ఎండుటాకుల కసువు వూడ్చి
మంచునీళ్ల కళ్ళాపు జల్లి
ఎండా నీడల ముగ్గులేస్తున్న
కట్టు బానిస గాలి నోట ఈలపాట
'మళ్ళీ తెల్లారింది మాయ లోకమా
నాకు మాత్రం తప్పకున్నదీ వెట్టి చాకిరీ.'
అంతటితో సరా అకటా ఒకటా రెండా వెతలు
కొమ్మల సైగల అర్థాలు వెదకాలి
పూల పదాలు ప్రేయసి కురులకి చెప్పాలి
ఆమె పెదవుల పలుకులు అతనికి చేర్చాలి
ఈ గాల్లోనే ఏదో మార్పు అనిపించాలి
ఇక్కడితో ముగిసేనా ఆ ముచ్చటలు
వీడ్కోలు వూపిరిలో వేడికి తడవాలి
ఎడబాటు అలజడిలో కంటితడిలో వెచ్చనవ్వాలి
ఎదురుచూపు మధురిమలో ఎద గానమవ్వాలి
సందేహాలు తీర్చాలి, సందేశాలు తీర్చిదిద్దాలి
జీవితాల ఋతువుల్లో కాలం గడపాలి
కాలపు మార్పుల్లో తన పని తాను చేయాలి
నిండువేసవి గాలి వీచాలి, జడివాన హోరుగాలీ కావాలి
ఎడారి మంచు తూఫాను కావాలి, నడిరేయి ఉప్పెనా కావాలి
గాలికెన్నో గాలిపనులు, మనిషి జీవితానా, జీవితంలోనూ ...
చాలా బాగుంది ఉషా, మరీ మొదటి స్టాంజా అయితే జీవనసారం.
ReplyDeleteఎప్పటిలాగే కొద్దిగా కెలుకుదామని ఈ ప్రయత్నం.
"నిండువేసవి గాలి వీచాలి, జడివాన హోరుగాలీ కావాలి
ఎడారి మంచు తూఫాను కావాలి, నడిరేయి ఉప్పెనా కావాలి
గాలికెన్నో గాలిపనులు, మనిషి జీవితానా, జీవితంలోనూ"
అవి ఇలా మారయనుకో, జీవన గమనంలో ఇవి ఏరకంగా లాభం?
ఇక్కడితో ముగిసేనా ఆ ముచ్చటలు
ReplyDeleteవీడ్కోలు వూపిరిలో వేడికి తడవాలి
ఎడబాటు అలజడిలో కంటితడిలో వెచ్చనవ్వాలి
ఎదురుచూపు మధురిమలో ఎద గానమవ్వాలి
సందేహాలు తీర్చాలి, సందేశాలు తీర్చిదిద్దాలి
జీవితసారాన్ని వడపోయడం మీకు వెన్నతో పెట్టిన విద్య...
నాకు నచ్చినా గాలి పాట ఇది
ReplyDeleteపూల పదాలు ప్రేయసి కురులకి చెప్పాలి
ఆమె పెదవుల పలుకులు అతనికి చేర్చాలి
కల్పన
ఈ గాలి జీవితం ఎన్నిటితో ముడిపడివుందో తెలుసా...
ReplyDeleteపూల నడిగా మాల కడదామని
పుష్ప విలాపాన్ని చదివి వినిపించాయి
గాలి నడిగా తావి తెమ్మని
గింగిరాలే తిరుగుతూ పోయాయి పవనాలు
జంటకోసం చూసే జాబిలమ్మా
చుక్క కన్నె ఎక్కడమ్మా..అంటే
చెప్పిన సంగతిదీ...
మారే ఋతువులతో మారలేక
చీకటింటి చీరకట్టి
కాటుక రంగు ముగ్గు పెట్టి
వెట్టి చాకిరీ కి కట్టు బానిసలా మారిన
ప్రకృతిశొభను చూడలేక
తల్లడిల్లే మనసుకు సద్దిచెప్పలేక
గాలివాటుగా సాగే ఈ జీవితానికి
ఊరటనిచ్చే దెవ్వరో... చెప్పగలరా ఎవరైనా.....
Baagundi
ReplyDeleteచాలా బాగుంది.
ReplyDeleteచాలా బాగుంది.మీ కవిత
ReplyDeleteచాలా బావుంది.
ReplyDeleteభా.రా.రె. నచ్చి మెచ్చినందుకు నెనర్లు. ఎప్పటిలానే మెలిక పెట్టినందుకు బహుబాగు.
