"నీలకంఠారెడ్డి" ఐ లవ్ యు

జీవితంలో ఎన్నో మజిలీలు, మలుపులు, పరిచయాలు, విడిపోవటాలు. కొందరు జీవితంలో తారసపడి, మనకి వారి వలన కలుగజేసే అనుభవాల వలన అలాగే యెప్పటికీ గుర్తుండిపోతారు.

ఈ కథనం సమయానికి మేము ఒంగోలు ప్రాంతాల్లో వుండేవారం. నాన్నగారి ఉద్యోగరీత్యా మాకు ఇంట్లో ప్యూన్స్/అటెండర్స్ బాగానే వుండేవారు. నాన్నగారు ముందుగా రిపోర్ట్ చేసి, తన స్టాఫ్ ని కలవటంతో మాకు కాస్త పరిచయ వ్యాక్యాలు చెప్పారు, "మీకొక మహానుభావుడిని చూపాలి," అని నవ్వారు.

నాకు మహా కుతూహలం, ఎవరెవరా అని ఆసక్తి. సరే, మేము ఆ వూరు మొదటిసారి చేరేసరికి మధ్యాహ్నం అయింది. లంచ్ ఎవరో పంపారనుకుంటా. అచ్చంగా "సాగరసంగమం" లో పొట్టి ప్రసాద్ మాదిరిగా వొంగి అదో మాదిరిగా నడుస్తున్న వ్యక్తి కారేజీలు మోసుకుంటూ రావటం కనపడింది.

దగ్గరగా వచ్చాక దాదాపుగా నేల మీద పడ్డంతగా వొంగిపోయి, ఇప్పుడు మోటర్ బైక్స్ మీద వెళ్ళే కుర్రకారుకి క్రొత్త పాఠాలు నేర్పేంత వడుపుగా, మా అమ్మగారికి నమస్కారం చేస్తూ "అమ్మ! నన్ను నీలకంఠారెడ్డి అంటారు." అన్నాడు. తిరిగి నా వైపు చూస్తూ "పాపా గారామ్మా?" అని కూడా అడిగేసాడు.

వెనక్కి చూసి నన్నే నని అర్థమయ్యాక వోణీ ఓ సారి జాడించి వేసుకున్నాను. :)

అలా ఆరుగురి అటెండర్స్ లో ఒకరిగా నా జీవితంలోకి వచ్చిన మనిషి "నీలకంఠారెడ్డి". నాకు తెలిసి నాన్నగారి తో అతిగా విసుక్కోబడ్డ మనిషీ తనే.

మాటకి ముందు "అమ్మ" వెనక "పాప" ఇలా కనీసం నన్నొక కోటిసార్లు పిలిచివుంటాడు. మచ్చుక్కి "అమ్మా, పాప, అమ్మగారు పిలుస్తున్నారమ్మా పాప." :(

నేనూ అన్నిసార్లు చెప్పాను, నన్ను "పాప" అని పిలవకు అని. ఆఖరుకి అమ్మ చీరలు చుట్టబెట్టుకున్నా ఆ విపత్కర పరిస్థితి తప్పలేదు.

వేసవికాలం కావటంతో సాయంత్రాలు అలా కెనాల్ దగ్గర కూర్చుని వచ్చేదాన్ని. కను చీకటి వేళ వరకు అలా పారే ఆ నీటి గలగలలు వింటూ, పొలాల్నుండి ఇళ్ళకి చేరే రైతువారి జనాలని చూస్తూ కూర్చునేదాన్ని. కనీసం పుస్తకం కూడా తీసుకెళ్ళేదాన్ని కాదు, ప్రకృతి వీక్షణం అంతే. అలాంటి ఓ సాయంత్రం కాస్త దగ్గరగా వున్న చెట్ల వెనగ్గా అలికిడి. తృళ్లిపడి చూస్తే ఎవరో ఒక మనిషి కదులుతున్నట్లుగా అనిపించింది.

చక చకా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చేసాను, నాకోసం అన్నలు వచ్చేసారు. మహదానందం. ఇంత తేలిగ్గా తీసుకుపోతారనుకోలేదు. గబ గబా గుర్తుచేసుకుని "అన్నలు మా ఎర్ర మల్లె పూవులు .." పాడుతూ ఓ రెండు నిమిషాలు చూసినా ఆ శాల్తీ కదలదే. సరే నేనే వెళ్ళాలేమోనని, నెమ్మదిగా లేచి, చేతులెత్తి అటుగా వెళ్ళి చూస్తే, అక్కడ వున్నదెవరో తెలుసా? ఇంకెవరు, "నీలకంఠారెడ్డి".

"ప్చ్, నువ్వెందుకొచ్చావిక్కడకి." అన్నాను.

"అమ్మ, పాప మీరీ చోట
కి రోజూ వస్తున్నారని..." అని ఆగి "తోడుగా వుందామని." నీళ్ళు నములుతూ ఆగిపోయాడు.

