అంబరచిత్రం
కనకాంబరంతో పోటి పడ్డట్లు
అంబరం ఆ వన్నెనే అద్దుకుంది ఆ క్షణం,
కంటి కుంచె మనసు ఫలకంపై ఆ తళుకులద్దే ఈ క్షణం
మరి దొరకలేదా వీక్షణం,
మాయదారి సూరీడు మబ్బుతెర విసిరి
వడి వడి అడుగుల పరుగిడి వచ్చి తన చిత్రం గీస్తున్నడాక్కడ,
చుప్పనాతి చిన్నోడు ఎప్పుడూ ఇంతే!
"జాషువాని స్మరించిన రాత్రి మేలుకొలిపిన ఉదయపు ఉనికిది!"
నా కంటికి ఓ చక్కని దృశ్యాన్ని చూపారు. దన్యవాదములు.
ReplyDeleteమనోభావన మదురంగా వుంది.. ఇట్టే మనసుకు నచ్చింది...:D
కృతజ్ఞతలు. ఈ నా కావ్య పయనం [అని నేనకుటున్నానని మీకు తోచినా కాదనరనే నా అహం] ముగిసేలోపు కనీసం నా భావావేశం అలలావిరిగిపోయేలోపు మీచిత్రమొకటి నా వ్రాతలకి తళుకులుక అద్దాలని ఆశ.
ReplyDelete