ముగించేసానొక యుద్దం

నిన్న రేయనిపించింది నువ్వో నియంతవేమోనని.
నా తోడురా అంటే, నన్ను దాటి వెళ్ళాలనుకున్నావు.

ముందుగా ఇటు దారితీసింది నేనని,
ఈ పయనం వరమని నేనన్నా,
అటు దారికి నన్ను తీసుకుపోవాలని చూసావు.
ఆ ప్రళయం నన్ను ముంచినా నీకేం కాదన్నావు.

నేవోడిపోతున్న సంబరం నీ కళ్ళు దాయలేదు,
పోనీలే అపుడయినా నిజం చెప్పాయవి.

నేను ముగియక మునుపే నిన్ను జయించేసాను నేడు.
కలల్లోంచి తోలేసాను, వూహల్లో వురిమి తరిమేసాను.
నిజానికి నేనే వురేసేసాను.


గుండె చప్పుడులో గునపపు పోటువంటి నీ వూసు,
గుస గుసగా కూడా వినపడనంత దూరం వచ్చేసాను.

మరుపు నడిగి నీకు నిండా తొడుగు వేసేసాను.
మరుగు సొరుగుల్లో చివరి మూలల్లో నిన్ను నొక్కేసాను.

రేపులోకి ఇలాగే సాగుతాను.
తిరిగి చూస్తాను మొన్న చాయల్లోకి,
నిన్న నీడల్లోకి,అపుడూ అంటాను నీవిక నాకులేవని.
కాదు కాదు వున్నా వద్దని. విన్నావా?

ఇపుడిక ఇది నావంతు, నన్ను పాలించుకోనే
రాణి నేనే - రాజు, మంత్రి కాదు, వాళ్ళిక లేరు, రారు.
వాళ్ళిరువురు నీవేనయినా నీకు నివాళి కూడ దక్కదు.
విజయమిపుడు నాది, వీర స్వర్గముంటే అదీ నాదే రేపు.

6 comments:

  1. గుండె చప్పుడులో గునపపు పోటువంటి నీ వూసు,
    గుస గుసగా కూడా వినపడనంత దూరం వచ్చేసాను.
    మరుపు నడిగి నీకు నిండా తొడుగు వేసేసాను.

    manasu mukkality, aalochanalu elane untai.!! chala baaga raasaru..!!

    ReplyDelete
  2. ధన్యవాదాలు, సుజ్జీ, కుమార్. అవును ఇలా కారిపోయిన మనసు వడిసి పట్టి ఏదో ఒక పాత్రలో పోత పోయాలనే ఈ ప్రయత్నం.

    ReplyDelete
  3. నేను ముగియక మునుపే నిన్ను జయించేసాను నేడు.
    కలల్లోంచి తోలేసాను, వూహల్లో వురిమి తరిమేసాను.
    నిజానికి నేనే వురేసేసాను.

    enduko intha aratam? kalallonchi tholesthe manishi gnapakam untada? edo kastha confusion ga unde?

    ReplyDelete
  4. అడ్డగాడిద గారు, సో, నా లేటెస్ట్ కవితకి పోయినేటి డిశంబర్ లో జరిగిన సంఘటనకీ మెలిక పెట్టే ప్రయత్నం లో [ఆ వ్యాఖల్లో వ్రాసానని..] ఇటుగా వచ్చారా? లేక, సమయం చిక్కి / రాండం గా చదువుతూ ఇది చూసారా? నా కవితలు చాలా వరకు నా స్వగతాలు [విలాసాలు/విహారాలు/విలాపాలు], స్వానుభవాలు, ఇతరత్రా వ్రాసేవీ ప్రయత్నపూర్వకంగానే అవుతుంది కానీ అరుదు. ఇది అప్పటి నా మనస్థితికి దర్పణం. నాకు “సత్య” పోకడలు ఎక్కువ. ఇది కోపం + ఆరాధన మిళితం. నిందాస్తుతి. అందరికీ అర్థం కాకపోయినా చేరాల్సిన మనసుకి చేరిందప్పుడే. జ్ఞాపకం కాదు తనని వదిలే నేను ఎక్కడికీ పోను.

    ReplyDelete
  5. intha baga rase miru kothalo ela rasara ani vethukuthunte kanabadindi.

    teerika! yes. vacation dorikindi oka nela. kastha manishi navudam ani idigo ikkada thachaduthunnanu. me mede kadule. inkonni blogs kuda unnai rekki cheyyataniki. :-D

    ReplyDelete