సూరేకారం లా మండిపడి "ఇంకోసారి, ఇలా చేసావంటే కాలవలోకి తోస్తాను" అని అరిచి "ఐ హేట్ యు" అని విసా విసా ఇంటికి చేరి, అమ్మకి చెప్పబోయి పోన్లే నేనే ఓ తట్ట వరస పెట్టాను కదా అనుకుని, నా సిల్కు దుప్పటికి వాడిని ఎందుకు అరిచానో చెప్పి పడుకున్నాను. అదో అలవాటు.

మర్నాడు నిమిషానికొకసారి ఆ చెట్ల వైపు చూస్తూ కూర్చున్నాను. నా ప్రకృతారాధన కాస్తా వాడి కోసం ఎదురుచూపుగా మారిపోయింది. ఎటువైపు నుండి నీళ్ళలోకి తోయాలా అని కొలతలు, లోతులు చూస్తూ కూర్చున్నాను.

కానీ రాలేదు, అలా మూడు రోజులు గడిచాక నా దృష్టిని మరొకటి ఆకర్షించింది. అదేమిటంటే గడ్డిమోపులు నెత్తిన పెట్టుకుని వయ్యారంగా సాగే ఆ రైతు జనాలు నాకేసి దొంగని చూసినట్లు చూస్తూ వెళ్ళటం. ఓ రెండు రోజులు వూరుకుని, మూడో రోజు ఓ పడుచుని పిలిచి "ఎందుకు అలా చూస్తున్నావు?' అని అడిగాను.

"అమ్మ, పాప మీరీ పెద్దయ్యగారి పాప అంటగా?" అని అడిగింది.

"అయితే.." నా మాట పూర్తి కాకుండానే..

"ఆ రెడ్డి మీమీద ఓ కన్నేసి పెట్టమన్నాడు." అన్నది.

"ఎందుకు?" నేను నచ్చానో, నా ప్రశ్న ముద్దొచ్చిందో, నెమ్మదిగా దగ్గరకి జరిగి, గుస గుసగా చెప్పింది "మీ కోసం ఎవరన్నా కుర్రోడు వస్తున్నాడేమో, మీరేమన్నా ఈ నీళ్ళలోకి పడతారేమో/దూకుతారేమో చూడమన్నాడు." నాకు ఆది పరాశక్తి కొచ్చినంత కోపం. ఇక వాడిని భస్మీపటలం చేయాల్సిందేనని ఇంటికి చేరే సరికి, ఏదో తింగర పని చేసి తలవాయా చీవాట్లు తింటున్నాడు.

"ఛీ ఛీ అవతలకి పో, అతి వినయం ధూర్త లక్షణం" ఇలా సాగుతుందా భారతం.

కాస్త మనశ్శాంతించి ఆ రోజుకి వదిలేసా. మర్నాడు ప్రొద్దున్నే స్పాట్ పెడదామని నిర్ణయించాను.

ప్రొద్దున్నే నాన్నగారికి తోటపని అలవాటు. అలాగే నాతో నాటిస్తే అవి "మరువం" మాదిరి ;) పచ్చగా ఎదుగుతాయని నమ్మకం.

"ఉషడు, లేమ్మా కాసేపలా వెనక దొడ్లో తిరుగుదాం." అన్నారు.

మేమలా ఒక అరగంట మొక్కల మధ్య తిరిగే సరికి అయ్యగారు దిగబడ్డాడు. చూట్టానికి నిగ నిగా మెరిసే నల్ల జుట్టు, తెల్లటి ఇస్త్రీ బట్టలు భలే ఠీవిగా వుండేవాడు.

నేను, నాన్నగారు ఆకుకూరల మడిలో కలుపు తీస్తూ కూర్చున్నాము. మరేమనుకున్నాడో, నాన్న గారిని ఇంప్రెస్ చేయటానికి పాంట్స్ మడిచి తనూ ఓ మూల ఏదో పీకుతూ కూర్చున్నాడు. కాసేపటికి అలా చూసేసరికి సగం కొత్తిమీర పీకేసాడు, అది గడ్డీ గాదం వేసిన బుట్టలో పడేసాడు. ఇక చూస్కోండి నాన్నగారి శివాలు. అలా మళ్ళీ నా చేతిలో చావు తప్పించుకున్నాడు. జాలిగుణం కదా, ఒకరి చేతిలో పడ్డాయి కదా ఇక మన చేయెందుకని వదిలేసా.

ఇక మూడో పాపం ఏమి చేసాడు అంటారా? ;)

ఓ పట్టాన పొరుగూరు ప్రయాణాలకి ఒప్పుకోని నాన్నగారిని వొప్పించి సినిమాకి బయల్దేరాం. వాడు మాకు అంగరక్షకుడు. మధ్యలో వంటమనిషితో ఏదో మాట్లాడటం కనపడింది కానీ సరీగ్గా చూడలేదు.

జీప్ లో నేను, చెల్లి, డ్రైవర్, రెడ్డి గారు. సరే సినిమాహాలుకి చేరి దిగటానికి కాలు కిందమోపానో లేదో

"తప్పుకోండి, ఇంజనీర్ గారి పాపలు వస్తున్నారు." అంటూ మా ముందు తను సాగుతూ హడావుడిగా జనాల్ని అదిలిస్తూ రెడ్డి తాండవాలు మొదలెట్టాడు.

