విరహిత వదిలిన తావున మల్లియ గొల్లున గగ్గోలు పెట్టదా?
తీయని తలపుల తాపపు తాకిడి తప్పని మనుగడ మనది.
వేచిన కన్నుల వేడికి వాడిన తనువు, వగపు నా బ్రతుకై,
నిను కౌగిట చేర్చగ తామసి వశమై నిలిచాను ప్రియా!
********************************తీయని తలపుల తాపపు తాకిడి తప్పని మనుగడ మనది.
వేచిన కన్నుల వేడికి వాడిన తనువు, వగపు నా బ్రతుకై,
నిను కౌగిట చేర్చగ తామసి వశమై నిలిచాను ప్రియా!
చేతిలోవున్న పెన్ను కాప్ క్రింది పెదవికి ఆనించి, ఆ నాలుగు పంక్తుల వెంటా మరోసారి దృష్టి సారించి మురిపెంగా చూసుకుంది మిత్ర. ఉదయాన్నే మెలుకువలో అస్పష్టంగా వచ్చిన వూహ అది.
కాస్త వేడిగా ఏమైనా తాగాలనిపించి లేచి వంట గదిలోకి వెళ్ళింది. పాలు వేడిచేయటానికి కప్పు తీసుకుందామని పరధ్యాసగా కిచెన్ కాబినెట్ వైపు చాపిన చేతికి సిరియల్ డబ్బా తగిలి క్రిందపడి రంగు రంగుల ఆ పలుకులు చెల్లాచెదురుగా పడ్డాయి. క్రింద కూర్చుని పోగేయటానికి చెయ్యి చాపబోతు "V" ఆకారంలో పడ్డ వాటిని చూడగానే మదిలో మళ్ళీ ఓ ఆలోచన.
మరొక పదినిమిషాల్లో "విశ్వామిత్ర" అని వ్రాసిన సిరియల్ వంక చూస్తూ కూర్చుంది. ఉదయపు గోరువెచ్చని కిరణాలు విశ్వ స్పర్శని గుర్తుకి తెస్తున్నాయి.
ఎటు చూస్తే అటే విశ్వ యేదో ఓ రకంగా తలపులనుంచి తొలగనని స్థిరంగా పరుచుకుపోయాడు.
అలా ఎంతసేపు కూర్చుందో తెలియదు. విశ్వ పరిచయం అయిననాటి నుండి జ్ఞాపకాలు అలలు అలలుగా ఎగిసిపడుతున్నాయి. ఇంతలో ఫోను మోగింది.
"అమ్మలు.." ఫోను తీయగానే ఆత్మీయంగా వినిపించిన నానమ్మ గొంతు.
"నానమ్మా," మిత్ర గొంతులో అమితాశ్చర్యం "ఎలా వున్నావు?" అని అడిగింది.
"ఏంట్రా తల్లీ ఇది? నెల పైనే అయింది నీ ఉత్తరం వచ్చి. ఫోను చేసీ పది రోజులైంది. తీరిక లేదా బంగారం?" లక్ష్మీదేవమ్మ గారి గొంతులో ఈమారు కాస్త ఆదుర్దా ధ్వనించింది.
ఒక్కసారిగా స్పృహలోకి వచ్చినట్లుగా, కాస్త అపరాధభావన, తడబడుతున్న స్వరంతో "బానే వున్నాను నానమ్మా, ఏదో కాస్త బద్దకం.." అన్నాగానీ తప్పించుకుంటున్నట్లుగా తనకే అనిపించింది మిత్రకి.
కాసేపు అవీ ఇవీ మాట్లాడి పెట్టేసాక, అవే ఆలోచనలు. ఎందుకు తననింతగా అతను ఆక్రమించేసుకున్నాడు? వద్దనీ అనాలనిలేదు. తనని అతనంతగా ప్రభావితం చేయటం ఎందుకో అప్పుడప్పుడు తనకే సమాధానం తెలియని ప్రశ్నార్థకంగా తోస్తుంది. ఇంతకు మునుపు ఎప్పుడూ తన మనసుకి కలగని స్థితి ఇది. ధ్యాస అంతా అతని పైనే.
లేచి వెళ్ళి మంచం మీదకి చేరి నిద్రపోవటానికి ప్రయత్నిస్తూ, పుస్తకం తిరగేస్తూ కాసేపు స్నానం కూడా చేయకుండా ఒంటిగంట వరకు అలాగే గడిపేసింది.
ఏదైనా వ్రాయాలనివుంది. విశ్వకి ఫోన్ చేసి రమ్మని అడగాలని వుంది.
క్రొత్తగా పరిచయమయిన నైబర్ తో కలిసి గోల్ఫ్ ఆడటానికి వెళ్తానని నిన్న సాయంత్రమే చెప్పాడు. ఈ మధ్యనే నేర్చుకోవటం మొదలుపెట్టాడు కనుక అతన్ని డిస్టర్బ్ చేయాలనిలేదు.
మళ్ళీ పుస్తకం తెరిచి వ్రాసుకుంటూ కూర్చుంది.
"నా మనసు నాది కాదు, అది నీ చెంతనేవుంది..
నాకూ నేను లేనా, కన్నా?
ఈ నిశ్శబ్దం నను నలిబిలిచేస్తుంది,
ఈ ఎడబాటు నను శిధిలజీవిని కమ్మంటుంది
నీవు లేని వనాన నేనిక విహారం చేయను,
ఈ విలాపాల విరహగీతమాలపిస్తాను.
నివురువోలె నింగికెగయనా,
వానవోలె నేలకు జారనా,
ఏవిధముగ నిను చేరను?
ఏ దిక్కున నిను వెదకను,
వేగిరపడి ఏ మలుపున నిను కలవను?