ReplyDeleteమీరన్న ఆ నాలుగూ ప్రకృతి పరంగా గాలి పాలు పంచుకునే పనులు. గాలి లేనిదే మనకి గ్రహింపుకు రానివవి. ఆ గాలివాటు పనులు జీవితానికి అన్వయిస్తే వేసవి సాయంత్రాల్లో వీచే గాలులు ఎంత సేదతీరుస్తాయో అలాగే ఓ వేడి ఘర్షణ వెనుక వచ్చే క్షమార్పణ ఉపశమనం. ప్రేమ జడివానై కురిసే సమయాన వలపు హోరున వీచాలి. ఇరువురి నడుమ కలిగే ఎడబాటు ఎడారిని తిరిగి కలిపే విరహపు మంచుతుఫానవ్వాలి. అలాగే నడిరేయిలో ప్రణయం ఉప్పెనంత ప్రళయం కావాలి. మనం ప్రతి గమనాన్ని తెలియకనే ప్రకృతిలో ఏదో ఒక పోలిక తో చెప్తాము కదా. ఇదీ అంతే. ఇక లాభనష్టాలు విప్పి చెప్పనక్కరలేదు కదా? ;)
వర్మ, జీవనసారాన్ని సంగ్రహించటమే రాని దాన్ని ఇక కాచి వడబోయటమే.. ;)
ReplyDeleteకల్పన, మంచి పదాలు మెచ్చారు. థాంక్స్.
వేణు, సునిత, ఫణి, వతనుగా నా కవితలు ఆస్వాదిస్తున్నందుకు థాంక్స్.
నెదునూరి, మీ తొలి వ్యాఖ్యకి ధన్యవాదాలు.
శ్రీలలిత గారు, పూలు, గాలులు, చుక్కలు అన్నిటా వెదికారన్నమాట గాలివాటు జీవితాల గమనం. ఎందుకో కానీ ప్రకృతి శోభని అస్వాదించలేని యాంత్రిక జీవన బానిసలు కొందరైతే, ఈ లోకం అంతటికీ యుగాల తరబడి అదే తీరుగ దర్శనమిచ్చే ప్రకృతి, గాలి, నీరు, భూమ్యాకాశాలు ఓ విధంగా వెట్టి చాకిరీ చేసే బానిసలే కదా అని నా కన్ను కాంచింది. దానికి నాదైన కాస్త రొమాంటిక్ ఫీల్ కలిపి ఇలా... నెనర్లు.
ReplyDeleteఈ కవిత వ్రాసాక మునుపు తనని గాలితో పోల్చుకుంటూ వూహాగానాలు చేస్తూ వ్రాసిన "ప్రాణ వాయువుగ పాటనే నింపేస్తా!" http://maruvam.blogspot.com/2009/04/blog-post_08.html కొందరికైనా గుర్తు చేస్తేనో అనిపించింది. నిజానికి అసలు వ్యక్తికి ఎంతమాత్రం అర్థం కాలేదని నాకనిపించింది. అయినా ఆ గాలిని వదల్లేక ఇలా గాలిపాటలో/ వెఱ్ఱి కైతలో వ్రాస్తూనే వుంటుందీ పిచ్చి మనసు. :)
ReplyDelete"పూల పదాలు ప్రేయసి కురులకి చెప్పాలి
ReplyDeleteఆమె పెదవుల పలుకులు అతనికి చేర్చాలి"
చేరిన పలుకుల సందేశానికి
చిందిన చిరునవ్వులు తిరిగి
మోసుకు రావాలి అకటా...
ఒకటా రెండా వెతలు!
"అంతటితో సరా అకటా ఒకటా రెండా వెతలు
ReplyDeleteకొమ్మల సైగల అర్థాలు వెదకాలి..."
"...జీవితాల ఋతువుల్లో కాలం గడపాలి
కాలపు మార్పుల్లో తన పని తాను చేయాలి"
simply superb...
remembered the song...
"గాలికి కులమేదీ ఏదీ...నేలకు కులమేదీ...ఏదీ..
మింటికి మరుగేదీ...ఏదీ...కంటికి నెలవేదీ..."
Oh ok usha, but still I am missing something, but for now I am convinced with your reply.
ReplyDeleteI don't want give you the credit hitting half century;)
Later.