కాస్త సిగ్గుగా, వెనకా, ప్రక్కనా మాకేసి చూసేవారి కళ్ళకి బలౌతూ, పళ్ళు నూరుకుంటూ నడిచి ఎలాగోలా లోపలకి చేరి సీట్లలో సర్ధుకుని కూర్చున్నామోలేదో,

"పాప, పెద్ద పాప మీకు బోర్నవిటా ఇదిగోమ్మా" అని ఫ్లాస్క్ లోంచి కప్పులోకి వంచి ఇచ్చాడు, ఇదన్నమాట వంట గదిలో చేసిన నిర్వాకం.

తప్పుతుందా, వద్దంటే అసలు వదలడు, కాళ్ళావేళ్ళా పడి బతిమాలతాడు.

ఇంతలో ఇంటర్వెల్. మళ్ళీ ఇంకో ప్రహసనం.

"పాపా పకోడీలు ఇదిగోమ్మా." అంటూ సిద్దం. "ఐ హేట్ యు" అని ఓ వెయ్యిసార్లు అనుకుని వదిలేసానప్పటికి.

వెనకనుండి ఎవరో ఈల వేసి ఏదో కొంటె కామెంట్ విసిరారు.

ఇక వీడిని జీపుతో గుద్దేయటమే అని డిసైడ్ అయ్యాక, మిగిలిన సినిమా మొత్తం నాకవే సీన్లు.

కానీ వాడి రోజు బాగుంది. అలసటగా వుండి జీపెక్కగానే నిద్రపోయాను.

అలా ముమ్మారు నా చేతిలో ప్రాణాలు పోకుండా రక్షించబడ్డ ఆ రెడ్డి, మేమా వూరి నుండి వచ్చేసేప్పుడు

"పాప మంచిదమ్మ. మంచిపిల్లాడు వస్తాడు." అని దీవెన లిచ్చి, కంటి నీటితో సాగనంపాడు.

ఇప్పుడు ఇక్కడ కేవలం అవర్లీ బేసిస్ మీద వచ్చి పైపైన మాటల్తో పని పూర్తిచేసుకుని వెళ్ళేవాళ్ళని చూస్తే ఎందుకో మా "నీలకంఠారెడ్డి" గుర్తుకొస్తాడు.

తన ఆప్యాయత, ఆదుర్దా,- నాన్నగారి కోపం వెనుకనున్న మంచితనాన్ని గుర్తించి- మా పట్ల ఆదరంగా వుండటం, వినయం ఇలా అన్నీ మూర్తీభవించిన మా రెడ్డి ఇప్పుడు కనిపిస్తే ఒక్కసారన్నా చెప్పాలని వుంది,

"నీలకంఠారెడ్డి, 'ఐ లవ్ యు', నన్ను మన్నించు!" అని. మనకక్కడ ఎలావున్నా ఆ 'మూడు ముక్కల్లో' ఇక్కడ ఎంతో ఆత్మీయత తొణికిసలాడుతుంది. అందుకే అలా అనిపించింది. నాకెలా
గూ తన చిరునామా తెలియదు. మీకెవరికైనా ఆ పేరున్న వ్యక్తి కనపడితే ఆ మాటలు చెప్పండి. అవి నా కన్నీట ముంచి తీసినవి అని కూడ చెప్పటం మరవకండి.

************************************************
చాలాకాలం అవటంతో నాకు ప్రకాశం జిల్లా మాండలీకం గుర్తు లేదు. కానీ సందర్భాలు, సంభాషణలు మాత్రం గుర్తున్నాయి.

55 comments:

 1. హి హి హి.. మా వర్క్ లో నీలకంఠా రెడ్డి లేడూ గాని చాలా మంది కాంట్రాక్టర్ రెడ్డి గారు లున్నారు పేర్ల లిస్ట్ పంపుతా, ఏ పేరు నచ్చిందో చూస చెప్పు ఆ రెడ్డి కి నువ్వు చెప్పమన్నావు అని ఐ లవ్ యూ చెపుతా ;-)

  ReplyDelete
 2. వూరికే నవ్వ తాలికి రాసేలే పై కామెంట్, మూతి ముడుచుకోకు.. అవును.. కొందరు బలే ఆప్యాయం గా వుంటారు మా సౌండ్ ఇంజనీర్ డ్రైవర్ రాంబాబు గర్తొచ్చాడు. హ హ కెనాల్ లోకి దూకుతావేమో అని పల్లె పడుచుల కాపలా మాత్రం సూపర్.

  ReplyDelete
 3. హిలారియస్ పోష్ట్...
  >>వెనక్కి చూసి నన్నే నని అర్థమయ్యాక వోణీ ఓ సారి జాడించి వేసుకున్నాను. :)
  >> కాసేపటికి అలా చూసేసరికి సగం కొత్తిమీర పీకేసాడు, అది గడ్డీ గాదం వేసిన బుట్టలో పడేసాడు.