నీ కొరకు గుండె చేసే నాదంలో మూగపోతూనే మౌన రాగాలు ఆలపిస్తున్నాను. నా జీవనాన ఇదే అతి మధురమైన పయనం. నీవు పంచిన స్మృతులు మల్లెల మాలలా అల్లి నిన్ను వరించే వరమాలగా చేసుకుని నిలిచున్నానిచట! ..."
ఇంకొక నాల్గు పేజీలు ఏవేవో వ్రాస్తూనేవుంది. పాలు తాగాలని వెళ్ళినది మొదలు ఆ క్షణం వరకు ఏమీ తినలేదు. నిస్సతువగా నిద్రలోకి జారిపోయింది.
*************************************************
కాలింగ్ బెల్ మోతతో కళ్ళు విప్పి టైం చూస్తే దాదాపు సాయంత్రం అయిదు. వెళ్ళి తలుపు తీయగానే ఎదురుగా విశ్వ. ప్రక్కకి తొలగి లోనికి దారి ఇచ్చింది.
"మిత్ర, ఏమైంది?" లోనికొస్తూనే చేతిలో వున్న ఫ్రూట్స్ వున్న బాగ్ ప్రక్కగా వుంచి నుదురు మీద చేయివేసి చూస్తూ "ఇలా వున్నావేం?" అని అడిగాడు.
మొదట్లో ఓసారి హైదరాబాదులో కంప్యూటర్ లో ఏదో ప్రాబ్లం చూడటానికి వచ్చినప్పటి జ్ఞాపకం మెదిలింది.
"ఏమీ లేదు, మనసుకి నలతగా వుంది, విశ్వ." మిత్ర నవ్వేసింది.
అతన్ని కూర్చోమని ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసరికి యాపిల్స్, పేర్స్, బెర్రిస్ ముక్కలుగా కోసి ప్లేట్స్ లో సర్ది వుంచాడు.
"అమ్మలు, యేంట్రా ఇది?" మిత్ర ఉదయం వ్రాసిన "విశ్వామిత్ర" అన్న సిరియల్ పలుకులు చూపుతూ అడిగాడు.
నవ్వుతూ జరిగిన సంగతి చెప్పింది. ఇద్దరూ కూర్చుని పళ్ళముక్కలు తింటూ మాటల్లో పడ్డారు.
లేత గోధుమ రంగు టీ షర్ట్, డార్క్ కాఫి కలర్ పాంట్స్, వుంగరాల జుట్టు. సాధారణం గా కనపడే అతనిలో ఏదో అసాధారణ విలక్షణత. చిలిపి వూహ కదలాడింది.
అలవాటుగా అతని ఎడమ అరచేతిలో తన కుడిచేతి చూపుడు వేలితో సున్నాలు చుడుతూ "విశ్వ నీకు కొన్ని పేర్లు పెట్టనా?" అని అడిగింది.
ఆమె చెప్పేది వింటూ కుడిచేత్తో ఆమె ముంగురులు సవరిస్తూ వున్న విశ్వ "ఊ" అన్నాడు.
"నీ శరీరాకృతి చూస్తే సింహం గుర్తుకొస్తుంది - ఎందుకంటే నువ్వు నా కెంతో ప్రీతికరమైన సింహమధ్యముడువి.
నీ మంద్రస్వర కంఠం నాకు గండు కోయిలని ఎదుట నిలబెడుతుంది
నీ మంచితనం మహావృక్షాన్ని గుర్తు తెస్తుంది - చల్లని నీడ, తన తావుని వీడని మేరు గంభీరత్వం.
సేదతీరానిచట అనిపించే నీ సమక్షం గోదారి ఒడ్డునున్న భావననిస్తుంది."
ఒక క్షణం ఆగి అతని మెడ వంపులో తలవాల్చి
"నీ ఆలింగనాలు, చుంబనాలు తుమ్మెదని జ్ఞప్తికితెస్తాయి." నెమ్మదిగా పూర్తిచేసింది.
"మిత్ర, ఒక మాట అడగనా?' మిత్ర నుదురు మీద సన్నగా ముద్దిడి, కాస్త ప్రక్కకి జరిగి, మిత్రని తన వొడిలో పడుకోబెట్టుకుని అడిగాడు విశ్వ.
"అడుగు, ఏమని అడుగుతావు.." అంది మిత్ర.
"మన ఇద్దరినీ బయటనుండి చూద్దాం. నీవు మంచి అందగత్తెవి, భావుకురాలివి, కెరీర్ లో ఉన్నత స్థాయికి చేరుకుంటున్నదానివి. ఇక నేను అన్నిటా సామాన్యుడినే. పెద్దగా సాధించేమీ లేదు. నువ్వు కూడా మన తొలిపరిచయం లో నన్ను నిరాకరించావు. మరి ఇప్పుడు మనమింత సన్నిహితం ఎలా కాగలిగాము?" అని అడిగాడు.
"ఊ, తెలియదు కన్నా." అంది.
"బహుశా అప్పుడు నా బాహ్యరూపం చూసావేమో, ఇప్పుడు నాలోని మనిషిని చూస్తున్నావేమో?" అన్నాడు. అతని మాటలు కూడా సుధీర్ఘ ఆలోచనలోంచి వస్తున్నట్లుగా వున్నాయి.
"మిత్ర, ఇదంతా కలగా తోస్తుంది. నీకు దూరం అయిపోతానేమోనని ఒక్కోసారి తెలియని వెరపు. నువ్వు నిజంగానే నన్ను యాక్సెప్ట్ చేసావా?" విశ్వ మాటకి ఛివాల్న లేచిన మిత్ర మొహమ్మీద చిరు కోపం తాలూకు కెంజాయ వన్నె. ముక్కు మాత్రం మంకెన రంగుకి మారింది.
