copper bottom heart నా చూడచక్కనమ్మ!

బరువెక్కువైందని తడిమిచూసానొకసారి,
పిడికడంతే తగిలింది, మెత్తగానే తోచింది!
అదనుచూసి కొన్నేనని చెప్పి అన్నీ ఒంపేసాను
బిడియంగానో, బెంగగానో అది దాచుకున్న [త]/వలపులు
ఎందుకైనా మంచిదని మరోసారి వూపి చూసాను
ఈసారి మాత్రం లోహపు గిన్నెకి రాగి తాపడమద్దినట్లు
తానూ గట్టి పడింది కరకు కోటు తొడుక్కుంది
ఒలికిన గురుతులు వడిసెలవేసి విసిరి పారేసింది
తదుపరి నేర్చిన పాఠం మాత్రం నొక్కి సర్దుకుంది
రాటుతేలావీ మథ్య అన్నవార్ని చూసి నాతో పాటే
ముసి ముసి నవ్వులునవ్వే నా [చి]/గట్టి గుండె
వేసవిలో చెమర్చే తేమలా అపుడపుడూ చెమ్మగిల్లుతుంది
గచ్చు మీద పడ్డ కంచుగిన్నెలా కంగుమంటుంది
చొట్టమాత్రమెక్కడా పడనీయదు నా చూడచక్కనమ్మ :(

9 comments:

  1. ఉషా గారు

    మీ కాపరు బాటము గుండే, ఈ జీవితపు ప్రెషరు కుక్కరులో అమరుతుందా? బ్రతుకు వంట బానే వండుతుందా? ఐతే ఎక్కడ (కను)కొన్నారో చెప్పండి. నాకొకటి బాగా అవసరం.

    చాలా బాగుందండి.

    ReplyDelete
  2. I don't think I am qualified to comment on your post. I have to read it twice to understand the meaning. On the same note, I have read some decent books and poems and scored good marks in Telugu in my school days. But have never read anything like yours.

    It's just too good Usha. Proud to have a friend like you in all aspects.

    ReplyDelete
  3. ఆత్రేయ గారు,నా మనస్థితి ఇదండి - "ధన్యుడనైతిని ఓ రామ ..." మీ వ్యాఖ్య చూసుకున్న క్షణం. urgentగా ఓ వెయ్యి ప్రతులు అచ్చేయించి ఇదేదో పెద్ద ఆత్రేయనో, ఆరుద్రనో అనుకుంటుంది కలం కాగితందొరకగానే అన్నవారికి పంచేయాలనిపించింది.

    ఇంకా వంటకంలో ఉప్పు చూడాలండి. మొన్నామధ్య వరకు తీపిమాత్రం తెలిసేది. కంటినీరు తగిలి తగిలి ఉప్పు addiction పట్టుకుంది.

    గుండెమార్పిడికి ebayలో వేలంవేస్తానులేండి. చివరి పాట మీకు మాత్రం చెప్పేస్తాను :)

    జన్య, ఇలాగైనా కాస్త పలకరించిపోతుండవే. పులకరించను కాని తలుచుకోవటం తప్పుతుంది.

    ReplyDelete
  4. Dear Usha,

    I dont know how to send mails in telugu which would have helped me
    to express my feelings about your
    KAVITHALU.
    your literary talent is really superb.

    good effort. continue.

    Sambasivarao.

    ReplyDelete
  5. మీ కవిత బావుంది కానీ మీ మెటలర్జీ (లోహ శాస్త్రమే) లొగసానుగా ఉంది. లోహపు గిన్నెకి రాగి తాపడం .. తానూ గట్టిపడింది .. లోహం కంటే రాగి గట్టిది కాదు.

    ReplyDelete
  6. అందుకే సార్, మరి నేను సాఫ్టువేరు ఇంజినీరు [మీ భాషలో అల్లపు నీరు] నవుతా :) ఈ శాస్త్రం అంటే నాకు ముందు నుంచీ భయమే అది నేర్పిన కామేశ్వరి టీచరు గారంటే ఇంకా దడాను!

    ReplyDelete
  7. దొరికేసినప్పుడు, ఇలా మాబోటి మాస్టర్లని బలవంతంగా లాక్కొచ్చి బోనులో నుంచోపెట్టేయటం ఏంబాలా :-)

    ReplyDelete
  8. అమ్మోయ్ బాబా గారు, మళ్ళీ మీ దర్శినిలో పడిపోయానన్నమట. సార్ సార్ నాకు నిజ్జంగా తెలియదండీ ఈ లోహ తత్వాలు. అయినా కొత్తపాళీ గారు చెప్పేవరకు నేనూ గమనించలేదండి కవితాదేవి నన్నింతగా ముంచేసిందని. నిజానికి, రాగిని వేడి తట్టుకునే ఉపమానం అంటే నాకు కూడ వత్తిళ్ళు, సమస్యల రాపిడులు తట్టుకునే గట్టితనం అలవడిందన్న అర్థోక్తిలో వాడేసానన్న మాట. కనుక లోహ శాస్త్ర సారులంత ఒక్కమాట మీద నిలబడి ఈ ఒక్కసారికి చూసి చూడక వదిలేయండి ఈ పిల్ల కాకి/కవిని:(

    ReplyDelete
  9. ఎంత చక్కని కవితలు..ఎంత చక్కని పదాలు.... అసలు ఏమని comment పెట్టాలొ తెలియడం లెదు.. ఆ అర్హత కూడా నాకు లేదు ఉషగారు.. u r great

    ReplyDelete