  చీ చీ ఈ నీలకంఠా రెడ్డి మా పరువు తీసేసాడు. :). ఒంగోలు అయ్యివుండి ఊరికే దీవించి సాగనంపుతాడా? ఒక రాజకుమారుణ్ణి తెచ్చి అక్కడే మూడుముళ్ళు వెసి ఏకంగా ప్రకాశం జిల్లా ఆడపడుచు చేయాల్సింది పోయి. నాకు గనక ఆ రెడ్డి ఇప్పుడు కనిపిస్తేనా వాడంతు చూస్తాను ;)

  పాపా, అవును పాపా,
  >>కాస్త సిగ్గుగా, వెనకా, ప్రక్కనా మాకేసి చూసేవారి కళ్ళకి బలౌతూ, పళ్ళు నూరుకుంటూ నడిచి ఎలాగోలా లోపలకి చేరి సీట్లలో సర్ధుకుని కూర్చున్నామోలేదో

  ఇక్కడ వోణీ వేసుకోలేదా పాపా? ;)

  అమ్మాయ్ భావనా, అసలు నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నీకు ;)?

  ReplyDelete
 4. నేను కూడా వూరికే నవ్వ తాలికి రాసేలే పై కామెంట్, మూతి ముడుచుకోకు.

  ReplyDelete
 5. నిజానికి చాలామంది జీవితాల్లో నీలకంఠారెడ్లు రకరకాలుగా తారసపడుతుంటారు, వివిధ కారణాలవల్ల మనం అర్థం చేసుకోలేము. అర్థం చేసుకున్నాక మనుషులు ఉండరు. ఆ ఙ్ఞాపకాలు మాత్రమే మనకు మిగుల్తాయి. అందుకే వారు మన మనసుల్లో ఉన్నత శిఖరాలు అవుతారు.

  ReplyDelete
 6. ఇనాళ్ళూ మేమే అనుకున్నాను , మీరూ ఆ కోవేనన్నమాట :)

  ReplyDelete
 7. హహహ! టపా సరదాగా బాగుంది. భావనా...:-)

  ReplyDelete
 8. హ్మ్! ఏంజేస్తాం? :-D

  ReplyDelete
 9. గీతాచార్య, కాలువ అన్నది నాకు తెలియదనే అనుకున్నారా? అలాగయితే "ఇంకోసారి, ఇలా చేసావంటే కాలవలోకి తోస్తాను" అని ఎలా వాడతాను, చెప్పండి.

  కృష్ణమ్మతో ముడిపడిన నా చిన్నతనపు ప్రియమైన పదమది. రైట్ కెనాల్, లెఫ్ట్ కెనాల్, కెనాల్స్ ఆఫీస్, కాలనీ, క్వార్టర్ ఇవి ఎవరు చెప్పినా నేను తెలుగులో తర్జుమా చేసి వాడను. నెనర్లు. ;)

  ReplyDelete
 10. మీకు కాలువ తెలియదని నేను ఎలా అనుకుంటాను? నాకదికూడా తెలియదని అనుకున్నారా మీరు? ;-) మీకా పదంతో అనుబంధమలా ఉందని నాకు తెలియదంతే. మీరెలా వాడినా ఇబ్బంది లేదు కానీ, అప్పటికలా పంటి క్రింద రాయిలా తగిలిందని మనవి చేశాను. ఒక పని చెయ్యొద్దు అని చెప్పటానికి నేను డిక్టేటర్ కాదు. అలా ఉంటే బాగుండునేమో అని అన్నానంతే.

  ఈపూటకి సెలవ్. మళ్ళా ఎప్పుడన్నా కలుద్దాం.

  మనలో మాట. నీలకంఠారెడ్డి నాకు తెలియదు కానీ ఒక నీలకంఠం గారైతే నాకు బాగా తెలుసు. క్రికెట్టాడటానికి వెళ్తుంటే ఆయన కళ్ళలో పడ్డానని మా మురళీ బాబుకి చెప్పి వాయింపజేశాడు చిన్నప్పుడు. మళ్ళా ఇన్నాళ్ళకి మా ముబ్బుల్లో షికారు అప్పుడు పేరిచర్ల గేట్ దగ్గర నేను ఫొటోలు కొట్టటం చూశి మళ్ళా వాకృచ్చి అక్షింతలేయించాలని చూశారు కానీ, మీకు మాలా తిరగాలనుంటే మాతో రండి కానీ, ఇలా కుళ్ళుకుని చాడీలు చెప్పొద్దని గాఠి వాణింగిచ్చాను. ఆయనకసలే పాపం ఎవరైనా చేసేవి తను చెయ్యలేందే కుళ్ళుకుంటాడు. కుంపట్లో మాగిన కుమ్మక్కాయ మొహం ఆయనానూ. భలే వళ్ళు మండిందండీ మీ కథ విని ఆయన్ని గుర్తుజేసుకుంటే... ;-) అందుకనే ఐస్‍క్రీమ్ తిందామని పోతున్నాను. మీకేమన్నా కావాలంటే చెప్పండి. ఆన్లైన్లో పంపిస్తాను. గురు దక్షిణగా. ఆకులు తింటం నేర్పారు కదా. :-D

  ReplyDelete
 11. ఒంగోలు పట్టణానికి కెనాల్ లేదు కనక మీరు పరిసర ప్రాంతాల్లో ఉంది ఉంటారు ..... అదే ఊరో ఎ సంవత్సరమో కాస్త చెప్పండి ... మీ నీలకంఠారెడ్డి ని వేడికి మీ పోస్ట్ ప్రింట్ తీసి ఇస్తా.