"ఏమిటి నీ ఉద్దేశ్యం, నాకు పరిణితి లేదా? నాకంటూ వ్యక్తిత్వం లేదా? నా భాగస్వామి గురించి ఆలోచనలు వుండవా?" అంది మిత్ర.
"అమ్మలు, ఎందుకురా అంత కోపం? ఎంత ముద్దుగా వున్నావో.." తిరిగి ఆమె తన సంధిట బందిస్తూ "మన బంధం ఇలాగే సాగాలన్న ఆశ" అన్నాడు.
గట్టిగా అతని బుగ్గ మీద గిల్లాక కానీ కోపం కాస్త తగ్గలేదు.
"మరి, కేవలం నీ రూపు చూసే కాదన్నానకున్నావా?" అంది. మళ్ళీ తనే పొడిగిస్తూ
"వూహ తెలిసిన దగ్గర నుండీ ఎన్నో పరిచయాలు, అనుభవాలు జీవితం పట్ల, పెళ్ళి పట్ల, జీవిత భాగస్వామి పట్ల అభిప్రాయాన్ని ప్రభావితం చేస్తూనే వున్నాయి. కొంత జంకు, కొంత నిరాసక్తత వున్న సమయంలో దాదాపు అపరిచితుడివైన నీ నుండి ప్రపోజల్. ఎలా అంగీకరిస్తావనుకున్నావు? నాకు ఇప్పటికీ నీ పట్ల యే ఆశింపు లేదు. నీ లక్ష్యాలు, వాటి పట్ల అవగాహన నాకు తెలుసు. నీలో నేను ప్రేమికుడినే కానీ నాకేదో సాధించిపెట్టే వ్యక్తిని కోరుకోవటం లేదు." అంది. మిత్ర మాటల్లో కూడ దృఢస్వరం.
"మిత్ర, నాకు నీ అంత పట్టుదల లేదు. నాకు లక్ష్యాలు వున్నాగానీ ఒక ప్లాను తో వెళ్ళను. నీ అంత నియమంగా వుండను. ఒక్కోసారి ఆ సమయానికి ఏది తోస్తే అది చేస్తాను." విశ్వ మాట పూర్తి చేయకుండానే..
"ఆగాగు, మొద్దబ్బాయ్ కి ఈ సందేహాలన్నీ ఇపుడెందుకు కలుగుతున్నాయి.." మిత్ర గొంతులో ఈసారి అల్లరి ద్వనించింది.
"నాకు నువ్వు నచ్చావు. అదీ సంపూర్ణ వ్యక్తిగానే ఇష్టపడ్డాను. నీ రూపం నా కళ్లకి మనోహరంగా వుంది. నా జీవితం నీకు ఆహ్వానం పలుకుతుంది. ఇక మనం మనకోసం. నన్ను, నిన్ను కలిపిన ప్రేమకి తెలుసు మననెందుకు కలిపిందో.." అంది మిత్ర.
ఆమె మాటల్లో భావుకతకి, స్వఛ్ఛతకి విశ్వ చలించిపోయాడు. ఒకరినొకరు హత్తుకున్న ఆ స్పర్శలో హృదయాలు సంభాషించుకున్నాయి.
మిత్ర ఏదో మగతలో అన్నట్లుగా అంది..
"విశ్వ నీ సమక్షంలో నేను దైవానికి చేరువగా వున్నట్లు ఫీలవుతున్నాను. నీ ప్రేమలోని పవిత్రతకి లోబడిపోతున్నాను. నీ చెంత
శూన్యంలో మౌనాన్ని నేను
మౌనంలో రాగాన్ని నేను
రాగంలో భాష్యాన్ని నేను
భాష్యంలో భావాన్ని నేను
భావంలో జీవాన్ని నేను
జీవంలో పూర్ణాన్ని నేను
నువ్వెవరు?"
"ఈ అనంత విశ్వంలో నీ కోసం సృష్టించబడ్డ వస్తువుని. లేదా పదార్ధాన్ని." విశ్వ గొంతులోనూ అల్లరి.
"వస్తువుకి రూపు, రంగు మాత్రమే వుంటాయి. రుచి వుండదు, మరి నన్ను వెంటాడుతున్న ఆ రుచేంటబ్బా? అదీ తనువంతా అలముకొని మరీ... ఇంకా నయం రంగు కూడా అంటలేదు. పోనీ పదార్ధం అందామంటే తమరేమో జడపదార్ధమాయే. నువ్వు పంచుతున్న ఈ అనుభూతులకి అది సరిపడదు. మరి ఎలా,ఏమని పిలవను నిన్ను?" మిత్ర కూడా ఏమీ తగ్గలేదు.
"ఆనందం దేన్నుంచి పుట్టుకొస్తుందో ఎవరి మనసుకు వారికే తెలుస్తుంది. చిన్ని చిన్ని ఆశలున్న నా ప్రాయానికి నడక, పరుగు నేర్పావు. మరింత చిన్ని కలలున్న నా గుండెకి మేలుకొలుపు పాడావు. లౌకిక, అలౌకిక భావాలు - ఆ రెండిటా నీదాన్ని చేసేసుకున్నావు. ఈ అలాపన కువ కువల గువ్వ పయనాలు మాదిరే ఎప్పటికి నిలవాలి." అంది.
అలా అలా ఇద్దరూ వూసులాడుకుంటూ గడిపిన ఆ సాయంత్రం మిత్రకి ఎంతో సంతృప్తినిచ్చింది. ఆ సంతృప్తి తాలూకు సంతోషం, అనుభూతి మనసుకి సంబంధించినవే. మూలకారణం, నిర్వచనం, ప్రమాణం, కొలమానం అన్నీ ప్రేమ నిర్ణయించేసింది.
