వేసవిలో నాపరాయి గచ్చు మీద పడ్డ క్షణమే,
ఆవిరైపోయే నీటిచుక్క నీపై నా అలక
చీకటిలో సాగి తిరిగి కృంగే క్రీనీడ నా చిత్తంలో నీ చిత్రం
ఒకపరి ఆప్తుడివై అమృతం చిలికినట్లుగ
తదుపరి విలుకాడిలా అంబులపొది,
మొత్తం నాపై గురితప్పక విసిరేస్తూ
రేపటి దారులు మనకై వెదుకుతూ నేనుంటే,
నేటి మజిలీలో నీవు నా చేయి వదిలి పోతావేం?
నీమది లోగిలిలో నేవున్న గది తెరిచే వుంచా,
నాకు తెలిసిన నీకై వేచేవుంటా,
పంజరమని పారిపోతావో పొదరిల్లని చేరిపోతావో!
ఉష గారు, మంచి భావుకత. బాగుంది. స్పేసింగ్, bold, italic వంటి ఫార్మేటింగ్ అనుసరించడం వల్ల మీ కవిత మరింత ఆకర్షణీయంగా కన్పిస్తుంది. చూడడానికి మొత్తం ఒక పేరాగా అనిపిస్తోంది. మున్ముందు వీలైతే దీనిపై దృష్టి పెట్టగలరు. మంచి పోస్టులు రాస్తారని ఆశిస్తూ..
ReplyDeleteThank you Sridhar. I'll try to follow your suggestion. Though I myself am a software engineer for 20 years, at times I ignore it and just think like how I used to be in the beginning days when it comes to jotting down a passing thought with a poetic touch. Thanks again! :)
ReplyDeleteనాకు చాలా నచ్చిందండి ఈ కవిత.ప్రతీ లైనూ ఎంత భావాన్ని నింపుకుందో.
ReplyDelete"రేపటి దారులు మనకై వెదుకుతూ నేనుంటే, నేటి మజిలీలో నీవు నా చేయి వదిలి పోతావేం?"ఈ సూటి ప్రశ్నలో ఎంత వేదన వుందో?నమ్మకం తునాతునకలైనప్పుడు కలిగేలాంటి స్తబ్ధత కనిపిస్తుంది ఈవాక్యంలో " నేవున్న గది తెరిచే వుంచా"
కవిత వస్తువు చాలా సాధారణమైనదేకానీ నాకు చాలా చాలా నచ్చింది మీ వ్యక్తీకరణ.
ఇది సంతసాన్నిమించిన, సంబరాన్ని కొలవనన్న భావన - ఇలా మీరంతా చిన్నిమాటల్లొ పెద్ద ప్రశంసల హారాలు విసిరేస్తుంటే!
ReplyDeleteధన్యురాలను.
బాగుంది.
ReplyDelete>>నీమది లోగిలిలో నేవున్న గది తెరిచే వుంచా,
నామది లోగిలో నీవున్న.. కాదా? కొంచెం కంఫ్యూసింగా ఉంది.
కవితలో ఫీల్ మాత్రం సూపర్ ఉంది. అభ్యర్థన, ఆవేదనా, ఆరాటం అన్నీ కలిసున్నాయి.
"నీమది లోగిలిలో నేవున్న గది తెరిచే వుంచా,"
ReplyDeleteమన మది మన ఇష్టం కాదు కదా ఒకరికిచ్చాక? వచ్చినవారు వుంచుకుంటే వుంటాం, పొమ్మంటే పోతాం. నే తన మదిలోనేవున్నాననిచెప్పి, తననీ అక్కడేవుండమనీ అడుగుతున్నాను, ఎన్ని గదులున్నాయో ఎందర్ని వుండమన్నాడో ఎరుకలేకే అలా నా దరికే రావా అని అర్థిస్తున్నాను. బెదిరిపోతాడేమోనని భయాపడుతున్నాను. ఇదేం పిచ్చిది అనుకుంటున్నారా, అది పట్టినవారికే తెలుస్తుందిలేండి :)
ఇది చదివి నాకు దేవులపల్లివారు గురుతుకొచ్చారు...
ReplyDeleteనీవు వచ్చేవని నీ పిలుపే విని కన్నుల నీరిడి కలయజూచితిని
గడియ యేని యిక విడచిపోకుమా
చెదరిన హృదయము పగులనీకుమా
ఈ జన్మకిది చాలు. ఇంత కన్నా మరేం ప్రశంసవుంటుంది, చెప్పండి రాఘవా? ఇవి మీకు మెప్పుకోలో, ముఖస్తుతో కావు, నాకు ఇప్పటికిప్పుడు ఈ నిద్ర కళ్ళలో నిండిన ఆనందభాష్పాక్షరాలివి.
ReplyDelete:-)
ReplyDelete