  ReplyDelete
 12. వేడికి అని పడింది వెదికి అని అర్ధం చేసుకోండి

  ReplyDelete
 13. మా చిన్నప్పుడు కూడా ఇదే పరిస్థితి మేము ఎదుర్కొనాము. కాని ఇప్పుడు రమ్మన్నా అంతటి అభిమానం చూపించే వారు రారు. కోట్లు కుమ్మరించినా ఆ ప్రేమ రాదు. నిజంగానే ఇటువంటి వాళ్ళని ఎప్పటికీ మర్చిపోలేము. చాలా బాగా రాశారు.

  ReplyDelete
 14. ఉషాగారూ, చిన్నప్పటి సంఘటనలు, అలా అనుకోకపోతే బాగుండేదేమో, అలా అనకపోతే బాగుండేదేమో అనే ఆలోచనలూ తల్చుకున్నప్పుడల్లా మనల్ని కదుపుతుంటాయి. మా నాన్నగారికి కూడా అస్తమానం బదిలీలు అయ్యేవి. ప్రతిచోటా కొత్త స్కూల్ లో సీట్ తో పాటు, ఇంకో సంగీతం మాస్టార్ని పెట్టడం, ఆయన "అబ్బే, మీ అమ్మాయి కి మళ్ళీ మొదట్నించీ చెప్పాలండీ" అంటూ వర్ణాలు వీణ మీద అలవోకగా వాయించేసే నన్ను మళ్ళీ అలంకారాలు దగ్గరికి దించెయ్యడం, నేను మహా అవమానకరంగా ఫీల్ అయిపొతూ, ఆ మాస్టారి మీద కోపమంతా వీణ మీద చూపించెయ్యడం... అమ్మో.. అవన్నీ ఒక్కసారి గుర్తొచ్చేసాయి. చాలా థాంక్స్.
  నాకు నీలకంఠారెడ్డి ఎక్కడా కనిపించలేదండీ..

  ReplyDelete
 15. మీ చేత ఇంతగా గుర్తుంచుకోబడ్ద ఆ నీలకంఠారెడ్డి ఎంత అదృష్టవంతులో!

  ఇంటికెళ్తే ఇప్పటికీ ఆప్యాయంగా వచ్చి పలకరించే కొంతమంది మా నాయనమ్మ చుట్టాలు ఉంటారు.(మా నాయనమ్మ చుట్టాలంటే..అప్పట్లో మా పొలంలోకి వచ్చి పనిచేసినవాళ్లు..వాళ్లని మేము మా నాయనమ్మ చుట్టాలని అనేవాళ్లం..అంత అనుబంధం ఆమెకి వాళ్లతో)..చచ్చి బ్రతికివచ్చావమ్మ దేవుడమ్మా అని మొహాన్ని ఓ సారి తడిమి కళ్లవెంట నీళ్లుపెట్టుకుని ....మన కంటవెంట కూడా నీళ్లు తెప్పిస్తారు.

  అప్పుడప్పుడు ఇలాంటి వచనాలు కూడా వ్రాస్తుండండి:)) సరదాగా ఉన్నా మరుగునపడ్డ బంధాల్ని-అనుబంధాల్ని తట్టి లేపే టపా!

  ReplyDelete
 16. avunu! ii papa, baby, buzzi, endukantanroegaanii...abbaa...abbabbaabbaa...peddaipoeyaaka kuuda avi manaki vrealaadutuunea vuntaayi...chikaaggaa...

  ReplyDelete
 17. పాపం రెడ్డి.. :)
  నాకు కె సి కెనాల్ లో ఈతలు కొట్టిన రోజులు గుర్తొచ్చాయి

  ReplyDelete
 18. నాకివన్నీ తెలియవు. అమ్మ కొట్టిన దబ్బలు, నాన్న చెప్పిన కథలు, అక్కతో ఆడిన ఆటలు, చేసిన తిక్క ప్రయోగాలూ, అంతే.

  Priya is a పెద్ద ముసలిది. Of course, గొడవ ఎక్కువ అని అంటారనుకోండీ

  ReplyDelete
 19. నిజం చెప్పొద్దూ.. మీ నీలకంఠారెడ్డి నా కంటనీరొలికించాడు.. ఎలా అంటారా.. తను చేసిన పనులు వాటికి మీరు ఉడుక్కున్న పద్దతి చూసి నవ్వి నవ్వి కంటనీరు ఒలికింది. టపా చివరికి వచ్చేసరికి వారికి మనమేమీ కాకపోయినా, మనమీద కొండంత ఆపేక్ష చూపించే అమాయకమైన కొందరు గుర్తొచ్చి కంటనీరు ఒలికింది..