విశ్వకీ అంతే. ఎక్కడో మనసులో కలిగిన సందేహం నివృత్తి అయిపోయింది.
అపుడపుడు మిత్ర చెప్పే వూసుల్లో ఆమెకి తన జీవితం పట్ల గల నిబద్దత, లక్ష్యాల పట్ల స్పష్టత, అనుకున్నదాని మీద లగ్నం చేయగల మనసు చూస్తే లోలోపల సంధిగ్దత కలుగుతుంది. తమ విరుద్ద స్వభావాల వలన ఏదైనా దూరం తమ మధ్య చోటు చేసుకుంటుమ్దేమోనని. వీటన్నిటినీ మించి ఆమె ప్రేమ తనకి దక్కింది.
ఇద్దరిలోను ఒకటే భావన. తాము ఒకరినొకరు ఒక గురిగా సాధించలేదు. ఒక మజిలీగా చేరారు. అవును వారిరువురు ఒకరి ప్రేమ అన్వేషణ మరొకరు.
*************************************************
విశ్వ చాలా రోజుల తర్వాత చిత్రం గీసాడు.
కొబ్బరిచెట్టుకి ఆనుకుని వున్న ఓ యువకుడు, నిండు పౌర్ణమి రేయిలో ఆ కొబ్బరాకుల వెనగ్గా వున్న చందమామ, ప్రక్కనున్న సన్నజాజి పందిరి ని ఆనుకుని స్వాప్నికావస్థలో వున్నట్లున్న యువతి. ఇరువురికీ నడుమ జాడలుగా పరుచుకునున్న వెన్నెల. వారువురి నడుమ పరుచుకునున్న ఆ కాంతి, ఒకరి నుండి ఒకరికి ప్రవహిస్తున్న అనురాగ వాహినా అన్నట్లుగా వుంది.
పాఠకులకి ఓ ప్రశ్న: ఈ చిత్రం మీకు ఏ భావన కలజేసింది. చెప్పినవారు నా ప్రియ స్నేహితులు. చెప్పనివారు నా ప్రియ శత్రువులు.
*** శుక్రవారం ఇంతవరకు వ్రాసి ఆపిన ఆ భాగానికి ఈ క్రింది కవిత శనివారం రాత్రి కలిపాను.
నా వూహా చిత్రానికి నా భావ వీచిక ఇది
/****************************
వెన్నెల్లో ముంచితీసిన సన్నగాలి కలాలు
కొబరాకు పత్రాలమీద నీకు లేఖలు లిఖిస్తే
చందురూడు నిన్ను కాంచి నివ్వెరపోయాడో
నీ మది దోచిన నను చూసి సంబరపడ్డాడో
సన్నజాజి వూగిసల చిరుస్వరాలు
నీ చెవి జూకాలకి సాటి అంటుంటే
నీకంటి కలల వర్ణాలు నా కలలసౌధానికి
మంచి గంధపు దూపాలు చదివిస్తుంటే
చెలియా నిను చేరిన ఈ ఇహం మరిచి
నా అహం విడిచి మళ్ళీ నీకు అర్పితమవనా?
సఖీ, నీదని నాదని ఏదీ లేదని తెలిసినదేదో,
మనది కానిదేదీ వలపు కాదనీ తెలిపినది
****************************/
[సశేషం]
painting thought baagundhi
ReplyDeleteమనసు కొద్ది సంవత్సరాల వెనక్కు వెళ్ళి సన్నజాజి పందిరి దగ్గర ఆగిపోయింది.
ReplyDeleteSrujana--సినిమా వాళ్ళ పోలిక కాదండి, నాకు కవిత్వం రాదు. చదవాలన్నా భయమూ, బద్దకమూ. అలాంటిది, ఈ మరువం లో కవితలు నాకు కవిత్వం అంటే ఉన్న వ్యతిరేకతను పోగొట్టాయని చెప్పబోయి ఇంకేదో చెప్పినట్లున్నాను.
అవునండీ, ఉష గారూ ఇంకో చేప కూడా వల్లో పడ్డది:-)
హుమ్.. మిత్ర కు తన ఆలోచనల మీద తనకు కొంచెం స్పృష్టత వచ్చిందే. నేను విశ్వ జట్టే బాబు..
ReplyDeleteజాలువారే వెన్నెల కట్టిన వారధి సాక్షి గా కలవాలని తపన, కలవలేమో అనే బెంగ, కలిసిన మనసుల మధ్యన సాగే ఒక మౌన సంభాషణ. ఆ భావన తోచింది ఈ భావన కు.. :-)
అతనిలో తొందర పడ్డానేమో అన్న తప్పుచేసిన భావన .ఆమెలో ఇన్నాళ్ళు పదిలంగా దాచుకున్న విల్లు లాంటి మేను ని ఎక్కుబెట్టి బాణం లా గమ్యం వైపు సాగి పోయేలా గురిచుసే విలుకాడు లాంటి తన కాబోయే భర్త దొరికిన ఆనందం లో స్వాప్నికావాస్త లో సన్న జాజి పందిరికింద ఆమె , ఆ వెన్నెలని ఆ రోజు వీళ్ళకోసం మాత్రమె ధార పోయడానికి వచ్చిన జాబిలి , తెరచాటు గా ఉపయోగ పడిన పక్కనే వున్న చెలులు శిలలు , వాళ్ళకోసమే వేచి వున్న మరింత మధురమైన ముందు నాళ్ళు వెరసి విశ్వ మనసులోని భావానికి ప్రతీక ఆ చిత్రం . యి విషయం లో ఇంత కంటే ఏమి చెప్పలేను మిత్రున్ని అయినా ప్రియ శత్రువును అయినా ఉష గారు .
