితో నింగిపట్టు నింపేటి నక్షత్రాలు.
    అవే నా వూహ వునికికి చిరునామాలు

    marvellous...

    ReplyDelete
  14. వేణు, మరి అదే కదా మాట చేయగల తాండవం :) నా కలం తాతై ధిధితై అంటే, భా.రా.రె. గారి జజ్జనకరిజనారే అంటూ నన్ను సమ్మక్క సారక్క లెవల్లోకి ఎత్తేసారు ;)

    అశ్వినిశ్రీ, శ్రీనిక, వర్మ గార్లకి, నెనర్లు. నా మనసుని నొప్పించి, నన్ను తీవ్రంగా బాధించిన ఒక సంఘటనకి ప్రతిగా ఈ కవిత. మాటకున్న పదును తెలిసిన మనిషి, మనసుకున్న సున్నితత్వాన్ని కూడ తెలుసుకుంటే బాగుండు..

    ReplyDelete
  15. వేణూ గారూ, మీరిలా ఉష ముందు మీ కవిత మరీ బాగు అంటే, మీకు తలంటు పోస్తానని ఎక్కడో చెప్పింది. చూసుకున్నారా? మనూరబ్బాయివని ఏదో ఉప్పందిస్తున్నా... జాగ్రత్త సుమా ;)

    ReplyDelete
  16. ఒకటే పలుకు
    ఎదను నెమ్మదిస్తుంది
    అదే పలుకు
    మదిని కలచివేస్తుంది
    మరో పలుకు
    మనసును మంట పెడుతుంది
    ఆ పలుకే అంతరంగాన్నంటి ఆలోచనను ప్రేరేపిస్తుంది.
    నువ్వెవరివీ అన్నది నీ పలుకులో తెలుస్తుంది
    సంబోధనలో నీ సంస్కారం ఉట్టిపడుతుంది
    కుసంస్కారులు చుట్టుముట్టి మనస్సును చిన్నాభిన్నం చేసినప్పుడు
    సంస్కారవంతులు వారిని క్షమించి వదిలెయ్యడమే..
    అప్పుడే శాంతి..

    ReplyDelete
  17. చాలా బాగుంది ..
    నూతన సంవత్సర శుభాకంక్షలు..
    నా కానుకగా ఈ టపా అందుకోండి:
    http://creativekurrodu.blogspot.com/

    ReplyDelete
  18. భా.రా.రె. గారు, నేను వేణుని ఈసారికి వదిలేసాను. ఒకటి అసలే ఆర్ట్ ఆఫ్ లివింగ్ అభ్యసిస్తున్నాడు [అంటే తెలివిగా బ్రతకటం రాదనేగా అర్థం :)] రెండు జలుబుతో బాధపడుతున్నాననే మనిషికి ఇక తలంటు పోయటం ఎందుకనీను. మీరేమీ జాగ్రత్తలు అంచేత చెప్పనవసరం లేదు. :) [వేణు, మనం మనం బ్లాగ్ ఫ్రెండ్స్ మి. అందులో యేమీ తేడా లేదు సుమీ!]

    Nayani Aditya Madhav, థాంక్స్ ఫర్ ద కామెంట్ అండ్ కాంప్లిమెంట్.

    ReplyDelete
  19. శ్రీలలిత గారు, చక్కగా పరిణితి తెలిపే మాట చెప్పారు. వాగ్దేవి అందరికీ ఒక విధమైన వితరణ ఎందుకీయదనే నా బాధ. I gave word to my kannaa that I would always forgive those wronged me. So I stand by my word in any circumstance. In turn I feel the strength of my love for him. So, యేది జరిగినా అంతా మన మంచికేనేమో. మన మనసు ఎదగటానికేనేమో ఇటువంటివి ఎదురవటం. నెనర్లు.

    ReplyDelete