  మనలో మనమాట మీ టపా శీర్షిక చూసి ఏదో ఫ్యాక్షన్ ప్రేమకథ చెప్పబోతున్నారేమో అని అనుకున్నాను :-)

  ReplyDelete
 20. మీ నీలకంఠారెడ్డి హేగిలియన్ గతితార్కిక సిద్ధాంతం అవలంబించడం వల్ల ఆ విధం గా చేసారు అని నా అభిప్రాయం. నేను రాసిన కధ లో హీరో పేరుకి రెడ్డి అని పెట్టను. నేను చిన్నప్పటి నుండి మా ఇంట్లో ఉండడం వల్ల ఎబివిపి గూండాలను పంపించి వేసి షాపు తీస్తాను. బిసినెస్ చేస్తాను.

  ReplyDelete
 21. చాల బాగుందండీ జ్ఞాపకం...నీలకంటరెడ్డి ఎక్కడున్నాడో ,ఉంటె ఎలా ఉన్నాడో ...పనేమిలేక ఆఫీసులో రెండు మూడు సార్లు చదివానండి .

  ReplyDelete
 22. చాలా ఆర్ద్రంగా వ్రాసారండి. కళ్ళల్లో నీళ్ళు చిప్పిల్లుతున్నాయి.

  ఆకాశమంతా సినిమాలో ఇంట్లో వుండే పని వాడు బాగా గుర్తుకువచ్చాడు ఈ టపా చదువుతూవుంటే.

  ReplyDelete
 23. ఉష, ఎంత పని జరిగిపోయింది. మా ప్రవీణ్ అన్నని కాపీ కొట్టి మరీ కామెంట్ రాస్తున్నారు. మీకేం భయంలేదు. ఇప్పుడు శర్మ గారు చూసారంటే నీ.కం.రె ని హీరో గా చేసి ఒక కథ వ్రాసేసి మీకు లింకు ఇస్తాడు చూడండి :). అసలే హెగిలియన్ తత్వశాస్త్రాన్ని చలం భావజాలాన్ని కలిపి వ్రాయాలని ఎప్పటినుంచో కోరికంట.

  ReplyDelete
 24. చదివినంత సేపు సరదాగున్నా ఎందుకో చివరిలో కంటనీరొలికింది.
  ఆకాశమంత చిత్రంలో సేవకుడి పాత్ర మదిలో మెదులుతోంది.

  ReplyDelete
 25. ఉషక్క ( అక్క , పాప :) ) మీ మదుర స్మృతులు బావున్నాయ్ :) :)
  I Too Like నీలకంఠారెడ్డి


  www.tholiadugu.blogspot.com

  ReplyDelete
 26. ముందుగా ఈ టపాని చదివి నాతో పాటు నవ్వి, ఆ పకపకలతో నన్ను అలరించినవారికి, నా అసలు ఉద్దేశ్యాన్ని గ్రహించి కళ్ళతడితో వ్యాఖ్యానించిన వారికీ, మరుగునపడ్డ బంధాల్ని-అనుబంధాల్ని తట్టి లేపే టపా అని ఒప్పుకున్నవారికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ మధ్య అనుభవంలోకి వచ్చిన కొన్ని కపట ప్రేమలు [అలా అని నా మనసుకి తోచింది, అది నన్ను మోసం చేసివుండవచ్చుగాక :)] చూసాక ఈ అమాయక ప్రేమలు, ఏ ఆశింపు లేని ప్రేమల్ని ఒకసారి తరచి చూడాలనిపించింది.

  ReplyDelete
 27. భావన, భా.రా.రె, నవ్వుతాలకి అన్నారు కనుక ఊరుకున్నాను. లేదంటే నేనే వెదికి పట్టుకునైనా మా నీ.కం.రె. తో కాలవలోకి తోయించేసేదాన్ని. ;)

  సుజ్జీ, మాలాకుమార్ గారు, సునిత, లక్ష్మి, (అల్లరి) ప్రియ :), థాంక్స్.

  ReplyDelete
 28. జయ గారు, జీవని గారు, శ్రీలలిత గారు, జీవితం ప్రతి దశలోను ఆ పార్శ్వం తప్పదేమో కదండి? కనీసం జ్ఞాపకాలుమిగిలున్నాయిలే, కొందరు అభాగ్యులకు అవీ గుర్తు వుండవు [నేను చూసానిటువంటి వారిని] అని సరిపెట్టుకుంటూవుంటాను.

  శ్రీలలిత గారు, మాకు వేసవిలో వెళ్ళటం తిరిగి వేసవిలోపే మారిపోవటం కూడా అనుభవమే. బదిలీలలో మీకేమీ తీసిపోము. ;)

  ReplyDelete
 29. సిరిసిరిమువ్వ గారు, ఒకప్పుడు మా తాతగారి హయాంలో మా పొలాలు మూడు జిల్లాలకి విస్తరించివుండేవట. ఆయన ఈనాములు దండిగా ఇచ్చేవారట. నాకు వూహ బాగా తెలిసాక కూడా నూజివీడు ప్రాంతాల నుండి లంబాడీ/బంజారా తెగకి చెందిన కొందరు వచ్చేవారు. కేవలం ఒక రోజుకే అయినా ప్రతి ఏడాదీ అదే కన్నీరు, తాత గారిని తలుచుకుని, అమ్మ ని పుణికిపుచ్చుకుని, మమ్మల్ని భుజాల మీద కెక్కించుకుని...అలా. అలాగే మేము అంతే, చిన్నప్పుడు వరసలతో పిలిచేవారం మీ మాదిరి. అన్నీ వ్రాయాలనేవున్నా మనబోటి వారందరికీ అనుభవాలే కదా అని ఆగిపోతాను.