ReplyDeleteఉషగారు....విశ్వ ఎంతైనా నా హీరో అండి అందుకే అలా పెయింటింగ్ వేసాడు!మిత్ర నన్ను తిట్టుకుంటుందో ఏమో??
ReplyDeleteఅమ్మయ్య....నేను మీ ప్రియ మిత్రురాలినే కదండీ??
చివరి వరకు చదివి నిద్రపోకుండా, మెలుకువగా సమాధానం వ్రాసిన బంగారుకొండలు - నా ప్రియ శత్రు/మిత్రులకి థాంక్స్. విడివిడి మార్కులు త్వరలోనే తెలుస్తాయి. ;)
ReplyDeleteఅన్యాయం మీ మానన మీరు మార్క్స్ యియ్య కుండా, మీ మొక్కల్ని చూసుకోడానికి పొతే , యి రాత్రంతా టెన్షన్ తో నిద్ర ఎలా పడుతుంది . నా 10th suplimentary అప్పుడు కుడా నేను ఇంత టెన్షన్ పడ లేదు -)
ReplyDeleteప్రదీప్, నిజానికి ఆ చిత్రం మదిలో కదలాడి కవితలల్లమంటున్నట్లుగా లేదా? ;)
ReplyDeleteసునిత, మరి ఆ సన్నజాజి ప్రక్కన నడుము సన్న చిన్నదాని గురించి కూడా పంచుకోరా? ;)
ReplyDeleteఇక మరి ఎక్కడ పడ్డవారు అక్కడే వుండాలి. పై యేడూ మీతోనూ కైత వ్రాయించేస్తా! ;) కీచురాళ్ళు, కొబ్బరిబోండాలు ఏది కావాలంటే అదే మీ అంశం.
భావన, అదే ఈ విశ్వకున్న ఆకర్షణ. మీ నల్లనయ్య తానే ఈతనిదీను. నీ భావన చాలా బాగుంది, నా వూహ దాదాపు దగ్గరకి వచ్చింది. థాంక్యు.
ReplyDelete>> విశ్వ ఎంతైనా నా హీరో అండి
ReplyDeleteపద్మార్పిత, నా కొంప కొల్లేరేనా ఇక. ;) ఎలాగో వూహలే కదా అని తెగ నా హీరో గార్ని వూహించుకుంటుంటే మధ్యలో మీరు పోటికొస్తానంటే ఎలాగమ్మీ!.. :( అమ్మో ఇక దాచేస్తాను.
రవిగారు, ఎంత కట్టన్యాయం కథ కట్టారు? :(
ReplyDeleteతొందరపాటా అదీ విశ్వానా చాల్లేండి, మాటే నిదానం. ఆమె వరకు మీ వూహ ఒక కోణంలో కరెక్ట్. తన లక్ష్యాలు ఏవైనాగానీ నెరవేరాలనుకునే మనిషి. అందుకు సాయపడే మనసున్నవాడు.
అందుకే మీరు సెప్టెంబర్ బాచ్లోనే ఇక్కడాను ;)
ఇంకెక్కడి మొక్కలు, మోడులు మిగిలితేను. ఈ చలికి annuals, perennials ఖతం. ప్రతి యేడు మళ్ళీ వేయాలి. లేక్ ఫ్రీజ్ అయింది ఓ సారి నడిచిరావాలని కోరిక. ఆ ప్రయత్నంలో పడ్డాను.
నా వూహా చిత్రానికి నా భావ వీచిక ఇది
ReplyDelete/****************************
వెన్నెల్లో ముంచితీసిన సన్నగాలి కలాలు
కొబరాకు పత్రాలమీద నీకు లేఖలు లిఖిస్తే
చందురూడు నిన్ను కాంచి నివ్వెరపోయాడో
నీ మది దోచిన నను చూసి సంబరపడ్డాడో
సన్నజాజి వూగిసల చిరుస్వరాలు
నీ చెవి జూకాలకి సాటి అంటుంటే
నీకంటి కలల వర్ణాలు నా కలలసౌధానికి
మంచి గంధపు దూపాలు చదివిస్తుంటే
చెలియా నిను చేరిన ఈ ఇహం మరిచి
నా అహం విడిచి మళ్ళీ నీకు అర్పితమవనా?
సఖీ, నీదని నాదని ఏదీ లేదని తెలిసినదేదో,
మనది కానిదేదీ వలపు కాదనీ తెలిపినది
****************************/
వేణు గారైతే మంచి పాట గుర్తు చేసేవారు. పోయిన టపాలో తను అలాగ వెలికి తెచ్చిన "మల్లెలు పూసే.. వెన్నెల కాసే..ఈ రేయి హాయిగా..
మమతలు వేయిగ..పెనవేయి నన్ను తీయగా..." పాట ఇచ్చిన అనుభూతి తాలూకు మధురిమ ఈ టపా వ్రాసినప్పుడు తలపుకొచ్చింది.
అమృతం వెన్నెల జల్లులా కురిసిన ఆ రాత్రి
ReplyDeleteవ్యక్తిత్వమే వెన్నుగా నిలబడిన ఆ మనోహరుని ఎదుట
సన్నజాజిలోని సన్నదనం, లాలిత్యం, మురిపెం, మోహం
ఆతనిని అల్లుకోవాలనే ఆశని ఒకటికి రెండింతలు చేస్తుంటే
స్త్రీ సహజసిధ్ధమైన సిగ్గు ముందుకెళ్ళడానికి మొగమాటపడితే
గ్రహించిన ఆ యువకుడు అందుకోవాలి కదా
ఆమె హృదయం లాంటి హస్తాన్ని...