పరిమళం, తృష్ణ, మన సున్నిత మనస్కులకి ఆ గాలి విప్పి చెప్పే వూసులు ఇట్టే అర్థం అవుతాయి ;)
ReplyDeleteభా.రా.రె. ఏమిటీ మీ బాధ, ఇంకాస్త విప్పి చెప్పండి ఆర్యా, That was a feel a week or two ago while driving when the wind was blowing the leaves [then felt just like we the human carry responsibilities, the nature too does a job of its own for ages...] then down to how we say "gaali maLLiMdi, gaali gaaDu... etc. and of course added my own touch of love and affection.
హమ్మయ్య, ఉష ఇంగ్లీష్ లో వ్రాసింది కాబట్టి కోపమొచ్చిందేమో ;)ఇప్పుడు నాకు లాష్ట్ స్టాంజా ఓకే. కానీ could you please eloborate on this
ReplyDeleteఇక్కడితో ముగిసేనా ఆ ముచ్చటలు
వీడ్కోలు వూపిరిలో వేడికి తడవాలి
ఎడబాటు అలజడిలో కంటితడిలో వెచ్చనవ్వాలి
ఎదురుచూపు మధురిమలో ఎద గానమవ్వాలి
సందేహాలు తీర్చాలి, సందేశాలు తీర్చిదిద్దాలి
భా.రా.రె. ఫర్వాలేదే, నా వైనాలు బాగానే గుర్తుంచుకున్నారు. కాకపోతే త్వరత్వరగా వ్రాయొచ్చని ఆ భాషలోకి దిగానంతే. ;)
ReplyDeleteఇది మరీ అన్యాయం. తెలిసినవి మళ్ళీ నా నోటితో చెప్పించాలని కుట్ర.
ఒక్కసారి మీ భామిని తన అధరాల సాక్షిగా మీకు వీడ్కోలు ఇచ్చే సీన్ గుర్తుచేసుకోండి. మొదటిలైన్ అవగతమౌతుంది.
"ప్రేయసి నిట్టూర్పులో వెచ్చగా కమిలి,
ప్రియుని వూపిరిలో కోరికగా రగిలి,
అయ్యో పాపం ఎన్నాళ్ళిలా బందిగా ఈ గాలి ;)"
ఎడబాటులో వూపిరి కూడా కన్నీటితో కలిసి వెచ్చనవదా?
ఎదురుచూపుల్లో ఏదో ఒక ఆలాపన ఆలపించని మనసుంటుందా?
గాలి అలవోకగా విస్తేనే జాజులు విచ్చి నవ్వుతాయి. ఆ మధురిమలే మదిని తేటపరుస్తాయి. తన ప్రియుడు రాడేమోనన్న సందేహం తీర్చుతాయి. మరే సంశయం పడనీయవు. అలాగే వీచే గాలులు ఎన్నో సందేశాలు విప్పి చెప్పినట్లు, ప్రేమికుల బాషలో గుసగుసలాడినట్లుగా వుండదూ?
ఇక నా వల్ల కాదు బాబోయ్. నన్ను, నా కవితనూ ఇలా బ్రతకనీయండి. ;)
హ్మ్మ్... గాలి గింగరాల గల గల లకు చాలానే భాష్యాలు చెప్పేవే... ఇన్ని చేసే తనకంటు పాపం ఒక రూపం లేదే, ఒక గంధం లెదే, ఒక రుచైనా లేదే... అందుకే కామోసు పీల్చే వూపిరే పరమాత్మ అనుకోమన్నారు..
ReplyDeleteహహ్హహ్హా... ఇప్పుడు లెక్క సరిపోయింది :)
ReplyDeleteభావన, చివరికంతా తేల్చుకోవాల్సింది ఆ నిరాకార, నిర్గుణ తత్వం విలువే కదా?
ReplyDeleteభా.రా.రె., చూసారా ఎవరి లెక్కలు వారికి, ఎక్కడ లెక్కలు అక్కడ తీరిపోయాయి. :) ఎంతైనా గాల్లో లెక్కలు, గాలి మీద లెక్కలు కట్టటం చాలా తేలిక సుమా! నెనర్లు. ఏమిటో అంతా ఈ గాల్లోనే వుందేమో...
గాలికెన్నో గాలిపనులు, మనిషి జీవితానా, జీవితంలోనూ ... ha! ha! ha!
ReplyDeleteకొమ్మల సైగల అర్థాలు వెదకాలి
పూల పదాలు ప్రేయసి కురులకి చెప్పాలి
ఆమె పెదవుల పలుకులు అతనికి చేర్చాలి!wah waah! wah waah!
చాలా ఖుష్ అయినాము మేమ్ సాబ్. మాకు ఈనాము దక్కినాది మీ మాటల్తో...
ReplyDelete