  ReplyDelete
 30. రాఘవ్, కర్నూల్-కడప(కె,సి.కెనాల్)కాలవ లో ఈతలు బాగా ఎంజాయ్ చేసారన్నమాట. నేను కూడా నది లో ఈతలాడిదాన్నే. మేము శివరాత్రికి కృష్ణ లో స్నానాలు [దాదాపు యేడాదంతా ఎదురుచూపు]చేసేవారం.

  అది సరే గానీ "vaarni suparu :)" కథా కామామీషు ఏమిటట. ;)

  ReplyDelete
 31. ఫణి, కార్తీక్, శరత్ [బహుకాల దర్శనం] - నిజ జీవితానుభవాలు మనపై గాఢముద్ర వేసినవి ఇలాగే వుంటాయి అనుకుంటా. నేను రెడ్డి ని తలుచుకున్నపుడల్లా బాధ పడతాను, పాపం అంత అయిష్టత, అసహనం చూపానా అని. సినిమా కథలైనా మూలం ఏదో ఒక చిన్న వాస్తవఘటనే కదండి. నెనర్లు.

  ReplyDelete
 32. చిన్నీ, ఈ నీలకంఠారెడ్డి మీ బ్లాగులో నేను వ్రాసిన వూసుతోనే మొదలైంది అనుకుంటా. నిజమే ప్రతి క్షణాన్ని మనం మలుచుకోవటంలో వుంటుందేమో.

  అశ్వినిశ్రీ, నాకటువంటి ముద్దు పేర్లేమీ లేవండి. ఉషమ్ములు, ఉషడు ఇలా అన్నీ నా పేరుతో కలిపినవే. ;)

  ReplyDelete
 33. గీతాచార్య, భలే ఒకటే పేరు అన్నమాట, మీవి నావి వేర్వేరు అనుభవాలయినా కానీ. కనుక "పేరులోనే వుంది" అనొచ్చేమో! :) నేను ఐస్ క్రీములు తిననండి. అదికాక నాకిప్పుడు మా రెడ్డి ని తలుచుకుంటే మమతల గోరువెచ్చన భావన మాత్రమే కలుగుతుంది.

  ReplyDelete
 34. శ్రీనివాస్, మీకా శ్రమ వద్దులేండి. ఈ మధ్యన అలా వెదుక్కుని వెళ్ళిన ఒకరు నేను వూహించినట్లు లేక కాస్త నిరాశ పడ్డాను, కనుక రెడ్డి ని వెదక్కుండా అనుకోకుండా తారసపడితే చూడాలనుంది. నెనర్లు.

  ReplyDelete
 35. ప్రవీణ్, మీరన్న వాదాలు, తత్త్వాలు నాకు తెలియనివి బహుశా అవసరపడనివి. మీరు ప్రస్తావించిన ఆ రెండు ఇతర అంశాలు నాకు ఆసక్తి కలిగించనివి. థాంక్స్.

  భా.రా.రె. అయితే ఈ పైవ్యక్తి అసలు కాదా? నకలేనా? ;)

  ReplyDelete
 36. వేణు, రెడ్డి లాంటి వారు ఇంకా వున్నా ఇతని వలన కలిగిన ఆ ఇబ్బందుల రీత్యా మీరన్నట్లు గుర్తుండిపోయాడు. పాపం ఏ పని చేసినా చీవాట్లే. అసలు అందుకే పుట్టినట్లు. అయినా అందరు హీరోలు ఫాక్షన్ సినిమాలు చూపేసాక ఇంకా మా రెడ్డీ ఎందుకండి? ;)

  ReplyDelete
 37. రవిగారు, మంచి/చెడు ప్రక్కన పెడితే సరైన జతగాడు వచ్చాడని అమ్మగారికి ఓ మాట చేరవేయండి. ఇక ఉషడు పడుకోలేదమ్డి ;) "జై హో" కి మహాజోరుగా బాలీవుడ్ డాన్స్ చేయటానికి వెళ్ళివచ్చింది. అందుకే ఈ ఆలస్యం. :)

  ReplyDelete
 38. అడ్డగాడిద, యప్, అంతా ఇలా స్మైలీలు పెట్టాలనే, కొంత కన్నీరు చిందించాలనే, మరి కొంత ఆలోచనలో పడి తమతమ జ్ఞాపకాలని ఇక్కడ కలపాలనే నా టపా వ్రాసింది. ఆ కోరిక తీరింది. :)

  ReplyDelete
 39. భావన, చెప్పటం మరిచిపోయాను. నా కొలీగ్ శ్రీనీల్ అసలు పేరు శ్రీనీలకంఠ అని తెలిసాక కూడ ఆ మాటలు చెప్పలనిపించలేదు. :) అవి కొందరికే పరిమితం. నేను అపాత్రదానం చేయనమ్మీ! జె.కె. ;)

  ReplyDelete
 40. అవును ఉషడూ, ఆ హైస్కూల్లో చదివేటప్పుడు లెక్కల సార్ లెక్కచేయమంటే నేను తనని లెక్క చేయనందుకు ఆయన లెక్క ఆయన చూపిస్తే కిసుక్కున నవ్వావు. అది నువ్వేనా? గుర్తుందా బయటకొచ్చాక మేము చేసిన గొడవ?