ఎంత ఖేదం.. చెప్పరమ్మా మీరైనా వెన్నెల జల్లులు
ఊరుకున్నారేంటమ్మా కొబ్బరాకులు
అసలే సన్నజాజి గొంతు సన్నది
అయినా వినవలసింది హృదయాన్ని కదా...
ఇంకా ఎందుకీ వెనక ముందాటలు...
ఎంత దుర్మార్గమీ లోకం
అందరూ కన్నయ్య పక్షమేనా
ఏమిచ్చాడమ్మా మీకు
దొరికీ దొరకక ఊరించడం తప్ప...
సమయమేదీ సన్నజాజికి
తెల్లవారితె వాడిపోదా
ప్రభుని పాదాల వాలక
ధూళిలోనే కలుస్తుందా...
గొప్ప నోములే నోచిందిగా
తీవ్ర తపస్సే చేసిందిగా
ఇన్ని యేళ్ళు వేచి
ఇపుడు ఇంకా ఎదురుచూపేనా...
ఏమిటో ఇక్కడ అన్నీ కవితలే ఎక్కువున్నాయి. :(
ReplyDeleteమొదటి నుంచీ చదివాను. బాగుంది. కొత్త అనుభూతి. కధ నడవటం లేదు కానీ, చదివించేలా ఉంది.
madhyana ii poetii leantammaa? neanu satru mitroepaakhyaayanini! abbaa! bhalea kashtamaina pearu kaduu! in short SMP anukundaam!
ReplyDeleteఏమో అక్క ఆ కవితను ఆస్వాదించ గలిగాను కాని ఆ భావాన్ని మీ అంత బాగా చెప్ప లేని వాణ్ని, అలా అని నన్ను మీ మీ ప్రియ శత్రువు అంటే ఒప్పుకునేది లేదు, మీ జట్టు పచ్చే కొట్టేస్త,మీ ప్రియ మిత్రుల జాబితాలోవెయ్యాల్సిందే లేకపోతే మా జయక్కతో చెప్తా :) :) :).....
ReplyDeleteఅన్నట్టు సత్యం టపా లో నా వాణి మార్చా ఒక సారి చూడు అక్క :)
బాగుంది ఉషగారు. విశ్వ చిత్రం చూశాక నాలో మెదిలిన భావం...
ReplyDeleteచూడటానికి రఫ్ గా మొరటుగా కనిపించినా తనకంటూ ఏమీ మిగుల్చుకోకుండా తనలోని ప్రతి అణువునూ మానవాళి ఉపయోగానికై త్యాగం చేసేసి ప్రేమకు ప్రతిరూపమై నిలిచే కొబ్బరిచెట్టుకు సారుప్యతతో దానిపక్కనే విశ్వ..
అందం సుకుమారం తనసొంతమై భావుకులకు ప్రేరణై తన విరుల సుమధుర పరిమళాలతో పరిసరాలలో స్వచ్చతనూ, ఆనందాన్ని నింపే సన్నజాజితీగకు సారూప్యతతో దాని చెంతనే మిత్ర..
ఇరువురి మధ్య వారధిలా చక్కని చిక్కని ప్రేమలాంటి వెన్నెల కాంతి... ఈ జాజితీగ పందిరిని వదిలి కొబ్బరిచెట్టును అల్లుకుపోయేది ఎన్నడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న జాబిలి... అనిపించారు..
విశ్వచిత్రం చూసాక కాదు కానీ వారిరువురి సాంగత్యం సందేహాలు చూసి ఈపాట గుర్తొచ్చింది. విశ్వచిత్రంలో కూడా జాబిలి ఉండటం యాదృశ్చికం...
ReplyDeleteఓ నిండు చందమామ నిగ నిగలా భామ
ఒంటరిగా సాగలేవు కలసి మెలసి పోదామా..
ప్రత్యేకించి ఈ చరణం :-)
నిదురరాని తీయని రేయి నిను పిలిచెను వలపుల హాయి
మధురమైన కలహాలన్నీ మనసుపడే ముచ్చటలాయే..
మేలుకున్న స్వప్నములోనా ఏల ఇంత బిడియపడేవూ..
ఏలుకునే ప్రియుడను కానా లాలించగ సరసకు రానా..
ఇక్కడ వినచ్చు http://chimatamusic.com/playcmd.php?plist=7021
మీ సీరియల్ పుణ్యమా అని గుర్తుచేసుకున్న పాటలను నా సరిగమలగలగలలలో ఓ కొత్త టపాగా వేసుకుంటున్నాను థ్యాంక్స్ :-)
శ్రీలలిత గారు, ఎదురుగా వుంటే ఈ సారి పాదాభివందనం కాదండి, హగ్ చేసుకుని, "ఐ లవ్ యు" అనేదాన్ని. మా ఇంట్లో ఆత్మీయంగా చెప్పుకునే థాంక్స్ కి ప్రొటోకాల్ అది. :)
ReplyDeleteఏమిటో మా డైరీలు చదివేసినట్లే వ్రాస్తున్నారు. నా సన్నిహితులొకరు ఆ మాటే అడిగారు ఆవిడ మీకు ముందే తెలుసాని. ;)
మీ కవితకి జోహార్లు. నా కథ, మీ కవిత పూవు-తావి మాదిరి.
సమీర, మొదటినుండి చదివి అభిప్రాయం తెలిపినందుకు థాంక్స్.
ReplyDeleteనా తొలిపలుకు
"విశ్వ,మిత్ర - వారి జీవితాలే వారి పయనం. ఒకరి ప్రేమ అన్వేషణ ఆఖరి మజిలీ మరొకరు.ఇరువురి కలయిక చిత్రం. కలవరేమోననిపించే వైరుధ్యం. అయినా కలిసిన మనసులవి."
మీరు సరీగ్గా చదివి వుంటే బహుశా "కధ నడవటం లేదు" అన్న మాట వచ్చేది కాదు. ఇది ప్రేమ కథ. ఇందులో నడిపేది ఏమీ లేదు. మలుపులూ, మార్పులూ లేవు. మనోహరంగా సాగే కథనం అంతే. ప్రేమ ఎప్పటిదే. అది సంభంవించిన మరొక రెండు హృదయాల గానమిది. ఇక ఇందులో ఇంకా కథని వెదికితే అది మీ అభీష్టం. :)
అశ్వినిశ్రీ, SMP భలేగా వుందే. పేటెంట్ చేయటం మరిచిపోకండి మరి. ;) తర్వాతి భాగంలో SAP & BAAL గురించి వ్రాస్తాను. మిస్సవకుండా చదవండి. థాంక్స్.
ReplyDeleteకార్తీక్, మొదట టపాలో ఆ కవిత లేదు. ఒక రోజు సమయమిచ్చి నిన్న కలిపాను. అది ఒక పాఠకురాలిగా ఆ చిత్రానికి నా స్పందన. రచన తరఫున నా మానసం తర్వాతి వ్యాఖలో. థాంక్స్.
ReplyDeleteఇకపోతే నేను బెదిరింపులకి అసలు లొంగను. నా మనసుకి మాత్రమే జవాబుదారీని. :) ఇక్కడి వారంతా ప్రియమిత్రులే.
వేణు, ఈ కవిత నేనొక పాఠకురాలినైతే ఎలా స్పందిస్తాను అని వ్రాసినది. నేను మనసులో అనుకున్నది, భావన, మీరు ఫీలయ్యారు. శ్రీలలిత గారు మరొక ఫ్లేవర్ కూడా కలిపారు [జాజి వాడే లోగా దరిజేరు అన్న వేదనని]
ReplyDeleteనేను, అచ్చంగా మీరన్నట్లే విశ్వ మేరు గంభీరత్వానికి, వ్యక్తిత్వానికి ప్రతీకగా కొబ్బరి చెట్టు, మిత్ర సున్నితత్వానికి, భావుకతకి చిహ్నంగా సన్నజాజి తీగె తీసుకున్నాను. ["ఈ తీగె అల్లుకున్న పందిరి నీవే" ఇది నా నిజ జీవితంలో నేను వ్రాసుకున్నదే. "ఆ భావన నాకు ఎంతో సంతృప్తి నిచ్చింది" ఇది తన జవాబు.] జాబిలి, వెన్నెల స్వఛ్ఛత, పవిత్రతకి గుర్తులుగా వాడుకున్నాను. కల్పన వున్న ఈ కథలో ఏది నిజానుభవమో భావుకత ద్వనించే పదాల్లో భావుకుడిగా మీకు తెలిసేవుంటుందని నా అంచనా.
మీ పాటలతో నా టపాలకి ఒక విధమైన అలరింపు కూరుస్తున్నందుకు సదా కృతజ్ఞురాలిని. ;)
ఉషగారూ,
ReplyDeleteనన్ను కూడా మీ ఆత్మీయులలో ఒకరుగా చేసుకున్నందుకు నాకు కూడా మీరు చేసిన పనే చెయ్యాలనిపిస్తోంది.
భగవంతుడు ఒక్కలాంటి రూపురేఖలతో ఏడుగురిని సృష్టిస్తాడంటారు. బహుశా మనిద్దరినీ ఒకేలాంటి భావజాలంతో సృష్టించాడేమో. అందుకు ఆయనకి ఎన్ని నమస్కారాలు చేసినా తక్కువే.
నన్ను వదిలి నీవు పోలేవులే..అదీ నిజములే
పూవులేక తావి నిలువలేదులే ...లేదులే//
తావిలేక పూవు విలువ లేనిదే ఇదీ నిజములే
నీవులేక నేను లేనే లేనులే...లేనులే//(పాట పూర్తిగా గుర్తురాలేదు)
ఇక్కడ మీ ప్రోటోకాలే నేనూ ఫాలో అవుతాను.
iam back annaanu kada, anduke first comment pettEsaa monna kavita tarvaata raaddaamani. iMtalO mee abhimaana ganam oorukuMtaaraa, EkaMgaa 23 comments raasEsaaru. EdO iam back annaadu ani chance koodaa lEdu. sare lendi. idigO naa response
ReplyDelete=====
నారిని చూస్తూ నారికేళవృక్షానికి ఆనుకున్న నవయువకుడు
వెన్నెల వెలుగుల నీడలో సన్నగాలులు వీస్తూ ఆ వృక్షం
ఆ సన్నగాలికి కలయా నిజమా అని తెలియని మధురానుభూతిలో
ఎదుటపరుండిన సమ్మోహన సుందరాంగి
మన్మధుని విల్లుకైనా లొంగని అనిర్వచనీయ ప్రణయధ్యానంలో మునిగిన జంట
ఆ దృశ్యాన్ని చూచి భూమే పరవశమున మందగమనాన కదిలిందేమో
పున్నమి వెన్నెలకేనా ఈ భాగ్యమని
కన్నుకుట్టి దూసుకువచ్చే సూరీడుని ఆపే భూగమనం
ఎంతమందిని చూడలేదో ఇలాటి జంటలను ఆ పున్నమిరేడు
నారి - నారికేళం - పురుషుడు
నారి - సంద్రపుఅలలు - పురుషుడు
నారి - పర్వతశిఖరం - పురుషుడు
నారి - నదీతీరం - పురుషుడు
ప్రాంతమేదైనా, ఆ ఇరువురి నడుమ ప్రేమ పదిలమే ఆ వెన్నెల పందిరిలో
నిండు పున్నమి రేపిన తాపము
ReplyDeleteయువతి మనమున రేగిన మోహము
మోహ విచలిత విరహ జవ్వని
తనువున రేగెను ఆరని మంటలు
ఆరని మంటల రేగిన జ్వలితము
వెన్నెల దారుల తోరణ మాలిక
రెప రెపలాడెడి కన్నియ మనసు
వింతగ వీచే మన్మధ గాలులు
మరువపు గాలుల చిందిన నీళ్లు (కొబ్బరి)
చిరు జల్లుల తడిసిన "విశ్వా"సము.