  అయ్యో హాఫ్ సెంచరీకి ఆరు పరుగుల దూరం లో వున్నారని సిక్స్ ర్ కొడదామని వస్తే సింగిల్ తీసి నలభైఐదు చేసేసావా? సరే 50th కామెంట్ నాదే మరి.

  ReplyDelete
 41. భా.రా.రె. నేను గర్ల్స్ కాన్వెంట్ లో చదివాను. కాకపోతే నన్ను "పొగరుబోతు పోకిరీ ఉష" "ఎర్ర టమాట ఉష" అని ఏడిపించి ఆ పిచ్చి రాతలే రాసిన విశ్వాస్, సాధిక్, భాస్కర్ ముగ్గురి చేత అందరి ముందు కడిగించిన ఛండశాసనుడు మా నాన్నారు ;) ఆయనకి నా మీద అంత గురి. ఆ పిల్లకాయల్ని ఉడికించేది నేనే మరి. ఇక ఆ "భాస్కర్ " మీరేనా ఏమిటి.. చిన్నప్పటి సరదాలు/అమాయకమైన ఆటపట్టించటాలు/ఏడిపించుకోవటాలు భలే గుర్తు చేసారు. మీ బ్లాగులో ఓ టపా వ్రాయకూడదా?

  ReplyDelete
 42. ఓ అవునవును కదా భలే గుర్తుచేసారు. కాకపోతే మేము నాన్నగారికి దొరికే రకం కాదు ;). అట్లా అని గోడమీద రాతలు వ్రాసే రకమూ కాదు. వేరే వాళ్ళ పేరుతో కిచ కిచ, కిచ కిచ మని లెట ర్స్ [ అమ్మాయిదీ ,అబ్బాయిదీ ] వ్రాసి ఎలాగోలా వాళ్ళకి చేర్చి బయట వుండి రెండో రోజునుంచి తమాషా చూసే రకం :)

  ReplyDelete
 43. మర్చే పోయాను ఉషా స్పిన్ బాల్ వేయకు. సిక్స్ర్ ర్ వెళుతుంది.

  ReplyDelete
 44. Dhana 51

  Nice post. Our Neelakantham is from different planet. Just like an Alien. But that too is a sort of fun Hehehe

  ReplyDelete
 45. Oh WOW Dhana, you have popped up in deed at the right juncture "dhana-51". I just thought let you enjoy the title ;) hence this gap. But Sumanth is a rowdy like, yes? Can't recall the story as is. Even them looking at your real life fights the title very well goes with you. [JK]

  So you have come after a long time but on time....

  I wish you and your masterji to have much more fun with your Neelakantham, the Mr. Mess up.

  Thanks for the comment.

  ReplyDelete
 46. ఉషగారు , మీ "నీలకంఠారెడ్డి" నాకూ ఎన్నో స్మృతులను గుర్తుకుతెచ్చాడండీ ...
  తనకొరకు చెమ్మగిల్లు నయనమ్ము కలదని పొలమారినపుడల్లా తెలుసుకుంటాడులెండి.

  ReplyDelete
 47. పరిమళం, ఒక్కసారిగా గోదావరి కాలవనుండి తెచ్చిన కొత్తనీట్టితో దాహం తీర్చుకున్నంత తృప్తి మీ మాటతో. ఎప్పుడూ, వాళ్ళు వున్నా ఇపుడు భౌతికంగా లేకపోయినా పొలమారగానే అమ్మ కాని, మా నాయనమ్మ కాని తలచుకునుంటారు అనుకునేదాన్ని. ఇపుడు అది మా రెడ్డికి మీరు ఆపాదించి చెప్తే ఆ జ్ఞాపకం మరొక వూసుని తట్టిలేపిందిలా... ప్చ్, ఏమిటో ఈ మనియాదలు వున్నవీ కావాలీ, లేనివీ వెదుక్కోవాలి అన్నట్లు మమతల చిరునామా వెదుకుతూ, కలతల బాటలో అడుగడుగుకీ మనసులోని ఆశలే వూపిరిగా సాగుతూ... నెనర్లు.

  ReplyDelete
 48. అద్భుతంగా రాసారు
  అభినందనలు
  నెనర్లు కూడా :)

  ReplyDelete
 49. హరే కృష్ణ గారు, ఈ టపా మొదటి మాటలోనే వ్రాసాను, ఇది మీతో ఒకసారి అన్నమాటననుసరించే వ్రాసానని. మీరు చదవటంతో మరి కాస్త సార్ధకత యేర్పడింది. నెనర్లు.

  ReplyDelete
 50. నీలకంఠారెడ్డి ఐ లవ్ యు టూ! :)

  ReplyDelete