మన్మధిని వలలో లేడికూన చిక్కిందా
సన్నజాజి మరుల మన్మధుడు మధనపడ్డాడా?
ఏదో మీరుచెప్పిన సన్నివేసానికి నాకనిపించింది వ్రాసాను.
శ్రీలలిత గారు, మరిక మిగిలిన ఐదుగురిని వెదుకుదామా? ఒక్కొక్కరు ఒక్కో ఖండం లో వుంటే బాగుండును. కొత్త భాష నేర్చుకోవచ్చు. ;) మొత్తానికి మనకి ఒక ప్రొటోకాల్ పెట్టేసుకున్నామన్నమాట. నేను అంత్యాక్షరి స్పెషలిస్ట్ ని అంచేత పల్లవి వరకు, ఆపై నచ్చిన పంక్తుల వరకే గుర్తుంచుకుంటాను. ఈ పాట మాత్రం పూర్తిగా వచ్చు. ;)
ReplyDeleteప్రదీప్, గోళ్ళతో గిల్లుకుని, కాళ్ళతో డాన్స్ చేసి నిజమేనని నమ్మాక మీ కవిత చదివి..
ReplyDelete"మన్మధుని విల్లుకైనా లొంగని అనిర్వచనీయ ప్రణయధ్యానంలో మునిగిన జంట"
నిజమే ఆ ధ్యానానికి అంతం లేదు.
"సూరీడుని ఆపే భూగమనం"
విశ్వ విడిచి వెళ్తాడన్న ప్రతి క్షణం మిత్ర ప్రార్థించేది దీనికొరకే, ఒక్క క్షణం మరొక్క నిమిషం తనతో వుండాలనే...
మీ కవితని మైమరిచి చదవటమే కానీ విడమరిచి చూసేంత స్పృహ కలగటం లేదు. చాలా థాంక్స్.
భా.రా.రె. ఈ మధ్య అచ్చంగా నా జట్టు పట్టారేమి, సాధారణంగా అవతల బెంచీ మీద కెక్కి మరీ గోల చేస్తారుగా?
ReplyDeleteకాకపోతే నాది విశ్వ పరంగా సాగితే, మీ కవిత మిత్ర పరంగా నడిచింది. మీదైన బాణి పద ప్రయోగాలు "మోహ విచలిత విరహ జవ్వని", "వెన్నెల దారుల తోరణ మాలిక" అద్భుతం.
నా కథ, చిత్రం ఇంత మంచి కవిత్వాన్ని, భావుకతని వెలికి తెస్తున్నందుకు నాకు చాలా సంతోషం. నెనర్లు.
వార్ని ఇదన్నాయం నేను వీకెండుకి వూరికెల్తె సెప్పాపెట్టకుండా రాసేత్తరా ఆయ్..
ReplyDeleteRaghav, అవునూ ఏ వూరు వెళ్ళొచ్చారు? ;) ఇంత మంచి కథ [గర్వం కాదు నిజం] చదివి అంతా కవితలు వ్రాస్తుంటే మీరేమో "అన్యాయం" అని గళమెత్తారు. మీరే "ఏమిటి ఆలస్యం?" అంటారేమోనని శుక్రవారం రాత్రికిరాత్రి రాసి టపా పెడితే ఇలాగంటారా? 'వోరి దేముడా, ఇదన్నాయం' :)
ReplyDeleteపెద్ద చిక్కే పెట్టారే ! ఇంతమంది ఇన్ని కవితలు , భావాలు వెల్లడించాక ఇంకా నేనేమి చెప్పేది ? చెప్పక పోతే శత్రువు లో చేరుస్తానంటున్నారు . ఏమిటో ?
ReplyDeleteఅలాంటి చిత్రము మీరు గీస్తే మటుకు నాకు కాపీ పంపండి . నాకు తెలుసు మీరు గీయగలరు . అసలు గీసేవుంటారేమో !
14?
ReplyDeleteI have got a picture of what you asked for. Will place it as a comment soon here. :-)
Picture means an idea. Not a picture literally
మాలాకుమార్ గారు, నమ్మేసారా? చదువరులు/పాఠకుల భావుకతని ఇంకాస్త వెలికి రప్పించి మరువానికి అద్దుకోవాలన్న స్వార్థమది. నాకంటూ శతృవులు లేరు రారు. అజాతశతృవు నా సహవాసి. ఈ చిత్రం చాలా కాలం క్రితం గీసానండి. ఇప్పుడు నా దగ్గర లేదు. ఇప్పుడు దాని తాలూకు ఆలాపన మాత్రం పాత్రలోకి జొప్పించాను. థాంక్స్.
ReplyDeleteగీతాచార్య, మరిక ఆలస్యం ఎందుకు? ఇక్కడ ఉత్కంఠ పెంచాలనా ముందుగా ప్రకటన? ;) ప్రతీక్షిస్తూ..
ReplyDelete